
నంద కిశోర్, విశాల్ గుర్నాని, నిక్ తుర్లో
‘మూన్ లైట్ (2016), త్రీ బిల్ బోర్డ్స్ అవుట్ సైడ్ ఎబ్బింగ్, మిస్సోరీ’ (2017) వంటి పలు హాలీవుడ్ చిత్రాలకు నిర్మాతగా, సహనిర్మాతగా వ్యవహరించిన నిక్ తుర్లో తొలిసారి భారతీయ భాషా చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. మోహన్ లాల్, రోషన్ మేక తండ్రీ కొడుకులుగా, శనయ కపూర్, జహ్రా ఖాన్ కీ రోల్స్‌లో నటిస్తున్న ‘వృషభ’ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు నిక్. ఈ సందర్భంగా నిక్ మాట్లాడుతూ – ‘‘వృషభ’ నా ఫస్ట్ ఇండియన్ మూవీ.
నేను చేస్తున్న తొలి బహు భాషా సినిమా కూడా ఇదే. ‘వృషభ’ నాకో అందమైన జర్నీ అవుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు. నంద కిషోర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని అభిషేక్ వ్యాస్, విశాల్ గుర్నాని, జుహి పరేఖ్ మెహతా, శ్యామ్ సుందర్, ఏక్తా కపూర్, శోభా కపూర్, వరుణ్ మథూర్, సౌరభ్ మిశ్రాలు నిర్మిస్తున్నారు. తెలుగు, మలయాళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం హిందీ, కన్నడ, తమిళ భాషల్లోనూ రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment