Plus One
-
ప్లస్ ఒన్ విద్యార్థినిపై కవలల లైంగిక దాడి
తమిళనాడు,అన్నానగర్: ఉసిలంపట్టి సమీపంలో మంగళవారం ప్లస్ వన్ విద్యార్థినిపై లైంగిక దాడి చేసి హత్య చేసిన కవలలను పోలీసులు అరెస్టు చేశారు. మదురై జిల్లా ఉసిలంపట్టి ప్రాంతంలోని ఓ తోటకి మంగళవారం ఉదయం స్నానం చేయడానికి వెళ్లిన ప్లస్ వన్ విద్యార్థిని రక్తపు మడుగులో హత్యకు గురైంది. దీని గురించి సమాచారం అందుకున్న సేడపట్టి పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉసిలంపట్టి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన గురించి పేరైయూర్ పోలీసు జాయింట్ సూపరింటెండెంట్ మదియళగన్ కేసు నమోదు చేసి విచారణ చేశారు. ఇందులో ఓనాపట్టికి చెందిన అమ్మవాసి కుమారుడు మాధవన్ (24) చిక్కాడు. ఇతని వద్ద పోలీసులు తీవ్ర విచారణ చేశారు. ఇందులో మాధవన్, తన సోదరుడు మధు ఇద్దరు విద్యార్థిని బెదిరించి ఎవరు లేని స్థలానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయం బయట తెలిస్తే ప్రమాదం అని భావించిన ఇద్దరు ఆ విద్యార్థిన్ని గొంతు నులిమి, తలపై రాయి వేసి హత్య చేశారు. విద్యార్థిని మృతదేహాన్ని బావి ప్రాంతంలో విసిరేసి పరారైనట్లు తెలిసింది. మాధవన్, మధు కవలలు కావడం గమనార్హం. అనంతరం పోలీసులు మాధవన్, మధు ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి ఈ ఘటనలో ఇంకా ఎవరికైనా సంబంధం ఉందా అని తీవ్ర విచారణ చేస్తున్నారు. -
ప్లస్ వన్ ఏజ్‌లో...
‘‘యువతరం అనగానే అల్లరి చిల్లరగా తిరుగుతుంటారనే భావన ఉంటుంది. అయితే, సమస్య ఎదురైనప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలి? అన్నది ఈ తరానికి బాగా తెలుసు. ఆ విషయాన్నే ఈ చిత్రంలో చూపిస్తున్నాం’’ అన్నారు అళహరి. రోషన్, ఆర్తి జంటగా ఆయన దర్శకత్వంలో విశ్వాస్.హెచ్ నిర్మించిన చిత్రం ‘ప్లస్ వన్’. జయసూర్య స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని రేష్మీ ఠాకూర్ విడుదల చేసి, నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్‌కి ఇచ్చారు. ‘‘వినోదం, సందేశం ఉన్న కథ ఇది’’ అని దర్శకుడు అళహరి అన్నారు. ‘‘ప్లస్ ఒన్ ఏజ్‌లో యువత మనస్తత్వం ఎలా ఉంటుందని ఈ చిత్రంలో చూపించాం. ఈ నెల 30న విడుదల చేస్తున్నాం’’ అన్నారు విశ్వాస్. -
ప్రేమ లేని ప్రేమ కథ
రోషన్, ఆర్తి జంటగా తెరకెక్కిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘ప్లస్ వన్’. అళహరి దర్శకత్వంలో సచేతా డ్రీమ్ వర్క్స్ పతాకంపై విశ్వాస్.హెచ్ నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను నిర్మాత సి. కల్యాణ్ విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘ప్రేమలేని ప్రేమ కథ ఒక వైపు.. ప్రేమ ఉన్న ప్రేమ మరోవైపు. ఈ అంశాలను, స్వీట్ 16 వయసును దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రం చేశాం. తెలియని పొరపాటు వల్ల జరిగిన తప్పుని ఒప్పుగా చేసుకునేందుకు ఓ జంట ఏం చేశారన్నదే కథ’’ అన్నారు. ‘‘నల్గొండలో షూట్ మొత్తం పూర్తి చేశాం’’ అని నిర్మాత చెప్పారు. తేజారెడ్డి, పూర్ణిమ, సరయు, ప్రతాని రామకృష్ణగౌడ్ తదితరులు నటించారు. -
అయోమయంలో ప్లస్ టూ మైనారిటీ విద్యార్థులు
హొసూరు:రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 10 నుంచి ప్లస్‌వన్, ప్లస్ టూ విద్యార్థులకు అర్థసంవత్సర పరీక్షలు జరుగుతున్నాయి. క్రిష్ణగిరి జిల్లాలో మైనారిటీ భాషలైన తెలు గు, కన్నడం, ఉర్దూ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చదువుతున్నారు. తమిళం, ఆంగ్ల మీడియం విద్యార్థులకు ప్రశ్నపత్రాలు ముద్రించి అందజేశారు. మైనారిటీ భాషల విద్యార్థులకు చేతితో రాసి జిరాక్స్ కాపీలను అందజేశారు. అక్షరాలు కనిపించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూడు గంటల వ్యవధిలో 200 మార్కులకు జవాబులు రాయాల్సి ఉంది. ప్రశ్నపత్రాల్లో ప్రశ్న లు చదివేందుకు కూడా వీలులేక పోవడంతో విద్యార్థు లు కన్నీరు పెట్టుకున్నారు. తమిళ ప్రశ్నపత్రాలను ము ద్రించి అందజేసిన విద్యాశాఖ తెలుగు వారి విషయంలో చిన్నచూపు చూసింది. గతంలో కూడా ఇలాంటి పరిస్థితి కలిగింది. ఈ విషయంపై సాక్షి పత్రికలో కథనం ప్రచురితం కావడంతో 6 నుంచి 10వ తరగతి వరకు ప్రశ్నపత్రాలు ముద్రించి అందజేసే ఏర్పాట్లు చేశారు. ప్లస్‌వన్, ప్లస్‌టూ విద్యార్థుల పట్ల విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం చూపడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. పబ్లిక్ పరీక్షల్లో కూడా ఇదే పరిస్థితిని కొనసాగించి తెలుగు విద్యార్థులను పరీక్షలలో తప్పిపోయేలా విద్యాశాఖ అధికారులు కుట్ర పన్నుతున్నట్లు తెలుగు సంఘా లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.