YSRCP MLA Gudivada Amarnath Slams Over TDP Leader Chandhrababu Naidu - Sakshi
Sakshi News home page

'చంద్రబాబుకు విశాఖలో అడుగుపెట్టే హక్కే లేదు'

Published Sat, Mar 6 2021 5:38 PM | Last Updated on Sat, Mar 6 2021 7:14 PM

MLA Gudiwada Amarnath Fires On Chandrababu Naidu - Sakshi

సాక్షి,విశాఖ: టీడీపీ నేతలకు విశాఖ ప్రజలను ఓట్లు అడిగే హక్కు లేదని ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌  మండిపడ్డారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే కోర్టుకు వెళ్లి అడ్డుకుంటున్నారని, టీడీపీపై ప్రజలకు ఎప్పుడో నమ్మకం పోయిందన్నారు. ఏపీకి తండ్రీకుమారుల శని పట్టుకుందని, లోకేష్‌ అడ్డదారిలో మంత్రి అయ్యారని ధ్వజమెత్తారు. 'కుప్పం నియోజకవర్గం ప్రజలే చంద్రబాబును నమ్మలేదు, చంద్రబాబుకు ప్రజలు ఎందుకు ఓటు వేయాలి' అని ప్రశ్నించారు. 

రాష్ట్ర ప్రజలను ఓట్లు అడిగే హక్కు చంద్రబాబుకు లేదని, విశాఖ ప్రజలకు చంద్రబాబు ఏమీ చేయలేదని పేర్కొన్నారు. విశాఖను చంద్రబాబు వాడుకున్నారు తప్ప.. అభివృద్ధి చేసిందేమీ లేదని మండిపడ్డారు. చంద్రబాబుకు విశాఖ ఉపయోగపడింది తప్ప..విశాఖకు చంద్రబాబు ఎన్నడూ ఉపయోగపడలేదని ఆరోపించారు. చంద్రబాబుకు విశాఖలో అడుగుపెట్టే హక్కే లేదని, చంద్రబాబు చెప్పే అబద్ధాలను ప్రజలు నమ్మవద్దని తెలిపారు. విశాఖకు అండగా నిలబడేది సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని, విశాఖకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకొచ్చేది సీఎం జగనేనని పేర్కొన్నారు. 

చదవండి : (మళ్లీ చెంప చెళ్లుమనిపించిన బాలయ్య)
(చంద్రబాబుకు భారీ షాక్‌.. గో బ్యాక్‌ అంటూ నిరసన)





 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement