uha
-
విడాకులంటూ బ్రేకింగ్ ఇచ్చేశారు.. వెంటనే ఫోన్ చేసి చెప్పా: శ్రీకాంత్
టాలీవుడ్ హీరో శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో హీరోగా, ప్రతినాయకుడిగా తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని స్టార్‌గా ఎదిగారు. ఇటీవలే కోటబొమ్మాళి పీఎస్‌తో అభిమానులను అలరించిన శ్రీకాంత్ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అవేంటో ఓ లుక్కేద్దాం. ఇటీవలే ఓ మూవీ కార్యక్రమంలో శ్రీకాంత్ పాల్గొన్నారు. అక్కడే సీనియర్ హీరోయిన్ రాశి కూడా కనిపించింది. ఈవెంట్లో వీరిద్దరూ చాలా సరదాగా పలకరించుకున్నారు. అంతేకాకుండా ఈవెంట్లో పాల్గొన్న రాశి.. శ్రీకాంత్ భుజంపై కొట్టి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వేదికపై హిట్ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్న వీరిద్దరు చిన్నప్పటి స్నేహితుల్లా సందడి చేశారు. ఆ వీడియో పెద్దఎత్తున సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజా ఇంటర్వ్యూలో శ్రీకాంత్ ఈ విషయాన్ని వెల్లడించారు. రాశి కొట్టడంపై శ్రీకాంత్ స్పందిస్తూ.. 'చాలా ఏళ్ల తర్వాత మేమిద్దరం ఫంక్షన్లో కలిశాం. అక్కడ ఉన్న హీరోయిన్ రాశిని అమ్మ అన్నది. దీంతో నేను కూడా సరదాగా రాశి అమ్మా అన్నా.. దానికే తను సరదాగా నవ్వుతూ కొట్టింది. అంతకు మించి ఏం లేదు. నేను నటించిన వారిలో సౌందర్య, ఉమతో చాలా కంఫర్ట్‌గా ఫీలయ్యేవాన్ని. మా ఇంటికి కూడా ఒక ఫ్యామిలీలాగా వచ్చేవారు. సైడ్ ఆర్టిస్టులతో అందరితో బాగా ఉండేవాన్ని' అని అన్నారు. విడాకుల రూమర్స్‌పై మాట్లాడుతూ.. 'ఊహాతో నాకు విడాకులు అంటూ వార్తలొచ్చాయి. టీవీలలో బ్రేకింగ్‌లు కూడా వేశారు. అప్పుడే నేను, నా భార్య అరుణాచలం వెళ్తున్నాం. అప్పుడు వెంటనే ప్రభుకు ఫోన్ చేసి చెప్పా. చూడరా బాబు మేమిద్దరం అరుణాచలం వెళ్తున్నామని చెప్పా. వెంటనే ఆ వార్తలను ఖండించాం.' అని తెలిపారు. పెళ్లికి ముందు మీకు ఇండస్ట్రీలో ఎఫైర్స్ ఏమైనా ఉన్నాయా? అని ప్రశ్నించగా సరదాగా నవ్వుతూ ఆన్సరిచ్చారు. బయట ఎవరో ఏదో రాసింది అడిగితే కాదు?.. మీకు తెలిస్తే చెప్పండని నవ్వుతూ మాట్లాడారు. బాలీవుడ్ చిత్రాల్లో అవకాశమొస్తే తప్పకుండా చేస్తానని శ్రీకాంత్ అన్నారు. పోలీస్ ఆఫీసర్‌గా నచ్చిన చిత్రాల్లో ఖడ్గం అని తెలిపారు. ఇటీవలే పోలీస్‌గా కొటబొమ్మాళి అనే సినిమాను చేశా.. పోలీసులు స్ట్రగుల్స్ ఎలా ఉంటాయో చూపించామని అన్నారు. -
హీరో శ్రీకాంత్ తన లవ్ మ్యారేజ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
-
ఆ ఏజ్ లో పాప టాలెంట్,యాక్టింగ్ చూసి షాక్...అయ్యా బాబోయ్ చిచ్చరపిడుగు
-
ఊహాతో విడాకులు.. మరోసారి స్పందించిన శ్రీకాంత్
టాలీవుడ్ సీనియర్ హీరో, నటుడు శ్రీకాంత్- ఊహ విడాకులు తీసుకుంటున్నారనే రూమర్స్ కొద్ది రోజులుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తనపై వస్తున్న రూమర్స్‌పై గతంలోనే హీరో శ్రీకాంత్ స్పందించారు. గురువారం మార్చి 23న శ్రీకాంత్ బర్త్ డే సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఊహా విడాకులు తీసుకుంటున్నారంటూ వస్తున్న వార్తలను కొట్టిపారేశారు. సోషల్ మీడియాలో ఎవరికి నచ్చినట్లు వాళ్లు రాస్తున్నారని చెప్పుకొచ్చారు. శ్రీకాంత్ మాట్లాడుతూ..'సెలబ్రిటీల పర్సనల్ లైఫ్‌పై సోషల్ మీడియాలో ఎలా పడితే అలా రాసేస్తున్నారు. కొన్ని వార్తలు మరీ దారుణంగా కూడా ఉంటున్నాయి. ఒకసారి నేను మరణించినట్టు ఫొటో పెట్టేశారు. అలాంటివి చూసినప్పుడు బాధగా ఉంటుంది. నేను తట్టుకున్నా.. ఫ్యామిలీకి తెలిస్తే తట్టుకోలేరు. అలాంటి షాక్ న్యూస్ వింటే ఏదైనా అనర్థం జరగొచ్చు. అలా వార్తలు రాసేవారిలోనే మార్పు రావాలి. నేను డైవర్స్ తీసుకుంటున్నట్లు వదంతులు సృష్టించారు. వాటితో మేం కలిసి వేడుకలకు వెళ్లాల్సి వస్తోందన్నారు నవ్వుతూ. ఏదైనా ఈవెంట్‌కు వెళ్లాలంటే నా భార్యకు పెద్దగా ఇష్టముండదు. ఆ విషయం ఇండస్ట్రీలో చాలామందికి తెలుసు. కోట శ్రీనివాసరావు మరణించారని రూమర్స్ చూసి షాక్‌కు గురయ్యా.' అని అన్నారు. సీనియర్ నటుడు శ్రీకాంత్ ఎక్కువగా ఫ్యామిలీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం శ్రీకాంత్ సపోర్టింగ్ రోల్స్, విలన్ పాత్రల్లో ఎక్కువగా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన వారసుడు, హంట్ చిత్రాల్లో తనదైన నటనతో మెప్పించారు. శ్రీకాంత్ ప్రస్తుతం ఆర్సీ15, ఎన్టీఆర్30 చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. -
అరుణాచలేశ్వరుని సేవలో శ్రీకాంత్ దంపతులు
సాక్షి, తిరువణ్ణామలై: తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయాన్ని సినీ నటుడు శ్రీకాంత్ సతీసమేతంగా దర్శించుకున్నారు. మంగళవారం సాయంత్రం శ్రీకాంత్, ఊహాలు అరుణాచలేశ్వరాలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి ఆలయ జాయింట్ కమిషనర్ అశోక్‌కుమార్ ఘన స్వాగతం పలికారు. దర్శనాంతరం ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామి వారి ప్రసాదాలను వారికి అందజేశారు. -
విడాకుల పుకార్లను తీవ్రంగా ఖండించిన శ్రీకాంత్
సీనియర్ హీరో, నటుడు శ్రీకాంత్- ఊహ విడాకులు తీసుకుంటున్నారనే రూమర్స్ కొద్ది రోజులుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తన విడాకుల వార్తలపై హీరో శ్రీకాంత్ స్పందించారు. తాను-ఊహా విడాకులు తీసుకుంటున్నారంటూ వస్తున్న వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. కొన్ని వెబ్‌సైట్స్, యూట్యూబ్ ఛానల్స్ వారి గుంరించిన ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవ్వటం పట్ల హీరో శ్రీకాంత్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆయన ప్రెస్‌నోట్ విడదుల చేశారు. ఎవరు పుట్టిస్తున్నారు ఇలాంటి నిరాధారమైన పనికిమాలిన వార్తలను? అని ప్రశ్నించారు. ‘‘గతంలో నేను చనిపోయినట్లుగా ఒక పుకారు పుట్టించి నా కుటుంబ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురి చేశారు. ఇప్పుడు తాజాగా మేము ఆర్థిక ఇబ్బందుల కారణంగా విడాకులు తీసుకుంటున్నాం అంటూ ఒక న్యూసెన్స్ క్రియేట్ చేశారు. కొన్ని వెబ్‌సైట్స్‌లో వచ్చిన ఈ ఫేక్ న్యూస్‌ను నా ఫ్రెండ్స్ ఊహకు ఫార్వర్డ్ చేయడంతో తను కంగారుపడుతూ ఆ పోస్టులను నాకు చూపించింది. దీంతో నేను ‘ఇలాంటివి ఏమాత్రం నమ్మోద్దు. ఆందోళన పడోద్దు’ అని తనను ఓదార్చాను . అయితే ఏవో కొన్ని చిల్లర వెబ్‌సైట్స్, యూట్యూబ్ చానల్స్ వాళ్ళు చేసిన ఈ పని సోషల్ మీడియాలో విపరీతంగా స్ప్రెడ్ అవ్వతున్నాయి. దీంతో మా బంధుమిత్రులందరూ ఫోన్ చేసి అడుగుతుంటే వివరణ ఇచ్చుకోవడం పెద్ద న్యూసెన్స్‌గా అనిపిస్తుంది . ప్రస్తుతం నేనూ ఊహ నిన్న చెన్నై వచ్చి ఇక్కడి నుండి దైవ దర్శనానికి అరుణాచలం వెళ్తున్నాం. ఇలాంటి తరుణంలో ఈ పుకారు మా కుటుంబానికి చాలా చిరాకు తెప్పిస్తుంది. ఇది ఇంకా ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా ఉండటం కోసం ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తున్నాను. నా మీదనే కాకుండా చాలామంది ప్రముఖుల మీద ఇలాంటి నిరాధారమైన పుకార్లు స్ప్రెడ్ చేస్తున్న వెబ్‌సైట్స్, యూట్యూబ్ ఛానల్స్ మీద సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను’’ అని శ్రీకాంత్ తన లేఖలో పేర్కొన్నారు. చదవండి: బిజినెస్ విమెన్‌తో పెళ్లి.. నాగశౌర్యకు కట్నం ఎంత ఇచ్చారో తెలుసా? ప్రత్యేక ఆకర్షణగా నాగశౌర్య పెళ్లి భోజనాలు, అరేంజ్మెంట్స్ చూస్తే షాకవ్వాల్సిందే -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీకాంత్ కుటుంబం..
Actor Srikanth Visits Tirumala Temple With His Family: సినీ నటుడు, సీనియర్ హీరో శ్రీకాంత్ కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం (జున్ 28) ఉదయం మెట్ల మార్గంలో కొండెక్కి మరీ స్వామివారిని దర్శనం చేసుకున్నారు. శ్రీకాంత్‌తోపాటు భార్య ఊహ, కుమారులు రోషన్, రోహన్, కుమార్తె మేధ ఉన్నారు. వీరు శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కొండపైకి వెళ్తూ అన్ని మెట్లకు పసుపు కుంకుమలతో పూజ చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు శ్రీకాంత్ కుటుంబాన్ని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందించారు. దర్శనాంతరం బయటకు వచ్చిన శ్రీకాంత్, రోషన్‌తో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఎరుపురంగు లంగావోణీలో మేధ, సాంప్రదాయ దుస్తుల్లో శ్రీకాంత్, రోషన్, రోహన్ ఆకర్షించారు. కాగా తెలుగు చిత్రసీమకు మొదట విలన్‌గా ఎంట్రీ ఇచ్చి తర్వాత హీరోగా మారిన వారిలో శ్రీకాంత్ ఒకరు. 'పీపుల్స్ ఎన్కౌంటర్' సినిమాతో నటుడిగా పరిచయమైన శ్రీకాంత్ వన్ బై టు మూవీతో హీరోగా మారాడు. తర్వాత వచ్చిన 'తాజ్ మహల్' చిత్రంతో హీరోగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. 1997లో సహనటి ఊహని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. చదవండి: తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్ హార్ట్ సింబల్స్‌తో సమంత ట్వీట్.. నెట్టింట వీడియో వైరల్.. నటుడి ఆత్మహత్య.. డ్రగ్స్ కేసులో నిందితుడు -
ఊహ నన్ను చూసి వణికిపోయింది: శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
Hero Srikanth Interesting Comments On His Role In Akhanda Movie: శ్రీకాంత్.. ఫ్యామిలీ హీరోకు కేరాఫ్ అడ్రస్. ఆయన ఇప్పటి వరకు 100 పైగా చిత్రాల్లో నటించగా అందులో ఎక్కువగా కుటంబ కథా చిత్రాలే చేశాడు. దీంతో పరిశ్రమలో శ్రీకాంత్‌కు సాఫ్ట్ ఇమేజ్ ఏర్పడింది. అలా హీరోగా, నటుడిగా ఇంతకాలం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్రీకాంత్ అఖండ సినిమాలో క్రూరమైన విలన్‌గా కనిపించి అందరిని బయటపెట్టాడు. తనకు అలవాటు లేని పాత్ర అయినా కూడా అందులో పరకాయ ప్రవేశం చేశాడు శ్రీకాంత్. అయితే కొంతమంది ఫ్యాన్స్ శ్రీకాంత్‌ను విలన్‌గా చూడటానికి ఇష్టపడటం లేదు. చదవండి: అషూరెడ్డి ప్రెగ్నెంటా?! షాక్‌లో ఫ్యాన్స్, ఇంతగా దిగజారిపోయావా! దీంతో అఖండలో శ్రీకాంత్ పాత్రకు మిశ్ర స్పందన వస్తోంది. ఇటీవల విడుదలైన అఖండ మూవీ బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టిస్తూ బ్లాక్‌బస్టర్ విజయం వైపు దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో సినిమా సక్సెస్‌లో భాగంగా శ్రీకాంత్ తాజాగా మీడియాతో ముచ్చటించాడు. ఈ క్రమంలో తన పాత్రకు వస్తున్న రెస్పాన్స్‌పై శ్రీకాంత్ స్పందించాడు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. అఖండలో తన పాత్ర వ్యక్తిగతం తనకు బాగా నచ్చిందని, అయితే ఈ గెటప్‌లో మొదటిసారి చూసిన తన భార్య ఊహ వణికిపోయిందని చెప్పాడు. ‘ఒకసారి షూటింగ్ అయిపోయిన తర్వాత అదే గెటప్‌లో ఇంటికి వెళ్లాను. అప్పుడు ఊహతో కలిసి కొందరు మాట్లాడుకుంటు ఉన్నారు. నన్ను అలా చూసి వాళ్లంతా కంగారుపడ్డారు. చదవండి: Rashmi-Chiranjeevi: రెమ్యునరేషన్ విషయంలో తగ్గని రష్మీ, ఎన్ని లక్షలో తెలుసా? ఇక ఊహ అయితే గుర్తుపట్టలేదు. ఒక్కసారిగా నన్ను అలా చూసి వణికిపోయింది. సినిమా చూసిన తర్వాత కూడా ఊహ చాలా కంగారు పడింది. ఎందుకంటే నన్ను ప్రేక్షకులు ఇలా ఆదిరిస్తారో లేదోనని భయపడుతూనే ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు. మొదట ప్రతినాయకుడిగా నటించడానికి ఒప్పుకున్న తర్వాత చాలామంది తనని నమ్మలేదని, విలన్‌గా చేయడం అవరమా? అని తనతో అన్నవాళ్లు ఇప్పుడు తన పాత్రపై ప్రశంసలు కురిపిస్తున్నారంటూ అంటూ ఆనందం వ్యక్తం చేశాడు. అంతేకాదు బాలకృష్ణ కూడా ఇప్పుడే విలన్ పాత్రలు చేయకు కొంతకాలం ఆగమని సూచించినట్లు తెలిపాడు. ఇకపై కూడా కేవలం హీరోగా నటిస్తానని కూర్చోకుండా.. నచ్చితే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా విలన్‌గా కూడా చేస్తానని శ్రీకాంత్ పేర్కొన్నాడు. -
అలా ఊహతో ప్రేమలో పడ్డా : శ్రీకాంత్
వీళ్లెక్కడికి వెళ్లొచ్చినా.. గుడికి వెళ్లొచ్చినట్లే ఉంటుంది! వీళ్ల పెళ్లిరోజు సెలబ్రేషన్ కూడా గుడికి వెళ్లి రావడమే! పెళ్లయి ఇరవై మూడేళ్లయింది. ఎప్పుడు చూసినా.. అప్పుడే గుడి నుంచి వచ్చినట్లుగా ఫ్రెష్‌గా.. ప్రశాంతంగా ఉంటారు. ఇంటర్వ్యూకి వెళ్లాక.. ‘‘ఎలా సాగుతోంది మీ మ్యారీడ్ లైఫ్’’ అని అడగాలనిపించలేదు. ‘జస్ట్ మ్యారీడ్’లా కళ్లెదుట కనిపిస్తుంటే.. ఇక ప్రశ్నలేముంటాయ్? అయినా అడిగాం. ఇష్టాల్నీ, కష్టాల్నీ చెప్పమన్నాం. ‘వియ్ ఆర్ లక్కీ’ అన్నారు శ్రీకాంత్, ఊహ. ఏ విషయంలో వాళ్లు లక్కీ?! చదవండి. ► గత నెల పెళ్లి రోజు (జనవరి 20)ని ఎలా జరుపుకున్నారు? ఊహ: మా పెళ్లి రోజు సెలబ్రేషన్ అంటే గుడికి వెళ్లి, దేవుడికి దండం పెట్టుకోవడమే. ఈసారి తిరుపతి వెళ్లాం. ఆ తర్వాత షిరీడి వెళ్లాం. శ్రీకాంత్: అవును.. ప్రతీ యానివర్సరీకి ఏదో ఒక గుడికి వెళ్తాం. ఒకసారి కాశీ వెళ్లాం. మేం ఇద్దరం ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోం. అయితే ముగ్గురు పిల్లల బర్త్‌డేలను మాత్రం వాళ్ల ఫ్రెండ్స్‌ని పిలిచి, గ్రాండ్‌గా చేస్తాం. ► ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా. మొదట్లో ఉన్నంత ప్రేమ 23 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత కూడా ఉందా? ఊహ: చెప్పాలంటే ప్రేమ ఇంకా పెరిగింది. ఒకరి మీద ఒకరికి నమ్మకం, ఒకర్నొకరు అర్థం చేసుకోవడం.. ఏ కపుల్ మధ్య అయినా ఈ రెండూ ఉంటే అంతా హ్యాపీగా వెళ్లిపోతుంది. శ్రీకాంత్: అలాగే చిన్న చిన్న అలకలు కూడా. ఊహ: అవి ఉంటేనే బావుంటుంది. మా మధ్య అవి కూడా ఉంటాయి. బాధ్యతల వల్ల మనుషులు ఇంకా దగ్గరవుతారు. అయితే బిగినింగ్ డేస్‌లో ఎలా ఉంటామో పిల్లలు పుట్టిన తర్వాత ఖచ్చితంగా అలా ఉండలేం. రోజంతా ఎవరి బిజీలో వాళ్లు ఉండిపోతాం. మేం సరదాగా ఎక్కడుంటాం అంటే ఏదైనా పిక్నిక్కు వెళ్లినప్పుడో, ఫంక్షన్‌కు వెళ్లినప్పుడో.. అప్పుడు ఫుల్‌గా ఎంజాయ్ చేస్తాం. అలకలు, బాధ్యతల వల్ల ప్రేమ పెరిగినట్లు ఎవరికైనా ఒంట్లో బాగాలేనప్పుడు తెలుస్తుంది.. ఎవరి ఎఫెక్షన్ ఎంత ఉంటుందో. ► అలా ఆరోగ్యం బాగాలేని సందర్భాలేమైనా? ఊహ: అప్పట్లో ఆయన కాలికి పెద్ద ఆపరేషన్ జరిగింది. షూటింగ్స్‌లో జరిగిన ప్రమాదాల్లో చాలాసార్లు దెబ్బలు తగిలాయి. ఆపరేషన్ చేయాలని డాక్టర్ అంటే పోస్ట్‌పోన్ చేసుకుంటూ వచ్చారు. జనవరి 20న మా పెళ్లయింది. హనీమూన్ వెళదామని ప్లాన్ చేసుకున్నాం. వెళ్లేముందు జస్ట్ డాక్టర్ చెకప్‌కి వెళ్లాం. టెస్ట్ చేసి వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు. ట్రిప్ ఎప్పుడైనా వెళ్లొచ్చు అనుకుని హనీమూన్ క్యాన్సిల్ చేనుకున్నాం. శ్రీకాంత్: అప్పుడు బాగా చూసుకుంది. ఊహ: ఆయన కూడా అంతే. నాకు ఆరోగ్యం బాగా లేదంటే కేరింగ్‌గా ఉంటారు. ► జనరల్‌గా మీ ఇద్దరికీ ఎలాంటి విషయాల్లో గొడవలు వస్తుంటాయి? ఊహ: పిల్లల విషయంలోనే వస్తుంది. నేనేమో స్ట్రిక్ట్‌గా ఉండాలంటాను. ఆయనేమో పోనీలే అంటారు. శ్రీకాంత్: సీరియస్ గొడవలు ఏం ఉండవు. ► మీ ప్రేమ ఎలా మొదలైంది? ఊహ: ఇప్పటికి ఆలోచించినా అర్థం కాదు. ఇష్టం అంతే. శ్రీకాంత్: మేం ఇద్దరం కలిసి నాలుగు సినిమాలు చేశాం. ఫస్ట్ నుంచి కూడా ఒకరంటే ఒకరికి సాఫ్ట్ కార్నర్ ఉండేది. అలా ప్రేమ మొదలైంది. ► ఒకరిలో ఒకరికి నచ్చిన క్వాలిటీస్ ఏంటి? ఊహ: నేను అసలు చెప్పాల్సిన అవసరం లేదు. అందరికీ తెలిసిందే. ఆయన చాలా మంచి వ్యక్తి. అందరితో సరదాగా ఉంటారు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అర్థం చేసుకుని యాక్సెప్ట్ చేస్తారు. ఇంకేం కావాలి? శ్రీకాంత్: తనది సర్దుకుపోయే మనస్తత్వం. కోపం వచ్చినా మెచ్యూర్డ్‌గా ప్రవర్తిస్తుంది. అందరూ కావాలనుకుంటుంది. అందరితో ప్రేమగా ఉంటుంది. ► మీది సర్దుకుపోయే స్వభావం అన్నారు శ్రీకాంత్‌గారు. మరి.. అత్తగారింట్లో సర్దుకుపోయి ఉండాల్సి వచ్చిందా? ఊహ: మా పెళ్లయినప్పటి నుంచి ఇప్పటివరకూ నాకు సర్దుకుపోవాల్సిన అవసరం రాలేదు. వాళ్ల ఇంట్లో అమ్మాయిలానే చూసుకుంటారు. అత్తయ్య మామయ్య అని పిలవను. అమ్మానాన్న అనే పిలుస్తాను. శ్రీకాంత్: సర్దుకుపోవాల్సి వచ్చి ఉంటే 23 ఏళ్లు ప్రయాణం కొనసాగేది కాదేమో. ఊహ: మాది జాయింట్ ఫ్యామిలీ. శ్రీకాంత్: నాకు జాయింట్ ఫ్యామిలీ ఇష్టం. మా అమ్మా నాన్న మాతోనే ఉంటారు. ► మీరు మీ అత్త, మామలను బాగా చూసుకుంటున్నారు. మరి మీ అమ్మా, నాన్నలను శ్రీకాంత్‌గారు ఎలా చూసుకుంటారు? ఊహ: నాకంటే బాగా చూసుకుంటారు. మా అమ్మా, నాన్నలను అత్తయ్య, మామయ్య అనరు. నేను తన అమ్మానాన్నని పిలిచినట్లే ఆయన కూడా అత్తమామలను అమ్మానాన్నా అనే పిలుస్తారు. ► మీది ప్యూర్ వెజ్ ఫ్యామిలీ. వీళ్లు నాన్‌వెజ్. ఇబ్బందిగా ఉంటుందా? ఊహ: ఫస్ట్ కొన్ని నెలలు ఇబ్బందిగా ఉండేది. నా పక్కన ఎవరైనా కూర్చుని నాన్‌వెజ్ తిన్నా నాకు కడుపులో తిప్పేది. గుడ్డు మాత్రం తినేదాన్ని. అది కూడా వారానికి రెండు రోజులే. మిగతా రోజులన్నీ ఆ వ్రతం ఈ వ్రతం ఉండేవి. ఒకసారి అత్తయ్యవాళ్లు అమెరికా వెళ్లారు. వాళ్లు ఉన్నన్ని రోజులు నాన్ వెజ్ వండేవారు. నాకు మా సైడ్ వంటకాలు అన్నీ వచ్చు కానీ ఆంధ్రా స్టయిల్ వంటలు రావు. ఈయన ఇబ్బంది పడేవారు. బయట నుంచి తెప్పించుకునేవారు. లైఫ్ లాంగ్ ఇలా అయితే ఇబ్బంది అవుతుంది కదా అని నాన్‌వెజ్ వండాలని డిసైడ్ అయ్యాను. మా వంట మనిషిని పక్కన పెట్టుకుని రెసిపీ బుక్ చూస్తూ, ముక్కుకి కర్చీఫ్ కట్టుకొని దూరంగా నిలబడి కుక్ చేశాను. అలా మెల్లిమెల్లిగా వండటం స్టార్ట్ చేశాను. అయితే వండుతున్న ప్రతిసారీ ‘అయ్యో పాపం’ అని వండుతాను. కానీ ఇప్పటికీ నాన్‌వెజ్ తినను. ► మీరు మలయాళీ. మరి కేరళ వంటకాలు కూడా అలవాటు చేశారా? ఊహ: మాది కేరళ అయినా పుట్టింది, పెరిగిందీ చెన్నైలోనే. మా ఫుడ్ ఎక్కువ సాంబార్ బేస్డ్ ఉంటుంది. ఇంట్లో అవి కూడా చేస్తాం. శ్రీకాంత్: అన్ని రకాల వంటలు చేస్తుంది. నాన్‌వెజ్, వెజ్.. ఏదైనా బాగా వండుతుంది. ► కుక్ ఉంటారు కదా. అయినా మీరే చేస్తారా? ఊహ: కుక్ ఉంటారు. కానీ పిల్లలకు కావాల్సినవి ఎక్కువగా నేనే చేస్తాను. రోషన్, మేధ (పాప పేరు), రోహన్ ముగ్గురి టేస్ట్ వేరు. రోషన్, మేధది సెపరేట్ డైట్. ఇద్దరూ ఏది పెడితే అది తినరు. మా చిన్నోడు రోహన్, ఈయన ఒకేలా తింటారు. కొంచెం పులిహోర టైపు వంటలవీ రోహన్ బాగా తింటాడు. ► ఓకే... మీరు చేసిన చిత్రాల్లో ‘పెళ్లాం ఊరెళితే’ ఒకటి. అందులో భార్య ఊరెళితే గర్ల్‌ఫ్రెండ్‌తో స్పెండ్ చేస్తారు.. మరి? ఊహ: (మధ్యలో అందుకుంటూ) నేను ఊరెళ్లినా ఒకటే. లేకపోయినా ఒకటే. శ్రీకాంత్: ఎక్కువగా ఫ్రెండ్స్‌తో ఉంటాను. అందరూ మగ స్నేహితులే (నవ్వుతూ). ఊహ: నేను లేకుండా ఉండలేరు. శ్రీకాంత్: తను ఇంట్లో ఉంటేనే ఫ్రీగా ఉంటుం ది. తను లేనప్పుడు ఫ్రెండ్స్‌తో కూర్చుంటే ఏదో తప్పు చేసిన ఫీలింగ్. తనుంది కాబట్టి ఏదైనా చేయొచ్చు అనే ఫీలింగ్ (నవ్వుతూ). ఊహ: ఖాళీ సమయాల్లో ఆయన బయటకు వెళ్లరు. వాళ్ల ఫ్రెండ్స్ ఇంటికే వస్తుంటారు. ► మీరు ఒక హీరోయిన్గా చేసిన ‘ఆయనకి ఇద్దరు’ సినిమాలో మీ భర్త పాత్రను మరో అమ్మాయి (రమ్యకృష్ణ) వెంటాడుతుంది. ఆ సిట్యువేషన్‌ని ఎలా టాకిల్ చేయాలో తెలియక తడబడుతుంటారు. రియల్ లైఫ్‌లో అయితే? ఊహ: (పెద్దగా నవ్వుతూ) ఛాన్సే లేదండి. ఆయన మీద నాకున్న నమ్మకం అది. ఇక్కడ ఆయనకి అంత లేదు. ఈ క్వొశ్చన్ నన్ను అడగాల్సిన అవసరమే లేదు. శ్రీకాంత్‌గారి గురించి సినిమా పరిశ్రమలో అందరికీ తెలుసు. శ్రీకాంత్: నాతో నటించిన హీరోయిన్స్ అందరూ ఉమ (ఊహ అసలు పేరు)కు ఫ్రెండ్సే. వాళ్ల ఇళ్లకు మేం వెళ్తాం, మా ఇంటికి వస్తుంటారు. రోజా నన్ను ‘అన్నయ్యా’ అంటుంది. ‘నువ్వు నన్ను అన్నయ్యా అంటే నీతో డ్యూయెట్ ఎలా చేస్తాను’ అనేవాణ్ని. సంగీత కూడా అంతే. దాదాపు అందరం ఫ్యామిలీలానే ఉంటాం. చిరంజీవిగారు వాళ్లు ఎయిటీస్ బ్యాచ్ అని రీయూనియన్ చేసుకుంటున్నారు. ఆ తర్వాత 90స్ బ్యాచ్ మాది. మేమందరం కూడా అలా కలవాలని ట్రై చేసి, ఓసారి చెన్నైలో కలిసాం. తర్వాత అందరం బిజీ బిజీగా ఉండి 1980స్ బ్యాచ్‌లా ప్రతి ఏడాదీ కలవలేకపోతున్నాం. ► కెరీర్ ఫామ్‌లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకొని సినిమాలు మానేశారు. ఆ విషయంలో ఏదైనా బాధగా ఉందా? ఊహ: ఏమీ అనిపించలేదు. లైఫ్‌లాంగ్ ఎలానూ హీరోయిన్గా ఉండలేం. జీవితానికి ముఖ్యంగా కావాల్సింది మ్యారీడ్ లైఫ్. ఏ సమయంలో అయినా పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాల్సిందే. ఫామ్‌లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవడం బెటర్. మంచి పేరుతో ఇండస్ట్రీ బయటకి వచ్చినట్టు ఉంటుందనిపించింది. ► అమలగారు, నదియాగారు.. ఇలా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు. మీక్కూడా ఆ ఉద్దేశం ఏమైనా ఉందా? ఊహ: ముగ్గురు íపిల్లలు ఉన్నారు. నాకు వాళ్లతోనే సరిపోతోంది. శ్రీకాంత్: టీవీలో చేయమని చాలాసార్లు అడిగారు. చేయనని చెప్పింది. ► ఓకే.. ఇన్నేళ్లూ మీడియా ముందుకు రాని మీరు మీ పెద్దబ్బాయి రోషన్ హీరో అయినప్పుడు వచ్చి, మాట్లాడారు... శ్రీకాంత్: (మధ్యలో అందుకుంటూ) అవునండీ.. నా సినిమాలకు కూడా రాలేదు. ఊహ: అప్పుడు ఈయన జోక్స్ కూడా చేశారు. నా సినిమాల ఇంటర్వ్యూ అప్పుడు పిలిస్తే వచ్చేదానివి కాదు. మీ అబ్బాయి సినిమా కాబట్టి వస్తున్నావు అనేవారు. మనం పని చేసిన ఇండస్ట్రీలో మన అబ్బాయి కూడా వచ్చి పని చేయడం ఆ ఫీలింగ్ భలే ఉంటుంది. ఆ ఫీలింగే వేరు. ► మీ ముగ్గురు పిల్లల పెంపకం గురించి... ముగ్గుర్ని పెంచడం కష్టంగా ఉంటుందా? ఊహ: కష్టం అనుకుంటే ఒకరిద్దరు ఉన్నా పెంచలేం. హ్యాపీగా పెంచితే వాళ్లే పెరిగిపోతారు. పిల్లల పెంపకాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. సినిమాలు మానేశాను కాబట్టి ఇంట్లోనే ఉంటున్నాను. పిల్లలే లోకం. షూటింగ్ ముగించుకొని ఈయన వస్తే ఈయన. శ్రీకాంత్: నాకు గుర్తున్నంతవరకూ నేను పిల్లల స్కూల్‌కి వెళ్లింది ఒకే ఒక్కసారి. స్కూల్‌కి తీసుకెళ్లడం, ట్యూషన్స్‌కి తీసుకెళ్లడం.. అన్నీ తనే. పిల్లల విషయంలో నేను చాలా తక్కువ పట్టించుకున్నట్లే. ► ‘రుద్రమదేవి’ సినిమాలో మీ పాప కూడా యాక్ట్ చేసింది కదా. కంటిన్యూ చేస్తారా? శ్రీకాంత్: తనకి ఇంట్రస్ట్ లేదు. ఆ సినిమాలో చిన్నపిల్లల క్యారెక్టర్ అని చేసింది. అంతే. తను బాగా చదువుతుంది. బాస్కెట్ బాల్ నేషనల్ ప్లేయర్. మా చిన్నబ్బాయి రోహన్‌కి కూడా సినిమా హీరో అవ్వాలని ఉంది. ఊహ: రోహన్ ప్రభుదేవాతో ఓ సినిమా చేస్తున్నాడు. ఏప్రిల్‌లో ఆ సినిమా రిలీజవుతుంది. ► మాకు తెలిసి శ్రీకాంత్‌గారు బాగా ఖర్చు పెడతారు.. అది నిజమేనా? శ్రీకాంత్: ఇద్దరం ఖర్చు విషయంలో ఒకేలా ఉంటామనే చెప్పాలి. దగ్గరివాళ్ల పెళ్లిళ్లు అంటే బాగా ఇస్తుంది. ఇక అవసరం అని వస్తే ఎవరినీ కాదనదు. ఇద్దరం కూడా అవసరం అనుకున్నచోట ఎంతయినా వెనకాడం. నా ఖర్చులంటే పెద్దగా ఏముంటాయి? ఫ్రెండ్స్‌తో బాగా ట్రావెల్ చేస్తుంటాను. అదే నా ఖర్చు. ఊహ: సినిమా ఇండస్ట్రీ గురించి అందరికీ తెలిసిందే. ఎప్పుడు ఎలా ఉంటుందో అన్నట్లు ఉంటుంది. అందుకని కొంచెం జాగ్రత్తగానే ఉంటాం. అయితే మా పెళ్లయిన రోజు నుండి ఇంతవరకు ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారు. డబ్బు ఉంది కదా అని కొంతమంది కాసినోలకు వెళతారు. ఆయన అలాంటివి చేయరు. ► సినిమా ఇండస్ట్రీలో అప్ అండ్ డౌన్స్ మామూలే. డౌన్స్ వచ్చినప్పుడు మీరెలా సపోర్ట్ చేస్తారు? ఊహ: మన టైమ్ బాగున్నప్పుడు పైన ఉంటాం. లేదంటే కొంచెం కిందకు దిగుతాం. మనం పైకి వెళ్లినప్పుడు ఎంత బాగా యాక్సెప్ట్ చేసుకున్నామో, కిందకు వచ్చినప్పుడు కూడా అలానే ఉండాలి. మనకు మనం ఆలోచించుకుని సెటిల్డ్‌గా ఉంటే బావుంటుంది. ఈయన దగ్గర ఉన్న గొప్ప విషయం ఏంటంటే... తన ఫీలింగ్స్‌ని బయటకు చూపించరు. హ్యాపీనెస్‌ని షేర్ చేసుకుంటారు కానీ డల్ మూమెంట్స్‌ని బయటపెట్టరు. అయితే నేను కనిపెట్టేస్తాను. కానీ అది బయటకు చెప్పకుండా ఆయనతో మూమూలుగానే ఉంటాను. మెయిన్‌గా పిల్లలు కూడా ఈ విషయంలో సపోర్ట్ చేస్తారు. మేమిద్దరం ఆ విషయంలో అదృష్టవంతులం. మా పెద్దబ్బాయి రోషన్ సిట్యువేషన్‌ని అర్థం చేసుకొని ప్రవర్తిస్తాడు. పాప పదో తరగతి. చాలా జాగ్రత్తగా ఉంటుంది. మా చిన్నబ్బాయి ఐదో తరగతి చదువుతున్నాడు. శ్రీకాంత్: అలాంటి టైమ్స్‌లో వాళ్లకంటే నేను ఎక్కువ ధైర్యంగా ఉండాలి. ► ఏమైనా కావాలంటే పిల్లలు ఎవర్నడుగుతారు? ఊహ: దాదాపుగా నన్నే అడుగుతారు. ఏదైనా పెద్ద బడ్జెట్ అయితే ఆయన దగ్గరికి వెళతారు. టెన్షన్ పడుతూ వెళతారా, వాళ్లు టెన్షన్ పడ్డంత సేపు కూడా ఈయన ఉండరు. వెంటనే ఓకే అంటారు. (నవ్వుతూ). పిల్లలు కొంచెం డల్‌గా ఫేస్ పెడితే చాలు. వాళ్లకి నచ్చినది దొరికినట్లే. కానీ, మా పిల్లల్లో నచ్చేది ఏంటంటే దాన్ని గ్రాంటెడ్‌గా తీసుకోరు. ఇలా మనం బాధగా ఫేస్ పెడితే నాన్న ఏదైనా చేసేస్తారు అనే మెంటాలిటీ లేదు. అది మంచి విషయం. మేం చాలా లక్కీ. నాన్నని ఏదైనా అడగాలంటే ఓ రోజంతా ఆలోచిస్తారు. అడుగుదామా? వద్దా? అని. ► సరే.. మీ ఇంట్లో ఎవరు డామినేటింగ్? ఊహ: ఇద్దరం బ్యాలెన్స్డ్గా ఉంటాం. శ్రీకాంత్: తనే డామినేటింగ్ (నవ్వులు). ఊహ: అవును.. మరి ఇల్లు మొత్తం పట్టించుకోవాలి కదా. శ్రీకాంత్: అంటే నేను షూటింగ్‌లు అని పనుల్లో తిరుగుతూ ఉంటాను. ఆ టైమ్‌లో ఇంటికి అది కావాలి? ఇది కావాలి? అని ఆలోచిస్తే అవుట్. ఎప్పుడూ ఇంటి టెన్షన్ అనేది మన దగ్గరికి రాకూడదు. నాకా టెన్షన్ లేదు. ఒక్కోసారి సడెన్‌గా నైట్ షూటింగ్ అంటారు. ఏం ఆలోచించకుండా ఓకే అనేస్తాను. ఎందుకంటే నాకు ఇంటి టెన్షన్ లేదు. ► రోషన్ మళ్లీ స్క్రీన్ మీద ఎప్పుడు కనపడతాడు? శ్రీకాంత్: ఈ ఇయర్ అనుకుంటున్నాం. ► ఫైనల్లీ.. ప్రేమికులుగా ఉన్నప్పుడు ఇచ్చి పుచ్చుకున్న గిఫ్ట్‌ల గురించి? శ్రీకాంత్: ఏముంటాయి? పాపల బొమ్మలో, బాబుల బొమ్మలో ఇచ్చుంటాను. ఊహ: అవునండీ.. నాకు బొమ్మలంటే చాలా ఇష్టం. టెడ్డీబేర్లు ఇచ్చేవారు. పెళ్లయ్యాక కూడా అవి కొనిచ్చారు. శ్రీకాంత్: బంగారపు గొలుసులు అవీ ఇచ్చేవాణ్ని.. ఇప్పుడు అది కూడా లేదు. ఇప్పుడు ఇక ఏముంటుంది? ఊహ: అవును.. ఏముంటుంది? (నవ్వులు). ► మీ ప్రేమను ఇంట్లో ఒప్పించడానికి కష్టపడ్డారా? శ్రీకాంత్: చాలా ఈజీగా అయిపోయింది. ఊహ: మాది లవ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజా అని చాలామంది సందేహపడ్డారు. అంత స్మూత్‌గా జరిగింది. శ్రీకాంత్: ఎంగేజ్మెంట్ జరిగేవరకూ ఎవరికీ తెలియదు. ► మీరు ప్రేమలో ఉన్నారని ఇండస్ట్రీలో ఎవరూ కనిపెట్టలేదా? ఊహ: కొంచెం క్లోజ్‌గా ఉండే ఫ్రెండ్స్ వరకూ తెలుసు. శ్రీకాంత్: మా ఇంట్లోవాళ్లకి, వాళ్ల ఇంట్లో వాళ్లకి తెలుసు. కానీ మేమిద్దరం బయటకు వెళ్లడం లాంటివి ఏం చేయలేదు. ఫోన్లో మాట్లాడుకునేవాళ్లం. ఫంక్షన్స్ అప్పుడు మా ఇంటికి పిలిచేవాణ్ణి. అక్కడ అందర్నీ పరిచయం చేసేవాణ్ణి. ► ఇద్దరికీ దైవభక్తి ఎక్కువే అన్నమాట? శ్రీకాంత్: తనకి చాలా ఎక్కువ. పూజలు తెగ చేసేస్తుంది. నేను గుడికి ఎక్కువ వెళ్తుంటాను. ఊహ: ఈ మధ్యే ఆయనకి భక్తి ఎక్కువయింది. శ్రీకాంత్: ఐదేళ్ల నుంచీ భక్తి ఎక్కువైంది. ఎక్కువగా వీలు దొరుకుతోంది కాబట్టి గుళ్లను సందర్శిస్తున్నాం. ► ఉపవాసాలు అవీ చేస్తుంటారా? ఊహ: చిన్నప్పటినుండి పూజలు, ఉపవాసాలు అల వాటే. మంగళవారం, శుక్రవారం ఉపవాసం ఉంటాను. శనివారం పిల్లలు కూడా నాన్–వెజ్ తినరు. ఈయనకు ఆ పట్టింపులేవీ ఉండవు. అలా అని బాగా ఫుడ్డీ కాదు. – డి.జి. భవాని -
కడుపునొప్పి తాళలేక మహిళ ఆత్మహత్య
బుక్కపట్నం : మండలంలోని గూనిపల్లిలో ఓ వివాహిత కడుపునొప్పి తాళలేక పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి బంధువులు.. పోలీసులు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన రవీందర్‌రెడ్డి భార్య ఊహ(24) తరచూ కడుపునొప్పితో బాధపడుతుండేది. అయితే సోమవారం నొప్పి అధికం కావడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి అపస్మారకస్థితిలో పడి ఉంది. స్కూల్ నుంచి వచ్చిన వారి పిల్లలు గమనించి చుట్టుపక్కల వారికి చెప్పగా వారు బాధితురాలిని బత్తలపల్లి ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. ఊహ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ యతీంద్ర తెలిపారు. ఈమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. -
శ్రీవారి సేవలో సినీ నటుడు శ్రీకాంత్
సాక్షి, తిరుమల : సినీ నటుడు శ్రీకాంత్, ఊహ తమ కుమార్తె, కుమారులతో కలిసి ఆదివారం స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయం అనంతరం వారు ఆలయానికి వచ్చారు. శ్రీవారు, వకుళమాతను దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. అనంతరం రంగనాయక మండపంలో వారికి అధికారులు లడ్డూ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ హుదూద్ బాధితులకు తెలుగు చిత్ర పరిశ్రమ అండగా నిలిచిందని తెలిపారు. తాను నటించిన ఢీ అంటే ఢీ జనవరిలో విడుదల కానుందని చెప్పారు. నాటు కోడి, జల్సారాయుడు సెట్లో ఉన్నాయని తెలిపారు. రెండు రాష్ట్రాల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. -
అత్తింటి ఆరళ్లకు అబల బలి
వివాహమైన ఏడాదికే ఆమెకు నూరేళ్లూ నిండాయి. కడదాకా తోడుంటానని బాస చేసిన భర్తే ఆమె పాలిట యముడై నిత్యం వేధింపులకు పాల్పడ్డాడు. జీవిత భాగస్వామి నుంచి ఛీత్కారాలు ఎక్కువ కావడంతో మనస్తాపం చెంది ఆ యువతి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన సంతమాగులూరు మండలం పరిటాలవారిపాలెంలో బుధవారం జరిగింది. సంతమాగులూరు : భర్త, అత్తమామల వేధింపులకు తాళలేక ఓ యువతి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మండలంలోని పరిటాలవారిపాలెంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన పుట్టా వీరాంజనేయులు చిన్న కుమారుడు నాగరాజుకు గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం ముతరాసిపాలేనికి చెందిన చొప్పవరపు వెంకట్రావు రెండో కుమార్తె ఊహ(20)తో గతేడాది ఏప్రిల్‌లో వివాహమైంది. వీరి కాపురం ఆరు నెలల వరకు సజావుగానే సాగింది. ఆ తర్వాత దంపతుల మధ్య కలతలు రేగాయి. ఈ నేపథ్యంలో 20 రోజుల క్రితం భార్యను భర్త తన్ని ఆమె పుట్టింటికి తరిమేశాడు. ఇటీవల భార్య వద్దకు వెళ్లి నచ్చజెప్పి మళ్లీ ఇంటికి తెచ్చుకున్నాడు. మంగళవారం ఉదయం ఊహ భర్త నాగరాజు పనికి వెళ్లి సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చాడు. తన అన్న అయ్యప్ప, తల్లిదండ్రులు ఉండే గది తలుపులు పూర్తిగా వేసి ఉండటం.. తన గది తలుపులు ఓరగా వేసి ఉండటంతో ఇంట్లో ఎవరూ లేరని భావించి తలుపులు మరింత దగ్గరకు వేసేందుకు వెళ్లాడు. గదిలో తన అన్న అయ్యప్ప, తన భార్య ఊహ ఉండటాన్ని గుర్తించాడు. జీర్ణించుకోలేని నాగరాజు అన్న, తన భార్యపై చేయి చేసుకున్నాడు. బావముందే చేయి చేసుకున్నందుకు మనస్తాపం చెందిన ఊహ.. ఆ వెంటనే తమ వంగతోట వద్దకు వెళ్లింది. అక్కడ పురుగుమందు తాగింది. తోట వద్దే ఉన్న అత్త రాజ్యలక్ష్మి దగ్గరకు వచ్చేలోపే కోడలు కిందపడి ఉంది. స్థానికుల సాయంతో ఉహను ఇంటికి చేర్చారు. అనంతరం 108 సిబ్బందికి సమాచారం అందించారు. వారు ఎంతకీ స్పందించకపోవడంతో ఆటోలో వైద్యశాలకు తరలిస్తుండగా ఏల్చూరు సమీపంలోకి వెళ్లే సరికి 108 వాహనం వచ్చింది. ఊహను అందులో ఎక్కించేందుకు ప్రయత్నిస్తుండగా ఆమె మృతి చెందినట్లు 108 సిబ్బంది ధ్రువీకరించారు. పుట్టింటికి సమాచారం ఇవ్వడంలో జాప్యం ఊహ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంలో అత్తింటి వారు తీవ్ర జాప్యం చేశారు. వారే సమాచారం తెలుసుకుని వచ్చారు. కుమార్తె విగతజీవిగా పడి ఉండటం చూసి తల్లిదండ్రులు భోరున విలపించారు. ఆ సమయంలో అక్కడ అత్తింటి వారెవరూ లేకపోవడంతో ఊహ బంధువులకు అనుమానం వచ్చింది. తమ బిడ్డను అత్తింటివారే చంపారని ఆరోపించారు. తమ కుమార్తె మరణానికి ఊహ భర్త నాగరాజు, బావ అయ్యప్ప, అత్త రాజ్యలక్ష్మి, మామ వీరాంజనేయులే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు ఎస్సై ఎ.శివనాగరాజు కేసు నమోదు చేశారు. తహశీల్దార్ గంగాధరరావు సమక్షంలో శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు. -
డాక్టరవుతావని కలగంటిమి బిడ్డా..!
అదృశ్యమైన బాలిక..మృతదేహంగా లభ్యం ఊహ అదృశ్యం కేసులో వీడిన మిస్టరీ శోకసంద్రంలో తల్లిదండ్రులు మల్లారెడ్డిపల్లిలో విషాదం హసన్‌పర్తి/చిట్యాల, న్యూస్‌లైన్ : తల్లి నిన్ను డాక్టర్‌గా చూడాలని కల గంటిమి.. ఎంత పనిచేశావు బిడ్డా.. అప్పుడే నీకూ నూరేళ్లు నిండా యా తల్లి ? అంటూ ఆ తల్లిదండ్రుల ఆర్తనాదాలు మిన్నంటారుు. మండలంలోని మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన పల్లకొండ సూరయ్య, నిర్మల దంపతుల కూతురు ఊహ(15) జనవరి 21న చిట్యాల సాంఘిక సంక్షే మ హాస్టల్ నుంచి అదృశ్యమైన విషయం తెలిసిందే. తల్లిదండ్రులు, పోలీసులు ఆమె కోసం గాలిస్తుండగా ఆమె చదువుతున్న పాఠశాల సమీపంలోని బావిలో శుక్రవారం మృతదేహమై కనిపించింది. ఈ వార్త విన్న తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలారు. బిడ్డను తల్చుకుని బోరున విల పించారు.దీంతో మల్లారెడ్డిపల్లిలో విషాదం అలుముకుంది. వార్డెన్, ప్రిన్సిపాల్ మందలించారనే.. సంక్రాంతి పండుగ తర్వాత ఒకరోజు ఆలస్యంగా జనవరి 21న హాస్టల్‌కు వెళ్లిన ఊహను వార్డెన్, ప్రిన్సిపాల్ మందలించారని మృతురాలి తల్లిదండ్రులు తెలిపారు. దీంతో మనస్తాపానికి గురైన ఊహ అదే రోజు మధ్యాహ్నం బాత్రూంకని వెళ్లి తిరిగి కనిపించలేదు. 22న ఉద యం ఊహ కనిపించడం లేదని పిల్లలు చెప్పడంతో ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఊహ అదృశ్యానికి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్, టీచర్లే కారణమని తల్లిదండ్రులు రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఊహ వ్యవసాయబావిలో శవమై కనిపించ డం చర్చనీయూంశమైంది.