యాంకర్‌ సుమ కొడుకు మూవీ టీజర్‌ చూశారా? | Bubblegum Movie Teaser Launched By Nani | Sakshi
Sakshi News home page

Bubblegum Movie: యాంకర్‌ సుమ కొడుకు మూవీ టీజర్‌ చూశారా?

Published Tue, Oct 10 2023 3:44 PM | Last Updated on Tue, Oct 10 2023 3:44 PM

Bubblegum Movie Teaser Launched By Nani - Sakshi

ప్రముఖ యాంకర్‌ సుమ కనకాల తయనయుడు రోషన్‌ హీరోగా మారాడు. ఆయన నటించిన తొలి చిత్రం ‘బబుల్‌గమ్‌’.  'క్షణం' ఫేమ్‌  రవికాంత్ పేరెపు  దర్శకత్వం వహిస్తున్న  ఈ చిత్రాన్ని హేశ్వరీ మూవీస్ - పీపుల్ మీడియా సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని నేచురల్‌ స్టార్‌ నాని విడుదల చేశారు.

‘ప్రేమ అనేది బబుల్‍గమ్ లాంటిదని, ముందు తియ్యగా ఉన్నా ఆ తర్వాత అంటుకుంటుందంటూ’ వాయిస్ ఓవర్‌తో టీజర్‌ ప్రారంభమతుంది. ఆ తర్వాత హీరోయిన్‌ను పబ్‌లో చూసి ప్రేమలో పడడం.. ఆ తర్వాత హీరో గురించి హీరోయిన్‌కి నిజం తెలిసి గొడవ పడడం  ఇందులో చూపించారు. 

సముద్రం ఒడ్డున హీరోహీరోయిన్ లిక్‍లాక్‍తో బబుల్‍గమ్ సినిమా టీజర్ ముగిసింది. లవ్‌,రొమాన్స్‌, యాక్షన్‌.. ఇలా అన్ని అంశాలతో యూత్‌ఫల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు టీజర్‌ చూస్తే అర్థమవుతుంది. డిసెంబర్‌ 29న ఈ చిత్రం విడుదల కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement