విడాకులంటూ బ్రేకింగ్ ఇచ్చేశారు.. వెంటనే ఫోన్ చేసి చెప్పా: శ్రీకాంత్ | Tollywood Hero Srikanth Opens About Divorce Rumours With WIfe Ooha - Sakshi
Sakshi News home page

Srikanth: ఆమెతో కంఫర్ట్‌గా ఫీలయ్యేవాన్ని..హీరోయిన్స్‌తో ఎఫైర్స్‌పై శ్రీకాంత్ క్లారిటీ!

Published Wed, Dec 27 2023 7:47 PM | Last Updated on Wed, Dec 27 2023 8:38 PM

Tollywood Hero Srikanth Open About Divorce Rumours with WIfe - Sakshi

టాలీవుడ్‌ హీరో శ్రీకాంత్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో హీరోగా, ప్రతినాయకుడిగా తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని స్టార్‌గా ఎదిగారు. ఇటీవలే కోటబొమ్మాళి పీఎస్‌తో అభిమానులను అలరించిన శ్రీకాంత్ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అవేంటో ఓ లుక్కేద్దాం. 

ఇటీవలే ఓ మూవీ కార్యక్రమంలో శ్రీకాంత్ పాల్గొన్నారు. అక్కడే సీనియర్ హీరోయిన్ రాశి కూడా కనిపించింది. ఈవెంట్‌లో వీరిద్దరూ చాలా సరదాగా పలకరించుకున్నారు. అంతేకాకుండా ఈవెంట్‌లో పాల్గొన్న రాశి.. శ్రీకాంత్‌ భుజంపై కొట్టి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వేదికపై హిట్ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్న వీరిద్దరు చిన్నప్పటి స్నేహితుల్లా సందడి చేశారు. ఆ వీడియో పెద్దఎత్తున సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజా ఇంటర్వ్యూలో శ్రీకాంత్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. 

రాశి కొట్టడంపై శ్రీకాంత్ స్పందిస్తూ.. 'చాలా ఏళ్ల తర్వాత మేమిద్దరం ఫంక్షన్‌లో కలిశాం. అక్కడ ఉన్న హీరోయిన్ రాశిని అమ్మ అన్నది. దీంతో నేను కూడా సరదాగా రాశి అమ్మా అన్నా.. దానికే తను సరదాగా నవ్వుతూ కొట్టింది. అంతకు మించి ఏం లేదు. నేను నటించిన వారిలో సౌందర్య, ఉమతో చాలా కంఫర్ట్‌గా ఫీలయ్యేవాన్ని. మా ఇంటికి కూడా ఒక ఫ్యామిలీలాగా వచ్చేవారు. సైడ్ ఆర్టిస్టులతో అందరితో బాగా ఉండేవాన్ని' అని అన్నారు. 

విడాకుల రూమర్స్‌పై మాట్లాడుతూ.. 'ఊహాతో నాకు విడాకులు అంటూ వార్తలొచ్చాయి.  టీవీలలో బ్రేకింగ్‌లు కూడా వేశారు. అప్పుడే నేను, నా భార్య అరుణాచలం వెళ్తున్నాం. అప్పుడు వెంటనే ప్రభుకు ఫోన్ చేసి చెప్పా. చూడరా బాబు మేమిద్దరం అరుణాచలం వెళ్తున్నామని చెప్పా. వెంటనే ఆ వార్తలను ఖండించాం.' అని తెలిపారు. పెళ్లికి ముందు మీకు ఇండస్ట్రీలో ఎఫైర్స్ ఏమైనా ఉన్నాయా? అని ప్రశ్నించగా సరదాగా నవ్వుతూ ఆన్సరిచ్చారు.  బయట ఎవరో ఏదో రాసింది అడిగితే కాదు?.. మీకు తెలిస్తే చెప్పండని నవ్వుతూ మాట్లాడారు.

బాలీవుడ్‌ చిత్రాల్లో అవకాశమొస్తే తప్పకుండా చేస్తానని శ్రీకాంత్ అన్నారు. పోలీస్ ఆఫీసర్‌గా నచ్చిన చిత్రాల్లో ఖడ్గం అని తెలిపారు. ఇటీవలే పోలీస్‌గా కొటబొమ్మాళి అనే సినిమాను చేశా.. పోలీసులు స్ట్రగుల్స్‌ ఎలా ఉంటాయో చూపించామని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement