
హీరో శ్రీకాంత్ ఈ మధ్య మళ్లీ బిజీ అవుతున్నాడు. 'అఖండ'లో విలన్‌గా ఆకట్టుకుని, పలు భాషల్లో అవకాశాలు దక్కించుకుంటున్నాడు. ఈ మధ్యే మలయాళ మూవీ 'వృషభ'లోనూ ఛాన్స్ సొంతం చేసుకున్నాడు. ఇలా కెరీర్ పరంగా బిజీ బిజీగా ఉన్న శ్రీకాంత్.. రీసెంట్‌గా తమ్ముడి కూతురి పెళ్లిలో ఫ్యామిలీతో కలిసి కనిపించాడు.
శ్రీకాంత్ తమ్ముడు అనిల్ కూడా ఇండస్ట్రీలో అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. హీరోగా, నిర్మాతగా తలో మూవీ చేశాడు కానీ పెద్దగా కలిసి రాలేదు. ఇప్పుడు ఆయన కూతురు పెళ్లి జరగ్గా.. శ్రీకాంత్ తోపాటు అతడి భార్య ఊహ, పిల్లలు రోహన్, రోషన్, మేదా కనిపించారు. చాలారోజుల తర్వాత శ్రీకాంత్ ఫ్యామిలీతో కలిసి కనిపించగా, ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
(ఇదీ చదవండి: ఇక్కడ 'బేబీ'.. కన్నడలో ఆ చిన్న సినిమా!)
Comments
Please login to add a commentAdd a comment