పెళ్లికి రెడీ అవుతోన్న‌ 'దృశ్యం' న‌టుడు | Drishyam Actor Roshan Basheer Marriage With Farzana On August 5 | Sakshi
Sakshi News home page

దృశ్యం న‌టుడి పెళ్లికి ముహూర్తం ఖ‌రారు

Published Wed, Jul 22 2020 12:32 PM | Last Updated on Wed, Jul 22 2020 12:44 PM

Drishyam Actor Roshan Basheer Marriage With Farzana On August 5 - Sakshi

తిరువ‌నంత‌పురం: 'దృశ్యం' న‌టుడు రోష‌న్ బ‌షీర్‌కు పెళ్లి ఘ‌డియ‌లు ద‌గ్గ‌ర‌ప‌డ్డాయి. కేర‌ళ‌లో త‌న ప్రేయ‌సి, మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మ‌మ్ముట్టి ద‌గ్గ‌రి బంధువైన‌ ఫ‌ర్జానాను ఆగస్టు 5న వివాహం చేసుకోనున్నారు. కేర‌ళ ప్ర‌భుత్వం నియ‌మ నిబంధ‌న‌ల మేరకు కేవ‌లం ఇరు కుటుంబాల స‌మ‌క్షంలోనే ఈ వివాహం జ‌ర‌గ‌‌నుంది. కాగా ఎప్ప‌టినుంచో ప్రేమ ఊసులు చెప్పుకుంటున్న వీరిద్ద‌రినీ పెళ్లి బంధంతో ఒక్క‌టి చేసేందుకు పెద్ద‌లు నిర్ణ‌యించుకోవ‌డంతో జూలై 5న వీరి నిశ్చితార్థం కూడా జ‌రిగిపోయింది. దీనికి సంబంధించిన ఫొటోల‌ను రోష‌న్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీంతో అభిమానులు ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. కాగా ఫ‌ర్జానా న్యాయ‌విద్య‌ను అభ్య‌సిస్తున్నారు. (సెలబ్రిటీల పెళ్లిపై మాధ‌వీల‌త విసుర్లు)

రోష‌న్ బ‌షీర్ "ప్ల‌స్ టూ" చిత్రంతో మ‌ల‌యాళీ ఇండ‌స్ట్రీ‌లో అడుగు పెట్టారు. 'ఇన్న‌ను ఆ క‌ల్యాణం', 'బ్యాంకింగ్ అవ‌ర్స్', 'రెడ్ వైన్' వంటి ప‌లు సినిమాల్లో క‌నిపించారు. కానీ అత‌నికి మంచి బ్రేక్‌నిచ్చింది మాత్రం 'దృశ్యం' సినిమానే. మోహ‌న్‌లాల్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఈ సినిమాలో రోష‌న్ నెగెటివ్ పాత్ర‌లో మెరుగైన న‌ట‌న క‌న‌బ‌రిచారు. ఈ సినిమా బంప‌ర్ హిట్ సాధించ‌డంతో ఎన్నో భాష‌ల్లో రీమేక్ అయింది. తెలుగులో వెంకటేశ్‌ (దృశ్యం), తమిళంలో కమల్‌ హాసన్‌ (పాపనాశనం), కన్నడంలో రవిచంద్రన్‌ (దృశ్య), హిందీలో అజయ్‌ దేవగన్‌ (దృశ్యం) హీరోలుగా రీమేక్‌ చేశారు. అంతేకాదు.. సింహళీ (శ్రీలంక)భాషలో ‘ధర్మయుద్య’గా రీమేక్‌ అయింది. చైనీస్‌లోనూ ‘షీప్‌ వితౌట్‌ ఏ షెపర్డ్‌’ టైటిల్‌తో రీమేక్ అయింది. (భారీ వ్యూస్‌ సాధించిన ‘గడ్డి తింటావా’ సాంగ్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement