![Maa Oori Polimera 2 First Look Poster Is Out - Sakshi](/styles/webp/s3/article_images/2023/05/9/poli.jpg.webp?itok=cifITsUF)
‘‘మా ఊరి పొలిమేర’ పోస్టర్ బాగుంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. గౌరు గణబాబు సమర్పణలో డా. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో గౌరీకృష్ణ నిర్మించిన చిత్రం ‘మా ఊరి పొలిమేర 2’. సత్యం రాజేష్, డా. కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రాకేందు మౌళి, అక్షత, బాలాదిత్య, సాహితి దాసరి, రవి వర్మ, చిత్రం శ్రీను ముఖ్య తారలు.
ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రిలీజ్ చేశారు. ‘‘మా ఊరి పొలిమేర’ చూసి ఎగ్జయిట్ అయ్యాను. ఆ సినివ సీక్వెల్‌ను మా బ్యానర్‌లో చేసినందుకు డా. అనిల్ విశ్వనాథ్ గారికి ధన్యవాదాలు’’ అన్నారు గౌరీకృష్ణ.
Comments
Please login to add a commentAdd a comment