దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న పెళ్లి సందD. ఆర్కా మీడియా వర్క్స్, ఆర్.కె ఫిలిం అసోసియేట్స్ బ్యానర్స్‌పై కె.కృష్ణ మోహన్ రావు సమర్పణలో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు అందిస్తున్న ఈ చిత్రానికి గౌరి రోణంకి దర్శకత్వం వహిస్తున్నారు.
మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాతలు. రోషన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.ఈ సినిమాలో రాఘవేంద్రరావు కీ రోల్ లో కనిపిస్తున్నాడు.
ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలో ఈ మూవీ నుంచి టైటిల్ లిరికల్ సాంగ్ విడుదల చేసింది చిత్రయూనిట్.
‘పట్టుచీరల తళతళలు.. పట్టగొలుసులా గలగలలు’అంటూ సాగే ఈ పాటకి చంద్రబోస్ లిరిక్స్ అందించగా, కీరవాణి అద్భుత సంగీతాన్ని సమకుర్చాడు.
ఈ పాటను హేమచంద్ర, దీపు, రమ్యబెహ్రా ఆలపించగా, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ప్రస్తుతం ఈ పాట ప్రేక్షకులను అలరిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment