మా ఊరి పొలిమేర 2 ట్రైలర్‌.. ఈసారి మరిన్ని ట్విస్ట్‌లు | Maa Oori Polimera 2 Movie Trailer Out - Sakshi
Sakshi News home page

Polimera 2 Trailer: మా ఊరి పొలిమేర 2 ట్రైలర్‌.. ఈసారి మరిన్ని ట్విస్ట్‌లు

Published Sat, Oct 14 2023 12:04 PM | Last Updated on Sat, Oct 14 2023 12:30 PM

Maa Oori Polimera 2 Trailer Launch - Sakshi

'మా ఊరి పొలిమేర' కరోనా సమయంలో హాట్‌స్టార్‌ వేదికగా విడుదల అయిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ సినిమాకు భారీ రెస్పాన్స్‌ వచ్చింది. ఇందులో స‌త్యం రాజేష్‌, డా. కామాక్షి భాస్కర్ల, గెట‌ప్ శ్రీను, రాకేంద్ మౌళి, బాలాదిత్య తదితరులు నటించారు. శ్రీకృష్ణ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై గౌరు గ‌ణ‌బాబు స‌మ‌ర్ప‌ణ‌లో గౌరికృష్ణ నిర్మించిన ఈ చిత్రానికి డా. అనిల్ విశ్వ‌నాథ్ ద‌ర్శ‌కత్వం వహించారు.

సత్యం రాజేశ్ కెరియర్లో ఈ సినిమా చెప్పుకోదగినదిగా నిలిచింది. భారీ హిట్‌ కొట్టిన ఈ సినిమాకు సీక్వెల్‌గా  'మా ఊరి పొలిమేర 2' తెరకెక్కించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంటును హైదరాబాద్ - AAA సినిమాస్‌లో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా దర్శకుడు హరీశ్ శంకర్, నిర్మాత బన్నీవాసు, హీరో కార్తికేయ హాజరయ్యారు. వారందరి చేతుల మీదుగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.

(ఇదీ చదవండి: సాక్షి టీవీ వాట్సాప్‌ ఛానెల్‌ క్లిక్‌ చేసి ఫాలో అవ్వండి)

గ్రామీణ ప్రాంతాల్లో జరిగే క్షుద్రపూజల చుట్టూ తిరిగే ఈ కథలోని ట్విస్టులు ఆడియన్స్‌ను మెప్పిస్తాయి. మొదటి భాగంలో భారీ ట్విస్ట్‌తో సినిమా ముగుస్తుంది. ఇప్పుడు 'మా ఊరి పొలిమేర 2' సీక్వెల్‌లో ఇంకెన్ని ట్విస్ట్‌లు పెట్టారో ట్రైలర్‌లోనే తెలిసిపోతుంది. నవంబర్‌ 3న ఈ సినిమా విడుదల చేయనున్నారు. ఈసారి మాత్రం ఈ సినిమాను థియేటర్‌కు వెళ్లే చూడాలి. ఆ తర్వాతే ఓటీటీలోకి విడుదల చేస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement