సాక్షి, అమరావతి/విశాఖపట్నం: విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్-2023 నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఈ మేరకు మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మార్చి 3,4 తేదీల్లో విశాఖలో జరిగే గ్లోబల్ సమ్మిట్ కోసం ముందస్తు సన్నాహక సదస్సు జరిగిందని చెప్పారు. అలాగే గ్లోబల్ ఇన్వెస్టర్ల మీట్‌ను విశాఖపట్నంలో నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించారని తెలిపారు. ఈ సదస్సుకు 48 దేశాలకు చెందిన ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారని చెప్పారు.
ఈ అంతర్జాతీయ పెట్టుబడుదారుల సదస్సును విజయవంతం చేసేందుకు దేశంలోని ముఖ్య నగరాలలో వివిధ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించి, అభివృద్ధి పథంలో నడిపేందుకు ఈ కార్యక్రమాలు దోహదపడుతాయన్నారు. అందులో భాగంగా తొలుత న్యూఢిల్లీలో కర్టెన్ రైజర్ ఈవెంట్ నిర్వహించినట్లు తెలిపారు. ఈ సదస్సుకి దేశంలోని విభిన్న పారిశ్రామిక వేత్తలు, సంఘాల ప్రతినిధులు హాజరయ్యారని తెలిపారు. ఏపీకి సుదీర్ఘ తీర ప్రాంతం ఉందని.. 11.43 శాతం వృద్ధి రేటుతో దేశంలోనే అత్యంత వేగంగా వృద్ధి చేస్తున్న రాష్ట్రంగా ఉందన్నారు. దేశంలోకి 11 ఇండస్ట్రియల్ కారిడార్లు వస్తున్నాయి అందులో మూడు ఏపీకే రావడం శుభపరిణామని చెప్పారు.
అలాగే 69 వేల ఎకరాల పారిశ్రామిక భూములు ఏపీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయని చెప్పారు. నీతి ఆయోగ్ లాంటి సంస్థలు ఏపీ విధానాలను కోనియాడుతున్నారని మంత్రి అమర్నాథ్ చెప్పారు. ఎవరూ పెట్టుబడులు పెడతామన్న సాదరంగా ఆహ్వానిస్తున్నామన్నారు. అలాగే రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధిని ప్రపంచానికి తెలియ జెప్పే క్రమంలోనే విశాఖలో ఈ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నాం అని అన్నారు. అంతేగాదు ఈ సమ్మిట్‌ను విజయవంతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని పారిశ్రామిక వేత్తలే బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తారని అమర్నాథ్ తెలిపారు.
(చదవండి: ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సన్నాహక సదస్సులో పాల్గొననున్న సీఎం జగన్)
Comments
Please login to add a commentAdd a comment