global investors meeting
-
‘ఏపీలో ఎవరు పెట్టుబడులు పెడతామన్నా ఆహ్వానిస్తాం!’
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్-2023 నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఈ మేరకు మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మార్చి 3,4 తేదీల్లో విశాఖలో జరిగే గ్లోబల్ సమ్మిట్ కోసం ముందస్తు సన్నాహక సదస్సు జరిగిందని చెప్పారు. అలాగే గ్లోబల్ ఇన్వెస్టర్ల మీట్‌ను విశాఖపట్నంలో నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించారని తెలిపారు. ఈ సదస్సుకు 48 దేశాలకు చెందిన ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారని చెప్పారు. ఈ అంతర్జాతీయ పెట్టుబడుదారుల సదస్సును విజయవంతం చేసేందుకు దేశంలోని ముఖ్య నగరాలలో వివిధ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించి, అభివృద్ధి పథంలో నడిపేందుకు ఈ కార్యక్రమాలు దోహదపడుతాయన్నారు. అందులో భాగంగా తొలుత న్యూఢిల్లీలో కర్టెన్ రైజర్ ఈవెంట్ నిర్వహించినట్లు తెలిపారు. ఈ సదస్సుకి దేశంలోని విభిన్న పారిశ్రామిక వేత్తలు, సంఘాల ప్రతినిధులు హాజరయ్యారని తెలిపారు. ఏపీకి సుదీర్ఘ తీర ప్రాంతం ఉందని.. 11.43 శాతం వృద్ధి రేటుతో దేశంలోనే అత్యంత వేగంగా వృద్ధి చేస్తున్న రాష్ట్రంగా ఉందన్నారు. దేశంలోకి 11 ఇండస్ట్రియల్ కారిడార్లు వస్తున్నాయి అందులో మూడు ఏపీకే రావడం శుభపరిణామని చెప్పారు. అలాగే 69 వేల ఎకరాల పారిశ్రామిక భూములు ఏపీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయని చెప్పారు. నీతి ఆయోగ్ లాంటి సంస్థలు ఏపీ విధానాలను కోనియాడుతున్నారని మంత్రి అమర్నాథ్ చెప్పారు. ఎవరూ పెట్టుబడులు పెడతామన్న సాదరంగా ఆహ్వానిస్తున్నామన్నారు. అలాగే రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధిని ప్రపంచానికి తెలియ జెప్పే క్రమంలోనే విశాఖలో ఈ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నాం అని అన్నారు. అంతేగాదు ఈ సమ్మిట్‌ను విజయవంతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని పారిశ్రామిక వేత్తలే బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తారని అమర్నాథ్ తెలిపారు. (చదవండి: ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సన్నాహక సదస్సులో పాల్గొననున్న సీఎం జగన్) -
ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సన్నాహక సదస్సులో పాల్గొననున్న సీఎం జగన్
సాక్షి, అమరావతి/గన్నవరం: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలో మంగళవారం జరగనున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సు సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొంటారు. ముఖ్యమంత్రి జగన్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్యతో పాటు పలువురు అధికారుల బృందం సోమవారం ఢిల్లీకి వెళ్లింది. కాగా, ఈ సమావేశానికి వివిధ దేశాల రాయబారులు, పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. ఏపీలోకి పెట్టుబడులను ఆకర్షించేందుకు పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాల అంబాసిడర్లతో సీఎం జగన్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఏపీ అడ్వాంటేజ్.. ఈ ఏడాది మార్చి 3,4 తేదీల్లో విశాఖలో ఏపీ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరగనుంది. ఈ గ్లోబల్ సమ్మిట్‌లో, బిజినెస్-టు-బిజినెస్ (B2B), బిజినెస్-టు-గవర్నమెంట్ (B2G) సమావేశాలు, కీలక ప్రసంగాలు, సెక్టార్-నిర్దిష్ట దేశ-నిర్దిష్ట ప్లీనరీ సెషన్లను నిర్వహించనున్నారు. అలాగే ఏపీ ప్రభుత్వం ఫోకస్ చేసిన 13 కేంద్రీకృత రంగాలపై సెక్టోరల్ సెషన్లను ప్లాన్ నిర్వహించనున్నారు. ఇందులో వివిధ రంగాల పారిశ్రామిక నిపుణులు తమ అనుభవాలను పంచుకొనున్నారు. ఈ అంతర్జాతీయ పెట్టుబడుదారుల సదస్సును విజయవంతం చేసేందుకు దేశంలోని ముఖ్య నగరాలలో వివిధ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించి అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తోంది. అందులో భాగంగా తొలుత న్యూఢిల్లీలో కర్టెన్ రైజర్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ కు 28 మంది విదేశీ పెట్టుబడిదారులు, 44 దేశాలకు చెందిన రాయబారులను ఆహ్వానించారు. ఏపీ అడ్వాంటేజ్ అనే థీమ్‌తో రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వివరించనున్నారు. రాష్ట్రంలో వ్యాపార అనుకూల వాతావరణం, బలమైన పారిశ్రామిక, లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు తదితర అంశాలను వివరిస్తారు. అలాగే ప్రభుత్వం తరఫున అందించే ప్రోత్సాహకాలు, ప్రత్యేక రాయితీలు తదితర అంశాలను వివరించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నాయి. అలాగే వివిధ దేశాల రాయబారులతో ప్రత్యేకంగా రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తారు. రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి అవకాశాలను సీఎం జగన్ వివరిస్తారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం తమ తమ దేశాల వ్యాపారవేత్తలను ప్రోత్సహించాల్సిందిగా డిప్లమాట్స్ను కోరుతారు. ఈ కర్టెన్ రైజర్ ఈవెంట్‌తో పాటు ఫిబ్రవరిలో అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా,ముంబై నగరాల్లో రోడ్డు షోలను కూడా ఏపీ ప్రభుత్వం నిర్వహించనుంది. -
రూ.లక్ష కోట్ల పెట్టుబడులే లక్ష్యం...
హైదరాబాద్: హైదరాబాద్‌లో త్వరలోనే తెలంగాణ గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ చైర్మన్ సంగీతా రెడ్డి తెలిపారు. విదేశీ పెట్టుబడులను ఆకర్శించేందుకు వీలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచంలో ఏదేశంలోనూ లేని పారిశ్రామిక విధానాన్ని రూపొందించిందనీ, దీని ద్వారా లక్షల కోట్లు పెట్టుబడులుగా రాబట్టవచ్చని చెప్పారు. గురువారం జరిగిన తమిళనాడు గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్లో ఆమె స్వాగతోపన్యాసం చేశారు. పారిశ్రామిక రంగంలో మరింత పురోభివృద్ధి సాధించేందుకు వీలుగా తమిళనాడు రాష్ట్రం రూ.లక్ష కోట్ల పెట్టుబడులను గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ ద్వారా సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మే 23, 24 తేదీలలో చెన్నైలో జరిగే ఈ సదస్సులో దేశంలోని వివిధ రాష్ట్రాల పారిశ్రామికవేత్తలతో పాటు సింగపూర్, మలేషియా, శ్రీలంక, జపాన్, ఇంగ్లండ్, ఫ్రాన్స్, జర్మనీ, అమెరికా, కెనడా,ఆస్ట్రేలియా దేశాల నుంచి దాదాపు మూడువేల మంది పారిశ్రామికవేత్తలు హాజరవుతున్నారని తమిళనాడు పరిశ్రమలశాఖ మంత్రి పి.తంగమణి తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్‌కు సంబంధించి ఏర్పాటు చేసిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. పారిశ్రామిక రంగంలో తమిళనాడు రాష్ట్రం నిశ్శబ్ద విప్లవం సాధిస్తోందని, విజన్ 2023లో భాగంగా రాబోయో ఎనిమిదేళ్లలో గతంలో ఎన్నడూ చూడలేనంత ప్రగతిని తమ రాష్ట్రం సాధించబోతుందన్నారు. ఏరోస్పేస్, ఆగ్రో ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్స్, ఆటో కాంపొనెంట్స్, రసాయనాలు, పెట్రోకెమికల్స్, మినరల్స్, ఎలక్ట్రానిక్స్ హార్డ్‌వేర్, హెవీ ఇంజినీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మాసూటికల్స్, బయోటెక్నాలజీ, రెన్యువబుల్ ఎనర్జీ, స్కిల్ డెవలప్మెంట్, జౌళి రంగాల్లో ప్రపంచంలోని వివిధ దేశాల ఇన్వెస్టర్లనుంచి పెట్టుబడులను ఆశిస్తున్నామని తంగమణి చెప్పారు. ఈ సదస్సులో సురానా ఇండస్ట్రీస్ అధినేత దేవేంద్ర సురానా, బాబు థామస్ (హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్), ఇలాంజెళియన్ (సన్మినా)తో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.