
నేడు జగన్ రాక
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం నగరానికి రానున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు.
మిరియాల కుటుంబ సభ్యులను పరామర్శించనున్న వైఎస్సార్‌సీపీ అధినేత
పెదవాల్తేరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం నగరానికి రానున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు విమానంలో నగరానికి వస్తారని చెప్పారు. విమానాశ్రయం నుంచి చైతన్యనగర్‌లోని కాపునాడు వ్యవస్థాపక అధ్యక్షుడు మిరియాల వెంకటరావు నివాసానికి చేరుకుంటారు. మిరియాల వెంకటరావు ఆదివారం కన్నుమూసిన నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులను మంగళవారం పరామర్శిస్తారు. సాయంత్రం తిరుగు ప్రయాణమవుతారని అమర్‌నాథ్ తెలిపారు.