సాక్షి, విశాఖపట్నం: జిల్లా అభివృద్ధిపై రాజ్యసభ సభ్యులు విజయ సాయిరెడ్డి శుక్రవారం ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో పెండింగ్‌లో ఉన్న వివిధ అంశాలపై చర్చించారు. ముఖ్యంగా నాడు నేడుతో పాటు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఏ రకంగా సమాయత్తం కావాలి అనే అంశంపై ఆయన ఎమ్మెల్యేలతో చర్చించారు. కొన్ని పనుల్లో అధికారుల అలసత్వం వల్ల జాప్యం జరుగుతోందన్న అంశాన్ని కూడా ఈ సమావేశంలో ఆయన లేవనేత్తారు. ఈ నేపథ్యంలో విశాఖ మన్యంలో పర్యాటక అభివృద్ధి అంశాలను అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ విజయసాయిరెడ్డికి వివరించారు. జొలాపుట్ నుంచి పాదువా వరకు జల మార్గంలో టూరిజం అభివృద్ధి చేయనున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. (చదవండి: 'విశాఖ వేగంగా అభివృద్ధి చెందుతోంది')
ఆనకాపళ్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. విశాఖ ఎమ్మెల్యేల్లో అధిష్టానంపై అసంతృప్తితో ఉందన్న ప్రచారంపై ఆయన మండిపడ్డారు. టీడీపీ నేతలు తమ ఉనికి కాపాడుకునేందుకే ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. అదే విధంగా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉందన్న ప్రచారంలో నిజం లేదని పేర్కొన్నారు. డీఆర్సి మీటింగ్‌లో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేల్లో అసంతృప్తి వ్యక్తం చేశారని టీడీపీకి అనుబంధంగా ఉన్న కొన్ని వార్త సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. విశాఖ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఎవరు కూడా నిన్న అమరావతి వెళ్లలేదని, సీఎం కార్యాలయంలో ఎలాంటి ఫిర్యాదు చేయలేదని ఆయన వివరణ ఇచ్చారు. అయితే జిల్లా అభివృద్ధి పార్టీ కార్యకర్తల ప్రగతి అంశాలపై కూడా విజయసాయి రెడ్డి సుదీర్ఘ చర్చ జరిపారు. రానున్నకాలంలో జిల్లాల విస్తరణ నేపథ్యం కార్యకర్తలకు పదవుల కేటాయింపు అలాగే అభివృద్ధి అంశాలపై చర్చ కొనసాగినట్లు రాజ్యసభ సభ్యులు పేర్కొన్నారు. (చదవండి: ఆ ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది)
Comments
Please login to add a commentAdd a comment