వేట దేనికోసం? | srikanth and tarun's new movie titled as 'veta' | Sakshi
Sakshi News home page

వేట దేనికోసం?

Published Fri, Nov 8 2013 11:25 PM | Last Updated on Sat, Sep 2 2017 12:25 AM

వేట దేనికోసం?

వేట దేనికోసం?

 నమ్మిన వ్యక్తి కోసం ఎంతటి త్యాగానికైనా వెనుకాడని ఓ అనుచరుడికీ, ఓ కాలేజీ విద్యార్థికి మధ్య జరిగిన సంఘటనల సమాహారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘వేట’. శ్రీకాంత్, తరుణ్ ముఖ్య పాత్రధారులు. జాస్మిన్, అజాజ్‌ఖాన్, మధురిమ కథానాయికలు. అశోక్ అల్లె దర్శకుడు. సి.వి.రావు, పి.శ్వేతలానా, సి.వరుణ్‌కుమార్ నిర్మాతలు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే నెలలో విడుదల కానుంది. దర్శకుడు మాట్లాడుతూ -‘‘యాక్షన్ నేపథ్యంలో సాగే కథ ఇది. దేనికోసం ఈ ‘వేట’ అనేది ఇందులో ఆసక్తికరమైన అంశం. ఇటీవలే తరుణ్, జాస్మిన్‌లపై దుబాయ్‌లో రెండు పాటల్ని చిత్రీకరించాం’’ అని తెలిపారు. కృష్ణభగవాన్, డా.శివప్రసాద్, దీప్తి వాజ్‌పేయ్, శివారెడ్డి, వేణు తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: చక్రి, సమర్పణ: సి.కల్యాణ్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement