సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో అల్ట్రాటెక్ పరిశ్రమను ప్రారంభించబోతున్నామని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. రూ. 2,500 కోట్లతో అల్ట్రాటెక్ పరిశ్రమ ఏర్పాటుపై నేడు( బుధశారం) ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో చర్చించినట్లు పేర్కొన్నారు. తనకు టికెట్ భయం లేదని.. తన భవిష్యత్తును సీఎం నిర్ణయిస్తారని మంత్రి తెలిపారు. ఇదే విషయాన్ని చాలాసార్లు చెప్పానని అన్నారు.
అంబటి రాయుడు రాజకీయాల్లో ఇమడలేరని అన్నారు మంత్రి అమర్నాథ్. రాజకీయాల్లో ప్రజల కోసం పనిచేయాలని, స్టార్లు గ్రౌండ్ లెవల్లో పనిచేయడం కష్టమని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా పార్టీ కోసం పనిచేయాల్సిందేనని తెలిపారు. అలా చేయనివారు వైఎస్సార్‌సీపీ నుంచి వెళ్లిపోతేనే మంచిదన్నారు. వారి స్థానంలో కొత్త వారికి అవకాశం వస్తుందన్నారు.
కాగా దేశంలోని అతిపెద్ద సిమెంట్ తయారీ కంపెనీ అల్ట్రాటెక్ సిమెంట్ ఆంధ్రప్రదేశ్‌లో ఫ్యాక్టరీని ఏర్పాటు చేయబోతోంది. కర్నూలు జిల్లాలోని పెట్నికోట గ్రామం సమీపంలో ఇంటిగ్రేటెడ్ సిమెంట్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది దీనికి పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి జారీ చేసింది. ఈ ప్రాజెక్ట్ విలువ రూ.2,500 కోట్లు.
చదవండి: టీడీపీకి కేశినేని నాని రాజీనామా
Comments
Please login to add a commentAdd a comment