అయోమయంలో ప్లస్ టూ మైనారిటీ విద్యార్థులు | Confused plus 2 minority students | Sakshi
Sakshi News home page

అయోమయంలో ప్లస్ టూ మైనారిటీ విద్యార్థులు

Published Thu, Dec 18 2014 3:45 AM | Last Updated on Sat, Sep 2 2017 6:20 PM

Confused plus 2 minority students

హొసూరు:రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 10 నుంచి ప్లస్‌వన్, ప్లస్ టూ విద్యార్థులకు అర్థసంవత్సర పరీక్షలు జరుగుతున్నాయి. క్రిష్ణగిరి జిల్లాలో మైనారిటీ భాషలైన తెలు గు, కన్నడం, ఉర్దూ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చదువుతున్నారు. తమిళం, ఆంగ్ల మీడియం విద్యార్థులకు ప్రశ్నపత్రాలు ముద్రించి అందజేశారు. మైనారిటీ భాషల విద్యార్థులకు చేతితో రాసి జిరాక్స్ కాపీలను అందజేశారు. అక్షరాలు కనిపించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూడు గంటల వ్యవధిలో 200 మార్కులకు జవాబులు రాయాల్సి ఉంది. ప్రశ్నపత్రాల్లో ప్రశ్న లు చదివేందుకు కూడా వీలులేక పోవడంతో విద్యార్థు లు కన్నీరు పెట్టుకున్నారు.

తమిళ ప్రశ్నపత్రాలను ము ద్రించి అందజేసిన విద్యాశాఖ తెలుగు వారి విషయంలో చిన్నచూపు చూసింది. గతంలో కూడా ఇలాంటి పరిస్థితి కలిగింది. ఈ విషయంపై సాక్షి పత్రికలో కథనం ప్రచురితం కావడంతో 6 నుంచి 10వ తరగతి వరకు ప్రశ్నపత్రాలు ముద్రించి అందజేసే ఏర్పాట్లు చేశారు. ప్లస్‌వన్, ప్లస్‌టూ విద్యార్థుల పట్ల విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం చూపడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. పబ్లిక్ పరీక్షల్లో కూడా ఇదే పరిస్థితిని కొనసాగించి తెలుగు విద్యార్థులను పరీక్షలలో తప్పిపోయేలా విద్యాశాఖ అధికారులు కుట్ర పన్నుతున్నట్లు తెలుగు సంఘా లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement