
ఏపీ నారా లోకేష్ జాగీరుకాదు : అమర్నాథ్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
విశాఖపట్నం : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ లోకేష్ జాగీరుకాదని మండిపడ్డారు. రెండేళ్లలో వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సీఎం అవ్వడం ఖాయమని పేర్కొన్నారు.
తుని ఘటనలో టీడీపీ పాత్రను త్వరలోనే బయటపెడతామని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడులా వెన్నుపోటు పొడిచి వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం కాలేదని మండిపడ్డారు.