Shivajiraja
-
జవాన్ల కుటుంబాలకు ‘మా’ విరాళం
సాక్షి, హైదరాబాద్: పుల్వామా దాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు ‘మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్)’ ముందుకొచ్చింది. తమ వంతు సాయంగా 5 లక్షల రూపాయల విరాళాన్ని ‘మా’ ప్రకటించింది. ఈమేరకు మా అధ్యక్షుడు శివాజీరాజా, జనరల్ సెక్రెటరీ డాక్టర్ వి.కె నరేష్ విరాళాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జవాన్ల త్యాగం మరువలేనిదని, ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అమరులైను జవాన్ల కుటుంబాలను ప్రగాఢ సానూభూతిని వ్యక్తం చేశారు. అమర జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై జైషే ఉగ్రవాది కారు బాంబుతో దాడిలో 40 మంది జవాన్లు మృతిచెందారు. అమరులు కుటుంబాలను ఆదుకునేందుక దేశ వ్యాప్తంగా ఎంతోమంది ప్రముఖులు ముందుకొస్తున్న విషయం తెలిసిందే. సినీపరిశ్రమ నుంచి కూడా పలువురు తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. -
చిన్నా పెద్దా తేడా లేదు.. క్యాష్తో సమన్యాయం
‘‘తెలుగు చిత్రపరిశ్రమలో ఇటీవల లైంగిక వేధింపుల విషయమై పలు విమర్శలు వస్తున్నాయి. ఈ విషయాన్ని తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి సీరియస్‌గా తీసుకుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ విషయంలో విశాఖ గైడ్‌లైన్స్ పేరుతో ఇచ్చిన సూచనల ఆధారంగా లైంగిక వేధింపుల నిరోధానికి ‘క్యాష్’ (కమిటీ అగైనెస్ట్ సెక్సువల్ హెరాస్మెంట్) కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు పి.కిరణ్ చెప్పారు. గురువారం హైదరాబాద్‌లో టి.ఎఫ్.సి.సి, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టి.ఎఫ్.సి.సి అధ్యక్షుడు కిరణ్ మాట్లాడుతూ– ‘‘క్యాష్’ కమిటీలో చిత్రపరిశ్రమ నుంచి నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, ఫెడరేషన్ సభ్యులతో పాటు సమాజంలోని స్వచ్ఛంద సంస్థల వారు, లాయర్లు, డాక్టర్లు, ప్రభుత్వాధికారులు ఉంటారు. సినిమా రంగంలోని అన్ని విభాగాల వారు తమకు ఏవైనా వేధింపులు ఎదురైతే ఈ కమిటీ దృష్టికి తీసుకురావచ్చు’’ అన్నారు. ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా మాట్లాడుతూ– ‘‘శ్రీరెడ్డి అర్ధనగ్నంగా నిరసన తెలపడంతో మన కుటుంబంలోని వ్యక్తి ఇలా చేసిందే అని భావోద్వేగానికి గురై ఆ రోజు అలా మాట్లాడాను. అంతేకానీ ఆమెపై వ్యక్తిగతంగా మాకు ఎటువంటి విరోధం లేదు. ‘మా’ సభ్యులెవరూ ఆమెతో కలిసి నటించకూడదని ఆ రోజు అన్నాం. అయితే తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్, డైరెక్టర్స్ అసోసియేషన్, ‘మా’ అసోసియేషన్ పెద్దలు శ్రీరెడ్డి విషయాన్ని పునః పరిశీలించాలని సలహా ఇచ్చారు. ఆమెకు ‘మా’లో సభ్యత్వం విషయాన్ని జనరల్ బాడీలో పరిశీలించే వరకూ ‘మా’ సభ్యులందరూ శ్రీరెడ్డితో కలిసి నటించడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. నటించొచ్చు. ఈ సందర్భంగా ఆమెకు మేం వెల్కమ్ చెబుతున్నాం. శ్రీరెడ్డికి ఏ సహాయం కావాలన్నా చేస్తాం. తెలుగు నటీనటులకు అవకాశాలు ఇమ్మని ‘మా’ ఎప్పుడూ కోరుతుంది. కానీ, అవకాశాలు ఇచ్చే నిర్ణయం ఆయా దర్శక–నిర్మాతలదే’’ అన్నారు. ‘‘క్యాష్’ కమిటీలో పదిమంది ఇండస్ట్రీవారు, మరో పదిమంది సమాజంలోని ప్రముఖులు ఉంటారు.అతి త్వరలోనే కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. వేధింపుల కేసులన్నీ ఆ కమిటీకి వెళతాయి. ఇక్కడ పెద్దా చిన్నా అనే తేడా ఉండదు. అందరికీ సమన్యాయం జరుగుతుంది’’ అన్నారు దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. ఈ కార్యక్రమంలో రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు, నిర్మాత కె.ఎల్. నారాయణ, దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్, ‘మా’ జనరల్ సెక్రటరీ నరేశ్ తదితరులు పాల్గొన్నారు. -
చీప్ పబ్లిసిటీ కోసం ఇలా చేస్తే ఊరుకోం
‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)’లో తనకు సభ్యత్వం ఇవ్వలేదంటూ నటి శ్రీరెడ్డి ఫిల్మ్‌చాంబర్ ఎదుట శనివారం అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఈ వివాదంపై ‘మా’ సభ్యులు ఫిల్మ్‌చాంబర్‌లో ఆదివారం అత్యవసర సమావేశం నిర్వహించారు. ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా మాట్లాడుతూ–‘‘తెలుగు చిత్ర పరిశ్రమ గురించి ఎవరైనా తప్పుగా మాట్లిడితే ఊరుకునేది లేదు. శ్రీరెడ్డి మాటల్లో నిజం లేదు. చీప్ పబ్లిసిటీ కోసం ఇలా చేస్తే ఊరుకోం. ‘మా’ లోని 900మంది సభ్యుల్లో ఎవరూ తనతో నటించరు. ఎవరైనా నటిస్తే ‘మా’ నుంచి సస్పెండ్ చేస్తాం. ఆమెకు ‘మా’ లో సభ్యత్వం ఇవ్వం’’ అన్నారు. ‘‘మా’ 25 సంవత్సరాల జూబ్లీ ఇయర్లో ఇలాంటి సంఘటన సిగ్గు చేటు. ఇదంతా ఆ అమ్మాయి ఎందుకు చేస్తోంది? ఫ్రీ పబ్లిసిటీ కోసమా? సైకలాజికల్ ప్రాబ్లమా? అర్థం కావట్లేదు. పానకంలో పుడకలాగా సినీ పరిశ్రమను శ్రీరెడ్డి నాశనం చేస్తోంది’’ అన్నారు ‘మా’ జనరల్ సెక్రటరీ నరేశ్. ‘‘శ్రీ రెడ్డి విషయంలో ‘మా’ కి సహకరిస్తాం. తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్‌లో తనకు ఇచ్చిన సభ్యత్వం రద్దు చేసి, కార్డు వెనక్కి తీసేసుకుంటాం’’ అన్నారు టీఎఫ్‌సీసీ ౖచెర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్. ‘‘ప్రతి విషయానికీ టీవీ, సోషల్మీడియాకి ఎక్కితే పోయేది మన పరువే. ఇలాంటివి చూసి కొత్త అమ్మాయిలు హీరోయిన్గా ఎలా రావాలనుకుంటారు?’’ అన్నారు ‘మా’ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్. మా సభ్యులు బెనర్జీ, ఉత్తేజ్, సురేష్ కొండేటి, హేమ, వేణు మాధవ్, ఏడిద శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీ మిత్ర వెంచర్లో భూమిపూజ
ఇబ్రహీంపట్నం రూరల్ : స్థానిక కేతనకొండలో శ్రీమిత్ర వెంచర్స్ వారి ‘ఇంద్రప్రస్థ’ భూమిపూజ ఆదివారం వైభవంగా జరిగింది. ముఖ్యఅతిథులుగా సినీనటులు శ్రీకాంత్, తరుణ్, శివాజీరాజా పాల్గొన్నారు. ముందుగా కొబ్బరికాయకొట్టి భూమిపూజ చేశారు. అనంతరం విలేకరులతో సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ చౌదరి మాట్లాడారు. నవ్యాంధ్ర రాజధాని విజయవాడ పరిసరాల్లో సకల సౌకర్యాలతో ఇంద్రప్రస్థ విల్లాలను నిర్మిస్తామని తెలిపారు. శ్రీకాంత్, తరణ్ మాట్లాడుతూ హుదూద్ బాధితులకు సాయం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని, టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్‌ను సంప్రదించి మ్యాచ్ నిర్వహిస్తామని, వచ్చే ఆదాయాన్ని తుపాను బాధితులకు అందజేస్తామని తెలిపారు. శివాజీరాజా మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొంత సొమ్మును ప్రజాహిత కార్యక్రమాలకు వెచ్చించాలని కోరారు. డెరైక్టర్లు ఎం.తేజనివాస్, తేజాగోవింద్, శ్రీనివాస్‌పాల్గొన్నారు.