Pelli SandaDI : పెళ్లి సందD ట్రైలర్‌ అదిరిందిగా.. | Pelli SandaDI Movie Trailer Launched By Mahesh Babu | Sakshi
Sakshi News home page

Pelli SandaDI : మహేశ్‌ బాబు చేతుల మీదుగా ‘పెళ్లి సందD’ట్రైలర్‌

Published Wed, Sep 22 2021 12:24 PM | Last Updated on Wed, Sep 22 2021 12:42 PM

Pelli SandaDI  Movie Trailer Launched By Mahesh Babu - Sakshi

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న చిత్రం పెళ్లి సందD. ఆర్కా మీడియా వ‌ర్క్స్‌, ఆర్‌.కె ఫిలిం అసోసియేట్స్ బ్యాన‌ర్స్‌పై కె.కృష్ణ మోహ‌న్ రావు స‌మ‌ర్ప‌ణ‌లో  ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు అందిస్తున్న ఈ చిత్రానికి గౌరి రోణంకి ద‌ర్శ‌కత్వం వహిస్తున్నారు. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మాత‌లు. రోష‌న్, శ్రీ‌లీల హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.



ఈ సినిమాలో రాఘవేంద్రరావు కీ రోల్ లో కనిపిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని సూపర్ స్టార్ మహేశ్‌ బాబు విడుదల చేశాడు. ఈ సందర్భంగా చిత్రయూనిట్ కు బెస్ట్ విషెస్ తెలిపాడు మహేశ్‌.

ఇక ఈ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు..పెళ్లి సందడి’ సినిమాకి పనిచేసిన కీరవాణి – చంద్రబోస్ ఈ సినిమాకి కూడా పనిచేయడం విశేషం. పాతికేళ్ళ క్రితం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన పెళ్ళిసందడి సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.



ఈ సినిమా మ్యూజికల్‌గా కూడా సూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఈ పాటలు శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తాయి. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించారు.


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement