‘సలార్ సినిమాకి హిట్ టాక్ రావడం సంతోషంగా ఉంది. వచ్చేవారం(డిసెంబర్ 29) 'బబుల్‌గమ్' సినిమా రిలీజ్ కాబోతుంది. సలార్‌లో లేని కంటెంట్ మా సినిమాలో ఉంది. మా సినిమాలో లేని కంటెంట్ సలార్‌లో ఉంది(నవ్వుతూ..). కాబట్టి ప్రభాస్ సినిమా థియేటర్స్‌లో ఉన్నప్పటికీ మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఆడియన్స్‌కి నచ్చితే రెండు సినిమాలను చూస్తారు. ‘బబుల్‌గమ్’ అందరికి కనెక్ట్ అయ్యే సినిమా. కచ్చితంగా ప్రేక్షకులను నచ్చుతుందనే నమ్మకం మాకు ఉంది’ అని దర్శకుడు రవికాంత్ పేరేపు అన్నారు. ఆయన దర్శకత్వంలో ప్రముఖ యాంకర్ సుమ కనకాల కొడుకు రోషన్ హీరోగా పరిచయం అవుతున్న తాజా చిత్రం ‘బబుల్‌గమ్’. మానస చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు రవికాంత్ పేరేపు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
► ‘క్షణం’ తర్వాత కృష్ణ అండ్ లీల చేశాను. నిజానికి కృష్ణ అండ్ లీల థియేటర్స్ లో రిలీజ్ కావాల్సింది. కానీ కోవిడ్ లాక్ డౌన్ కారణంగా ఓటీటీలో విడుదలయింది. లాక్ డౌన్ కారణంగా యాక్టర్స్ షెడ్యుల్స్ మారిపొయాయి. చేయాల్సిన ప్రాజెక్ట్స్ ఎక్కువైపోయాయి. ఈ క్రమంలో కొత్తవాళ్ళతో చేయడానికి 'బబుల్‌గమ్' కథ రాశాను. రోషన్ నాకు ముందే తెలుసు. తను హీరోగా పరిచయం అవుతున్నారని తెలిసి రోషన్ కలిశాను. ఈ కథకు తను పర్ఫెక్ట్ ఫిట్ అనిపించాడు. తర్వాత మా జర్నీ మొదలైయింది.
► ఇది కొత్తవాళ్ళతోనే చేయాల్సిన కథ. 22 ఏళ్ల తర్వాత కాలేజ్ పూర్తి చేసుకొని రియల్ వరల్డ్ లోకి అడుగుపెడతాం. అప్పటి వరకూ మన ఫ్యామిలీ, పేరెంట్స్ మనల్ని ప్రోటక్ట్ చేస్తారు. ఒక్కసారి మన ప్యాషన్ ని వెదుక్కుంటూ బయటికి వెళ్ళినపుడు అంతా కొత్తగా అనిపిస్తుంది. ఈ క్రమంలో ఎలాంటి కెరీర్ ని ఎంచుకోవాలి ? డబ్బులు వుంటే సరిపోతుందా ? మనకి ఇష్టమైనది చేయాలా? ఇలా చాలా కన్ఫ్యుజన్స్ వుంటాయి. ఇలాంటి సమయంలో అనుకోకుండా జీవితంలో ప్రేమ వస్తే ఎలా డీల్ చేస్తాం.. ఇలాంటి కథకు కొత్తవాళ్ళు వుంటేనే బెటర్ అనిపించింది.
► ఇది ప్రధానంగా ప్రేమకథ. ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు కూడా ఇది రాక్ స్టార్ లా ఉంటుందా ? లేదా ఒక మ్యుజిషియన్ ఫిల్మ్ లా వుంటుందా అని అడిగారు. అయితే ఇది ప్రేమకథ ప్రధానంగా వుండే రిలేషన్ షిప్ డ్రామా.
► రోషన్ ఫెంటాస్టిక్. ట్రైలర్ లో చూసింది పది శాతమే. సినిమాలో చాలా అద్భుతంగా చేశాడు. రోషన్, మానస ఇద్దరూ చాలా చక్కగా నటించారు. అలాగే ఇందులో నటించిన మిగతా నటీనటులు కూడా చక్కని ప్రతిభ కనపరిచారు.
► మానస తెలుగమ్మాయి. చాలా అద్భుతంగా నటించింది. తనకి తెలుగు అర్ధం కావడం వలన మన రైటింగ్ లోని సబ్ టెక్స్ట్ కూడా తనకి అర్ధమౌతుంది. దీంతో మరింత ఈజీ అయ్యింది. ఇప్పుడు తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా వస్తున్నారు. దీంతో నేటివిటీ ఇంకొంచెం బిలీవబుల్ గా వుంటుంది.
►ప్రస్తుతానికి నా దృష్టి 'బబుల్‌గమ్' విడుదలపై ఉంది. ఈ సినిమా విడుదల తర్వాత కొత్త ప్రాజెక్ట్ పై దృష్టి పెడతాను.
Comments
Please login to add a commentAdd a comment