Anchor Suma Son Roshan Birthday Special Photo Goes Viral, See Netizens Reaction - Sakshi
Sakshi News home page

Anchor Suma Son Photo: యాంకర్‌ సుమ కొడుకు ఇప్పుడెలా ఉన్నాడో చూశారా?

Mar 16 2022 9:49 AM | Updated on Mar 16 2022 10:11 AM

Anchor SUma Son Roshan Photos Goes Viral - Sakshi

యాంకర్‌ సుమ, రాజీవ్‌ కనకాల తనయుడు రోషన్‌ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే హీరో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌తో కలిసి ‘నిర్మల కాన్వెంట్‌’ అనే చిత్రంలో నటించాడు. ఆ తర్వాత పై చదువుల కోసం యూఎస్‌ వెళ్లాడు. ఇటీవల ఇండియాకు తిరిగి వచ్చిన రోషన్‌.. మళ్లీ సినిమాలపై ఫోకస్‌ పెట్టాడు. తమ తనయుడి కెరీర్‌ని గాడిలో పెట్టేందుకు సుమ, రాజీవ్‌ బాగానే ప్రయత్నిస్తున్నారు. సొంతంగా ఓ సినిమాను కూడా నిర్మిస్తున్నారు. గతేడాదిలోనే ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆ మూవీ నుంచి ఎలాంటి అప్‌డేట్‌ లేదు.

ఇదిలా ఉంటే.. తాజాగా రోషన్‌ ఫోటోలు నెట్టింట్‌ వైరల్‌గా మారాయి. సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉండే సుమ.. రోషన్‌ బర్త్‌డే(మార్చి 15)సందర్భంగా మంగళవారం తన ఇన్‌స్టా ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్‌ చేసింది. తమ కుమారుడికి బర్త్‌డే విషెస్‌ చెబుతూ షేర్‌ చేసిన ఆ ఫోటోలను చూసి నెటిజన్స్‌ షాకవుతున్నారు. అతను రోషనేనా? ఇలా మారిపోయాడేంటి? అప్పుడే అంత పెద్దొడు అయిపోయాడా? అని నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. అలాగే రోషన్, సుమ తల్లీకొడుకుల్లా కాకుండా అక్క, తమ్ముడిలా ఉన్నారంటూ కామెంట్లు పెడుతున్నారు. రోషన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ ఫొటోలో రోషన్ చాలా పొడవుగా, క్యాజువల్ లుక్స్‌తోనే అందరినీ ఆకట్టుకుంటున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement