Kurnool Assembly Constituency
-
పోటీ చేద్దామా.. వద్దా?
సాక్షి, నంద్యాల: టికెట్ల విషయంలో టీడీపీ అధిష్టానం నానుస్తుండడంతో నంద్యాలలో ఆ పార్టీ కేడర్ అయోమయంలో పడింది. మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్‌కే టికెట్ అని గతంలో చంద్రబాబు చెప్పినా ప్రస్తుత నాన్చుడు ధోరణితో ఆయన ముందుకు కదలడం లేదు. పైగా ఎన్నికల్లో పోటీ చేయాలా... వద్దా అన్న సందిగ్ధంలో ఉన్నారు. ఓడిపోయే సీటు నుంచి పోటీ చేసేందుకు నిరాసక్తి వ్యక్తం చేస్తున్నారు. ఇన్చార్జే డైలమాలో ఉండడంతో కార్యకర్తలు తలోదిక్కు చూసుకుంటున్నారు. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్సార్సీపీకి కంచుకోట. 2017 ఉప ఎన్నికలో తప్ప ప్రతీసారీ వైఎస్సార్ సీపీ హవానే కొనసాగుతోంది. ఇక్కడ నుంచి ఈసారీ గెలవడం అసాధ్యమని ఫరూక్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. టీడీపీ క్షేత్రస్థాయి కేడర్ నుంచీ ఆశించినంత మద్దతు లేకపోవడంతో పోటీ చేసేందుకు విముఖత చూపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కోట్లకు కోట్లు ఖర్చు పెట్టుకునేందుకు సిద్ధంగా లేనని ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. ఫరూక్, బ్రహ్మానందరెడ్డి ఎడమొహం పెడమొహం మరోవైపు మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి, ఎన్ఎండీ ఫరూక్ ఎడమొహం పెడమొహంగా మెలుగుతున్నారు. టీడీపీ నంద్యాల నియోజకవర్గ ఇన్చార్జిగా గతేడాది నవంబర్ 27న ఫరూక్ చార్జి తీసుకున్న నాటి నుంచి నేటి వరకు వీరిద్దరూ కలిసింది లేదు. ఎవరికి వారు విడివిడిగా కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. కలిసి మాట్లాడదామని ఫరూక్ అనేకసార్లు భూమా బ్రహ్మానందరెడ్డిని కోరినా ఫలితం లేకపోయింది. ఫరూక్ ముఖం చూసేందుకు కూడా భూమా ఇష్టపడడం లేదని చెబుతున్నారు. కేడర్ తన ఆధీనంలో ఉందని, టికెట్ తనకేనని ప్రచారం చేసుకుంటున్నారు. టికెట్ రాని పక్షంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవాలని బ్రహ్మం ఆలోచనగా ఉందని అంటున్నారు. ఈ మేరకు కొంతమంది నాయకుల ఇళ్లకు వెళ్లి మరీ మద్దతు కోరుతున్నారు. కేడర్‌లో గందరగోళం ఇద్దరు నాయకుల మధ్య సమన్వయం కొరవడడంతో కేడర్ గందరగోళంలో పడింది. కలిసికట్టుగా పనిచేస్తేనే విజయం దక్కడం కష్టం.. ఇక కలహాలతో గెలవడం అసాధ్యమన్న భావన కార్యకర్తల్లో నెలకొంది. ఇన్చార్జిగా ప్రకటించిన తర్వాత కూడా పోటీ చేసేందుకు ఫరూక్ తటపటాయింపు, ఇద్దరు నేతల అనైక్యతతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో అధిష్టానం ఉంది. -
సైకిలెక్కితే సైడ్‌ట్రాకే!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఒకప్పుడు సీమ రాజకీయాల్లో పేరొందిన ఆ రాజకీయ నేతలు చంద్రబాబు పంచన చేరితే వంచనకుగురై చతికిలపడ్డారు. సైకిలెక్కి తప్పుచేశామని, బాబు నిండాముంచేశారని తెరవెనుక గగ్గోలు పెడుతున్నారు. కోట్ల.. భూమా.. గౌరు.. బుడ్డా కుటుంబాలకు చెందిన రాజకీయ నాయకులతోపాటు నంద్యాల వరదరాజులరెడ్డి, దేవగుడి ఆదినారాయణరెడ్డి ఒకప్పుడు కాంగ్రెస్, వైఎస్సార్సీపీలో బలమైన నేతలు. బలమైన రాజకీయ నేపథ్యం వారి సొంతం. చంద్రబాబు కల్లబొల్లి మాటలు నమ్మి టీడీపీలో చేరితే ‘సీమ’ రాజకీయాల్లో తెరమరుగయ్యే స్థితికి చేరారు. చంద్రబాబును నమ్మి వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన మరికొంతమంది కనీసం టికెట్ దక్కించుకోలేక మోసపోయారు. వీరిలో కొందరు తిరిగి వైఎస్సార్సీపీలో చేరారు. చంద్రబాబు మోసం గ్రహించి ‘సీమ’లో టీడీపీ పని ఖతమైందని తెలుసుకున్న కొందరు.. ఆ పార్టీలో ఉండి ఓడిపోవడం కంటే మౌనంగా ఉండటం మంచిదనే నిర్ణయానికి వచ్చారు. ఈసారి తాము కోరిన టికెట్ ఇవ్వకపోతే పోటీనుంచి తప్పుకోవాలనే భావనలో మరికొందరు ఉన్నారు. కోట్ల కోటకు బీటలు కర్నూలు జిల్లాలో కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, భూమా నాగిరెడ్డి, బుడ్డా వెంగళరెడ్డి కుటుంబాలు ‘సీమ’ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండేవి. మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి తనయుడు సూర్యప్రకాశ్‌రెడ్డి కేంద్రమంత్రిగా చేశారు. భూమా నాగిరెడ్డి జిల్లాలో బలమైన నేతగా ఉండేవారు. 2014లో సూర్యప్రకాశ్ రెడ్డి కాంగ్రెస్ తరఫున కర్నూలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆపై చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో ఎంపీగా కోట్ల, ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన సతీమణి సుజాతమ్మ పోటీ చేసి ఓడిపోయారు. టీడీపీలో చేరడమే కోట్ల కుటుంబం చేసిన తప్పిదమని, దీంతోనే గెలుపు దక్కడం లేదనే భావన ఆయన అనుచరవర్గంలో ఉంది. ఈ దఫా కూడా ఎంపీగా గెలవలేమని కోట్ల భావిస్తున్నారు. అందుకే ఎమ్మిగనూరు టికెట్ ఆశించగా.. డోన్ ఎంచుకోవాలని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. అక్కడ బరిలోకి దిగితే ఓటమి తప్పదని కోట్ల భయపడుతున్నారు. భూమా కుటుంబం తంటాలు వైఎస్సార్సీపీ నుంచి 2014లో నంద్యాల, ఆళ్లగడ్డ ఎమ్మెల్యేలుగా గెలిచిన భూమా నాగిరెడ్డి, అఖిల ప్రియలు అనంతర పరిణామాల్లో టీడీపీలో చేరారు. ఆ తర్వాత నాగిరెడ్డి మృతి చెందారు. అఖిలప్రియ టీడీపీ తరఫున 2019లో పోటీ చేసి ఘోరంగా ఓడిపోయింది. దీంతో పార్టీ మారి తప్పుచేశామనే చర్చ అఖిల కుటుంబంలో జరిగింది. ఆమె కుటుంబీకులు కూడా దూరమయ్యారు. నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డికి ఈ సారి మొండిచేయి చూపారు. అతని స్థానంలో ఫరూక్‌కు టికెట్ ఖాయమైంది. ఆళ్లగడ్డలో కూడా అఖిలకు కాకుండా పొత్తులో భాగంగా జనసేనకు టికెట్ ఇస్తారని సమాచారం. ఇదే జరిగితే పోటీ నుంచి భూమా కుటుంబం పూర్తిగా వైదొలిగినట్లే.. నమ్మితే నిండాముంచారు శ్రీశైలం, పాణ్యం, జమ్మలమడుగు ఎమ్మెల్యేలుగా గెలిచిన బుడ్డా రాజశేఖరరెడ్డి, గౌరు చరిత, దేవగుడి ఆదినారాయణరెడ్డిలు కూడా 2014 తర్వాత టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో వీరికి ఘోర ఓటమి తప్పలేదు. వైఎస్సార్సీపీలో ఎమ్మెల్యేగా గెలిచిన బుడ్డా.. రాజకీయ భవిష్యత్ ఇచ్చిన పార్టీని కాదని చంద్రబాబును నమ్మడంతో 2019లో ఓటమి తప్పలేదు. ఇప్పుడు అసలు టికెట్ దక్కని పరిస్థితి నెలకొంది. గౌరు వెంకటరెడ్డి కుటుంబానికి వైఎస్ చేసిన మేలు అందరికీ తెలిసిందే.. జగన్మోహన్రెడ్డిని కాదని టీడీపీలో చేరితే 2019లో ఓడిపోయారు. ఈ దఫా కూడా వీరు గెలిచే పరిస్థితి లేదు. మరోవైపు జమ్మలమడుగు ఎమ్మెల్యే కడప ఎంపీగా పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. ఐదుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి 2014లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2019లో అతనికి టికెట్ కూడా ఇవ్వలేదు. అంతర్మథనంలో నేతలు రాయలసీమలో అత్యంత బలంగా వైఎస్సార్సీపీ ఉంది. 52 అసెంబ్లీ స్థానాల్లో 49 చోట్ల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. దీంతో బలహీనంగా ఉన్న టీడీపీలో కొనసాగినా రాజకీయ భవిష్యత్తు ఉండదనే భావనకు వచ్చారు. చంద్రబాబు మోసపూరిత వైఖరిపై ప్రజలతో పాటు సొంత పార్టీలోని నేతలకు కూడా స్పష్టత వచ్చింది. ప్రత్యామ్నాయం లేక టీడీపీలో కొనసాగుతున్నామని, ఏ ఆప్షన్ ఉన్నా వెంటనే సైకిల్ దిగి వెళ్లిపోతామని ఈ నేతలంతా తమ అనుచరులతో చెబుతున్నారు. కల్లబొల్లి మాటలు నమ్మి వెళ్తే.. 2014లో వైఎస్సార్సీపీ తరఫున గెలిచి టీడీపీలో చేరిన వారిలో కర్నూలు, కోడుమూరు, కదిరి, బద్వేల్ ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, మణిగాంధీ, అత్తర్ చాంద్‌బాషా, జయరాములు ఉన్నారు. వీరికి 2019 ఎన్నికల్లో చంద్రబాబు టికెట్ ఇవ్వలేదు. దీంతో మోహన్‌రెడ్డి, మణిగాంధీ తిరిగి వైఎస్సార్సీపీలో చేరారు. చంద్రబాబును నమ్మినందుకు చాంద్‌బాషా, జయరాములు పూర్తిగా రాజకీయ భవిష్యత్ కోల్పోయారు. కర్నూలు, నంద్యాల ఎంపీలు బుట్టా రేణుక, ఎస్పీవై రెడ్డి కూడా వైఎస్సార్సీపీని వీడి టీడీపీలో చేరారు. ఇద్దరికీ చంద్రబాబు టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో బుట్టా రేణుక 2019 ఎన్నికలకు ముందే తిరిగి సొంత పార్టీలో చేరారు. చంద్రబాబును నమ్మి మోసపోయానంటూ ఎస్పీవై రెడ్డి జనసేన తరఫున నంద్యాల ఎంపీగా, అల్లుడు సజ్జల శ్రీధర్‌రెడ్డి నంద్యాల ఎమ్మెల్యేగా, కుమార్తె సుజల శ్రీశైలం నుంచి, మరో కుమార్తె అరవిందరాణి బనగానపల్లి నుంచి పోటీ చేశారు. ఇలా వీరంతా చంద్రబాబును నమ్మి మోసపోయినవారే. చంద్రబాబును నమ్మి మోసపోయానని ఎస్పీవై రెడ్డి 2019లో బహిరంగ ప్రకటన కూడా చేశారు. -
చంద్రబాబు.. లోకేశ్‌కు మేము పేరు పెట్టలేమా?: మంత్రి బుగ్గన ఫైర్
సాక్షి, అమరావతి: ఏపీ ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ఆధారంగా ఏపీ ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి? అని ప్రశ్నించారు. అప్పులపై ఎల్లో మీడియా రాసేవన్నీ తప్పేనని స్పష్టం చేశారు. కాగా, మంత్రి బుగ్గన గురువారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వ పాలనలో అప్పు 22 శాతం పెరిగింది. టీడీపీ హాయంలో రూ,2,71,797 కోట్ల అప్పులు చేశారు. అదే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాలుగున్నరేళ్లలో 12 శాతం మాత్రమే అప్పులు జరిగాయి. ఏపీ ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా అసత్య ప్రచారం చేస్తున్నాయి. రూ.13 లక్షల కోట్లు అప్పు చేశామని చంద్రబాబు చెబుతున్నారు. అప్పులపై నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. ఏ ఆధారంగా ఏపీ ఆర్థిక పరిస్థితిపై మాట్లాడుతున్నారు?. చంద్రబాబు హయాంలో రెవెన్యూ ఆరు శాతం కాగా, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 16.7 శాతం రెవెన్యూ రాబడి వచ్చింది. కర్నూలుకు చంద్రబాబు చేసిందేమీ లేదు. చంద్రబాబు ప్రతీ ఊరికి వెళ్లి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు పేర్లు పెడుతున్నారు. లోకేశ్‌కు మేము పేరు పెట్టలేమా?. రాష్ట్రంలో అన్ని పార్టీలతో చంద్రబాబు దోస్తీ చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, జనసేన పార్టీలతో బాబు దోస్తీ. రాష్ట్ర విభజనపై చంద్రబాబు అనేక సార్లు మాట మార్చారు. రాష్ట్ర అప్పులకు చంద్రబాబు కారణం కాదా?. ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం చంద్రబాబు కాదా?. ప్రత్యేక హోదా వదిలేసి ప్యాకేజీకి చంద్రబాబు ఎందుకు ఒప్పుకున్నారు. టీడీపీ, కాంగ్రెస్ కలిసి రాష్ట్ర విభజన చేశాయి. ప్రత్యేక హోదా వదిలేశారు, ప్యాకేజీ రాబట్టలేకపోయారు. పోలవరం ఆలస్యానికి గత ప్రభుత్వమే కారణం. పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. కేంద్రం నుండి మన వాటా నిధులు మేము సాధిస్తున్నాం. రాష్ట్రానికి ఇబ్బంది కలిగించే నిర్ణయాలు చంద్రబాబు తీసుకున్నారు’ అని వ్యాఖ్యలు చేశారు. -
టికెట్‌పై భయం లేదు.. నా భవిష్యత్తు సీఎం నిర్ణయిస్తారు: మంత్రి అమర్నాథ్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో అల్ట్రాటెక్ పరిశ్రమను ప్రారంభించబోతున్నామని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. రూ. 2,500 కోట్లతో అల్ట్రాటెక్ పరిశ్రమ ఏర్పాటుపై నేడు( బుధశారం) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో చర్చించినట్లు పేర్కొన్నారు. తనకు టికెట్ భయం లేదని.. తన భవిష్యత్తును సీఎం నిర్ణయిస్తారని మంత్రి తెలిపారు. ఇదే విషయాన్ని చాలాసార్లు చెప్పానని అన్నారు. అంబటి రాయుడు రాజకీయాల్లో ఇమడలేరని అన్నారు మంత్రి అమర్నాథ్. రాజకీయాల్లో ప్రజల కోసం పనిచేయాలని, స్టార్లు గ్రౌండ్ లెవల్లో పనిచేయడం కష్టమని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా పార్టీ కోసం పనిచేయాల్సిందేనని తెలిపారు. అలా చేయనివారు వైఎస్సార్సీపీ నుంచి వెళ్లిపోతేనే మంచిదన్నారు. వారి స్థానంలో కొత్త వారికి అవకాశం వస్తుందన్నారు. కాగా దేశంలోని అతిపెద్ద సిమెంట్ తయారీ కంపెనీ అల్ట్రాటెక్ సిమెంట్ ఆంధ్రప్రదేశ్‌లో ఫ్యాక్టరీని ఏర్పాటు చేయబోతోంది. కర్నూలు జిల్లాలోని పెట్నికోట గ్రామం సమీపంలో ఇంటిగ్రేటెడ్ సిమెంట్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది దీనికి పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి జారీ చేసింది. ఈ ప్రాజెక్ట్ విలువ రూ.2,500 కోట్లు. చదవండి: టీడీపీకి కేశినేని నాని రాజీనామా