'అన్ని చెప్పాకే ఆ పని చేయండి' | governement should clarify to people first before mou with hindhuja: gudiwada amarnath | Sakshi
Sakshi News home page

'అన్ని చెప్పాకే ఆ పని చేయండి'

Published Mon, Apr 27 2015 11:34 AM | Last Updated on Tue, May 29 2018 4:15 PM

'అన్ని చెప్పాకే ఆ పని చేయండి' - Sakshi

'అన్ని చెప్పాకే ఆ పని చేయండి'

విశాఖపట్నం: ప్రభుత్వ భూములు కేటాయించి రెండున్నర దశాబ్ధాలు అయినాఇప్పటి వరకు హిందూజ పవర్ ప్లాంట్ ఒక్క మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి చేయలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్ నాథ్ అన్నారు. నలుగురు కలెక్టర్లు మాట్టాడినా నేటికి ఆర్ ఆర్ ప్యాకేజీ విషయంలో నిర్వాసితులకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని చెప్పారు. ఏప్రిల్ 13,2013న విడుద లచే సిన జీవో ప్రకారం  ఆరు శాఖలతో ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక ఏమైందని ప్రశ్నించారు.

నివేదిక అంది ఉంటే ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. ఇప్పటికే ఉన్న భూముల్లో ఎలాంటి పనులు చేయకుండా ఈ నెల 30, మే 1న మరోసారి హిందూజ అవగాహన ఒప్పందం(ఎంవోయూ) చేసుకోబోతుందని తెలిసిందని చెప్పారు. వీటన్నింటిపై ప్రజలకు అన్ని వివరాలు తెలియజేశాకే హిందూజాతో ప్రభుత్వం ఒప్పందం చేసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement