ప్లస్‌ వన్‌ ఏజ్‌లో... | Plus One age ... | Sakshi
Sakshi News home page

ప్లస్‌ వన్‌ ఏజ్‌లో...

Published Sun, Dec 25 2016 11:36 PM | Last Updated on Mon, Sep 4 2017 11:35 PM

ప్లస్‌ వన్‌ ఏజ్‌లో...

ప్లస్‌ వన్‌ ఏజ్‌లో...

‘‘యువతరం అనగానే అల్లరి చిల్లరగా తిరుగుతుంటారనే భావన ఉంటుంది. అయితే, సమస్య ఎదురైనప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలి? అన్నది ఈ  తరానికి బాగా తెలుసు. ఆ విషయాన్నే ఈ చిత్రంలో చూపిస్తున్నాం’’ అన్నారు అళహరి. రోషన్, ఆర్తి జంటగా ఆయన దర్శకత్వంలో విశ్వాస్‌.హెచ్‌ నిర్మించిన చిత్రం ‘ప్లస్‌ వన్‌’.

జయసూర్య స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని రేష్మీ ఠాకూర్‌ విడుదల చేసి, నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్‌కి ఇచ్చారు. ‘‘వినోదం, సందేశం ఉన్న కథ ఇది’’ అని దర్శకుడు అళహరి అన్నారు. ‘‘ప్లస్‌ ఒన్‌ ఏజ్‌లో యువత మనస్తత్వం ఎలా ఉంటుందని ఈ చిత్రంలో చూపించాం. ఈ నెల 30న విడుదల చేస్తున్నాం’’ అన్నారు విశ్వాస్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement