Miriyala Venkata Rao
-
కాపులను బీసీల్లో చేర్చడం ఖాయం
మిరియాల సంస్మరణ సభలో ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప సాక్షి, హైదరాబాద్: సామాజికంగా వెనుక బడిన కాపు వర్గాలను బీసీల జాబితాలో చేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. ఇటీవల మరణించిన ప్రముఖ పోరాట యోధుడు, కాపు సామాజిక వర్గ నేత మిరియాల వెంకట్రావు సంస్మరణ సభ.. మిరి యాల ఆశయ సాధనకమిటీ సారథ్యంలో కాపు ఎడ్యుకేషన్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు ముత్తంగి గోపాలకృష్ణ అధ్యక్షతన ఆదివారం ఇక్కడ జరిగింది. ఈ సభలో రాజప్ప మాట్లాడుతూ 1966 వరకు కాపులు బీసీల్లోనే ఉన్నారని గౌరవానికి భంగమని ఆనాటి పెద్దలు భావించడంతో హోదాను మార్చారని అన్నారు. కాపులను బీసీల్లో చేర్చేందుకు మిరియాల అలుపెరుగని పోరాటం చేశారని ఆయన ఆశయాలకు కట్టుబడి ఉన్నామన్నారు. ఏపీ విద్యా శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, బీజేపీ ఎమ్మె ల్యే కిషన్‌రెడ్డి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మిరియాల జీవన శైలి, చరిత్రను తెరపై దృశ్య రూపం ప్రదర్శించారు. కాంగ్రెస్ నేతలు కేశవరావు, మర్రి శశిధర్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ కె. లక్ష్మణ్, అనకాపల్లి ఎంపీ ఎ. శ్రీనివాస్, ఐటీ కమిషనర్ పీవీ రావు, ఐఏఎస్‌లు రామాంజనేయులు, సామ్యూ ల్, రిటైర్డు ఐపీఎస్ ఆంజనేయరెడ్డి పాల్గొన్నారు. -
ఓ మంచివ్యక్తిని కోల్పోయాం
విశాఖపట్నంలో మిరియాల కుటుంబ సభ్యులను ఓదార్చిన జగన్ విశాఖపట్నం: మిరియాల వెంకటరావు మృతితో రాష్ట్రం ఓ మంచి వ్యక్తిని కోల్పోయింది. కాపు సామాజికవర్గం బలమైన నేతను కోల్పోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. ఆదివా రం మృతి చెందిన కాపునాడు వ్యవస్థాపక అధ్యక్షుడు మిరియాల వెంకటరావు కుటుంబ సభ్యులను ఆయన మంగళవారం పరామర్శించారు. హైదరాబాద్‌నుంచి సాయంత్రం 4గంటలకు విశాఖపట్నం చేరుకున్న జగన్ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా చైతన్యనగర్లోని మిరియాల నివాసానికి వెళ్లారు. మిరియాల చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం మిరియాల సతీమణి ప్రమీల, కుమారుడు శేషగిరిబాబు, ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. కాపు సామాజికవర్గంతోపాటు అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి మిరియాల వెంకటరావు విశేష కృషి చేశారని కొనియాడారు. వెంకటరావు సతీమణి ప్రమీల మాట్లాడుతూ... కాపులను బీసీల్లో చేర్చాలన్న ఆయన ఆశయం తీరకుండానే వెళ్లిపోయారని కన్నీటిపర్యంతమయ్యారు. మిరియాల కుటుంబానికి తాను, పార్టీ అండగా ఉంటామని జగన్ భరోసా ఇచ్చారు. మిరియాల కుటుంబాన్ని పరామర్శించినవారిలో పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యేలు సుజయ్‌కృష్ణ రంగారావు, బూడి ముత్యాల నాయుడు, గిడ్డి ఈశ్వరి, కంబాల జోగులు, ఎమ్మెల్సీ సూర్యనారాయణ రాజు, మాజీ ఎమ్మెల్యేలు బలిరెడ్డి సత్యారావు, తైనాల విజయ్‌కుమార్, మళ్ల విజయ్‌ప్రసాద్, గొల్ల బాబూరావు,చెంగల వెంకట్రావు, కర్రి సీతారాం, కరణం ధర్మశ్రీ, ధర్మాన కృష్ణదాస్, పిరియా సాయిరాజ్, తదితరులు పాల్గొన్నారు. -
మిరియాల కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
-
మిరియాలకు అంతిమ వీడ్కోలు
విశాఖపట్నం : కాపునాడు వ్యవస్థాపక అధ్యక్షుడు మిరియాల వెంకటరావు పార్ధివదేహానికి అశేష జనవాహిని మధ్య అంతిమ వీడ్కోలు పలికారు. ప్రముఖులు, అభిమానులు పెద్ద సంఖ్యలో మిరియాల నివాసానికి చేరుకుని ఆయన భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. చైతన్యనగర్లోని ఆయన నివాసానికి సోమవారం ఉదయం నుంచే పెద్ద ఎత్తున కాపు సామాజికవర్గ నేతలు, అభిమానులు చేరుకున్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ కంభంపాటి హరిబాబు, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్లు మిరియాల వెంకటరావు నివాసానికి చేరుకుని ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. మిరియాల భార్య ప్రమీల, కుమారుడు శేషగిరిబాబు, కుమార్తె స్వాతిలను పరామర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఫోన్లో మిరియాల కుటుంబ సభ్యులను పరామర్శించారు. మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు మిరియాల నివాసానికి చేరుకుని ఆయన పార్ధివదేహానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన కుమారుడు శేషగిరిబాబుకు పరామర్శించి ధైర్యం చెప్పారు. ఉప ముఖ్యమంత్రి చిన్నరాజప్ప, మంత్రులు నారాయణ, అయ్యన్నపాత్రుడు, మాణిక్యాలరావు,ఎమ్మెల్సీ చైతన్యరాజు, మాజీ మంత్రులు వట్టి వసంతకుమార్, బాలరాజు, వైఎస్సార్సీపీ నేతలు కొత్తపల్లి సుబ్బరాయుడు, జ్యోతుల నెహ్రూ, కరణం ధర్మశ్రీ, కోరాడ రాజబాబు, తోట రాజీవ్, పసుపులేటి ఉషాకిరణ్, మాజీ ఎమ్మెల్యే నాని, సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ, వీజేఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు పార్టీలకతీతంగా ఎందరో నాయకులు మిరియాలకు నివాళులర్పించారు. మిరియాల ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు. పలువురు నేతలు మాట్లాడుతూ మిరియాల మరణం రాష్ట్రానికే తీరని లోటన్నారు. కాపు సామాజికవర్గ ఉద్యమ నేతగా ఎన్నో కార్యక్రమాలను ముందుండి నడిపారన్నారు. అంతిమయాత్ర కుటుంబ సభ్యులు, అభిమానుల కన్నీటి సంద్రంతో మిరియాల అంతియ యాత్ర సాగింది. చైతన్యనగర్ నుంచి కేఆర్ఎం కాలనీ హిందూ శ్మశాన వాటిక వరకు అభిమానులతో ఈ యాత్ర సాగింది. కాపు సామాజికవర్గ పెద్ద దిక్కును కోల్పోయామని ఆ సామాజికవర్గ ప్రజలు విలపించారు. దారి పొడుగున మిరియాల సేవలను తలచుకుని కన్నీటిపర్యంతమయ్యారు. మిరియాల ఇక లేరనే ఆలోచనే తట్టుకోలేకపోతున్నామని కంటతడిపెట్టారు. అశేష జనవాహిని వెంటరాగా కుమారుడు శేషగిరిబాబు తండ్రి దహన సంస్కారాలు నిర్వహించారు. మిరియాల మృతికి టీఎస్ఆర్ ప్రగాఢ సంతాపం కాపునాడు వ్యవస్థాపక అధ్యక్షుడు మిరియాల వెంకటరావు మృతి పట్ల రాజ్యసభ్యుడు టి.సుబ్బిరామిరామిరెడ్డి ఒక ప్రకటనలో ప్రగాఢ సంతాపం తెలిపారు. రాష్ట్రంలో కాపు, తెలగ, బలిజ తదితర సామాజిక వర్గాల అభివృద్ధికి మిరియాల చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. మంచి నాయకత్వ లక్షణాలు కలిగిన మిరియాల నేతలకు ఆదర్శనీయమన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. -
నేడు జగన్ రాక
మిరియాల కుటుంబ సభ్యులను పరామర్శించనున్న వైఎస్సార్సీపీ అధినేత పెదవాల్తేరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి మంగళవారం నగరానికి రానున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు విమానంలో నగరానికి వస్తారని చెప్పారు. విమానాశ్రయం నుంచి చైతన్యనగర్లోని కాపునాడు వ్యవస్థాపక అధ్యక్షుడు మిరియాల వెంకటరావు నివాసానికి చేరుకుంటారు. మిరియాల వెంకటరావు ఆదివారం కన్నుమూసిన నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులను మంగళవారం పరామర్శిస్తారు. సాయంత్రం తిరుగు ప్రయాణమవుతారని అమర్నాథ్ తెలిపారు. -
కాపు నాయకుడు మిరియాల వెంకట్రావు మృతి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు నాయకుడు మిరియాల వెంకట్రావు(73) ఆదివారం తుది శ్వాస విడిచారు. గత కొన్నిరోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతున్న వెంకట్రావును ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఈ రోజు మధ్యాహ్న సమయంలో చికిత్స పొందుతూ వెంకట్రావు మృతి చెందారు. గతంలో ఆయన హస్తకళల కార్పోరేషన్ కు చైర్మన్ గా పని చేశారు. వెంకట్రావు మృతి పట్ల పలువురు కాపు సంఘ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
సీమాంధ్రను శాసించేది కాపులే: గంటా
విశాఖపట్నం: రానున్న రోజుల్లో సీమాంధ్రను శాసించేది కాపు కులస్తులేనని మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రలో రానున్న రోజుల్లో కాపులే అధికారం చేపడతారని ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ కాపు, తెలగ, బలిజ, ఒంటరి, మున్నారు, తూర్పుకాపు, మిరియాల వెంకట్రావు సన్మాన ఆహ్వానసంఘం సంయుక్త ఆధ్వర్యంలో బీచ్‌రోడ్డులోని వైఎంసీఏలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ కాపునాడు చైర్మన్ మిరియాల వెంకట్రావును సన్మానించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథి మంత్రి గంటా మాట్లాడుతూ తాను కాపు కులంలో పుట్టడం వల్లే ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా రాజకీయ రంగంలో వివిధ హోదాల్లో పనిచేయగలిగానని, అలాంటి కాపు కులాన్ని బీసీల్లో చేర్చేందుకు శాయశక్తులా కృషి చేస్తానన్నారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ రాష్ట్రంలో సగం వంతు ఉన్న కాపుల్ని బీసీల్లో చేర్చేవరకు ప్రతిపక్షం తరఫున శాసనసభలో పోరాడతానన్నారు. కాపునాడు రాష్ట్ర గౌరవాధ్యక్షుడు హనుమంతరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి మాణిక్యాలరావు, ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్‌బాబు, తోట త్రిమూర్తులు, వరుపుల సుబ్బారావు, ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, ఆప్కో వైస్ చైర్మన్ రత్నం, కాపు సంఘం నేతలు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మిరియాలను గజమాల, బంగారు కంకణంతో సత్కరించారు. సమావేశానికి రాలేకపోయిన డిప్యూటీ సీఎం చినరాజప్ప విమానం దిగిన వెంటనే నేరుగా మిరియాల వెంకట్రావు ఇంటికివెళ్లి ఆయన్ను సత్కరించారు.