House rails
-
పేదల గూడు.. మౌలిక తోడు
కర్నూలు(అర్బన్): పేదలకు ఉచితంగా ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా గృహ నిర్మాణాలు పూర్తయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం సాయం చేస్తోంది. కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తోంది. జిల్లాలో మొత్తం 672 జగనన్న లేఅవుట్ల ఉన్నాయి. వీటిలో పలు లే అవుట్లకు సరైన దారి సౌకర్యం లేక లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గృహ నిర్మాణాల్లో వేగం పెరగడం లేదు. ఈ విషయాన్ని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కర్నూలు జిల్లాలోని 46 లేఅవుట్లకు అప్రోచ్ రోడ్ల నిర్మాణం చేపట్టేందుకు రూ.2.35 కోట్లు మంజూరు చేసింది. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఈ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. రూ.25 లక్షలతో గోడౌన్ల నిర్మాణం ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులు సిమెంట్, స్టీల్ తీసుకువెళ్లేందుకు ఇబ్బంది పడకూడదనే భావనతో జిల్లాలోని ఐదు ప్రాంతాల్లో అదనంగా గోడౌన్లను నిర్మించనున్నారు. ఆదోని, హొళగుంద, ఉడుములపాడు, దొరపల్లిగుట్ట, నందికొట్కూరులోని పగిడ్యాల రోడ్లో ఈ గోడౌన్లను నిర్మించనున్నారు. ఒక్కో గోడౌన్ నిర్మాణానికి రూ.5 లక్షలు వెచ్చించనున్నారు. జిల్లా గృహ నిర్మాణ సంస్థ అధికారులు ఈ పనులు చేపట్టనున్నారు. అందుబాటులో ఇసుక గృహాలు నిర్మించుకుంటున్న పేదలు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఇసుకను అందుబాటులో ఉంచారు. జిల్లాలోని 28 పెద్ద లేఅవుట్లను గుర్తించి వాటిలో ఇసుకను డంప్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 12,737 మెట్రిక్ టన్నుల ఇసుకను అందుబాటులో ఉంచారు. లబ్ధిదారులకు సంబంధిత మండల ఏఈ ఇండెంట్‌ను రైజ్ చేసిన వెంటనే, ఆయా సచివాలయాల్లోని ఇంజినీరింగ్ అసిస్టెంట్ ఇసుకను అందించి, ఆన్లైన్లో వివరాలు నమోదు చేస్తారు. చాలా సంతోషం మాకు ఎమ్మిగనూరు రోడ్డులోని మంచాల కాలనీ 1లో ఇల్లు మంజూరైంది. రోడ్డు సౌకర్యం లేక పోవడంతో వంక దాటి వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం కాలనీలోకి వెళ్లేందుకు అప్రోచ్ రోడ్డు మంజూరు చేయడం చాలా సంతోషం. రోడ్డు వేస్తే ఇంటి నిర్మాణం వేగంగా పూర్తవుతుంది. – జంగం పంకజ, మంత్రాలయం గృహ నిర్మాణాల్లో వేగం పెరిగింది లేఅవుట్లలో రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతులను కల్పిస్తోంది. దీంతో గృహ నిర్మాణాల్లో వేగం పెరిగింది. జగనన్న కాలనీలకు ప్రత్యేకాధికారులను నిర్మించాం. వీరు లబ్ధిదారులతో మాట్లాడుతూ ఇళ్లను నిర్మించుకునేందుకు ప్రోత్సహిస్తున్నారు. గృహ నిర్మాణాలకు అవసరమైన మెటీరియల్ సిద్ధంగా ఉంది. – నారపురెడ్డి మౌర్య, జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) ఉపయోగకరం మా ఇల్లు బేస్మెంట్ లెవెల్ పూర్తయి, గోడల పని జరుగుతోంది. కాలనీలోకి వెళ్లేందుకు రోడ్డు కొంచెం ఇబ్బందిగా ఉంది. అప్రోచ్ రోడ్డు వేస్తామని అధికారులు చెబుతున్నారు. గృహాలు నిర్మించుకుంటున్న మా లాంటి వారికి ఈ రోడ్డు ఉపయోగకరంగా ఉంటుంది. – ఎద్దులదొడ్డి భువనేశ్వరి, పత్తికొండ -
పేదల గూటికి టీడీపీ గండి!
సాక్షి, అమరావతి: ఇప్పటి వరకు దేశ, రాష్ట్ర చరిత్రలో వేలాది ఎకరాల భూమిని పారిశ్రామిక వేత్తలకు కేటాయించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నాయి గానీ, గూడు లేని పేదలకు ఇళ్ల స్థలాల కోసం సేకరించిన దాఖలాలు లేవు. అలాంటిది తొలి సారిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇళ్లు లేని పేదలందరికీ సంతృప్త స్థాయిలో ఏకంగా 62 వేల ఎకరాల భూమిని 30.60 లక్షల మందికి పంపిణీ చేశారు. తొలి దశలో 15.60 లక్షల మంది పేదలకు ఇళ్ల నిర్మాణాలను చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేసి అమలు చేస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ తొలి దశలో 55,230 మంది పేదలకు ఇళ్ల స్థలాలు, ఇంటి నిర్మాణాలు జరగకుండా తాత్కాలికంగా గండి కొట్టింది. వివిధ సాకులతో పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ కాకుండా ఆ పార్టీ పెద్దల సూచనలతో కొందరు నేతలు న్యాయ స్థానాలను ఆశ్రయించారు. దీంతో తొలి దశలో తొమ్మిది జిల్లాల్లోని 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 55,230 పేదల ఇళ్ల నిర్మాణాల మంజూరు నిలిచిపోయింది. టీడీపీ నేతలు తాత్కాలికంగా పేదల ఇళ్ల నిర్మాణాలను అడ్డుకున్నారే తప్ప శాశ్వతంగా అడ్డుకోలేరని, న్యాయస్థానాల్లో కేసులను పరిష్కరించి.. అర్హులందరికీ లబ్ధి కలిగేలా చూస్తామని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కోర్టు కేసుల వల్ల ఆగిపోయిన ప్రాంతాల్లో లబ్ధిదారుల మనసులో అలజడి ఏర్పడకుండా వారికి భరోసా కల్పించేలా కేసులు పరిష్కారం కాగానే ఇంటి స్థలాలు ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణాలు చేపడతామని సీఎం ఆదేశాల మేరకు ఇప్పటికే అధికారులు లేఖలు రాశారు. పక్షం రోజుల్లో వివాదాల పరిష్కారానికి చర్యలు న్యాయ స్థానాల్లో కేసుల కారణంగా ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వని కారణంగా తొలి దశ ఇళ్ల నిర్మాణాల మంజూరు పత్రాలను 55,230 మంది పేదలకు ఇవ్వలేకపోయామని గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. వారం పది రోజుల్లోగా న్యాయస్థానాల్లో కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారని చెప్పారు. ఆ దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు. వీలైనంత త్వరగా న్యాయ స్థానాల్లో కేసుల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ల సహకారంతో చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఇంకా ఎక్కువ రోజులు జాప్యం అయితే రెండో దశ ఇళ్ల నిర్మాణాల్లో తొలి దశలోని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు ఇళ్ల నిర్మాణాలను చేపట్టాలని సీఎం ఆదేశించారని తెలిపారు. -
ఇళ్లు.. పుష్కలంగా నీళ్లు
సాక్షి, అమరావతి: ప్రస్తుతం పట్టాలు పంపిణీ జరుగుతున్న వైఎస్సార్ జగనన్న కాలనీలన్నింటిలో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం ప్రారంభించడానికి ముందే నీటి వసతి కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తొలి ఇల్లు నిర్మాణ పనులు మొదలు పెట్టే సమయానికి.. అక్కడ ఇళ్ల సంఖ్య ఆధారంగా అవసరమైన మేరకు బోర్ల తవ్వకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బోరు తవ్విన చోట నీటిని నిల్వ ఉంచడానికి వీలుగా పెద్ద పెద్ద నీటి తొట్టెలు లేదా ప్లాస్టిక్ ట్యాంక్‌లను ఏర్పాటు చేయబోతోంది. ఇతరత్రా అవసరమైన మౌలిక వసతులు కల్పించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 17,005 వైఎస్సార్ జగనన్న కాలనీలలో లే అవుట్లు వేసి, 30.76 లక్షల కుటుంబాలకు మహిళల పేరిట ఇంటి పట్టాలు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అందులో మొదటి దశలో 15.60 లక్షల ఇళ్లను నిర్మించే ప్రక్రియను కూడా శుక్రవారం సీఎం జగన్మోహన్రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. మార్చి 15 నాటికి పూర్తి ► లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా ప్రతి కాలనీలో నీటి వసతిని ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ► గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మొదటి దశలో ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ఎంపిక చేసిన దాదాపు 8,000 వైఎస్సార్ జగనన్న కాలనీల్లో నీటి వసతి కల్పనకు గ్రామీణ మంచినీటి సరఫరా (ఆర్డబ్యూఎస్) శాఖ రూ.641 కోట్లు, మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖ రూ.279 కోట్లు కేటాయించింది. మొత్తంగా రూ.920 కోట్లు నీటి వసతి కోసం ప్రభుత్వం వెచ్చించనుంది. ► గృహ నిర్మాణ శాఖ నుంచి ఆర్డబ్ల్యూఎస్ శాఖ అధికారులు ఇళ్ల స్థలాల వివరాలను సేకరించి.. ఎన్ని బోర్లు ఏర్పాటు చేయాలన్న దానిపై అంచనాలు తయారు చేసే పనులు ఇప్పటికే ప్రారంభించినట్టు ఆర్డబ్యూఎస్ ఈఎన్సీ కృష్ణారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ► మొదటి దశకు ఎంపిక చేసిన వైఎస్సార్ జగనన్న కాలనీల్లో మార్చి 15 నాటికి నీటి వసతి కల్పించాలని ఆర్డబ్ల్యూఎస్ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. జనవరి మొదటి వారం కల్లా జిల్లాల వారీగా ఏయే కాలనీలలో ఎన్ని బోర్లు అవసరం అన్న దానిపై అంచనాలు సిద్ధం అవుతాయని ఆర్డబ్ల్యూఎస్ సీఈ సంజీవరెడ్డి చెప్పారు. పట్టణ కాలనీల్లో పబ్లిక్ హెల్త్.. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్డబ్ల్యూఎస్ వైఎస్సార్ జగనన్న కాలనీల్లో నీటి వసతి కల్పించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ఆర్డబ్ల్యూఎస్ ద్వారా, పట్టణ ప్రాంతాల్లో పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా పనులు చేపడుతున్నాం. సీఎం ఆదేశాల మేరకు మార్చి 15 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో నిర్ధేశించుకున్న కాలనీలన్నింటికి నీటి వసతి కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. – ఆర్.వి.కృష్ణారెడ్డి, ఈఎన్సీ, ఆర్డబ్ల్యూఎస్ పట్టణాల్లోని కాలనీల్లో నీటి వసతికి రూ.279 కోట్లు వైఎస్సార్–జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణానికి అవసరమైన నీటి సరఫరా కోసం తొలిదశలో పట్టణ ప్రాంతాల్లోని ఎంపిక చేసిన కాలనీల్లో ముందస్తుగా ఏర్పాట్లు చేస్తున్నాం. బోర్లు వేయడంతో పాటు నీటి సరఫరాకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు రూ.279 కోట్లు ఖర్చవుతుందని అంచనా. మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం ఈమేరకు టెండర్లు పిలవడానికి రంగం సిద్ధం చేసింది. – చంద్రయ్య, ఈఎన్సీ, మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం -
బాబు 420 అయితే.. వెలగపూడి 840..
సాక్షి, విశాఖ : అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తెలిపారు. అలాగే 17వేల కొత్త కాలనీలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే అమర్నాథ్ శుక్రవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘31 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు చేతులెత్తి దండం పెడుతున్నా. సెంటు స్థలం లేని పేదవారికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్న సీఎం జగన్ నాయకత్వంలో పని చేస్తున్నందుకు గర్వపడుతున్నాం. ప్రజలు తిరస్కరించినా చంద్రబాబు నాయుడుకు బుద్ధి రాలేదు. ప్రజల ఇళ్ల పట్టాలను అడ్డుకునే కుట్రలు చేశారు. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు కాబట్టి అందరూ అవినీతికి పాల్పడినట్లు భావించి ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తున్నారు. బాబు తన పాలనలో ఒక మంచిపని చేయకపోగా ముఖ్యమంత్రి చేస్తున్న మంచి పనులను అడ్డుకుంటున్నారు. ఇళ్ల పట్టాలకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తుంటే దాని జీర్ణించుకోలేని చంద్రబాబు నాయుడు లేనిపోని విమర్శలు చేస్తున్నారు. బాబు చేస్తున్న కుట్ర రాజకీయాలను ప్రజలు అందరు గమనిస్తున్నారు. ఇక రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మీద వెలగపూడి రామకృష్ణ ఛాలెంజ్ చేయడం హాస్యాస్పదంగా ఉంది. వెలగపూడి తీరు చూస్తే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. వంగవీటి రంగా హత్య కేసులో వెలగపూడి నిందితుడు. ఆయన అక్రమాలు ప్రజలందరికీ తెలుసు. ఆయనను బెజవాడలో బహిష్కరిస్తే వైజాగ్ వచ్చాడు. చంద్రబాబు 420 అయితే.. వెలగపూడి 840. తూర్పు నియోజకవర్గంలో దొంగ ఓట్లు నమోదు చేయించి గెలిచాడు. విశాఖ ప్రజలు రాజకీయంగా ఆదరిస్తే విశాఖ పరిపాలన రాజధాని కాకుండా కుట్రలు చేస్తున్నారు. టీడీపీ నేతలు కబ్జా చేసిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. మరో వారం రోజుల్లో సిట్ నివేదిక వస్తుంది. ఆ నివేదిక ఆధారంగా నిందితులను కఠినంగా శిక్షిస్తాం. సిట్ నివేదికలో ఉన్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదు’ అని స్పష్టం చేశారు. (పేదలకు పట్టాభిషేకం ) విశాఖ జిల్లాలో పట్టాల పండగ విశాఖ జిల్లాలో పేదల ఇళ్ల పంపిణీకి పెందుర్తి మండలం వాలిమెరక నుంచి శ్రీకారం జరగనుంది. విశాఖ జిల్లాలో ఇళ్ల పట్టాల పంపిణీ 73,660 మందికి ఇళ్ల పట్టాలు అందనున్నాయి. అలాగే 16,954 మందికి ల్యాండ్ పొజిషన్ సర్టిఫికెట్లు. 25 వేల 743 మంది టిడ్కో ఇళ్లు పంపిణీ చేయనున్నారు. వీటిలో విశాఖ సిటీ లో 23,576 టిడ్కో ఇల్లు పంపిణీ జరగనుంది. ఆ క్రమంలో ఈ పట్టాల పంపిణీ ద్వారా ద్వారా ఒక లక్ష 63 వేల 50 7 మందికి లబ్ధి పొందనున్నారు. -
పేదలకు పట్టాభిషేకం
సాక్షి, అమరావతి: లక్షలాది కుటుంబాలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నివాస స్థల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణానికి భూమి పూజలకు శుభ ముహూర్తం వచ్చేసింది. ఇళ్ల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణాలకు శంకుస్థాపనలు రెండు వారాల పాటు వాడవాడలా పండుగలా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. లబ్ధిదారుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ జగనన్న కాలనీలు చక్కటి వసతులతో సర్వాంగ సుందరంగా రూపు దిద్దుకున్నాయి. తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం కొమరగిరిలోని వైఎస్సార్ జగనన్న కాలనీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాక కోసం సిద్ధమైంది. ఇక్కడ సేకరించిన 367.58 ఎకరాల్లో 60 ఎకరాలను సామాజిక అవసరాలకు వదిలేసి 16,500 ప్లాట్లను చక్కగా రూపొందించారు. సీఎం జగన్ కడప నుంచి శుక్రవారం మధ్యాహ్నం ఇక్కడకు చేరుకుని పైలాన్‌ను ఆవిష్కరించి లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయనున్నారు. అనంతరం ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. శనివారం నుంచి వచ్చేనెల ఏడో తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాల పంపిణీ, భూమి పూజల కోలాహలం కొనసాగుతుంది. చదవండి: (ముందు లిమిటెడ్.. తరువాత రెగ్యులర్ డీఎస్సీ) వాడవాడలా ఆనందోత్సాహాలు ► భారత దేశ చరిత్రలో ఇదివరకెన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో 30,75,755 మందికి నివాస స్థల పట్టాలు అందజేయడంతోపాటు వచ్చే మూడేళ్లలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యంపై ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ► మన ప్రభుత్వం వస్తే 25 లక్షల ఇళ్ల స్థల పట్టాలు ఇస్తామని ప్రజా సంకల్పయాత్ర సందర్భంగా విపక్షనేత హోదాలో ప్రకటించిన వైఎస్ జగన్.. సీఎం అయ్యాక ఏకంగా 30.75 లక్షల మందికి పట్టాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ► ఇంత మంచి కార్యక్రమం చేస్తే జగన్‌కు ప్రజల్లో ఎంతో పేరు ప్రతిష్టలు వస్తాయనే కసితో దీనిని ఎలాగైనా అడ్డుకోవాలని టీడీపీ నాయకులు శతవిధాలా ప్రయత్నించారు. ఇందులో భాగంగానే ఇళ్ల స్థలాల పంపిణీకి బ్రేకులు వేయించేందుకు వెనకుండి కోర్టుల్లో కేసులు వేయించారు. ఇలా కోర్టు కేసుల్లో ఉన్న లేఅవుట్లలోనివి మినహా మిగిలిన వారందరికీ ఇళ్ల స్థల పట్టాలను ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా పంపిణీ చేయనున్నారు. ► రూ.50,940 కోట్ల అంచనా వ్యయంతో 28.30 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని వచ్చే మూడేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రూ.28,080 కోట్ల వ్యయంతో మొదటి విడతలో నిర్మించ తలపెట్టిన 15.60 లక్షల ఇళ్లకు వచ్చే నెల ఏడో తేదీ వరకూ ప్రజా ప్రతినిధులు శంకుస్థాపనలు చేస్తారు. వాస్తవాలను కోర్టులకు నివేదించడం ద్వారా స్టేలను ఎత్తివేయించి మిగిలిన 3.51 లక్షల మందికి కూడా త్వరలో ఇళ్ల స్థల పట్టాలు ఇచ్చే దిశగా రెవెన్యూ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. అర్హతే ప్రామాణికం ► కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడకుండా అర్హతే ప్రాతిపదికగా అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో గ్రామ/ వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. లబ్ధిదారుల జాబితాను ప్రదర్శించారు. అర్హుల పేర్లెవరివైనా పొరపాటున మిస్సయితే మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ► 68,361 ఎకరాల ప్రభుత్వ, ప్రయివేటు భూమిని సేకరించి పాఠశాలలు, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, పార్కులు, వైఎస్సార్ హెల్త్ క్లీనిక్‌లు, క్రీడా ప్రాంగణాలు లాంటి సామాజిక అవసరాల కోసం స్థలాలను వదిలేచి చక్కగా రహదారులు ఏర్పాటు చేశారు. ► రాష్ట్ర వ్యాప్తంగా 17004 వైఎస్సార్ జగనన్న కాలనీలను అధికారులు అభివృద్ధి చేశారు. ఈ కాలనీల్లో ప్లాట్లను అత్యంత పారదర్శకంగా లాటరీ విధానం ద్వారా కేటాయించారు. తమకు కేటాయించిన ప్లాట్లను చూసేందుకు ఆయా కాలనీల వద్దకు జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. ► ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా దారిద్య్రరేఖకు దిగువనున్న ఇల్లులేని పేద కుటుంబాలన్నింటికీ ఈ నెల 25 నుంచి నివాస స్థల పట్టాలు పంపిణీ చేయనున్నట్లు గురువారం రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి ఉత్తర్వులు జారీ చేశారు. ‘తూర్పు’ నుంచే ‘పట్టా’భిషేకం సాక్షిప్రతినిధి, రాజమహేంద్రవరం : పేదల సొంతింటి కలలను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ‘తూర్పు’ నుంచి సాకారం చేస్తున్నారు. కాకినాడ–ఉప్పాడ బీచ్ రోడ్డుకు సమీపాన 367.58 ఎకరాల్లో సువిశాలమైన స్థలంలో పట్టాల పండుగకు సర్వం సిద్దమైంది. కొమరగిరి లే అవుట్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అమీనాబాద్ గ్రామంలో ప్రతిపాదిత ఫిష్షింగ్ హార్బర్‌కు ఐదు కిలోమీటర్లు, కాకినాడ స్మార్ట్ సిటీకి 11 కిలోమీటర్లు, కాకినాడ స్పెషల్ ఎకనమిక్ జోన్‌కు 12 కిలోమీటర్లు దూరాన కొమరగిరి లే అవుట్ ఏర్పాటైంది. 60 అడుగుల సువిశాలమైన ప్రధాన రహదారి, 40 అడుగులతో అంతర్గత రహదారులు, 20 అడుగులతో బ్లాకుల మధ్య రహదారులు ఏర్పాటు చేశారు. ప్రతి లబ్ధిదారుకు 60 చదరపు అడుగుల వంతున కేటాయించారు. కాగా, 2006 ఏప్రిల్ 1న మహానేత వైఎస్సార్ ‘తూర్పు’ సెంటిమెంట్‌తో ఇదే జిల్లా కపిలేశ్వరపురం మండలం పడమర కండ్రిగ గ్రామం నుంచి ‘ఇందిరమ్మ’ ఇళ్ల పథకాన్ని ప్రారంభించడం గమనార్హం. మహిళా స్వావలంబనకు పెద్దపీట మరే రాష్ట్రంలో లేని విధంగా సీఎం జగన్ వినూత్న రీతిలో మహిళా స్వావలంబనకు పెద్దపీట వేస్తున్నారు. మహిళల పేరుతో ఇన్ని లక్షల నివాస స్థల పట్టాలిచ్చి ఇళ్లు కట్టించే కార్యక్రమం చేపట్టడం అభినందనీయం. – సుధామూర్తి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ జగన్ సర్కారుకు అభినందనలు మహిళలకు ఇంత పెద్దఎత్తున ఇళ్ల పట్టాలు ఇవ్వడం చాలా గొప్ప విషయం. నివాస స్థల పట్టా పొందుతున్న ప్రతి మహిళకూ హృదయపూర్వక శుభాభినందనలు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వానికీ అభినందనలు. – పరుగుల రాణి పీటీ ఉష మహిళలకు రక్షణ కవచం మహిళల అభ్యున్నతి, సాధికారతకు సీఎం వైఎస్ జగన్ ఎంతో కృషి చేస్తున్నారు. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలుచేస్తోంది. ఏపీ తెచ్చిన ‘దిశ’ చట్టం మహిళలకు రక్షణ కవచంగా మారింది. – నవనీత్ రవి రానా, మహారాష్ట్ర ఎంపీ దేశ చరిత్రలో సువర్ణాధ్యాయం సీఎం జగన్ నిర్ణయం దేశ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. 30 లక్షల మంది పేద మహిళల పేరు మీద ఇళ్ల పట్టాలివ్వడమనేది మామూలు విషయం కాదు. మహిళలకు జగన్ సర్కారు ఇస్తున్న ప్రాధాన్యమేంటో అర్థమవుతోంది. – ఒలింపిక్ మెడల్ గ్రహీత కరణం మల్లీశ్వరి తూర్పుగోదావరి జిల్లా కొమరిగిరిలో సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా పేదలకు ఇచ్చేందుకు సిద్ధం చేసిన లేఅవుట్ -
టిడ్కో ఇళ్ల పండుగకు అంతా రెడీ
సాక్షి, అమరావతి: ‘అందరికీ ఇళ్ల పథకం’ కింద ఈ నెల 25న లబ్ధిదారులకు ఇళ్లను పంపిణీ చేసేందుకు రాష్ట్ర టౌన్షిప్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీ టిడ్కో) సన్నద్ధమవుతోంది. ఈ పథకం కింద 300 ఎస్ఎఫ్టీ ఉన్న టిడ్కో ఇళ్లను ఒక్క రూపాయికే అందివ్వనుంది. టీడీపీ ప్రభుత్వంలో పునాదుల దశ కూడా దాటని టిడ్కో యూనిట్ల స్థానంలో లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలను మంజూరు చేయనుంది. రూ.9,995 కోట్ల టిడ్కో ఇళ్లు రిజిస్ట్రేషన్ ► వీటికి సంబంధించిన పూర్తి ఆర్థిక భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని సీఎం జగన్ ఇప్పటికే ప్రకటించారు. ఆ ప్రకారం 300 ఎస్ఎఫ్టీ టిడ్కో యూనిట్లను లబ్ధిదారులకు ఈ నెల 25న సేల్ అగ్రిమెంట్లు రిజిస్ట్రేషన్ చేస్తారు. ► దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 88 మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 1,43,600 మంది లబ్ధిపొందనున్నారు. ► జి+3 నమూనాలో నిర్మించిన ఆ టిడ్కో ఇళ్ల మొత్తం విలువ రూ.9,995 కోట్లు. భూమి, మౌలిక సదుపాయాలతో కలిపి ఒక్కో యూనిట్ విలువ రూ.6.65లక్షలు. వారికి పట్టాలు.. ఉచితంగా ఇళ్లు ► గతంలో టీడీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్ల పనులను ఆర్భాటంగా ప్రారంభించి తరువాత వదిలేసింది. దాంతో పునాదుల దశలోనే 51 వేల యూనిట్లు నిలిచిపోయాయి. ► ప్రస్తుత ప్రభుత్వం వాటిని రద్దుచేసింది. ► వాటి స్థానంలో ఆ లబ్ధిదారులకు ‘అందరికీ ఇళ్లు’ పథకం కింద ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని నిర్ణయించింది. ► ఈ నెల 25 నుంచి వారం రోజులపాటు నిర్వహించే కార్యక్రమాల్లో వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తారు. ► ఆ స్థలాల్లో ప్రభుత్వమే ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇస్తుంది. ► 365 ఎస్ఎఫ్టీ, 430 ఎస్ఎఫ్టీ యూనిట్లకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీ ప్రకటించింది. ► గత టీడీపీ ప్రభుత్వంలో 365 ఎస్ఎఫ్టీ యూనిట్‌కు రూ.50వేలు లబ్ధిదారుని వాటాగా చెల్లించాల్సి ఉండేది. అందులో రూ.25వేలు తమ ప్రభుత్వం భర్తిస్తుందని ఇటీవల సీఎం జగన్ ప్రకటించారు. రూ.7.55 లక్షల విలువ చేసే 365 ఎస్ఎఫ్టీ యూనిట్‌కు మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రుణాలను సమకూరుస్తుంది. దీనివల్ల 44,304 మంది లబ్ధి పొందనున్నారు. ► అదే విధంగా.. 430 ఎస్ఎఫ్టీ యూనిట్‌కు టీడీపీ ప్రభుత్వంలో లబ్ధిదారుని వాటా రూ.లక్ష ఉండేది. అందులో రూ.50వేలు తమ ప్రభుత్వం భరిస్తుందని జగన్ ప్రకటించారు. రూ.8.55 లక్షలు విలువ చేసే 430 యూనిట్‌కు మిగిలిన మొత్తానికి బ్యాంకు రుణం సమకూరుస్తారు. దీనివల్ల 74,312మందికి ప్రయోజనం కలగనుంది. ► పై రెండు కేటగిరీల లబ్ధిదారులకు కూడా ఈనెల 25 నుంచి సేల్ రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. పక్కాగా ఏర్పాట్లు 300 ఎస్ఎఫ్టీ లోపు టిడ్కో యూనిట్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. పునాదుల దశ దాటకపోవడంతో రద్దుచేసిన 51వేల టిడ్కో ఇళ్ల స్థానంలో ఆ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తాం. అనంతరం ప్రభుత్వం ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇస్తుంది. – శ్రీధర్, ఎండీ, ఏపీ టిడ్కో -
టీడీపీ కుట్ర.. ఆధారాలు బట్టబయలు
సాక్షి, దెందులూరు: రామారావుగూడెం పంచాయతీ మలకచర్లలో 71 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇవ్వనివ్వకుండా కోర్టులో వ్యాజ్యం వేసి అడ్డుకున్నది టీడీపీకి చెందిన పర్వతనేని వెంకటరామారావు అని వైఎస్సార్ సీసీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి కామిరెడ్డి నాని, వైఎస్సార్ సీపీ నాయకులు పేర్కొన్నారు. శ్రీరామవరంలో వారు విలేకరులకు వివరాలు తెలిపారు. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి టీడీపీ వ్యతిరేకం కాదని, కోర్టులో కేసు వేసిన వ్యక్తికి, టీడీపీకి సంబంధం లేదని ఆ పార్టీ నాయకులు మంగళవారం విలేకరులకు తెలిపారన్నారు. అయితే ఆ వ్యాజ్యం వేసిన వెంకటరామారావు టీడీపీకి చెందిన వ్యక్తి అనేందుకు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని వాటిని చూపించారు. మలకచర్లలో హెల్త్ సెంటర్ నిర్మాణం, మేదినరావుపాలెంలో ఇళ్ల స్థలాల పంపిణీ, పెదవేగి మండలంలో ఐదు గ్రామ సచివాలయ భవనాల నిర్మాణాలను నిలిపివేయాలని కోర్టులో వ్యాజ్యం వేయటాన్ని వారు తప్పు పట్టారు. వైద్యశాల విషయంలో కూడా రాజకీయం చేస్తారా? అని మండిపడ్డారు. గత టీడీపీ ప్రభుత్వంలో తనపై తప్పుడు కేసులు పెట్టి నియోజకవర్గంలో దుర్మార్గమైన పాలన చేశారు కాబట్టే నియోజకవర్గ ప్రజలందరూ వ్యతిరేకించి చింతమనేనిని ఇంటికి పరిమితం చేశారని నాని పేర్కొన్నారు. అయినా తీరు మార్చుకోకుండా టీడీపీకి వందల ఓట్ల మేరకు తక్కువ పడిన గ్రామాల్లో అభివృద్ధి జరగకుండా, సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందకుండా చేసేందుకు ఏదొక సాకుతో కోర్టుల్లో వ్యాజ్యాలు వేయిస్తున్న తీరును నియోజకవర్గ ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. ల్యాండ్ పూలింగ్, ఫిల్లింగ్‌కు వ్యత్యాసం తెలియని వారంతా ఉన్నత విద్యను అభ్యసించిన ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరిని విమర్శించటం చూసి నియోజకవర్గ ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండేటి గంగాధరబాబు, పార్టీ సీనియర్ నాయకుడు కామా కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
'కోర్టు కేసులతో 6 నెలల నుంచి ఆపుతున్నారు'
సాక్షి, పశ్చిమగోదావరి: ద్వారకా తిరుమల వెంకన్నను శనివారం రోజున రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు దర్శించుకున్నారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు, వేదపండితులు, వేద మంత్రోచ్ఛరణలతో ఆశీర్వచనం పలికి ప్రసాదాలను అందజేసారు. దర్శనానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'గుళ్లపై కూడా ప్రతిపక్ష నేతలు రాజకీయం చేస్తున్నారు. చంద్రబాబు రాష్ట్రంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా టీడీపీ వారితో కోర్టులో కేసులు వేసి 6 నెలల నుంచి ఆపుతున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో ఒక సెంటు భూమి కూడా పేదలకు పంచిన పాపాన పోలేదు. ఇప్పటికే రాష్ట్రంలో 15 లక్షలు ఇళ్లు శాంక్షన్ అయ్యాయి. కోర్టు నుంచి అనుమతి రాగానే మరో 15 లక్షల ఇళ్లు పంపిణీ చేస్తాం. సొంతంగా ఇల్లు నిర్మించుకోలేని పేదలకు ప్రభుత్వం నిర్మించి ఇస్తుంది' అని మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పేర్కొన్నారు. -
పట్టా పండగ.. ఇళ్ల పట్టాలు రెడీ
పేదల దశాబ్దాల కల నెరవేరనుంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజున అక్క చెల్లెమ్మలకు నివాసయోగ్యమైన ప్లాట్లు ఇచ్చేందుకు ఇళ్ల పట్టాలు సిద్ధమయ్యాయి. సువిశాలమైన రోడ్లు, విద్యుత్ సౌకర్యం, డ్రెయినేజీ వ్యవస్థతో ప్రైవేట్ లేఅవుట్లను తలపించే ప్లాట్లను సిద్ధం చేశారు. జిల్లాలో ఒకే రోజు 1.32 లక్షల మంది లబ్ధిదారులకు ఏకకాలంలో పట్టాలు అందించడానికి అధికార యంత్రాంగం సర్వశక్తులు ఒడ్డుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల పట్టాల పంపిణీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న క్రమంలో రెవెన్యూ యంత్రాంగమంతా ప్లాట్లను సిద్ధం చేసే పనిలో బిజీబిజీగా ఉన్నారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత రూ.లక్షల విలువైన స్థలాలను, ఇంత ఉదారంగా ప్రతి లబ్ధిదారు కుటుంబంలోని మహిళ పేరుతో రిజిస్ట్రేషన్ చేసి అందజేయనుండడంతో పల్లె నుంచి పట్టణాల వరకు పండగ వాతావరణం కనిపిస్తోంది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో ఈ నెల 8న ఇళ్ల పట్టాల పంపిణీ పండగ జరగనుంది. ఒకే రోజు పల్లె నుంచి పట్టణాల వరకు 1.32 లక్షల మందికి నివాస స్థలాల పట్టాలు అందజేయనున్నారు. ఇప్పటికే ప్లాట్లు, పట్టాలు సిద్ధం చేశారు. పది నియోజకవర్గాల్లో ఉన్న లబి్ధదారులు వారు నివసిస్తున్న ప్రాంతాల సమీపంలోనే ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించింది. ►ప్రభుత్వ భూమి లేని పక్షాన మార్కెట్ ధర చెల్లించి ప్రైవేట్ భూమిని కొనుగోలు చేసి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలో అనేక చోట్ల విలువైన ప్రైవేట్ భూములను కూడా కొనుగోలు చేసి వెంచర్లుగా మార్చారు. ►ఆ స్థలంలో వెనువెంటనే ఇల్లు కట్టుకునేందుకు వీలుగా రోడ్లు, కాలువలు, విద్యుత్ సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ►లే అవుట్లలో 80 శాతం పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ►జిల్లా వ్యాప్తంగా 3493.8 ఎకరాల భూమి అవసరం ఉండగా ఆ మేరకు భూమిని పూర్తిగా సిద్ధం చేశారు. ►సేకరించిన భూముల్లో 2,450 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా, 950 ఎకరాల ప్రైవేట్ భూములను కొనుగోలు చేశారు. ►3,493 ఎకరాల భూముల్లో 1,407 లేఅవుట్లు వేయడంతో జిల్లాలో ప్రతి గ్రామంలోనూ ఓ లేఅవుట్ ఏర్పాటు అయింది. ►దరఖాస్తులను బట్టి సగటున 3 ఎకరాల విస్తీర్ణం నుంచి 100 ఎకరాల విస్తీర్ణం వరకు వెంచర్లు నిర్మించారు. ►లే అవుట్ ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన గ్రావెల్‌తో చదును చేసి సంబంధిత తహసీల్దార్లు సిబ్బందితో కలిసి మార్కింగ్ నిర్వహించి ప్లాట్లుగా విభజించారు. ►రహదారుల నిర్మాణంతో సహా అన్ని పనులు పూర్తి చేశారు. ►జిల్లాలో ఇప్పటి వరకు ఉదయగిరి, వెంకటగిరి, సూళ్లూరుపేట, ఆత్మకూరు నియోజకవర్గాల్లో భూ సేకరణ పూర్తవడంతో పాటు వెంచర్ల నిర్మాణం కూడా పూర్తి స్థాయిలో జరిగింది. ►మిగిలిన నియోజకవర్గాల్లో భూ సేకరణ పూర్తయి రహదారి నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ►ఈ నెల 7వ తేదీకల్లా నూరు శాతం పూర్తిగా చేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ►ఈ క్రమంలో జాతీయ రహదారి సమీపంలోనూ, రాష్ట్ర రహదారికి సమీపంలోని ఇతర విలువైన భూముల్లో వెంచర్లు నిర్మించారు. అక్కచెరువుపాడులో భారీ లేఅవుట్ ప్రధానంగా జిల్లాలో భారీ లే అవుట్ నెల్లూరు నగర శివారులో రూపు దిద్దుకుంటుంది. మంత్రి అనిల్ కుమార్‌యాదవ్, కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబు ప్రత్యేక శ్రద్ధతో నెల్లూరురూరల్ మండలంలోని అక్కచెరువుపాడులో వంద ఎకరాల విస్తీర్ణంలో భారీ లేఅవుట్‌ను సిద్ధం చేశారు. 4,500 ప్లాట్లను సిద్ధం చేశారు. ఇప్పటికే ప్లాట్ల మార్కింగ్ పూర్తి చేసి రహదారి నిర్మాణ పనులను పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 1.32 లక్షల మంది లబి్ధదారుల్లో అత్యధిక శాతం మంది నెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గాల నుంచే ఉన్నారు. నెల్లూరు నగరంలో 14,703 మంది, నెల్లూరు రూరల్‌లో 16,319 (నగర పాలక సంస్థ పరిధి వరకు) మంది లబ్ధిదారులు ఉన్నారు. కావలి, ఆత్మకూరు, నాయుడుపేటల్లో భారీ లేఅవుట్లను ఏర్పాటు చేశారు. జిల్లాలో అత్యధిక శాతం లేఅవుట్లు సగటున 20 ఎకరాల పైబడిన విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. లబ్ధిదారుల జాబితా పెరుగుతుంది జిల్లాలో అర్హులైన లబ్ధిదారుల జాబితా ఇంకా పెరిగే అవకాశం ఉందని జాయింట్ కలెక్టర్ వినోద్ కుమార్ ‘సాక్షి’ ప్రతినిధికి తెలిపారు. గడిచిన 15 రోజుల వ్యవధిలో 25,536 కొత్త దరఖాస్తులు అందాయని, వాటితో కలిపి కేవలం ఇళ్ల పట్టాల వరకే 1.32 లక్షల వరకు ఉందని మరికొంత మంది లబి్ధదారులు పెరిగే అవకాశం ఉందని, ఇందుకు అనుగుణంగా ముందస్తుగా స్థలాలు అవసరమైన చోట గుర్తించి రిజర్వులో పెడతామని చెప్పారు. 8వ తేదీన నూరు శాతం పట్టాల పంపిణీ పూర్తి చేస్తామని తెలిపారు. – వినోద్‌కుమార్, జాయింట్ కలెక్టర్ -
దేశంలోనే సరికొత్త చరిత్రకు శ్రీకారం
సాక్షి, విశాఖపట్నం: ‘రాష్ట్రంలో ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ అనే కార్యక్రమంలో భాగంగా సొంత ఇల్లు లేని అర్హులైన వారికి నివాస స్థల పట్టాల పంపిణీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తలపెట్టారు. గ్రామీణ ప్రాంతంలో ఒకటిన్నర సెంట్లు, పట్టణ ప్రాంతంలో కనీసం ఒక సెంటు చొప్పున ఇంటి స్థలం ఇవ్వడానికి తగిన ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలిచ్చారు. ఈ కార్యక్రమం అంతా మార్చి 25వ తేదీ ఉగాది రోజున ఒక పండుగలా జరగనుంది. స్థలం ఇవ్వడమంటే పట్టా ఇచ్చేయడమనే గత విధానానికి భిన్నంగా సాగుతుంది ఇప్పటి ప్రక్రియ. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏవిధంగా అయితే లేఅవుట్లు అభివృద్ధి చేస్తారో ఆ మాదిరిగా ప్రభుత్వమే అన్ని ప్రాథమిక వసతులు కల్పించి ఇవ్వాలనేది ఉద్దేశం. అంతర్గత రోడ్లు, డ్రెయిన్లు ఏర్పాటు చేయడమే గాక ఆ లేఅవుట్లో సామాజిక అవసరాలకు స్థలం కేటాయింపు ఉంటుంది. సరిహద్దులు గుర్తించి, ఆ ప్రకారం రాళ్లు వేయిస్తున్నాం. ఆ స్థలంపై లబ్ధిదారుల కుటుంబంలోని మహిళకు యాజమాన్య హక్కు ఉంటుంది. గతంలో ఇచ్చినట్లు అసైన్డ్ పట్టా మాదిరిగా గాకుండా యాజమాన్య హక్కు పత్రం (కన్వీయన్స్ డీడ్) తయారుచేసి ప్రభుత్వం ఇస్తోంది. అర్హులందరికీ స్థలం కుల, వర్గ, మత, రాజకీయాలకు అతీతంగా ఈ స్థలాల కేటాయింపు కోసం లబ్ధిదారులను ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎంపిక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరిగింది. ఇంటింటికీ వెళ్లి గ్రామ, వార్డు వలంటీర్లు సర్వే నిర్వహించారు. ఎంపికైన లబ్ధిదారుల జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో, మండల కార్యాలయాల్లో ప్రదర్శించాం. దరఖాస్తు చేసుకున్నా కొంతమందికి ఎందుకు అర్హత లేదో స్పష్టంగా పేర్కొంటూ అనర్హుల జాబితాలను ఉంచాం. వాటిపై అభ్యంతరాలను స్వీకరించి పునఃపరిశీలన చేయించాం. ఆ దశలోనూ అర్హులైనవారికి అవకాశం కల్పించాం. జిల్లాలో 2.50 లక్షల మందికి లబ్ధి జిల్లాలో ఇప్పటివరకూ లెక్క తేలిన లబ్ధిదారులు 2.50 లక్షల మంది. గ్రామీణ ప్రాంతంలో సుమారు 66 వేల మంది ఉన్నారు. వారికి ఒకటిన్నర సెంట్లు చొప్పున స్థలం కేటాయించాలంటే లేఅవుట్లు వేసేందుకు 1,613 ఎకరాల భూమి అవసరమవుతోంది. దీనిలో 1,393 ఎకరాలు అంటే దాదాపు 1,400 ఎకరాల ప్రభుత్వ భూమి గుర్తించాం. అదీ ఏ గ్రామంలో లబ్ధిదారులకు ఆ గ్రామ పరిధిలోనే స్థలం ఇవ్వాలనేది లక్షం. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. వేరే గ్రామంలో స్థలం ఇచ్చినా అక్కడ నివాసానికి వెళ్లకపోవచ్చు. అందుకే సాధ్యమైనంత వరకూ ఒక గ్రామంలోని లబ్ధిదారుల కోసం ఆ గ్రామ పరిధిలోనే లేఅవుట్ వేయిస్తున్నాం. ప్రభుత్వ భూమి అందుబాటులో లేనిచోట 171 ఎకరాల అసైన్డ్ భూమి మాత్రమే తీసుకున్నాం. జిరాయితీ భూమి ధరతో సమానంగా పరిహారం ఇచ్చిన తర్వాతే వాటిని సేకరించాం. ఇక ప్రభుత్వ, అసైన్డ్ భూమి అందుబాటులో లేనిచోట 47.64 ఎకరాల మేర జిరాయితీ భూమి కూడా తీసుకున్నాం. ఇందుకు రూ.46.83 కోట్ల మేర బిల్లులు పంపించాం. కొంతమందికి ఇప్పటికే ఆ మొత్తం అందింది కూడా. వీఎంఆర్డీఏకు బాధ్యతలు.. విశాఖ మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) అనేది ఒక ప్రభుత్వ సంస్థ. విశాఖ నగర పరిధిలో లేఅవుట్ల అభివృద్ధి బాధ్యతలు దీనికే ప్రభుత్వం అప్పగించింది. ప్రతి లేఅవుట్‌లోనూ పక్కాగా రోడ్లు, డ్రెయిన్లు, వీధిదీపాల సహా మౌలిక వసతులన్నీ కల్పించి ఇస్తుంది. ఇందుకు రూ.150 కోట్ల వరకూ ఖర్చు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మార్చి 25వ తేదీన ఉగాది రోజున పట్టాల పంపిణీకి అన్నీ సిద్ధమవుతాయి. 20 బ్లాక్‌ల్లో లేఅవుట్ల అభివృద్ధి పనులు చేపట్టేందుకు వీఎంఆర్డీఏ ఇప్పటికే టెండర్లు పిలిచింది. ఈ బ్లాక్‌లన్నీ నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉన్నాయి. వార్డుల వారీ లబ్ధిదారులకు వారికి సమీప బ్లాక్‌లోనే స్థలం కేటాయించేలా మ్యాపింగ్ చేస్తున్నాం. కన్వీయన్స్ డీడ్స్ సిద్ధం చేస్తున్నాం ప్రతి లబ్ధిదారుడికి కేటాయించిన స్థలానికి సంబంధించి కన్వీయన్స్ డీడ్ (ఆస్తి హక్కు పత్రం)ను ప్రభుత్వం ఇస్తుంది. వాటిని లబ్ధిదారుల కుటుంబంలో మహిళ పేరిట అన్ని వివరాలతో సిద్ధం చేస్తున్నాం. పట్టణంలోనే ల్యాండ్ పూలింగ్.. విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ)తో పాటు నర్సీపట్నం, యలమంచిలి పురపాలక ప్రాంతాల్లో మొత్తం 1,84,704 మందికి ఇళ్ల స్థలాలకు అర్హులుగా గుర్తించాం. వారిలో 28,152 మందికి టిడ్కో ఇళ్లను కేటాయిస్తాం. మిగతా 1,56,552 మందికి ఇళ్ల స్థలం ఇవ్వాల్సి ఉంది. జీవీఎంసీ పరిధిలోనే సుమారు 1.52 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. వారి కోసం ల్యాండ్ పూలింగ్ విధానంలో భూమి సమీకరించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ఇప్పటికి 5,200 ఎకరాల భూసమీకరణ ప్రక్రియ పూర్తి అయ్యింది. అసైన్డ్ భూమి అనుభవదారులైన రైతులు, ప్రభుత్వ భూమి ఆక్రమణదారులు చాలామంది తమ ఆమోదం తెలిపారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందీ లేదు. వారికి ఇచ్చిన హామీ మేరకు అభివృద్ధి చేసిన లేఅవుట్లో స్థలం ఇస్తారని ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. అధికార యంత్రాంగంపై విశ్వాసం ఉంది. తక్కువ ఖర్చుతోనే.. రాష్ట్రంలో ఇంత తక్కువ మొత్తం ఖర్చుతో భూసేకరణ పూర్తి అయ్యింది మన జిల్లాల్లోనే. దాదాపుగా ప్రభుత్వ భూమి, అసైన్డ్ భూమినే లేఅవుట్ల కోసం వినియోగిస్తున్నాం. గ్రామీణ ప్రాంతంలో మొత్తం 845 లేఅవుట్లు వేస్తున్నాం. వాటిలో 493 లేఅవుట్లు అన్ని విధాలా సిద్ధమయ్యాయి. వాటిలో 33,192 ప్లాట్లను సిద్ధం చేసేశాం. మిగతావి కూడా మరో ఒకటీ రెండు వారాల్లో సిద్ధమవుతాయి. -
రూ.10 స్టాంప్ పేపర్‌పై మూడు పేజీల్లో ఇళ్ల పట్టా
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పండుగ రోజు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పేదలందరికీ ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. 25 లక్షల పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్‌పై అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. భూములను సేకరించి చదును చేయడం, ప్లాటింగ్, మార్కింగ్ జరుగుతోంది. లబ్ధిదారుల పేరిట ప్రభుత్వం రూ.పది స్టాంప్ పేపర్‌పై ఇంటి స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసి అందించనుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను రెవెన్యూ శాఖ జిల్లా అధికార యంత్రాంగానికి పంపింది. రిజిస్ట్రార్ కార్యాలయానికి డాక్యుమెంట్ రూ.పది స్టాంపు పేపర్ తొలి పేజీలో లబ్ధిదారుడి సమాచారంతో పాటు తహసీల్దారు సంతకం ఉంటుంది. రెండో పేజీలో ఇంటి స్థలం, సరిహద్దు వివరాలు, తహసీల్దారు సంతకం ఉంటుంది. మూడో పేజీ (ఫారం 32–ఏ)లో తొలుత తహసీల్దారు / ప్రతినిధి ఎడమ చేతి బొటన వేలి ముద్ర వేసి పాస్‌పోర్టు ఫోటో అతికించి సంతకం చేసి చిరునామా పూరిస్తారు. తరువాత లబ్ధిదారులు / ఆమె ప్రతినిధి ఎడమ చేతి బొటన వేలు ముద్ర వేసి పాస్ పోర్టు ఫొటో అతికించి సంతకం చేసి చిరునామా పూరిస్తారు. స్టాంప్ పేపర్‌పై సాక్షి, తహసీల్దారు సంతకాలు చేస్తారు. డాక్యుమెంట్ మూడు పేజీలను స్కానింగ్ చేసి రిజిస్ట్రార్ కార్యాలయానికి పంపిస్తారు. లబ్ధిదారుల పేరిట తహసీల్దారులే రిజిస్ట్రేషన్ చేయిస్తారు. ఈ ప్రక్రియపై చర్చించేందుకు రెవెన్యూ శాఖ మంగళవారం తహసీల్దార్లు, రెవెన్యూ డివిజనల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. - రూ.పది స్టాంపు పేపర్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రెవెన్యూ శాఖ ఇంటి స్థలం పట్టా అని ఉంటుంది. - లబ్ధిదారులు ఇంటి స్థలాన్ని వంశపారంపర్యంగా అనుభవించవచ్చు. అవసరాల నిమిత్తం ఇంటి స్థలాన్ని బ్యాంకులో ఎప్పుడైనా తనఖా పెట్టుకోవచ్చని పట్టాలో పేర్కొన్నారు. - అవసరమైతే ఐదేళ్ల తరువాత ఇంటి స్థలాన్ని విక్రయించుకోవచ్చు, కొనుగోలు చేయవచ్చు. మంజూరు చేసిన స్థలంలో అమలులో ఉన్న చట్టాలకు లోబడి నివాస కట్టడాలు చేపట్టవచ్చు. - నవరత్నాల పథకాల వివరాలతోపాటు వైఎస్సార్, ముఖ్యమంత్రి జగన్ ఫొటోతో కూడిన లోగోను ఇంటి స్థలం పట్టాపై ముద్రించారు. -
అర్హులందరికీ ఇళ్ల పట్టాలు: సీఎం జగన్
-
ఉపయోగం లేని చోట ఇవ్వొద్దు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: అర్హులు ఎంతమంది ఉన్నా అందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఉగాది నాటికి పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీపై క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సీఎం సమీక్ష జరిపారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, అధికారులు హాజరయ్యారు. ‘అమ్మఒడి’ తర్వాత ప్రభుత్వం చేపడుతున్న మరో అతి పెద్ద కార్యక్రమం అని సీఎం పేర్కొన్నారు. ఏ ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో ఇళ్ల పట్టాలు ఇవ్వలేదని తెలిపారు. ప్రజాసాధికార సర్వే అన్నది ప్రమాణం కాకూడదని.. వాలంటీర్లు క్షేత్రస్థాయిలో గుర్తించిన అంశాలు ప్రామాణికం కావాలన్నారు. ఇళ్ల పట్టాల కోసం గుర్తిస్తున్న స్థలాలు ఆవాస యోగ్యంగా ఉండాలన్న ప్రాథమిక విషయాన్ని మరిచిపోకూడదని అధికారులకు సీఎం సూచించారు. ఇళ్ల స్థలాల పట్ల లబ్ధిదారులు సంతృప్తి చెందాలి.. ‘అందరికీ పట్టాలు ఇవ్వాలి కదా అని... లబ్ధి దారులకు ఉపయోగం లేని చోట ఇవ్వడంలో అర్థం లేదు. ఇళ్లపట్టాలు ఇస్తున్న స్థలాలు పట్ల లబ్ధిదారులు సంతృప్తి వ్యక్తం చేయాలి. వారికి ఆవాసయోగ్యంగా ఉండాలి. ఈ అంశాలను అధికారులు దృష్టిలో పెట్టుకోవాలి. వీలైనంత వరకు ఇళ్ల పట్టాలకోసం అసైన్డ్ భూములను తీసుకోవద్దు’ అని సీఎం సూచించారు. ఇళ్లపట్టాల కోసం సడలించిన అర్హతల వివరాలను గ్రామ సచివాలయాల్లో డిస్ప్లే చేయాలని సీఎం పేర్కొన్నారు. ఈ వివరాలను గ్రామ సచివాలయాలకు అందుబాటులో ఉంచడంతో పాటు.. ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే.. వారు దరఖాస్తు చేసుకునేలా ఆ సమాచారం గ్రామ సచివాలయాలకు అందుబాటులో ఉండాలని సీఎం పేర్కొన్నారు. లబ్ధిదారుల అభిప్రాయం తప్పనిసరి.. ‘లబ్ధిదారుల అభిప్రాయం తప్పనిసరిగా తీసుకోవాలి. ఇళ్ల పట్టాల కోసం ఎంపిక చేసిన స్థలాలపై లబ్ధిదారులు ఆమోదం తెలిపిన తర్వాతనే ప్లాటింగ్ చేయాలి. లేకపోతే డబ్బు వృథా అవుతుందని’ సీఎం స్పష్టం చేశారు. ఇళ్ల పట్టాల కోసం కేటాయించిన స్థలాల్లో మొక్కలను పెంచాలని ముఖ్యమంత్రి సూచించారు. మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీల్లో లబ్ధిదారులందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ఆయన ఆదేశించారు. ఇంటి స్థలం లేనివారు ఎవరూ ఉండకూడదు.. పేదలకు కట్టించే ఇళ్ల డిజైన్ బాగుండాలని ఆ మేరకు ప్రతిపాదనలు తయారు చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఇంటి స్థలం లేనివారు ఎవ్వరూ ఉండకూడదని స్పష్టం చేశారు. అభ్యంతరకర ప్రాంతాల్లో ఉన్న నిరుపేదలకు ప్రత్యామ్నాయం కూడా వెంటనే చూపించాలని సీఎం తెలిపారు. వారికి ఇళ్లపట్టాలు ఎక్కడ ఇస్తున్నామో చెప్పాలని.. వారికి ఇళ్లు కట్టి అప్పగించి.. వారిని సంతోషం పెట్టిన తర్వాతనే వారిని అక్కడ నుంచి ఖాళీ చేయమని కోరాలని సీఎం పేర్కొన్నారు. ఇళ్ల పట్టాలు ఇవ్వగానే ఇళ్లు కట్టడానికి, లబ్ధిదారులు అక్కడకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ఈ విషయంలో అధికారులు హడావుడిగా వ్యవహరించడం తగదని.. ఈ మేరకు కలెక్టర్ ఆదేశాలు ఇవ్వాలని సీఎం అన్నారు. 1 నుంచి గ్రామాల్లో పర్యటిస్తా.. ‘ఫిబ్రవరి 1 నుంచి నేను గ్రామాల్లో పర్యటిస్తాను. రాండమ్‌గా ఒక పల్లెలోకి వెళ్లి పరిశీలిస్తాను. లబ్ధిదారుల ఎంపిక, పథకాలు అమలు జరుగుతున్న తీరును స్వయంగా పరిశీలిస్తాను’ అని సీఎం పేర్కొన్నారు. పొరపాట్లు జరిగితే కచ్చితంగా అధికారులను బాధ్యులను చేస్తామన్నారు. ఇళ్ల పట్టాల కోసం అధికారులు గుర్తించిన స్థలాల వివరాలను గ్రామ సచివాలయాల్లో డిస్ప్లే చేయాలన్నారు. అక్కడ ప్రజల అభిప్రాయాలను స్వీకరించాలన్నారు. ప్రజలను సంతోషంగా ఉంచాలి కాని, దాన్ని డ్యూటీగా చూడకూడదని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. (చదవండి: ఫిబ్రవరి 1 నుంచి సీఎం వైఎస్ జగన్ పల్లెబాట) -
ఇళ్ల పట్టాల పంపిణీకి ఇంటింటి సర్వే
అర్హతలు లబ్ధిదారుకు తెల్ల రేషన్‌కార్డు తప్పనిసరి. 2.5 ఎకరాల మాగాణి లేదా 5 ఎకరాలలోపు మెట్ట భూమి. పట్టణాల్లో రూ. 3 లక్షల్లోపు వార్షిక ఆదాయం సాక్షి, అనంతపురం: జిల్లాలో ఇళ్లులేని పేదలందరికీ పట్టాలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తును ప్రారంభించింది. ఇందులో భాగంగా వలంటీర్లు ఇంటింటి సర్వే చేపట్టనున్నారు. ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు ఇంటింటికీ వెళ్లి అర్హులైన వారిని గుర్తించే ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు. వలంటీర్లు సేకరించిన జాబితాను ఇప్పటికే రెవెన్యూ, హౌసింగ్ శాఖ అధికారుల వద్దనున్న సమాచారంతో సరిపోల్చుకోవడంతో పాటు సంబంధిత తహసీల్దార్లు, కమిషనర్లు రీ–వెరిఫికేషన్ చేస్తారు. అనంతరం సెప్టెంబర్ 3 నుంచి 10వ తేదీ వరకు సంబంధిత పంచాయతీ, వార్డుల్లో అర్హులైన జాబితాను ప్రకటిస్తారు. అదేవిధంగా దీనిపై అభ్యంతరాలను స్వీకరించడంతో పాటు పరిష్కరించే పనిని తహసీల్దార్లు, కమిషనర్లు చేయాల్సి ఉంటుంది. అంతిమంగా సెప్టెంబర్ 15వ తేదీ నాటికి తుది జాబితాను కలెక్టరుకు అందజేయాలి. ఆ తర్వాత కలెక్టర్ అనుమతితో అర్హులైన పేదలకు ఇంటి పట్టాల పంపిణీకి రంగం సిద్ధమవుతుంది. ఇందుకోసం జిల్లాలోని మొత్తం 20,050 మంది వలంటీర్లు ఇంటింటి సర్వే చేపట్టనున్నారు. ఎంపిక ఇలా...! జిల్లాలోని మొత్తం 1,029 పంచాయతీలు ఉండగా.. 15,006 మంది గ్రామ వలంటీర్లు.. ఒక కార్పొరేషన్, 11 మునిసిపాలిటీల్లో మొత్తం 373 వార్డులు ఉండగా 5,044 మంది వార్డు వలంటీర్లు నియమితులయ్యారు. జిల్లా వ్యాప్తంగా 20,050 మంది వలంటీర్లు ఈ సర్వేలో పాల్పంచుకోనున్నారు. ఒక ఫారంలో సర్వే చేసిన సంబంధిత కుటుంబం గురించి పేర్కొన్న వివరాలన్నీ సరైనవేనంటూ సదరు ఇంటి యజమానితో పాటు వలంటీరు కూడా సంతకం చేయాల్సి ఉంటుంది. ఈ వివరాలపై మరోసారి తహసీల్దారు ఆధ్వర్యంలో విచారణ చేపడతారు. ఆయా పంచాయతీలు, వార్డుల్లో జాబితాను సెప్టెంబర్ 3 నుంచి 10వ తేదీ వరకు ఉంచుతారు. దీనిపై అభ్యంతరాలను, క్లైయిమ్లను స్వీకరించి పరిష్కరిస్తారు. అనంతరం తుది జాబితాను ఆమోదం కోసం సెప్టెంబర్ 15 నాటికి కలెక్టర్‌కు పంపనున్నారు. ప్రస్తుత లెక్కలు ఇవీ...! జిల్లాలో ఇప్పటివరకు ఇళ్ల పట్టాల కోసం 1,40,682 మంది దరఖాస్తు చేసుకోగా.. ప్రాథమిక విచారణలో 1,20,712 మందిని అర్హులుగా అధికారులు తేల్చారు. వీరందరికీ ఇళ్ల పట్టాలను కేటాయించేందుకు 4,082.53 ఎకరాల భూమి అవసరం కాగా.. 1077.25 ఎకరాల ప్రభుత్వ భూమి మాత్రమే అందుబాటులో ఉంది. ఈ భూమిని 29,259 మంది లబ్ధిదారులకు మాత్రమే ఇళ్లపట్టాలను పంపిణీ చేసేందుకు సాధ్యమవుతుంది. మిగిలిన 97,453 మంది లబ్ధిదారులకు ఇళ్లపట్టాలను పంపిణీ చేసేందుకు మరో 3,010.68 ఎకరాల భూమి అవసరం అవుతుందని రెవెన్యూ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే, ఈ భూమిని ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేయాల్సి ఉంది. ఇందుకోసం మొత్తం రూ.716.49 కోట్లు అవసరం అవుతుందని జిల్లా అధికారులు లెక్కకట్టారు. అయితే, తాజాగా మళ్లీ ఇళ్ల పట్టాల కోసం అర్హులైన వారి కోసం ఇంటింటి సర్వేతో తుది లబ్ధిదారుల సంఖ్య తేలనుంది. అంతేకాకుండా గతంలో గంపగుత్తగా మండలాల వారీగా లెక్కలు తీసుకోగా.. తాజా సర్వేలో పంచాయతీల వారీగా భూమి లభ్యత, అర్హుల జాబితాను రూపొందించనున్నారు. ఈ దృష్ట్యా ఆయా గ్రామాల పరిధిలోనే ఇంటి స్థలం దక్కనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వీరికి వచ్చే ఏడాది ఉగాది పర్వదినాన పట్టాల పంపిణీ ప్రారంభంకానుంది. మొత్తం మీద జిల్లాలో ఇళ్లపట్టాలు లేని వారికి త్వరలోనే ఇంటిపట్టా చేతికి అందించేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. సెప్టెంబర్ 15 నాటికి ప్రక్రియ పూర్తి జిల్లాలో అర్హులైన పేదలకు ఇళ్లపట్టాలను పంపిణీ చేసేందుకు అర్హులై జాబితాను రూపొందించేందుకు 26వ తేదీ నుంచి వాలంటీర్లు సర్వే చేయనున్నారు. ఈ ప్రక్రియ మొత్తం సెప్టెంబర్ 15 నాటికి పూర్తి అవుతుంది. ప్రధానంగా సంబంధిత పంచాయతీలోనే ఇళ్లపట్టాలను ఇచ్చేందుకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అర్హులైన ప్రతీ ఒక్కరికీ న్యాయం చేసే దిశగా పక్కాగా చర్యలు తీసుకుంటాం. – డిల్లీరావు, ఇన్చార్జి కలెక్టర్ -
ఫలించిన ఎమ్మెలే విశ్వ పోరాటం
ఉరవకొండ: పట్టణంలోని అర్హులైన పేదలకు జానెడు జాగా ఇప్పించడానికి స్థానిక ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి దశలవారిగా ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. చివరికి వైఎస్సార్సీపీ అధినేత, ప్రతి పక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డినే స్వయంగా ఉరవకొండ తీసుకొచ్చి ఇంటి పట్టాల కోసం ధర్నా చేయించి ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా చేశారు. ఓ వైపు ప్రజా పోరాటాలు సాగిస్తూనే.. మరోవైపు పేదలకు న్యాయం చేయడానికి మూడు నెలల క్రితం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అర్హులైన వారికి ఇంటిపట్టాలు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని హైకోర్టు జిల్లా ఉన్నతాధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టులో పిల్ దాఖలు చేయాలని కూడా సూచించింది. కోర్టు ఆదేశాలతో స్పందించి ఆర్డీఓ, ఇతర అధికారులు పేదల ఇంటిపట్టాల ప్రక్రియను ప్రారంభించారు. ఇదిలా ఉంటే.. 2008లో మహనేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వ హయంలో ఉరవకొండ పట్టణంలోని నిరుపేదలకు ఇంటిపట్టాలు ఇవ్వడానికి 88 ఎకరాల స్థలాన్ని రూ. కోటి వెచ్చించి కొనుగోలు చేశారు. అయితే ఆ తర్వాత పేదలకు పట్టాలు పంచి పెట్టడంలో టీడీపీ ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తూ వచ్చింది. ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అటు ప్రభుత్వంపై ఇటు ఉన్నతాధికారుల పై ఒత్తిడి తీసుకురావడంతో ఇంటిపట్టాల పంపిణీ ప్రక్రియకు ఇప్పటికి మోక్షం కల్గింది. ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పోరాటాల వల్లే తమకు ఇళ్ల పట్టాలకు మార్గం సుగమం అయిందని పట్టణవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
క్రమబద్ధీకరణపై కసరత్తు!
- ఎక్కువ మందికి పట్టాలిచ్చేందుకు పరిశీలన - రెగ్యులరైజ్ చేసే కోణంలో రెవెన్యూ శాఖ చర్యలు - ఈ నెల 25 కల్లా తుది నిర్ణయం సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో జీవో 58 ప్రకారం ఉచిత క్రమబద్ధీకరణకు సంబంధించి సాధ్యమైనంత ఎక్కువ మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు రెవెన్యూ యంత్రాంగం కసరత్తు చేస్తున్నది. ఈమేరకు గురువారం పలు శాఖల అధికారులతో సమీక్షలు, సమాలోచనలు జరిపింది. తద్వారా ఇళ్ల పట్టాలపై ఒక నిర్ణయానికి రావాలని భావిస్తున్నది. వీలున్నంత మేరకు ఇళ్ల క్రమబద్ధీకరణపై ఉదారంగా వ్యవహారించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేయటంతో....చెరువులు, స్మశానవాటిక, లే అవుట్లలో ఖాళీ స్థలాలు, శిఖం భూములలోని నిర్మాణాలను కూడా రెగ్యులరైజ్ చేసే కోణంలో రెవెన్యూ శాఖ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వివిధ సంస్థలకు కేటాయించిన సర్కారీ భూముల్లో వెలిసిన నిర్మాణాల క్రమబద్ధీకరణపై సర్కారు కనికరిస్తే ఇళ్ల పట్టాలు పెంచవచ్చని యంత్రాంగం భావిస్తున్నది. పారిశ్రామిక, అటవీ, విద్య, నీటిపారుదల తదితర శాఖలకు బదలాయించిన స్థలాల్లో చాలా చోట్ల నిర్మాణాలు పుట్టుకొచ్చాయి. ఈ మేరకు క్రమబద్ధీకరణ చేయాలంటూ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి 13,417 మంది దరఖాస్త్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను పరిశీలించిన యంత్రాంగం ప్రభుత్వానికి నివేదించగా...అక్కడి ఆదేశాలకు అనుగుణంగా వాటికి మోక్షం కలిగించే అంశంపై సీసీఎల్ఏ అధ్వర్యంలోని కమిటీ కసరత్తు చేస్తున్నది. ఈ దరఖాస్తుల్లో హైదరాబాద్ జిల్లాకు సంబంధించినవి 6,725, రంగారెడ్డి జిల్లావి 6,692 దరఖాస్తులు ఉన్నాయి. వచ్చే నెల 2 నుంచి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించటంతో.. ఆగమేఘాలపై వివిధ శాఖల నుంచి క్రమబద్ధీకరణకు సంబంధించి క్లియరెన్స్ కోసం అధికారయంత్రాంగం కుస్తీ పడుతొంది. ఈ మేరకు గురువారం ఆయా శాఖల ఉన్నతాధికారులు, సంబంధిత విభాగాలతో సమీక్షలు, చర్చలు జరిపారు. 25 వ తేదీ కల్లా కసరత్తు పూర్తి చేయాలని నిర్ణయించారు.