సాక్షి, అమరావతి: ఏపీ ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ఆధారంగా ఏపీ ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి? అని ప్రశ్నించారు. అప్పులపై ఎల్లో మీడియా రాసేవన్నీ తప్పేనని స్పష్టం చేశారు.
కాగా, మంత్రి బుగ్గన గురువారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వ పాలనలో అప్పు 22 శాతం పెరిగింది. టీడీపీ హాయంలో రూ,2,71,797 కోట్ల అప్పులు చేశారు. అదే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నాలుగున్నరేళ్లలో 12 శాతం మాత్రమే అప్పులు జరిగాయి. ఏపీ ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా అసత్య ప్రచారం చేస్తున్నాయి. రూ.13 లక్షల కోట్లు అప్పు చేశామని చంద్రబాబు చెబుతున్నారు. అప్పులపై నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. ఏ ఆధారంగా ఏపీ ఆర్థిక పరిస్థితిపై మాట్లాడుతున్నారు?. చంద్రబాబు హయాంలో రెవెన్యూ ఆరు శాతం కాగా, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 16.7 శాతం రెవెన్యూ రాబడి వచ్చింది.
కర్నూలుకు చంద్రబాబు చేసిందేమీ లేదు. చంద్రబాబు ప్రతీ ఊరికి వెళ్లి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు పేర్లు పెడుతున్నారు. లోకేశ్‌కు మేము పేరు పెట్టలేమా?. రాష్ట్రంలో అన్ని పార్టీలతో చంద్రబాబు దోస్తీ చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, జనసేన పార్టీలతో బాబు దోస్తీ. రాష్ట్ర విభజనపై చంద్రబాబు అనేక సార్లు మాట మార్చారు. రాష్ట్ర అప్పులకు చంద్రబాబు కారణం కాదా?. ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం చంద్రబాబు కాదా?. ప్రత్యేక హోదా వదిలేసి ప్యాకేజీకి చంద్రబాబు ఎందుకు ఒప్పుకున్నారు. టీడీపీ, కాంగ్రెస్ కలిసి రాష్ట్ర విభజన చేశాయి. ప్రత్యేక హోదా వదిలేశారు, ప్యాకేజీ రాబట్టలేకపోయారు. పోలవరం ఆలస్యానికి గత ప్రభుత్వమే కారణం. పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. కేంద్రం నుండి మన వాటా నిధులు మేము సాధిస్తున్నాం. రాష్ట్రానికి ఇబ్బంది కలిగించే నిర్ణయాలు చంద్రబాబు తీసుకున్నారు’ అని వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment