'బబుల్‌గమ్‌' రొమాంటిక్‌ వీడియో సాంగ్‌తో హీట్‌ పెంచిన రోషన్‌ | Roshan Kanakala Bubblegum Movie Second Song Released Now | Sakshi
Sakshi News home page

'బబుల్‌గమ్‌' రొమాంటిక్‌ వీడియో సాంగ్‌తో హీట్‌ పెంచిన రోషన్‌

Published Mon, Dec 25 2023 8:20 AM | Last Updated on Mon, Dec 25 2023 9:52 AM

Roshan Kanakala Bubblegum Movie Second Song Released Now - Sakshi

'బబుల్‌గమ్‌' సినిమాతో వెండితెరపై కనిపించనున్నాడు యాంకర్‌ సుమ కుమారుడు రోషన్‌ కనకాల. ఈ సినిమాలో ఆయనకు జోడీగా  మానస చౌదరి నటిస్తుంది. రవికాంత్‌ పేరేపు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అడివి శేష్‌తో ‘క్షణం’ సినిమాతో హిట్‌ కొట్టిన డైరెక్టర్‌ రవికాంత్‌.. దీంతో బబుల్‌గమ్‌ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి బజ్‌ క్రియేట్‌ అయింది.  పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరి మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్‌ యూత్‌ను ఆకట్టుకునేలా ఉంది. తాజాగా ఈ చిత్రం నుంచి రొమాంటిక్‌ సాంగ్‌ను మేకర్స్‌ విడుదల చేశారు.

ప్రేమకథను ప్రధానమైన కాన్సెప్ట్‌గా మంచి రిలేషన్‌షిప్‌ డ్రామాగా ‘బబుల్‌గమ్‌’ చిత్రాన్ని తెరకెక్కించినట్లు డైరెక్టర్‌ తెలిపాడు. ఈ చిత్రంలో ఆది పాత్రలో రోషన్, జాన్వీ పాత్రలో తెలుగు అమ్మాయి మానస నటించడం విషేశం అని ఆయన చెప్పాడు. కొత్తవారితో చేయాల్సిన సినిమా ఇది అని రోషన్‌ హీరోగా పరిచయమవుతున్నాడని తెలిసి, ఈ కథను చెప్పాను అన్నాడు. కాలేజీ చదువు పూర్తి చేసుకున్న తర్వాత యువకుల కెరీర్‌లో కొంత కన్‌ఫ్యూజన్‌ ఉంటుంది. దానిని ఈ సినిమాలో చూపించామని ఆయన తెలిపాడు. 

'బబుల్‌గమ్‌' సినిమా డిసెంబర్‌ 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో 'జస్ట్ ఈజీ పీసీ' రొమాంటిక్‌ సాంగ్‌ లిరికల్‌ వీడియోను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది.  శ్రీ చరణ్‌ ఈ చిత్రానికి చక్కటి సంగీతం అందించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement