Srikanth Son Roshan And Sri Leela Pelli Sandadi Film Release On September - Sakshi
Sakshi News home page

Pelli Sandadi: సెప్టెంబర్‌లో శ్రీకాంత్‌ తనయుడి చిత్రం రిలీజ్‌

Published Thu, Jul 22 2021 9:01 AM | Last Updated on Thu, Jul 22 2021 11:33 AM

Srikanth Son Roshan Pelli Sandadi Movie Release On September - Sakshi

Pelli Sandadi: శ్రీకాంత్‌ హీరోగా కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘పెళ్లి సందడి’ సినిమా ఎంత హిట్‌ అయ్యిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా ‘పెళ్లి సందడి’ పేరుతోనే ఓ చిత్రం తెరకెక్కింది. కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా ఆయన శిష్యురాలు గౌరీ రోణంకి దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. శ్రీలీల హీరోయిన్‌. కె. కృష్ణమోహన్‌ రావు సమర్పణలో ఆర్కా మీడియా వర్క్స్, ఆర్‌.కె ఫిలిం అసోసియేట్స్‌పై మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మించిన ఈ సినిమా నిర్మాణానంతర పనులు జరుపుకుంటోంది.

గౌరీ రోణంకి మాట్లాడుతూ– ‘‘పెళ్లి సందడి’ అవుట్‌పుట్‌ చాలా బాగా వచ్చింది. రోషన్, శ్రీలీల జోడీ ఫ్రెష్‌ లుక్‌ను తీసుకొచ్చింది. లవ్‌ ట్రాక్, ఎమోషన్స్, కామెడీ.. అంశాలతో సినిమా అందర్నీ మెప్పించేలా ఉంటుంది. ఈ ‘పెళ్లి సందడి’ ద్వారా కీరవాణిగారు తన సంగీతంతో శ్రోతలను మరోసారి మెస్మరైజ్‌ చేయడం ఖాయం. సెప్టెంబర్‌లో మా సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సునీల్‌ కుమార్‌ నామా, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సాయిబాబా  కోవెలమూడి.  కార్తీక్, శ్రీలక్ష్మీ ఫిలింస్‌ బాపిరాజు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement