
న్యూఢిల్లీ: బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించటంపై కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బుధవారం రాత్రి సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రాను కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ నేతృత్వంలోని కాంగ్రెస్ సభ్యుల బృందం కలిసింది. కర్ణాటక గవర్నర్ నిర్ణయం చాలా తీవ్రమైన అంశమని.. దీనిని బుధవారం అర్ధరాత్రే విచారణకు స్వీకరించాలని సీజేఐ కోరింది. గురువారం ఉదయం యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేయనున్నందున.. తక్కువ సమయం కారణంగా అత్యవసర విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేసింది. అనంతరం సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ కార్యాలయం చేరుకున్న కాంగ్రెస్ బృందం.. ఈ కేసును రిజిస్టర్ చేసింది. ‘కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుచేయటం అనైతికం, రాజ్యాంగ విరుద్ధం. అక్రమంగా బీజేపీ గద్దెనెక్కడం దారుణం’ అని వ్యాఖ్యానించింది.
Comments
Please login to add a commentAdd a comment