
పేదల పెన్నిధి వైఎస్సార్
పేదలను ఆదుకోవడంలో వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ముందుంటారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ అన్నారు.
* గుడివాడ అమర్‌నాథ్
* హుద్‌హుద్ మృతుల కుటుంబీకులకు ఆర్థికసాయం
* రూ.50వేలు చొప్పున చెక్కుల పంపిణీ
కశింకోట: పేదలను ఆదుకోవడంలో వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ముందుంటారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. హుద్‌హుద్ తుఫాన్‌లో చనిపోయినా వారి కుటుంబాలకు వైఎస్సార్ ఫౌండేషన్ తరపున బుధవారం ఆర్థికసాయాన్ని అందజేశారు. మండలంలోని సుందరయ్యపేటలో అడిగర్ల రామునాయుడు, బయ్యవరంలో గొల్లవిల్లి సన్యాసినాయుడు కుటుంబసభ్యులకు రూ.50 వేలు చొప్పున చె క్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా అమర్‌నాథ్ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేదలను అన్ని విధాలా ఆదుకున్నారన్నారు. ఆయన కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డి కూడా అదే దృక్పథంతో ముందుకు సాగుతున్నారన్నారు. హుద్‌హుద్‌కు జిల్లాలో 44 మంది మృతి చెందారని,వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిని, ఇళ్లు, చెట్లు కూలిపోయి ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు.
ఈ నేపథ్యంలో జిల్లా పర్యటనకు వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి పరిస్థితిని చూసి చలించిపోయారని, మృతుల కుటుంబాలకు వైఎస్సార్ ఫౌండేషన్ తరపున ఆర్థిక సాయం చేశారన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. అరకు పార్లమెంటరీ నియోజకవర్గం పార్టీ ఇన్‌చార్జి బొడ్డేడ ప్రసాద్, గొల్లవిల్లి శ్రీనివాసరావు, పార్టీ స్థానిక నాయకులు గొన్నా సత్యనారాయణ, ఊడి అచ్చియ్యనాయుడు, రేఖ లక్ష్మణరావు, రేఖ పండుబాబు, కొణతాల జగన్ పాల్గొన్నారు.