ఆంధ్రప్రదేశ్‌లో మంత్రి వర్గ విస్తరణ అధికార టీడీపీలో చిచ్చు రాజేసింది. మంత్రి పదవి నుంచి తొలగించడంతో తీవ్ర అసంతృప్తికి గురైన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుకు ఆయన రాజీనామా లేఖ పంపారు.