నాన్న ఏడ్చారు.. నాకు ఆనందంగా అనిపించింది: రోషన్‌ కనకాల | Roshan Kanakala Talk About Bubblegum Movie | Sakshi
Sakshi News home page

షర్ట్‌ లేకుండా సిటీ అంతా తిరిగాను.. సిగ్గు అంతా పోయింది: రోషన్‌ కనకాల

Published Thu, Dec 28 2023 5:32 PM | Last Updated on Thu, Dec 28 2023 6:01 PM

Roshan Kanakala Talk About Bubblegum Movie - Sakshi

నా బాల్యం అంతా తాతగారి(దేవదాస్‌ కనకాల) యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లోనే గడిచింది. ఆ ప్రభావం నాపై పడింది. చిన్నప్పటి నుంచే యాక్టింగ్‌పై ఇష్టం పెరిగింది. సినిమాని ముందుకు తీసుకెళ్ళే కథానాయకుడిగా చేయలనే కోరిక ఎప్పటినుంచో ఉండేది. బబుల్‌గమ్ చిత్రంతో ఆ కోరిక నెరవేరింది. ఇకపై నటుడిగానే నా జీవితాన్ని కొనసాగిస్తాను’అని యంగ్‌ హీరో రోషన్ కనకాల అన్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ రవికాంత్ పేరేపు దర్శకత్వంలో రోషన్ కనకాల హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'బబుల్‌గమ్'. మానస చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రోషన్‌ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. 

చిన్నప్పటి నుంచి నటుడు కావాలనేది నా కోరిక. హీరోగా సినిమా చేయాలని చాలా రోజుల ఎదురుచూశాను. అలా దర్శకుడు రవికాంత్ ని కలవడం, ఆయనకి నాతో సినిమా చేయాలని అనిపించడంతో ఈ ప్రయాణం మొదలైయింది.

నటన పరంగా తాతగారి(దేవదాస్‌ కనకాల)దగ్గర రెండు నెలల పాటు శిక్షణ తీసుకున్నాను. ఆ తర్వాత లాస్‌ ఏంజలెస్‌లో ఒక కోర్సు చేశాను.  పాండిచ్చేరి లో ఒక కోర్స్ చేశాను. అలాగే నాన్నతో చర్చించి కొన్ని ప్రాక్టీస్ చేస్తుంటాను.

బబుల్‌గమ్‌ సెట్‌పైకి వచ్చినప్పుడు నాకు న్యూ కమ్మర్ లా అనిపించలేదు. ఎందుకంటే షూటింగ్‌కి నెల ముందే మేము వర్క్‌ షాప్‌ చేసుకున్నాం. స్క్రిప్ట్ ని రిహార్సల్ చేసుకున్నాం. ఒక సీన్ లో ఎలా చేయాలి, ఎలాంటి ఎమోషన్ కన్వే అవ్వాలి, ఎలాంటి కాస్ట్యూమ్ ఉండాలి.. ఇవన్నీ ముందు అనుకున్నాం. ఆ ప్రిపరేషన్ చాలా హెల్ప్ అయ్యింది. 

► అమ్మానాన్నలకు(యాంకర్‌ సుమ, రాజీవ్‌ కనకాల)పరిశ్రమలో మంచి పేరుంది.ఆ ప్లెజర్‌ నాపై ఉంది.నటన పరంగా వారి నుంచి సలహాలు సూచనలు తీసుకుంటాను. ఏవైనా సందేహాలు వున్నా అడుగుతుంటాను. అమ్మా నాన్న సినిమా చూశారు. అయితే అప్పుడు అక్కడ నేను లేను. నాన్న కొన్ని సీన్స్ లో ఏడ్చారని అమ్మ చెప్పింది. నాన్నని అడిగితే ‘బాగా చేశావ్’ అన్నారు. నాన్న సహజంగా ఒప్పుకోరు. ఆయన నుంచి అలాంటి కాంప్లిమెంట్ రావడం ఆనందంగా అనిపించింది. అమ్మకు కూడా చాలా నచ్చింది.

► ఈ సినిమాలోని ఇజ్జత్ పాట లాంచ్ చేయడానికి చిరంజీవి గారిని కలిశాం. ఆ సమయంలో వారి జీవితంలో ఎదురైన అనుభవాలు గురించి చెప్పారు. అలాగే బిగ్ బాస్ కి వెళ్ళినపుడు నాగార్జున గారితో వీడియో చేశాం. మొదట ఆడియో రికార్డ్ కాలేదు. ఆయన్ని అడిగితే .. మరోసారి చేశారు. అది చాలా గొప్పగా అనిపించింది.

► ఈ సినిమాలో షర్ట్‌లెస్‌ సీన్‌ ఉంటుంది. దాదాపు మూడు గంటలు పాటు షర్టు లేకుండా సిటీ అంతా తిరిగాను. ఒక పాయింట్ లో నా సిగ్గు అంతా పోయింది( నవ్వుతూ). నా దృష్టి అంతా ఆ సీన్, అందులోని ఎమోషన్ పైనే పెట్టాను. ఆ సీన్ షూటింగ్ ఎప్పటికీ మర్చిపోలేని అనుభువం. చాలా విషయాలు నేర్చుకున్నాను. 

► ఈ సినిమా కోసం శ్రీచరణ్ చాలా కొత్త సౌండ్ ని క్రియేట్ చేశాడు, పాటలన్నీ ఇప్పటికే హిట్ అయ్యాయి. ఇంటర్వెల్ బ్లాక్ ఇచ్చిన మ్యూజిక్ గూస్ బంప్స్ వస్తాయి. సినిమా మొత్తం చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు.ఇందులో ఒక పాట పాడాను. అయితే దీనికి కోసం ప్రత్యేక శిక్షణ ఏమీ తీసుకోలేదు. దర్శకుడు, సంగీత దర్శకుడు కోరడంతో అది అలా జరిగిపోయింది.

 నాకు ప్రత్యేకమైన జోనర్ అంటూ ఏమీ లేదు. మంచి సినిమా ఏదైనా ఇష్టం. ప్రేక్షకులని ఎంగేజ్ చేసే ప్రతి సినిమా ఇష్టం.కథలు వింటున్నాను. ప్రస్తుతం నా దృష్టి 'బబుల్‌గమ్’ విడుదలపైనే ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement