మూడోరోజుకు చేరిన గుడివాడ అమర్నాథ్ దీక్ష | Gudivada amarnath indefinite fast over special railway zone for visakha, reaches second day | Sakshi
Sakshi News home page

మూడోరోజుకు చేరిన గుడివాడ అమర్నాథ్ దీక్ష

Published Sat, Apr 16 2016 10:50 AM | Last Updated on Tue, May 29 2018 4:23 PM

Gudivada amarnath indefinite fast over special railway zone for visakha, reaches second day

విశాఖపట్నం : విశాఖ కేంద్రంగా  ప్రత్యేక రైల్వేజోన్ సాధనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ చేపట్టిన దీక్ష శనివారానికి మూడోరోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆయన శనివారం ఉదయం రోడ్డు మీద స్నానం చేసి తన నిరసన తెలిపారు. మరోవైపు గుడివాడ అమర్నాథ్ చేపట్టిన ఉద్యమ దీక్షకు రాజకీయాలకు అతీతంగా అన్నివర్గాల నుంచి సంఘీభావం వెల్లువెత్తుతోంది.

కాగా విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ... ప్రతిసారీ తీవ్ర అన్యాయం జరుగుతూనే ఉంది. ఉద్యమాలు చేపట్టినా ప్రభుత్వాలు మాత్రం స్పందించటం లేదు. దీంతో రాష్ట్ర సమస్యలతో పాటు విశాఖ రైల్వే జోన్ పై కేంద్రంపై పోరాటం చేస్తోంది వైఎస్ఆర్ సీపీ ఎంపీలే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement