
Pelli SandaD Movie Teaser : శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న సినిమా 'పెళ్లి సందD'.శ్రీ లీల ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన పాటలు సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. 'సహస్రకు పెళ్లి నాతోనా.. లేక నువ్వు తెచ్చిన తొట్టిగ్యాంగ్ లీడర్‌తోనా' అంటూ రోషన్ చెప్పిన డైలాగ్ హైలెట్‌గా నిలిచింది.
రాఘవేంద్ర రావు మార్క్ ప్రతి ఫ్రేములో స్పష్టంగా కనిపిస్తుంది. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. గౌరి రోణంకి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్కా మీడియా వర్క్స్, ఆర్.కె ఫిలిం అసోసియేట్స్ బ్యానర్స్‌పై మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.