సాక్షి, విశాఖ : అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు. అలాగే 17వేల కొత్త కాలనీలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే అమర్‌నాథ్ శుక్రవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘31 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు చేతులెత్తి దండం పెడుతున్నా. సెంటు స్థలం లేని పేదవారికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్న సీఎం జగన్ నాయకత్వంలో పని చేస్తున్నందుకు గర్వపడుతున్నాం. ప్రజలు తిరస్కరించినా చంద్రబాబు నాయుడుకు బుద్ధి రాలేదు. ప్రజల ఇళ్ల పట్టాలను అడ్డుకునే కుట్రలు చేశారు. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు కాబట్టి అందరూ అవినీతికి పాల్పడినట్లు భావించి ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తున్నారు. బాబు తన పాలనలో ఒక మంచిపని చేయకపోగా ముఖ్యమంత్రి చేస్తున్న మంచి పనులను అడ్డుకుంటున్నారు. ఇళ్ల పట్టాలకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తుంటే దాని జీర్ణించుకోలేని చంద్రబాబు నాయుడు లేనిపోని విమర్శలు చేస్తున్నారు. బాబు చేస్తున్న కుట్ర రాజకీయాలను ప్రజలు అందరు గమనిస్తున్నారు.
ఇక రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మీద వెలగపూడి రామకృష్ణ ఛాలెంజ్ చేయడం హాస్యాస్పదంగా ఉంది. వెలగపూడి తీరు చూస్తే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. వంగవీటి రంగా హత్య కేసులో వెలగపూడి నిందితుడు. ఆయన అక్రమాలు ప్రజలందరికీ తెలుసు. ఆయనను బెజవాడలో బహిష్కరిస్తే వైజాగ్ వచ్చాడు. చంద్రబాబు 420 అయితే.. వెలగపూడి 840. తూర్పు నియోజకవర్గంలో దొంగ ఓట్లు నమోదు చేయించి గెలిచాడు. విశాఖ ప్రజలు రాజకీయంగా ఆదరిస్తే విశాఖ పరిపాలన రాజధాని కాకుండా కుట్రలు చేస్తున్నారు. టీడీపీ నేతలు కబ్జా చేసిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. మరో వారం రోజుల్లో సిట్ నివేదిక వస్తుంది. ఆ నివేదిక ఆధారంగా నిందితులను కఠినంగా శిక్షిస్తాం. సిట్ నివేదికలో ఉన్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదు’ అని స్పష్టం చేశారు. (పేదలకు పట్టాభిషేకం )
విశాఖ జిల్లాలో పట్టాల పండగ
విశాఖ జిల్లాలో పేదల ఇళ్ల పంపిణీకి పెందుర్తి మండలం వాలిమెరక నుంచి శ్రీకారం జరగనుంది. విశాఖ జిల్లాలో ఇళ్ల పట్టాల పంపిణీ 73,660 మందికి ఇళ్ల పట్టాలు అందనున్నాయి. అలాగే 16,954 మందికి ల్యాండ్ పొజిషన్ సర్టిఫికెట్లు. 25 వేల 743 మంది టిడ్కో ఇళ్లు పంపిణీ చేయనున్నారు. వీటిలో విశాఖ సిటీ లో 23,576 టిడ్కో ఇల్లు పంపిణీ జరగనుంది. ఆ క్రమంలో ఈ పట్టాల పంపిణీ ద్వారా ద్వారా ఒక లక్ష 63 వేల 50 7 మందికి లబ్ధి పొందనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment