Hero Ravi Teja Released Pelli SandaDI Movie Song - Sakshi
Sakshi News home page

Pelli SandaD Song Release: రవితేజ చేతుల మీదుగా ‘పెళ్లి సందD’ సాంగ్‌

Published Wed, Sep 29 2021 8:32 PM | Last Updated on Thu, Sep 30 2021 3:57 PM

Hero Ravi Teja Released Srikanth Son Roshan Pelli SandaDI Movie Song - Sakshi

సీనియర్ నటుడు శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పెళ్ళిసందD’. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కన్నడ భామ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు, ట్రైలర్లకు ప్రేక్షకులను విశేష స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో రొమాంటిక్‌ సాంగ్‌ను పాటను విడుదల చేశారు మేకర్స్‌. మాస్‌ మహారాజా రవి తేజ చేతుల మీదుగా విడుదలైన ఈ పాటకు చంద్రబోస్‌ సాహిత్యంగా అందించగా.. ఎమ్‌ఎమ్‌ కీరవాణి స్వరాలను సమకూర్చారు. శ్రీనిధి, కాలభైరవ, నయన నాయర్ ఆలపించారు.

చదవండి: పరిశ్రమ సమస్యలను రాజకీయం చేయకండి: దిల్‌ రాజు

‘మధుర నగరిలో..’  అంటూ సాగే ఈ పాట కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.  పాటతో దర్శకేంద్రుడు మరోసారి తన మార్క్‌ చూపించారు. కాగా కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న రాఘవేంద్రరావు చాలా గ్యాప్‌ తర్వాత ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు. ఈ సినిమాకు ఆయన దర్శకత్వ పర్యవేక్షణ అందించడమే కాకుండా ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. శ్రీకాంత్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన ‘పెళ్ళిసందడి’ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా మరీ రోషన్‌కు ఎంత మేర సక్సెస్‌ను తెచ్చిపెడుతుందో చూడాలి. 

చదవండి: Pelli SandaDI : పెళ్లి సందD ట్రైలర్‌ అదిరిందిగా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement