హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు నాయకుడు మిరియాల వెంకట్రావు(73) ఆదివారం తుది శ్వాస విడిచారు. గత కొన్నిరోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతున్న వెంకట్రావును ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఈ రోజు మధ్యాహ్న సమయంలో చికిత్స పొందుతూ వెంకట్రావు మృతి చెందారు. గతంలో ఆయన హస్తకళల కార్పోరేషన్ కు చైర్మన్ గా పని చేశారు. వెంకట్రావు మృతి పట్ల పలువురు కాపు సంఘ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.