గత కొన్నేళ్ల కాలంలో హారర్ స్టోరీల్లో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన సినిమా 'పొలిమేర'. అంచనాల్లేకుండా రిలీజై అభిమానుల్ని ఆకట్టుకున్న ఈ చిత్రానికి ఇదివరకే రెండు భాగాలు రాగా.. రీసెంట్‌గానే మూడో పార్ట్ కూడా ఉంటుందని ప్రకటించారు. ఈ మేరకు షూటింగ్ కూడా మొదలుపెట్టేశారు. ఇదిలా ఉండగానే పార్ట్ 2 నిర్మించిన నిర్మాత మూడో భాగాన్ని తీస్తున్న నిర్మాతపై పోలీస్ కేసు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఏం జరుగుతోంది?
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 26 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్ )
తాంత్రిక విద్యలు, చేతబడి కాన్సెప్ట్‌తో తీసిన 'మా ఊరి పొలిమేర' సినిమా.. 2021లో నేరుగా ఓటీటీలో రిలీజై సెన్సేషన్ సృష్టించింది. దీంతో రెండో భాగాన్ని గతేడాది థియేటర్లలో రిలీజ్ చేశారు. తొలుత మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ ఓవరాల్‌గా పెట్టిన డబ్బులు వెనక్కి వచ్చేశాయి. రెండో భాగానికి గౌరి కృష్ణప్రసాద్ నిర్మాతగా వ్యవహరించగా, నందిపాటి వంశీ అనే వ్యక్తి డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించాడు. నిర్మించింది తానే కాబట్టి వచ్చిన లాభాల్లో షేర్ కావాలని అడుగుతుంటే.. చంపేస్తానని తనని వంశీ బెదిరిస్తున్నాడని కృష్ణప్రసాద్ తాజాగా హైదారాబాద్‍లోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
'పొలిమేర 2 మూవీ రిలీజ్ తర్వాత రూ.30 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూట్ చేసిన వంశీ ఇప్పటివరకు నాకు లాభాల్లో పైసా కూడా ఇవ్వలేదు. నా షేర్ నాకు కావాలని డిమాండ్ చేస్తూ తనని కలిశాను. కానీ నన్ను చంపేస్తానని, పోలీసులకు ఫిర్యాదు చేస్తే దానికి తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించాడు' అని నిర్మాత కృష్ణ ప్రసాద్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా ఈ మధ్య లాంచ్ అయిన మూడో భాగానికి ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తోంది వంశీనే కావడం ఇక్కడ ట్విస్ట్!
(ఇదీ చదవండి: హీరో కిరణ్ అబ్బవరంతో పెళ్లి... తేదీ రివీల్ చేసిన హీరోయిన్)
Comments
Please login to add a commentAdd a comment