Srikanth: Hero Says His Role In Akhanda Movie As Varadarajulu - Sakshi
Sakshi News home page

Srikanth: నా భార్య ఊహ నన్ను అలా చూసి వణికిపోయింది

Published Thu, Dec 9 2021 1:03 PM | Last Updated on Thu, Dec 9 2021 3:22 PM

Hero Srikanth About His Role In Akhanda Movie As Varadarajulu - Sakshi

Hero Srikanth Interesting Comments On His Role In Akhanda Movie: శ్రీకాంత్‌.. ఫ్యామిలీ హీరోకు కేరాఫ్‌ అడ్రస్‌. ఆయన ఇప్పటి వరకు 100 పైగా చిత్రాల్లో నటించగా అందులో ఎక్కువగా కుటంబ కథా చిత్రాలే చేశాడు. దీంతో పరిశ్రమలో శ్రీకాంత్‌కు సాఫ్ట్‌ ఇమేజ్‌ ఏర్పడింది. అలా హీరోగా, నటుడిగా ఇంతకాలం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్రీకాంత్‌ అఖండ సినిమాలో క్రూరమైన విలన్‌గా కనిపించి అందరిని బయటపెట్టాడు. తనకు అలవాటు లేని పాత్ర అయినా కూడా అందులో పరకాయ ప్రవేశం చేశాడు శ్రీకాంత్‌. అయితే కొంతమంది ఫ్యాన్స్‌ శ్రీకాంత్‌ను విల‌న్‌గా చూడ‌టానికి ఇష్ట‌ప‌డ‌టం లేదు.

చదవండి: అషూరెడ్డి ప్రెగ్నెంటా?! షాక్‌లో ఫ్యాన్స్‌, ఇంతగా దిగజారిపోయావా!

దీంతో అఖండలో శ్రీకాంత్‌ పాత్రకు మిశ్ర స్పందన వస్తోంది. ఇటీవల విడుదలైన అఖండ మూవీ బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టిస్తూ బ్లాక్‌బస్టర్‌ విజయం వైపు దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో సినిమా సక్సెస్‌లో భాగంగా శ్రీకాంత్‌ తాజాగా మీడియాతో ముచ్చటించాడు. ఈ క్ర‌మంలో త‌న పాత్రకు వస్తున్న రెస్పాన్స్‌పై శ్రీకాంత్ స్పందించాడు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌ మాట్లాడుతూ.. అఖండలో తన పాత్ర వ్యక్తిగతం తనకు బాగా నచ్చిందని,  అయితే ఈ గెటప్‌లో మొదటిసారి చూసిన తన భార్య ఊహ వణికిపోయిందని చెప్పాడు. ‘ఒకసారి షూటింగ్ అయిపోయిన తర్వాత అదే గెటప్‌లో ఇంటికి వెళ్లాను. అప్పుడు ఊహతో కలిసి కొందరు మాట్లాడుకుంటు ఉన్నారు. నన్ను అలా చూసి వాళ్లంతా కంగారుపడ్డారు.

చదవండి: Rashmi-Chiranjeevi: రెమ్యునరేషన్‌ విషయంలో తగ్గని రష్మీ, ఎన్ని లక్షలో తెలుసా?

ఇక ఊహ అయితే గుర్తుపట్టలేదు. ఒక్కసారిగా నన్ను అలా చూసి వణికిపోయింది. సినిమా చూసిన తర్వాత కూడా ఊహ  చాలా కంగారు పడింది. ఎందుకంటే నన్ను ప్రేక్షకులు ఇలా ఆదిరిస్తారో లేదోనని భయపడుతూనే ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు. మొదట ప్రతినాయకుడిగా నటించడానికి ఒప్పుకున్న తర్వాత చాలామంది తనని నమ్మలేదని, విలన్‌గా చేయడం అవరమా? అని తనతో అన్నవాళ్లు ఇప్పుడు తన పాత్రపై ప్రశంసలు కురిపిస్తున్నారంటూ అంటూ ఆనందం వ్యక్తం చేశాడు. అంతేకాదు బాలకృష్ణ కూడా ఇప్పుడే విలన్‌ పాత్రలు చేయకు కొంతకాలం ఆగమని సూచించినట్లు తెలిపాడు. ఇకపై కూడా కేవలం హీరోగా నటిస్తానని కూర్చోకుండా.. నచ్చితే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా విలన్‌గా కూడా చేస్తానని శ్రీకాంత్‌ పేర్కొన్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement