గోపాలా.. కొల్లేరు గోడు ఆలకించయ్యా..!
- నేడు అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కైకలూరు రాక
- సమస్యలు వివరించేందుకు కొల్లేరు వాసులు సిద్ధం
కైకలూరు : పాలకులు మారిన ప్రతిసారి తమకు న్యాయం జరుగుతుందేమోనని ఆశగా ఎదురు చూడటం కొల్లేరు ప్రాంత వాసులకు ఆనవాయితీగా మారింది. మంత్రులు, నాయకులు వచ్చినప్పుడు సమస్యలను వివరించడం పరిపాటిగా మారింది. రాష్ట్ర అటవీ, పర్యావరణ, సహకార, శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మంగళవారం తొలిసారిగా కైకలూరు రానున్నారు. ఈ సందర్భంగా కొల్లేరు తీర ప్రాంత సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లడానికి లంక గ్రామాల ప్రజలు సిద్ధమవుతున్నారు.
కొల్లేరు వాసుల డిమాండ్లు ఇవీ..
కొల్లేరు ఆపరేషన్ సమయంలో కైకలూరు, మండవల్లి మండలాల్లో అదనంగా ధ్వంసం చేసిన 7,500 ఎకరాలను తిరిగి పంపిణీ చేయాలి.
కొల్లేరు ఆపరేషన్‌లో ధ్వంసమైన జిరాయితీ భూమలకు నష్టపరిహారం అందించాలి.
సరస్సును +5 కాంటూరు నుంచి +3 కాంటూరు వరకు కుదించాలి. మిగిలిన భూమిని పేదలకు పంచాలి.
కొల్లేరులో వలసల నివారణకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి.
కొల్లేరులో వేటపై ఆంక్షలు ఎత్తేయాలి. కొల్లేరు ప్రాంత ప్రజలను మత్య్సకారులుగా గుర్తించి పథకాలు అమలు చేయాలి.
కొల్లేరు ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యే నిధులు కేటాయించాలి.