
ఫైల్ ఫోటో
సాక్షి, విశాఖపట్నం: దావోస్ సదస్సు ద్వారా ఏపీకి పెట్టుబడులు వస్తాయని ఐటీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖలో జరిగిన ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ నాలుగు విమానాల నుంచి 64 విమానాల స్థాయికి ఎదిగిందన్నారు. 18 లక్షలు మంది ప్రయాణికులు పోకలు సాగిస్తున్నారన్నారు. మలేసియా, బ్యాంకాక్, సింగపూర్‌లకు విమాన సర్వీసులు పునరుద్ధరణ జరుగుతోందన్నారు. జులై నుంచి విశాఖ-కోలంబో మధ్య విమాన సర్వీసులు ప్రారంభమవుతాయన్నారు.
చదవండి: ఏది నిజం: ఐదేళ్ల లూటీ ఆగిందనా మంట.. రామోజీ?
దావోస్‌లో 18 అంశాలపై సదస్సు జరుగుతుందని, వీటిలో 10 అంశాలు ప్రాధాన్యతగా ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు చేస్తోందన్నారు. వ్యవసాయం, పర్యాటకం, విద్య, వైద్య, ఆర్థిక అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. బీచ్ ఐటీ అనే నినాదంతో ఐటి రంగాన్ని అభివృద్ధి చేస్తామని.. వైఎస్సార్ హయాంలో విశాఖలో ఐటికి బీజం పడిందని వివరించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో మరింత ప్రగతి సాధిస్తోందని, బీచ్ ఐటి నినాదం విశాఖకు కలిసి వస్తుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment