deepak mishra
-
గవర్నర్ కు ఫిర్యాదు..ప్రధాన ముద్దాయి చంద్రబాబు
-
దీపక్ మిశ్రా పై మోపిదేవి ఫైర్
-
టీడీపీతో కుమ్మక్కు.. ఏపీ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రాపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, విజయవాడ: ఏపీ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా అక్రమాలపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. టీడీపీ నేతలతో కుమ్మక్కై తెరవెనుక కథ నడిపినట్టు దీపక్ మిశ్రాపై ఆరోపణలు ఉన్నాయి. డీజీపి హరీష్ కుమార్ గుప్తా, ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు వైఎస్సార్సీపీ ఫిర్యాదులు చేసింది. పోలింగ్ రోజు టీడీపీ కూటమికి మద్దతుగా వ్యవహరించాలని పోలీసు అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చినట్లు ఫిర్యాదులో వైఎస్సార్సీపీ నేతలు పేర్కొన్నారు.పోలింగ్ కు మూడు రోజుల ముందు విజయవాడలో టీడీపీ నేత విష్ణువర్ధనరావు ఇచ్చిన పార్టీకి దీపక్ మిశ్రా హాజరైనట్లు గుర్తించారు. ఆ తర్వాత నుండి భారీగా పోలీసు అధికారుల మార్పులు జరగటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాచర్ల, గురజాలలో రాత్రికి రాత్రే సీఐలు, ఎస్ఐలను మార్చేశారు.చివరికి సీఎం జగన్ పై జరిగిన హత్యాయత్నం కేసులో కూడా జోక్యం చేసుకున్నట్లు వైఎస్సార్సీపీ చెబుతోంది. ఆ మేరకు ఆధారాలు కూడా ఉన్నాయని వైసీపి నేతలు తెలిపారు. కేసులోని A2 నిందితుడిని అరెస్టు చేయవద్దని విచారణ అధికారిపై ఒత్తిడి తెచ్చినట్లు వైఎస్సార్సీపీ పేర్కొంది. ఆధారాలను సేకరించి డీజీపి, ఈసీలకు వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. -
మాజీ సీజేఐ మిశ్రాపై బయటి ఒత్తిళ్లు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాపై రిటైర్డ్ జస్టిస్ కురియన్ జోసెఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పటి సీజేఐ జస్టిస్ మిశ్రా బాహ్య శక్తుల ఒత్తిడికి లోబడి పనిచేశారని, దీని ప్రభావం న్యాయవ్యవస్థ పరిపాలనపై పడిందని పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘అప్పటి సీజేఐ కొన్ని బాహ్య శక్తుల ప్రభావానికి లోబడి పనిచేశారు. ఆయన రిమోట్ కంట్రోల్ నియంత్రణలో ఉన్నారు’ అని పేర్కొన్నారు. అయితే, ఆ వెలుపలి శక్తి రాజకీయ పార్టీనా లేక ప్రభుత్వమా అనే విషయం వివరించేందుకు, ఏఏ కేసుల కేటాయింపులో సీజేఐ ఏకపక్షంగా వ్యవహరించారో తెలిపేందుకు ఆయన నిరాకరించారు. దీనిపై ఆధారాలున్నాయా అని ప్రశ్నించగా.. సుప్రీంకోర్టులోని అందరు జడ్జీలు ఇదే నమ్మకంతో ఉన్నారని జస్టిస్ కురియన్ బదులిచ్చారు. సీజేఐ జస్టిస్ మిశ్రా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారన్న విషయం స్పష్టమయ్యాకే తాము మీడియా సమావేశం ఏర్పాటు చేశామన్నారు. జడ్జి బీహెచ్ లోయా మృతి వంటి కీలక కేసు కేటాయింపు కూడా అసంతృప్తికి కారణమా అని ప్రశ్నించగా ఫలానా విషయమంటూ ప్రత్యేకంగా చెప్పలేనన్నారు. కేసుల కేటాయింపుతోపాటు సుప్రీంకోర్టు పరిపాలన సంబంధిత అంశాలు కారణమని వివరించారు. కీలకమైన సొహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ కేసును విచారిస్తున్న జడ్జి బీహెచ్ లోయా 2014లో నాగపూర్‌లో గుండెపోటుతో చనిపోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కూడా నిందితుడిగా ఉన్నారు. జడ్జి బీహెచ్ లోయా మృతిపై తిరిగి దర్యాప్తు జరిపించాలంటూ దాఖలైన పలు పిటిషన్లను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు ఆయనది సహజ మరణమేనని స్పష్టం చేసింది. జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలో సుప్రీంకోర్టు పనితీరు మెరుగైందనీ, న్యాయవ్యవస్థ స్వతంత్రతపై నమ్మకం ఏర్పడిందని చెప్పారు. -
‘సుప్రీం’ సరైన దిశలో సాగలేదు
న్యూఢిల్లీ: మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలో సుప్రీంకోర్టు కార్యకలాపాలు సరైన దిశలో సాగలేదని మాజీ జడ్జి జస్టిస్ కురియన్ జోసెఫ్ అన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే నలుగురు జడ్జీలు జస్టిస్ దీపక్ మిశ్రాకు వ్యతిరేకంగా మీడియా సమావేశం నిర్వహించాల్సి వచ్చిందని తెలిపారు. శుక్రవారం పదవీ విరమణ పొందిన ఆయన వార్తా సంస్థ ఏఎన్‌ఐకిచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు చెప్పారు. ‘కోర్టు పనితీరుకు సంబంధించిన ఎన్నో విషయాల్ని జస్టిస్ మిశ్రా దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. అందుకే ఇక ప్రజల్లోకి వెళ్లడం మినహా మరో మార్గం లేదని నిర్ణయించుకునే మీడియా సమావేశం నిర్వహించాం’ అని ఆయన వెల్లడించారు. అత్యున్నత న్యాయస్థానంలో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి? అని ప్రశ్నించంగా..క్రమంగా మార్పు వస్తోందని తెలిపారు. అత్యున్నత న్యాయ వ్యవస్థపై వచ్చిన అవినీతి అరోపణలన్నీ నిరాధారమని కొట్టిపారేశారు. -
జస్టిస్ జోసెఫ్ పదవీ విరమణ
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: భారత సుప్రీంకోర్టులో మూడో సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ గురువారం పదవీవిరమణ చేశారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టులోని ప్రముఖ న్యాయమూర్తుల్లో జస్టిస్ జోసెఫ్ ఒకరని సుప్రీం బార్ అసోసియేషన్ సభ్యులు ప్రశంసించారు. ఈ ఏడాది జనవరిలో బెంచ్‌లకు కేసుల కేటాయింపులో అప్పటి సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా వ్యవహారశైలిని వ్యతిరేకిస్తూ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ జె.చలమేశ్వర్, జస్టిస్ మదన్.బి.లోకూర్‌తో కలిసి జస్టిస్ జోసెఫ్ మీడియా సమావేశాన్ని ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. ట్రిపుల్ తలాక్ రాజ్యాంగవిరుద్ధమనీ, చెల్లదని ప్రకటించిన ధర్మాసనంలో జోసెఫ్ ఉన్నారు. కొలీజియం సిఫార్సులపై కేంద్రం నిర్ణయం తీసుకోకపోవడంపై, తాజ్‌మహల్ పరిరక్షణపై జస్టిస్ జోసెఫ్ చాలాసార్లు బహిరంగ లేఖలు రాశారు. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో జడ్జీల నియామకానికి కేంద్రం తీసుకొచ్చిన నేషనల్ జ్యూడీషియల్ అపాయింట్మెంట్స్ కమిటీ చట్టాన్ని జస్టిస్ జోసెఫ్ బెంచ్ కొట్టివేసింది. 1,035 తీర్పులతో టాప్–10 సుప్రీం జడ్జీల జాబితాలో పదో స్థానం దక్కించుకుని జస్టిస్ జోసెఫ్ అరుదైన ఘనత సాధించారు. కాగా, ఉన్నత న్యాయస్థానాలు యువ న్యాయవాదులను జడ్జీ బాధ్యతలు స్వీకరించేలా ఆకర్షించలేకపోతున్నాయని సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ వ్యాఖ్యానించారు. కేరళ నుంచి మొదలైన ప్రస్థానం.. జస్టిస్ జోసెఫ్ కేరళలో 1953, నవంబర్ 30న జన్మించారు. ఆయన తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని ఎర్నాకులం జిల్లాలోని సెయింట్ జోసెఫ్ స్కూలులో పూర్తిచేశారు. అనంతరం తిరువనంతపురంలోని కేరళ లా అకాడమీ లా కాలేజీలో న్యాయశాస్త్రంలో డిగ్రీని అందుకున్నారు. కేరళ హైకోర్టులో 1979లో ప్రాక్టీసును ప్రారంభించిన ఆయన, 1994లో అక్కడే అదనపు అడ్వొకేట్ జనరల్‌గా నియమితులయ్యారు. ఆరేళ్ల అనంతరం జస్టిస్ జోసెఫ్ కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2010, ఫిబ్రవరి 8 నుంచి 2013 మార్చివరకూ హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. 2013, మార్చి8న సుప్రీంకోర్టు జడ్జీగా జోసెఫ్ పదోన్నతి పొందారు. -
విలక్షణ న్యాయమూర్తి
-
అందరివాడు అయ్యప్ప
-
వారి అరెస్టుపై 2:1 మెజారిటీతో సుప్రీం తీర్పు
న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని భీమా–కోరేగావ్ అల్లర్ల కేసుకు సంబంధించి హక్కుల కార్యకర్తలు వరవరరావు, సుధా భరద్వాజ్, అరుణ్ ఫెరీరా, గౌతమ్ నవలఖ, వెర్మన్ గంజాల్వెజ్‌లను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటనలో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ అరెస్టుల వ్యవహారంపై సమగ్ర విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) నియమించాలన్న విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఐదుగురు హక్కుల కార్యకర్తలను విడుదల చేయాల్సిన అవసరం లేదని సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల త్రిసభ్య ధర్మాసనం 2:1 మెజారిటీతో శుక్రవారం తీర్పు ఇచ్చింది. తమ నిర్ణయంపై అప్పీలు చేసుకునేందుకు హక్కుల కార్యకర్తలకు ప్రస్తుతమున్న గృహనిర్బంధాన్ని 4 వారాల పాటు పొడిగించింది. ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్‌లు తీర్పునిస్తూ తమ కేసును ఎవరు విచారించాలో ఎంచుకునే అధికారం నిందితులకు ఉండదని తేల్చారు. అసమ్మతి, రాజకీయ భిన్నాభిప్రాయం కారణంగా పోలీసులు ఈ అరెస్టులు చేపట్టలేదనీ, నిందితులకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయన్నారు. ఆధారాలను పరిశీలించామనీ, విచారణ సందర్భంగా ఏదో ఒకపక్షం వైపు తాము ప్రభావితమయ్యే అవకాశమున్నందున వాటి లోతుల్లోకి వెళ్లలేదని పేర్కొన్నారు. గతేడాది డిసెంబర్ 31న మహారాష్ట్రలోని పుణె సమీపంలో దళిత సంఘాలు ‘ఎల్గర్ పరిషత్’ పేరుతో సమావేశం నిర్వహించాయి. సదస్సు అనంతరం అక్కడి భీమా–కోరేగావ్ ప్రాంతంలో హింస చెలరేగింది. ఈ ఘటనకు సంబంధించి పుణె పోలీసులు గత నెల 28న ఐదుగురిని అరెస్ట్ చేశారు. దీంతో వీరిని విడుదల చేసి, అరెస్టులపై సిట్ ఏర్పాటు చేయాలంటూ చరిత్రకారిణి రొమీలా థాపర్‌తో పాటు కొందరు సుప్రీంను ఆశ్రయించారు. దీంతో ఐదుగురిని గృహనిర్బంధంలో ఉంచాలని సుప్రీం ఆదేశించింది. తీర్పును స్వాగతించిన బీజేపీ.. దేశానికి వ్యతిరేకంగా, ప్రధాని మోదీ హత్యకు అర్బన్ నక్సల్స్ పన్నిన కుట్రను పోలీసులు విజయవంతంగా ఛేదించారని మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ అన్నారు. గృహనిర్బంధం పూర్తయ్యాక వీరి కస్టడీ కోసం కోర్టుకెళతామన్నారు. ఈ ఐదుగురికి మద్దతు ఇచ్చి జాతీయ భద్రతతో చెలగాటమాడిన కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సిగ్గుతో తలదించుకోవాలని బీజేపీ విమర్శించింది. వీరికి మద్దతు ఇచ్చినందుకు రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. అసమ్మతి గొంతు నొక్కేస్తున్నారు ఇద్దరు న్యాయమూర్తుల అభిప్రాయంతో జస్టిస్ డీవై చంద్రచూడ్ విభేదించారు. ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ప్రభుత్వం అసమ్మతి గొంతును నొక్కేసేందుకు ప్రయత్నిస్తోందని తన తీర్పులో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసమ్మతి, భిన్నాభిప్రాయం అసలైన ప్రజాస్వామ్యానికి సూచిక అని వ్యాఖ్యానించారు. ఈ కేసులో పూర్తిస్థాయిలో, సరైన విచారణ జరపకుండా ఈ ఐదుగురిని వేధిస్తే భారత రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛా హక్కుకు అర్థం లేకుండా పోతుందని అభిప్రాయపడ్డారు. మావోయిస్టులు రాసుకున్నట్లు భావిస్తున్న లేఖలను మహారాష్ట్ర పోలీసులు మీడియాకు ఉద్దేశపూర్వకంగా విడుదల చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిష్పాక్షిక విచారణపై అనుమానాలు తలెత్తేలా పోలీస్ అధికారులు వ్యవహరించారని దుయ్యబట్టారు. ఈ కేసులో సిట్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరముందనీ, విచారణను సుప్రీంకోర్టు పర్యవేక్షించాలని తన 43 పేజీల తీర్పులో జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో అసమ్మతి అన్నది ప్రెజర్ కుక్కర్‌కు ఉన్న సేఫ్టీ వాల్వ్ లాంటిదనీ, దాన్ని పోలీస్ బలంతో అణిచివేయలేరని పునరుద్ఘాటించారు. ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసేలా పోలీసులు మీడియాను వాడుకోవడం ద్వారా విచారణ నిష్పాక్షికత దెబ్బతింటుందనీ, కేసుల్లో దోషులెవరో నిర్ధారించి తీర్పు చెప్పేందుకు పోలీసులు న్యాయమూర్తులు కాదని వ్యాఖ్యానించారు. ఐదుగురు హక్కుల కార్యకర్తలు ప్రధాని మోదీ హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదు చేయలేదనీ, కొత్తగా కేసును రిజస్టర్ చేయని విషయాన్ని ముగ్గురు జడ్జీలు తీర్పులో ప్రస్తావించారు. జస్టిస్ డీవై చంద్రచూడ్ -
శబరిమలలో మహిళల ప్రవేశంపై సంచలన తీర్పు
న్యూఢిల్లీ: శతాబ్దాల నాటి సంప్రదాయాన్ని పక్కనబెడుతూ అన్ని వయసుల స్త్రీలకు శబరిమల ఆలయంలోకి ప్రవేశం కల్పించాలని సుప్రీంకోర్టు శుక్రవారం సంచలన తీర్పును వెలువరించింది. రుతుస్రావాన్ని కారణంగా చూపుతూ ప్రస్తుతం 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు శబరిమల ఆలయంలోకి అనుమతించకపోవడం రాజ్యాంగానికి విరుద్ధం, అక్రమమని ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పులో వెల్లడించింది. ఐదుగురు సభ్యుల బెంచ్ 4:1 మెజారిటీతో ఈ తీర్పు చెప్పింది. జస్టిస్ మిశ్రాతోపాటు జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్‌లు ఆలయంలోకి స్త్రీల ప్రవేశానికి అనుకూలంగా తీర్పునివ్వగా మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఇందూ మల్హోత్రా మాత్రం వారితో విభేదించారు. మతపరమైన ఏ విశ్వాసాలను కొనసాగించాలి, ఏ సంప్రదాయాలను రద్దు చేయాలనేది కోర్టులు నిర్ణయించాల్సిన అంశం కాదని ఆమె తన తీర్పులో పేర్కొన్నారు. రుతుస్రావం అయ్యే వయసులో ఉన్న మహిళలకు ఆలయ ప్రవేశం నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ వచ్చిన పిటిషన్లను విచారించిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించగా.. తాజా తీర్పుపై భిన్న స్పందనలు వెలువడుతున్నాయి. లింగ సమానత్వం కోసం పోరాటంలో ఇదో కీలక విజయమని పలువురు మహిళా సామాజిక కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తుండగా, ఈ తీర్పు దురదృష్టకరమని కొన్ని హిందూ భక్త సంఘాలు, అయ్యప్ప భక్తులు పేర్కొంటున్నారు. తీర్పును అమలు చేస్తామని శబరిమల ఆలయ పరిపాలనను చూసుకునే ట్రావన్‌కోర్ దేవస్థాన మండలి తెలిపింది. భక్తిలో వివక్ష చూపలేం: జస్టిస్ మిశ్రా మహిళలకు ప్రవేశంపై శబరిమల ఆలయం పెట్టిన ఆంక్షలు తప్పనిసరి మత సంప్రదాయాలేమీ కాదనీ, మతం అనేది మనిషిని దైవత్వంతో అనుసంధానించే జీవన విధానమని జస్టిస్ మిశ్రా తన తీర్పులో పేర్కొన్నారు. భక్తిలో వివక్షను చూపలేమనీ, పురుషాధిక్య విధానాలతో ఆధ్యాత్మికతలో లింగ సమానత్వాన్ని పాటించకుండా ఉండలేమన్నారు. ‘ఆయప్ప భక్తులంతా హిందువులే. వారు ప్రత్యేక వర్గమేమీ కాదు. శరీర ధర్మ కారణాల ముసుగులో మహిళలను అణచివేయడం చట్టబద్ధం కాదు. నైతికత, ఆరోగ్యం తదితర కారణాలతో మహిళలను పూజలు చేయకుండా అడ్డుకోలేం. పురుషులు ఆటోగ్రాఫ్‌లు పెట్టేంత ప్రముఖులు అవుతున్నా మహిళలు సంతకం పెట్టే స్థితిలో కూడా లేరు’ అని అన్నారు. అయ్యప్ప భక్తులు ప్రత్యేక వర్గమన్న దేవస్థానం వాదనను జస్టిస్ మిశ్రా తోసిపుచ్చుతూ, ‘అయ్యప్ప భక్తులంటూ ప్రత్యేక వర్గంగా ఎవరూ లేరు. హిందువులెవరైనా శబరిమల ఆలయానికి వెళ్లొచ్చు. ఈ దేశంలోని ఇతర అయ్యప్ప ఆలయాల్లో మహిళలకు ప్రవేశం ఉంది. శబరిమలలో నిషేధమెందుకు? శబరిమల ఆలయం బహిరంగ ప్రార్థన స్థలమే. అయ్యప్పను పూజించేవారు ప్రత్యేక వర్గమేమీ కాదు’ అని స్పష్టం చేశారు. వచ్చే నెల 2న జస్టిస్ మిశ్రా పదవీ విరమణ పొందనుండగా, ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో ఆయన ఇచ్చిన చివరి తీర్పు ఇదే. తనతోపాటు జస్టిస్ ఖన్విల్కర్ తరఫున కూడా జస్టిస్ మిశ్రాయే 95 పేజీల తీర్పును రాశారు. మిగిలిన న్యాయమూర్తులు ఎవరికి వారు తమ తీర్పులు వెలువరించారు. జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ నారిమన్‌లు కూడా జస్టిస్ మిశ్రా అభిప్రాయాలతో తమ తీర్పుల్లో ఏకీభవించారు. రుతుస్రావం అయ్యే వయసులో ఉన్న మహిళలను ఆలయంలోకి అనుమతించకపోవడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 26లకు విరుద్ధమని ఆయన జస్టిస్ నారిమన్ పేర్కొన్నారు. శబరిమల ఆలయ ప్రవేశం విషయంలో మహిళలపై వివక్ష చూపుతున్న కేరళ హిందూ బహిరంగ ప్రార్థనా స్థలాల నిబంధనలు–1965లోని 3(బి) నిబంధనను కూడా కొట్టేయాలని ఆయన అన్నారు. అది అంటరానితనమే: జస్టిస్ చంద్రచూడ్ వయసు, రుతుస్రావం స్థితి ఆధారంగా మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతించకపోవడం అంటరానితనం కిందకే వస్తుందని జస్టిస్ చంద్రచూడ్ తన తీర్పులో పేర్కొన్నారు. అది మహిళ గౌరవానికి భంగం కలిగించడంతోపాటు, పురుషుల కన్నా స్త్రీలు తక్కువనేలా ఉంటుందని అన్నారు. ‘రుతుస్రావం కారణంగా మహిళలు శుభ్రంగా లేరనే కారణం చూపుతూ వారిని గుడిలోకి రానివ్వకపోవడం ఓ రకమైన అంటరానితనమే. రాజ్యాంగంలోని 17వ అధికరణం ప్రకారం అది అక్రమం’ అని చంద్రచూడ్ తన 165 పేజీల తీర్పులో పేర్కొన్నారు. పునః సమీక్ష కోరతాం: అయ్యప్ప ధర్మసేన సుప్రీంకోర్టు తీర్పు దురదృష్టకరమనీ, త్వరలోనే ఈ తీర్పుపై తాము పునఃసమీక్ష కోరతామని అయ్యప్ప ధర్మసేన అధ్యక్షుడు రాహుల్ ఈశ్వర్ చెప్పారు. శబరిమల ఆలయ మాజీ పూజారి మనవడైన రాహుల్ మాట్లాడుతూ ‘మేం తప్పకుండా సుప్రీంకోర్టులో మా పోరాటం కొనసాగిస్తాం. అక్టోబరు 16 వరకు ఆలయం మూసే ఉంటుంది. కాబట్టి అప్పటివరకు మాకు సమయం ఉంది’ అని వెల్లడించారు. మహిళలు సహా పలువురు భక్తులు కూడా తాము విశ్వాసాలను నమ్ముతామనీ, సుప్రీంకోర్టు తీర్పు విచారకరమన్నారు. శబరిమల ఆలయ ప్రధాన అర్చకుడు తాంత్రి కందరారు రాజీవారు మాట్లాడుతూ తీర్పు తనను నిరాశకు గురిచేసినప్పటికీ, కోర్టు ఆదేశాలను అమలు చేయాలని దేవస్థానం నిర్ణయించిందన్నారు. తీర్పును కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ స్వాగతించారు. ఇదొక అద్భుత తీర్పు అనీ, హిందూ మతాన్ని మరింత మందికి చేరువ చేసేందుకు ఉపయోగపడుతుందని ఆమె పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు చరిత్రాత్మకమని కేరళ మత సంస్థల శాఖ మంత్రి సురేంద్రన్ అన్నారు. మహారాష్ట్రలోని శని శింగ్నాపూర్ ఆలయంలోకి కూడా మహిళల ప్రవేశం కోసం గతంలో ఉద్యమం చేపట్టిన తృప్తీ దేశాయ్ తాజా సుప్రీం తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. స్త్రీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులకు అభించిన విజయంగా ఆమె సుప్రీం తీర్పును అభివర్ణించారు. పురుషాధిక్య, అహంకార ఆలయ పాలక మండలికి ఈ తీర్పు చెంపపెట్టు అన్నారు. త్వరలోనే తాను శబరిమల ఆలయాన్ని సందర్శిస్తానని ఆమె చెప్పారు. అవి రెండు పరస్పర విరుద్ధ హక్కులు జస్టిస్ ఇందు మల్హోత్రా దేశంలో లౌకిక వాతావరణం ఉండేలా చేసేందుకు పురాతన విశ్వాసాలను రద్దు చేయాలనుకోవడం సమంజసం కాదని జస్టిస్ ఇందు మల్హోత్రా తన తీర్పులో పేర్కొన్నారు. సమానత్వ హక్కు, అయ్యప్ప స్వామిని పూజించడానికి మహిళలకు ఉన్న హక్కు.. ఈ రెండు పరస్పర విరుద్ధమైనవని ఆమె అన్నారు. ‘ఈ అంశం శబరిమలకే పరిమితంకాదు. ఇతర ఆలయాలపై కూడా దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. శబరిమలలో పూజలు చేయడం ఒక మత సంప్రదాయం. దానిని కాపాడాలి. హేతుబద్ధ భావనలను మతపరమైన విషయాల్లోకి తీసుకురాకూడదు. మత సంప్రదాయాలపై న్యాయసమీక్ష జరగడం సరికాదు. కోర్టులు హేతుబద్ధతను, నైతికతను దేవుణ్ని పూజించే విధానంపై రుద్దలేవు. కొందరిని అనుమతించడం లేదంటే దాని అర్థం వారంతా అంటరానివారని కాదు. ఆలయ సంప్రదాయాలు, నమ్మకాలపై అది ఆధారపడి ఉంటుంది. భారత్‌లో భిన్న మత విధానాలు ఉన్నాయి. ప్రార్థించేందుకు ఉన్న ప్రాథమిక హక్కును సమానత్వ సిద్ధాంతం ఉల్లంఘించజాలదు’ అని ఆమె తన తీర్పులో వెల్లడించారు. సామాజిక రుగ్మతలైన సతీసహగమనం వంటి అంశాల్లో తప్ప, మతపరమైన విశ్వాసాల్ని తొలగించే అధికారం కోర్టులకు లేదని ఆమె అన్నారు. ఈ ఆలయాల్లోనూ నో ఎంట్రీ హరియాణలోని కార్తికేయ ఆలయం, రాజస్తాన్‌లోని రణక్పూర్ గుడి తదితరాల్లోనూ మహిళలను అనుమతించరు. క్రీ.పూ ఐదో శతాబ్దానికి చెందిన కార్తికేయుడి ఆలయం హరియాణాలోని కురుక్షేత్ర జిల్లా పెహోవాలో ఉంది. కార్తికేయుడు బ్రహ్మచారి. అందుకే ఈ ఆలయంలోకి మహిళలు ప్రవేశిస్తే వారిని దేవుడు శపిస్తాడని భక్తుల నమ్మకం. రాజస్తాన్‌లోని పాలి జిల్లాలో ఉన్న జైన ఆలయం రణక్పూర్ గుడిలోకి మహిళలకు ప్రవేశం లేదు. క్రీ.శ. 15వ శతాబ్దంలో నిర్మాణమైన దేవాలయాల సమూహ ప్రాంతమిది. ఈ ఆలయ సముదాయంలోకి రుతుస్రావం అయ్యే వయసులో ఉన్న మహిళల ప్రవేశం నిషిద్ధం. అసోంలోని బార్పెటా పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న హిందూ ఆలయం పట్బౌసి సత్రాలోకి రుతుస్రావమయ్యే స్త్రీలు రాకూడదనే నిబంధన ఉంది. 2010లో అప్పటి అసోం గవర్నర్ జేబీ పట్నాయక్ ఈ ఆలయ అధికారులను ఒప్పించి 20 మంది మహిళలకి ఆలయ ప్రవేశం కల్పించారు. అయితే, ఆ తర్వాత కొన్నాళ్ల పాటు మహిళల్ని అనుమతించినా మళ్లీ నిషేధం విధించారు. తిరువనంతపురంలోని ప్రఖ్యాత పద్మనాభస్వామి ఆలయంలో మహిళలకు ప్రవేశంపై కొన్ని పరిమితులున్నాయి. స్త్రీలు పద్మనాభుడికి పూజలు చేయవచ్చు. కానీ గర్భగుడిలోకి వెళ్లరాదు. వివాదం ఇలా ప్రారంభం 2006లో జ్యోతిష్కుడు ఒకరు ఆలయంలో దేవప్రశ్నం అనే కార్యక్రమాన్ని నిర్వహించి ఎవరో మహిళ ఆలయంలోకి ప్రవేశించిందన్నారు. వెంటనే కన్నడ నటి, ప్రస్తుత కర్ణాటక మంత్రివర్గంలో సభ్యురాలు జయమాల తాను శబరిమల ఆలయంలోకి వెళ్లి అయ్యప్పస్వామి విగ్రహాన్ని తాకినట్లు చెప్పారు.దీంతో శబరిమలలో మహిళల ఆలయ ప్రవేశంపై వివాదం ముదిరింది. ఆ తర్వాత మహిళలకు ప్రవేశం నిరాకరణను సవాల్ చేస్తూ సీనియర్ అడ్వకేట్ ఇందిర జైసింగ్ ఆధ్వర్యంలో మహిళా లాయర్లు కోర్టుకెక్కారు. వందల ఏళ్ల సంప్రదాయాల్ని కాదనే హక్కు కోర్టుకి ఉండదనీ, అలాంటి అంశాల్లో పూజారులదే తుది నిర్ణయమంటూ కేరళ హైకోర్టు తీర్పు చెప్పింది. ఆ తీర్పుని లాయర్ల బృందం సుప్రీం కోర్టులో సవాల్‌చేసింది. శబరిమల ఆలయానికి ప్రాముఖ్యత ఉందనీ, ప్రభుత్వాలు, కోర్టులు జోక్యం చేసుకోకూడదని ట్రావన్‌కోర్ దేవస్థానం బోర్డు వాదించింది. అయ్యప్పస్వామి నైష్టిక బ్రహ్మచారి, అందుకే రుతుస్రావ వయసులో మహిళల్ని రానివ్వడం లేదని చెప్పింది. దీన్ని మహిళలపై వివక్షగా చూడకూడదంది. హిందూమతంలోని వైవి«ధ్యాన్ని అర్థం చేసుకోలేక పిటిషినర్లు దానిని వివక్షగా చూస్తున్నాయని బోర్డు ఆరోపించింది. కొందరు మహిళా భక్తులు బోర్డుకు మద్దతుగా నిలిచారు. శబరిమల కేసు పూర్వాపరాలు... ► 1990: శబరిమల ఆలయంలోకి మహిళలకు ప్రవేశంపై నిషేధాన్ని తొలగించాలంటూ ఎస్.మహేంద్రన్ అనే వ్యక్తి కేరళ హైకోర్టులో పిటిషన్ వేశారు. ► 1991, ఏప్రిల్ 5: కొన్ని వయస్సుల మహిళలపై తరాలుగా కొనసాగుతున్న నిషేధాన్ని సమర్ధిస్తూ కేరళ హైకోర్టు తీర్పునిచ్చింది. ► 2006 ఆగస్టు 4: శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల మధ్య మహిళలకు ప్రవేశం కల్పించాలంటూ ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ పిటిషన్ వేసింది. ► 2007 నవంబర్: పిటిషన్‌కు మద్దతుగా కేరళలోని ఎల్డీఎఫ్ సర్కారు అఫిడవిట్ దాఖలు. ► 2016 ఫిబ్రవరి 6: కేరళ ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. మతాచారాన్ని పాటించే భక్తుల హక్కును పరిరక్షిస్తామని తెలిపింది. ► 2016 ఏప్రిల్ 11: మహిళల ప్రవేశంపై నిషేధం వల్ల స్త్రీ, పురుష సమ న్యాయ భావనకు ప్రమాదం ఏర్పడిందని కోర్టు వ్యాఖ్య. ► 2016 ఏప్రిల్ 13: ఆలయ సంప్రదాయం పేరుతో ప్రవేశాలను అడ్డుకోవడంలో హేతుబద్ధత లేదన్న సుప్రీంకోర్టు. ► 2016 ఏప్రిల్ 21: మహిళలను అనుమతించాలంటూ హింద్ నవోత్థాన ప్రతిష్టాన్, నారాయణాశ్రమ తపోవనమ్ పిటిషన్లు. ► 2016 నవంబర్ 7: అన్ని వయస్సుల మహిళలను అనుమతించాలనే వాదనకు మద్దతు తెలుపుతూ కేరళ అఫిడవిట్ వేసింది. ► 2017 అక్టోబర్ 13: ఈ కేసును రాజ్యాంగ ధర్మాసనానికి సుప్రీంకోర్టు బదిలీ చేసింది. -
అయోధ్య కేసు విచారణకు తొలగిన అడ్డంకులు
-
1994 తీర్పుపై పునఃసమీక్షకు నో
న్యూఢిల్లీ: అయోధ్య రామమందిరం కేసు విషయంలో సుప్రీంకోర్టు చారిత్రక తీర్పునిచ్చింది. 1994 నాటి ఇస్మాయిల్ ఫారుఖీ కేసును విస్తృత ధర్మాసనానికి ఇచ్చేందుకు నిరాకరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం 2:1 మెజారిటీతో గురువారం ఈ తీర్పు చెప్పింది. ఇస్లాం ప్రకారం ప్రార్థనలు చేసేందుకు మసీదు తప్పనిసరి కాదు అని 1994 నాటి తీర్పుపై పునఃవిచారణ జరగదని స్పష్టం చేసింది. ధర్మాసనంలోని సీజేఐ, జస్టిస్ అశోక్ భూషణ్‌లు ఇందుకు మద్దతుగా తీర్పునివ్వగా మరో న్యాయమూర్తి అబ్దుల్ నజీర్ విభేదించారు. పునఃసమీక్ష జరగాల్సిందేనన్నారు. సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో.. అత్యంత సున్నితమైన అయోధ్య కేసు విచారణ వేగవంతం అవడానికి మార్గం సుగమమైంది. అక్టోబర్ 29 నుంచి ఈ కేసులో రోజువారీ విచారణ జరగనుంది. తీర్పుతో బీజేపీ, ఆరెస్సెస్ హర్షం వ్యక్తం చేశాయి. అయోధ్య కేసులోనూ త్వరలో తీర్పు వెలువడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాయి. అటు కాంగ్రెస్ పార్టీ ఆచితూచి స్పందించింది. కోర్టు తీర్పును ఆమోదించాల్సిందేనని పేర్కొంది. ఇది భూసేకరణ వివాదమే 1994లో ఇస్మాయిల్ ఫారూఖీ కేసులో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ ఎం సిద్దిఖీ సుప్రీంను ఆశ్రయించారు. భూ వివాదంలో హైకోర్టు తీర్పును సుప్రీం నిర్ణయం ప్రభావితం చేసిందన్నారు. ఇస్లాం సంప్రదాయం ప్రకారం ప్రార్థనల కోసం మసీదు ముఖ్యమైన ప్రదేశమేమీ కాదనడంపై పునఃసమీక్ష చేయాలని కోరారు. అయోధ్య కేసులోని ప్రధాన కక్షిదారుల్లో ఒకరైన సిద్దిఖీ చనిపోయినా ఆయన వారసులు ఈ కేసును సుప్రీంకోర్టుకు నివేదించారు. దీన్ని 2:1తో ధర్మాసనం తిరస్కరించింది. ‘ఇస్మాయిల్ ఫారుఖీ కేసులో లెవనెత్తిన అంశాలన్నీ భూ సేకరణకు సంబంధించినవేనని పునరుద్ఘాటిస్తున్నాం. అయోధ్య కేసులో విచారణకు సంబంధించి ఇస్మాయిల్ ఫారుఖీ కేసులో పరిగణనలోకి తీసుకున్న అంశాల ప్రభావమేమీ ఉండదు’ అని జస్టిస్ అశోక్ భూషణ్ తమ (సీజేఐతో కలుపుకుని) నిర్ణయాన్ని వెలువరించారు. అయోధ్యలో నెలకొన్న సివిల్ భూ వివాదాన్ని కొత్తగా ఏర్పాటుచేయబోయే ముగ్గురు సభ్యుల బెంచ్ అక్టోబర్ 29 నుంచి విచారిస్తుందన్నారు. అక్టోబర్ 2న ప్రస్తుత సీజేఐ మిశ్రా రిటైర్‌కానున్నారు. 2010లో అలహాబాద్ హైకోర్టు వివాదాస్పద రామజన్మభూమి–బాబ్రీ మసీదు స్థలాన్ని మూడు భాగాలుగా విడగొడుతూ తీర్పు నివ్వడాన్ని సవాల్ చేయడంపైనా కోర్టు వ్యాఖ్యానించింది. మొత్తం 2.77 ఎకరాల స్థలాన్ని మూడు సమాన భాగాలుగా విభజించి.. సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మొహి అఖాడా, రామ్ లల్లాలకు పంచాలని ఆదేశించింది. ప్రభుత్వం అన్ని మతాలను సమదృష్టితో చూడాలని సూచించింది. కాగా దేశానికి మేలు చేసేందుకు అయోధ్య విషయాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అభిప్రాయపడ్డారు. స్వాగతించిన ఆరెస్సెస్ విస్తృత ధర్మాసనానికి అయోధ్య కేసును బదిలీ చేయబోమంటూ సుప్రీం ఇచ్చిన తీర్పును రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) స్వాగతించింది. ఈ వివాదంతో వీలైనంత త్వరగా తీర్పు వచ్చే అవకాశాలున్నాయని విశ్వాసం వ్యక్తం చేసింది. ‘అక్టోబర్ 29 నుంచి ముగ్గురు సభ్యుల ధర్మాసనం శ్రీరామజన్మభూమి కేసును విచారిస్తామని గురువారం సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని మేం స్వాగతిస్తున్నాం. వీలైనంత త్వరగా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందనే విశ్వాసం వచ్చింది’ అని ఓ ప్రకటనలో ఆరెస్సెస్ పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ ఈ వివాదాన్ని మరింతకాలం కొనసాగించాలని చూస్తోందని.. అందుకే త్వరగా నిర్ణయం వెలువడకుండా (2019 ఎన్నికల తర్వాత ఈ వివాదంపై తీర్పు వెలువరించాలన్న కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ పిటిషన్‌ను ప్రస్తావిస్తూ) కుట్ర పన్నిందని ఆరెస్సెస్ నేత ఇంద్రేష్ కుమార్ ఆరోపించారు. పాకిస్తాన్ ఏజెంట్‌గా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందన్నారు. ఇకపై వీరి ప్రయత్నాలేవీ సఫలం కాబోవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తీర్పుకు కట్టుబడే: కాంగ్రెస్ గురువారం నాటి కోర్టు తీర్పుకు అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. ఈ తీర్పుతో అయోధ్య అసలు వివాదంపై విచారణను వేగవంతం చేసేందుకు మార్గం సుగమమైందని పేర్కొంది. ఇన్నాళ్లూ రామమందిరం పేరుతో బీజేపీ దేశ ప్రజలను మోసం చేస్తూ వస్తోందని.. కాంగ్రెస్ నేత ప్రియాంక చతుర్వేది విమర్శించారు. రామమందిర వివాదాన్ని పరిష్కరించడంలో బీజేపీ పాత్ర లేశమాత్రమైనా లేదన్నారు. రామమందిరంపై సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుకు కట్టుబడి ఉంటామని కాంగ్రెస్ పార్టీ మొదట్నుంచీ చెబుతోందని.. ఆచరణలోనూ కట్టుబడి ఉంటామని ఆమె పేర్కొన్నారు. అసలు విచారణ ఇకపైనే.. రామజన్మభూమి – బాబ్రీ మసీదు వివాదంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని.. అది తమకు అనుకూలంగానే ఉందని ఈ కేసులో కక్షిదారులుగా ఉన్న ముస్లింలు పేర్కొన్నారు. ‘ఇస్లాంలో మసీదు అంతర్గత భాగం కాదనే విషయాన్ని 1994లోనే సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీంతో మాకు సంబంధం లేదు. ఇప్పుడు కేసు పూర్తిగా రామజన్మభూమి–బాబ్రీ మసీదు మధ్య స్థల వివాదంపైనే ఉందని సుప్రీం స్పష్టం చేసింది. ఇది సంతోషదాయకం’ అని మౌలానా మహ్ఫుజూర్ రహమాన్ తరపున నామినీగా ఉన్న ఖాలిక్ అహ్మద్ ఖాన్ పేర్కొన్నారు. ‘ఇకపై అయోధ్య–బాబ్రీ కేసు విచారణ మత విశ్వాసాలపై కాకుండా భూ యాజమాన్య హక్కుదారు, యోగ్యత ఆధారంగానే కొనసాగుతుందని సుప్రీంకోర్టు పేర్కొనడం హర్షదాయకం. రెవెన్యూ రికార్డుల ఆధారంగా బాబ్రీ స్థల వివాదంలో మా వాదనలు వినిపిస్తాం. ఏ మందిరాన్నీ ధ్వంసం చేయకుండానే బాబ్రీ మసీదును నిర్మించారనేది మా విశ్వాసం’ అని సున్నీ వక్ఫ్ బోర్డు తరపున కక్షిదారుగా ఉన్న ఇక్బాల్ అన్సారీ తెలిపారు. మిగిలిన కక్షిదారులు కూడా కోర్టు నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. అయోధ్య–బాబ్రీ వివాదమేంటి? భారత్‌లో ఐదు దశాబ్దాలుగా హిందు–ముస్లింల మధ్య ఘర్షణకు అయోధ్య–బాబ్రీ మసీదు వివాదం కారణమవుతోంది. తమ ఆరాధ్య దైవమైన శ్రీరాముడు జన్మించిన పవిత్రస్థలంలో మందిర నిర్మాణం జరగాలని హిందువులు డిమాండ్ చేస్తున్నారు. 2.77 ఎకరాల స్థలంలో భవ్యంగా మందిర నిర్మాణం జరగాలని కోరుతున్నారు. అయితే బాబర్ మసీదు నిర్మించిన ఈ స్థలం తమకే చెల్లుతుందని రామమందిర నిర్మాణం జరపడానికి వీల్లేదని ముస్లింలు వాదిస్తున్నారు. రామజన్మభూమిలో ఆయన విగ్రహాలు పెట్టి.. అక్కడ పూజలకు అనుమతించాలంటూ 1950లో గోపాల్ సిమ్లా, పరమహంస రామచంద్రదాస్‌లు ఫైజాబాద్ కోర్టును ఆశ్రయించారు. దీనికితోడు 1992, డిసెంబర్ 6న కరసేవకులు బాబ్రీ మసీదులోని కొంత భాగాన్ని ధ్వంసం చేయడంతో దేశవ్యాప్తంగా ఇరువర్గాల మధ్య వివాదం మరింత ముదిరింది. ఆ తర్వాత పురాతత్వ శాస్త్రవేత్తలు చేపట్టిన తవ్వకాల్లోనూ మసీదు కింద రామమందిరానికి సంబంధించిన ఆనవాళ్లు బయటపడ్డాయి. దీంతో రామమందిర నిర్మాణానికి హిందూ సంఘాలు, వద్దే వద్దంటూ ముస్లింలు పోటాపోటీగా కోర్టులో పిటిషన్లు వేశారు. దీనిపై అక్టోబర్ 29 నుంచి సుప్రీంకోర్టు రోజూవారి విచారణ చేపట్టనుంది. ‘మసీదు’పై పునఃసమీక్ష: జస్టిస్ నజీర్ ‘అన్ని దేవాలయాలు, మసీదులు, చర్చిలు ఆయా వర్గాలకు చాలా ముఖ్యమైనవి’ అని జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ తన తీర్పులో పేర్కొన్నారు. ఇస్లాం సంప్రదాయం ప్రకారం మసీదు అంత ముఖ్యమైన ప్రదేశం కాదని, ముస్లింలు ఎక్కడైనా నమాజ్ చేసుకోవచ్చన్న 1994నాటి ఇస్మాయిల్ ఫారుఖీ కేసుపై పునఃసమీక్ష జరగాలని తన 42 పేజీల తీర్పులో ఆయన చెప్పారు. సమగ్రమైన విచారణ జరపకుండా నాడు తీర్పుచెప్పారన్నారు. రాజ్యాంగ ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని ‘మసీదు’ వ్యాఖ్యలపై విస్తృత ధర్మాసనంతో పునఃసమీక్ష జరపాలన్నారు. తన తీర్పులో 4 ప్రశ్నలు సంధించారు. ‘1954 షిరూర్ మఠ్ కేసులో మత విశ్వాసాలను పరీక్షించకుండానే తీర్పు వెలువరించారా? ఆవశ్యకమైన మత విశ్వాసాన్ని నిర్ధారించేందుకు పరీక్షలు జరగాలా? ఆర్టికల్ 25కింద ఒక మతానికి సంబంధించిన విశ్వాసాలనే కాపాడాలా? అన్ని మతాలకూ వర్తిస్తుందా? ఆర్టికల్ 15, 25, 26 ప్రకారం అన్ని విశ్వాసాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందా?’ అని ప్రశ్నించారు. బహుభార్యత్వం, నిఖాహలాలా, మహిళా జననాంగాల విచ్ఛిత్తి కేసుల్లో తీర్పులను గుర్తుచేశారు. అయోధ్య స్థల వివాద క్రమమిదీ.. ► 1528: బాబర్ సైన్యాధ్యక్షుడు మిర్ బాకీ బాబ్రీ మసీదును నిర్మించాడు. ► 1885: ఈ స్థలంలో రాముడికి చిన్న పైకప్పు కట్టుకునేందుకు అనుమతివ్వాలని మహంత్ రఘువీర్ దాస్ ఫైజాబాద్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు దీన్ని తిరస్కరించింది. ► 1949: వివాదాస్పద స్థలంలో రామ్ లల్లా విగ్రహాల స్థాపన ► 1959: విగ్రహాలకు పూజ చేసేందుకు అనుమతించాలంటూ నిర్మోహి అఖాడా పిటిషన్ ► 1981: ఈ స్థలాన్ని తమకు అప్పగించాలంటూ యూపీ సున్నీ వక్ఫ్ బోర్డు కేసు ► 1986, ఫిబ్రవరి 1: హిందూ భక్తులకు ప్రవేశాన్ని అనుమతిస్తూ స్థానిక కోర్టు తీర్పు ► 1992, డిసెంబర్ 6: బాబ్రీ మసీదు నిర్మాణం పాక్షికంగా ధ్వంసం ► 1994, అక్టోబర్ 24: ఇస్మాయిల్ ఫారుఖీ కేసు విచారణ సందర్భంగా ఇస్లాంలో మసీదు అంతర్భాగం కాదన్న సుప్రీంకోర్టు ► 2003, మార్చి 13: వివాదాస్పద స్థలంలో ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు జరపొద్దని సుప్రీం ఆదేశం, అలహాబాద్ హైకోర్టుకు కేసు బదిలీ. ► 2010, సెప్టెంబర్ 30: నిర్మోహీ అఖాడా, రామ్ లల్లా, సున్నీ వక్ఫ్ బోర్డులకు వివాదాస్పద భూమిని పంచుతూ హైకోర్టు ఆదేశం. ► 2016, ఫిబ్రవరి 26: రామమందిర నిర్మాణానికి అనుమతించాలంటూ సుబ్రమణ్య స్వామి పిటిషన్ ► 2017, మార్చి 21: కక్షిదారులంతా కోర్టు బయట చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలని నాటి సీజేఐ జస్టిస్ జేఎస్ ఖేహార్ సూచన ► నవంబర్ 20: అయోధ్యలో మందిరం, లక్నోలో భారీ మసీదు నిర్మాణానికి అంగీకరిస్తున్నట్లు సుప్రీంకోర్టుకు వెల్లడించిన షియా వక్ఫ్ బోర్డు. ► 2018, సెప్టెంబర్ 27: ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి కేసును బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు విముఖత. అక్టోబర్ 29 నుంచి రోజువారీ విచారణ చేపట్టనున్నట్లు వెల్లడి. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం అయోధ్యలో ప్రధాన కక్షిదారులు ఇక్బాల్ అన్సారీ, నిర్మోహి అఖాడా మహంత్ ధరమ్ దాస్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ అశోక్ భూషణ్ -
6 రోజుల్లో 8 తీర్పులు
న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ–చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా)గా ఉన్న జస్టిస్ దీపక్ మిశ్రాకు సుప్రీంకోర్టులో మరో ఆరు పనిదినాలే మిగిలున్నాయి. వచ్చే నెల 2న ఆయన పదవీ విరమణ పొందనున్నారు. అత్యధిక రాజ్యాంగ ధర్మాసనాలకు నేతృత్వం వహించిన సీజేఐగా జస్టిస్ మిశ్రా ఘనత వహించారు. స్వలింగ సంపర్కం నేరం కాదంటూ ఐపీసీ సెక్షన్ 377ను రద్దు చేస్తూ జస్టిస్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇప్పటికే ఓ చరిత్రాత్మక తీర్పునిచ్చింది. అయితే మిగిలున్న ఆరు పనిదినాల్లో జస్టిస్ మిశ్రా నేతృత్వంలోని వివిధ ధర్మాసనాలు ఎనిమిది కీలక కేసుల్లో తీర్పులు వెలువరించనున్నాయి. ఆధార్ చెల్లుబాటు నుంచి అయోధ్య కేసు వరకు.. దేశ గతిని మార్చగల ఈ తీర్పులు చెప్పే వివిధ ధర్మాసనాల్లో మొత్తం కలిపి పది మంది న్యాయమూర్తులు పాలుపంచుకోనున్నారు. ఈ నేపథ్యంలో జస్టిస్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనాలు వెలువరించే ఎనిమిది కీలక కేసులేంటో ఓ సారి పరిశీలిద్దాం.. 1. ఆధార్ కేసు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి చిన్న పనికీ ఆధార్ కావాలంటున్న ఈ రోజుల్లో అసలు ఆధార్ కార్డే చెల్లుబాటు కాదనీ, దానికి రాజ్యాం గబద్ధత లేదనీ, వ్యక్తిగత గోప్యత హక్కును ఆధార్ ఉల్లంఘిస్తోందంటూ అనేక పిటిషన్లు వచ్చాయి. హైకోర్టు మాజీ జస్టిస్ కె.పుట్టస్వామి కూడా ఈ పిటిషన్లు వేసిన వారిలో ఉన్నారు. ఈ పిటిషన్లన్నింటినీ కలిపి ఐదుగురు సభ్యుల ధర్మాసనం 40 రోజులపాటు ఏకధాటిగా విచారించి నాలుగున్నర నెలల ముందే తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. ఆ తీర్పు ఈ ఆరు రోజుల్లో వెలువడనుంది. 2. అయోధ్య కేసు వివాదాస్పద రామ జన్మభూమి–బాబ్రీ మసీదుకు చెందిన 2.77 ఎకరాల భూమిని రామ్ లల్లా, సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖాడాల మధ్య సమానంగా పంచుతూ అలహాబాద్ హైకోర్టు గతంలో ఉత్తర్వులిచ్చింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేయలా? వద్దా? అన్న విషయంపై ప్రస్తుత త్రిసభ్య ధర్మాసనం నిర్ణయం ప్రకటించనుంది. 3. పదోన్నతుల్లో రిజర్వేషన్ల కేసు ప్రభ్యుత్వ ఉద్యోగాల పదోన్నతుల్లోనూ ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని సమర్థిస్తూ 2006లో ఎం.నాగరాజ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తుత సీజేఐ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం సమీక్షించనుంది. పదోన్నతుల్లోనూ రిజర్వేషన్లను తొలగించేం దుకు మోదీ ప్రభుత్వం విముఖంగా ఉండగా, తరతరాల నుంచి ఐఏఎస్ అధికారులుగా ఉంటున్నవారి కుటుంబీకులు కూడా రిజర్వేషన్లను ఉపయోగించుకుంటున్నారనీ, అదేమీ వారసత్వ హక్కు కాదని సుప్రీంకోర్టు అంటోంది. 4. శబరిమల ఆలయ ప్రవేశం కేసు 10 నుంచి 50 ఏళ్లలోపు వయసున్న బాలికలు, మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమ తించాలా? వద్దా? అన్న విషయంపై ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు చెప్పనుంది. పలు స్వచ్ఛంద సంస్థలు, మహిళా కార్యకర్తలు స్త్రీలకు కూడా ఆలయ ప్రవేశం కల్పించాలని డిమాండ్ చేస్తుండగా సంప్రదాయవాదులు వ్యతిరేకిస్తుండటం తెలిసిందే. 5. వ్యభిచారం కేసు వ్యభిచారం, వివాహేతర సంబంధం కేసుల్లో మహిళ తప్పు ఉన్నా కూడా ఆమెను నిర్దోషిగా ప్రకటిస్తూ పురుషుడిపై మాత్రమే కేసులు నమోదు చేస్తున్న అంశంపై కూడా సీజేఐ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ తీర్పు వెలువరించనుంది. ఐపీసీ సెక్షన్ 497కు సవరణలు చేసి మహిళపై కూడా కేసులు నమోదు చేసేందుకు కోర్టు అనుమతించే అవకాశం ఉంది. 6. విచారణల ప్రత్యక్ష ప్రసారాల కేసు కోర్టుల్లో జడ్జీలు కేసులను విచారిస్తుండగా ఆ దృశ్యాలను ప్రత్యక్షప్రసారం చేయాలన్న కేసుకు సంబంధించి సీజేఐ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు చెప్పనుంది. న్యాయమూర్తులు సానుకూలంగా స్పందిస్తే ముందుగా సీజేఐ విచారించే కేసులను ప్రయోగాత్మకంగా ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. 7. నేర ప్రజా ప్రతినిధులపై నిషేధం కేసు రాజకీయ నేతలపై ఏదైనా కోర్టు నేరాలు, అభియోగాలు మోపితే.. వారిని ఇకపై రాజకీయాల్లో పోటీ చేయకుండా నిషేధించాలంటూ వచ్చిన ఓ ప్రజాహిత వ్యాజ్యంపై జస్టిస్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు ఇవ్వనుంది. ప్రస్తుతం రాజకీయ నేతలు దోషులుగా తేలితేనే నిషేధం వర్తిస్తుండగా తుది తీర్పులు రావడానికి దశాబ్దాలు గడిచిపోతున్నాయి. 8. లాయర్లుగా ప్రజాప్రతినిధులు.. ప్రస్తుత రాజకీయ నాయకుల్లో చాలా మంది న్యాయవాదులై ఉండి కోర్టుల్లో కేసులు కూడా వాదిస్తున్నారు. న్యాయవాదులుగా ఉన్నవారు పార్లమెంటుకు లేదా శాసనసభలకు ఎన్నికైతే వారికి ప్రభుత్వం వేతనం చెల్లిస్తోందనీ, వారు మళ్లీ సొంత సంపాదన కోసం కోర్టుల్లో కేసులు వాదిస్తూ ప్రజాప్రతినిధులుగా తమ బాధ్యతలు నెరవేర్చడం లేదు కాబట్టి వారు కోర్టులకు వెళ్లకుండా నిలువరించాలంటూ వచ్చిన పిటిషన్‌పై కూడా తీర్పు రానుంది. -
జడ్జీల నియామకం మాకొదిలేయండి: సుప్రీం
న్యూఢిల్లీ: జడ్జీల నియామకం అంశాన్ని తమకు విడిచిపెట్టాలని సుప్రీంకోర్టు పేర్కొంది. న్యాయవ్యవస్థకు సంబంధించి దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చిన అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. సీజేఐ జస్టిస్ మిశ్రా అభిశంసన తీర్మానంపై సంతకాలు చేసిన న్యాయవాదులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌ను గురువారం జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్‌ల ధర్మాసనం విచారించింది. ‘ఇది జడ్జీల నియామకానికి సంబంధించిన అంశం. దీనిని మాకు విడిచిపెట్టండి. ఆ విషయాన్ని మేం చూసుకోగలం. ఇలాంటి పిటిషన్లను మేం పరిగణనలోకి తీసుకోం’ అంటూ ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. -
కట్నం వేధింపులపై సుప్రీం తీర్పు సవరణ
న్యూఢిల్లీ: వరకట్నం వేధింపుల కేసులో భర్త, అతని కుటుంబ సభ్యులను వెంటనే అరెస్ట్ చేయకుండా గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తాజాగా సవరించింది. తాము గతంలో ఇచ్చి తీర్పు చట్టాలకు లోబడి లేదని సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం వ్యాఖ్యానించింది. క్రిమినల్ కేసుల్లో ఇరుపక్షాలు రాజీకి వచ్చినా కేసును కొట్టేసే అధికారం కేవలం హైకోర్టులకు మాత్రమే ఉంటుందని తేల్చిచెప్పింది. మరోవైపు కుష్టు వ్యాధిగ్రస్తులు రిజర్వేషన్, ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందేలా దివ్యాంగుల చట్టం–2016లో నిబంధనలు సవరించే అంశాన్ని పరిశీలించాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. -
సీజేఐగా రంజన్ గొగోయ్
న్యూఢిల్లీ: అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 46వ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ రంజన్ గొగోయ్(63) నియమితులైనట్లు న్యాయ మంత్రిత్వ శాఖ వెల్లడిం చింది. ఈశాన్య రాష్ట్రాల నుంచి నియమితులైన మొట్టమొదటి సీజేఐ ఈయనే కావడం గమనార్హం. ప్రస్తుత సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా తర్వాత అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ గొగోయ్ పేరును సీజేఐగా లా కమిషన్‌కు ప్రతిపాదించారు. కమిషన్ ఆ ప్రతిపాదనను ప్రధాని మోదీకి పంపగా ఆయన దానిని రాష్ట్రపతి ఆమోదానికి సిఫారసు చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేయడంతో న్యాయమంత్రిత్వ శాఖ గురువారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. వివిధ అంశాలకు సంబంధించి సీజేఐకు వ్యతిరేకంగా గొంతెత్తిన నలుగురు న్యాయమూర్తుల్లో జస్టిస్ గొగోయ్ కూడా ఉండటంతో సీజేఐగా ఆయన నియామకంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా అక్టోబర్ 2వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఎన్నార్సీ, లోక్‌పాల్ కేసుల విచారణలో కీలక తీర్పులు వెలువరించారు. -
రాజ్యాంగ హక్కులే మూలాధారం
పట్నా: ప్రజాస్వామ్య, స్వేచ్ఛాయుత సమాజానికి రాజ్యాంగం రక్షణ కల్పించిన హక్కులే మూలాధారమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా తెలిపారు. ప్రజలకు స్వేచ్ఛగా బతికే హక్కు ఉన్నప్పుడు చనిపోయే హక్కు కూడా ఉంటుందని వెల్లడించారు. పట్నాలోని భారతి విశ్వవిద్యాలయంలో జరిగిన డా.పతంగ్‌రావు కదమ్ స్మారకోపన్యాసంలో జస్టిస్ మిశ్రా ప్రసంగించారు. పాక్షిక యూథనేషియా(స్వచ్ఛంద మరణం)కు గతంలో సుప్రీం అనుమతి ఇవ్వడంపై స్పందిస్తూ..‘ఇది ఇబ్బందికరమైన పరిస్థితే. కానీ బతికే హక్కున్న ప్రతి పౌరుడికి చనిపోయే హక్కు కూడా ఉంటుంది. దీని ఆధారంగానే తీర్పు ఇచ్చాం’ అని వెల్లడించారు. -
తదుపరి సీజేఐగా జస్టిస్ గొగోయ్!
న్యూఢిల్లీ: భారత సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగోయ్ నియమితులు కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా పదవీకాలం అక్టోబర్ 2న ముగియనున్న నేపథ్యంలో సంప్రదాయాన్ని అనుసరించి సుప్రీంలో తన తర్వాత అత్యంత సీనియర్ అయిన జస్టిస్ గొగోయ్ పేరును మిశ్రా ప్రతిపాదించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జస్టిస్ దీపక్ మిశ్రా చేసిన సిఫార్సును త్వరలోనే కేంద్ర న్యాయశాఖకు పంపనున్నట్లు వెల్లడించాయి. అన్ని సవ్యంగా సాగితే అక్టోబర్ 3న జస్టిస్ గొగోయ్ సీజేఐగా ప్రమాణం చేస్తారని పేర్కొన్నాయి. సాధారణంగా పదవీకాలం ముగిసేందుకు నెల రోజుల ముందుగా తదుపరి సీజేఐ పేరును సిఫార్సు చేయాలని కేంద్ర న్యాయ శాఖ సీజేఐని కోరుతుంది. దీంతో తన తర్వాత అత్యంత సీనియర్‌ను తర్వాతి సీజేఐగా ప్రస్తుత సీజేఐ ప్రతిపాదిస్తారు. ఇదే తరహాలో వారం రోజుల క్రితం కేంద్రం తదుపరి సీజేఐ నియామకంపై జస్టిస్ మిశ్రాకు లేఖ రాసింది. దీంతో సంప్రదాయాన్ని అనుసరించి జస్టిస్ గొగోయ్ పేరును జస్టిస్ దీపక్ మిశ్రా ప్రతిపాదించారు. సుప్రీంకోర్టు నిర్వహణతో పాటు కేసుల కేటాయింపులో సీజేఐ వ్యవహారశైలిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రిటైర్డ్ జస్టిస్ జె.చలమేశ్వర్, జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌లతో కలసి జస్టిస్ గొగోయ్ ఈ ఏడాది జనవరిలో మీడియా ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జస్టిస్ గొగోయ్ పేరును సీజేఐ మిశ్రా ప్రతిపాదించకపోవచ్చని వార్తలొచ్చాయి. సీజేఐ ప్రతిపాదనలను న్యాయశాఖ ప్రధాని ముందు ఉంచుతుంది. అనంతరం కొత్త సీజేఐ నియామకంపై ప్రధాని రాష్ట్రపతికి సలహా ఇస్తారు. అసోం నుంచి సుప్రీంకోర్టు వరకూ.. జస్టిస్ గొగోయ్ 1954, నవంబర్ 18న అసోంలో జన్మించారు. 1978లో బార్ అసోసియేషన్‌లో పేరు నమోదు చేయించుకున్నారు. ఆ తర్వాత గొగోయ్ గువాహటి హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. 2001, ఫిబ్రవరి 28న గొగోయ్ గువాహటి హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2010, సెప్టెంబర్‌లో పంజాబ్–హరియాణా హైకోర్టుకు బదిలీఅయిన గొగోయ్, మరుసటి ఏడాది ఫిబ్రవరిలో అదే హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2012, ఏప్రిల్ 23న జస్టిస్ గొగోయ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అసోంలో ఇటీవల ప్రకటించిన జాతీయ పౌర రిజిస్టర్(ఎన్నార్సీ)ను గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనమే పర్యవేక్షించింది. మద్రాస్ హైకోర్టు వివాదాస్పద మాజీ న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్‌పై దాఖలైన కోర్టు ధిక్కరణ కేసును జస్టిస్ చలమేశ్వర్‌తో కలసి విచారించారు. అయితే 2016లో సౌమ్య అనే యువతి రేప్, హత్య కేసులో దోషికి ట్రయల్ కోర్టు విధించిన మరణశిక్షను జస్టిస్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం యావజ్జీవంగా మారుస్తూ ఇచ్చిన తీర్పుపై అన్నివర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. -
న్యాయవ్యవస్థలో మౌలిక కొరత: సీజేఐ
న్యూఢిల్లీ: న్యాయ పరిపాలనపై మచ్చ రావడానికి ముందుగానే న్యాయ వ్యవస్థలో మౌలిక వసతుల కొరతను అధిగమించాల్సి ఉందని సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా అన్నారు. మౌలిక సౌకర్యాల లేమికి ఆర్థికపరమైన అవరోధాలను సాకుగా చూపకూడదన్నారు. సుప్రీంకోర్టు అడ్వొకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ నిర్వహించిన సింపోజియంలో రాష్ట్రపతి కోవింద్‌తోపాటు సీజేఐ పాల్గొన్నారు. ‘మౌలిక వనరుల కొరత తీవ్రమై, న్యాయ పరిపాలనకు హాని కలిగించక ముందే చర్యలు తీసుకోవాల్సి ఉంది. నాణ్యమైన, జవాబుదారీ తనంతో కూడిన సత్వర న్యాయం అందించడానికి, న్యాయ ఉద్దేశం నెరవేరేందుకు న్యాయ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది’ అని సీజేఐ అన్నారు. సామాన్యుడికి న్యాయం అందించటానికి, కక్షిదారులకు వసతులు, న్యాయవాదులకు అవసరమైన సౌకర్యాలను కల్పించాలంటే న్యాయస్థానాల పరిధి పెరగాలన్నారు. కాగా, చాలా కేసుల్లో కక్షిదారులు వాయిదాలు కోరడం సర్వసాధారణంగా మారిందని, కోర్టుల్లో పేరుకుపోతున్న కేసులకు ఇది కూడా ఒక కారణమని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. -
‘ఎన్నికల్లో అక్రమాల’ కేసు కొట్టివేత
న్యూఢిల్లీ: ఎన్నికల అక్రమాలను తక్షణ అరెస్టుకు వీలైన నేరంగా పరిగణించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. ‘వాదనలు విన్నాం. ఈ పిటిషన్‌ను కొట్టేస్తున్నాం’ అని సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం స్పష్టం చేసింది. ఎన్నికల అక్రమాలుగా పరిగణించే డబ్బులు పంచడం, తప్పుడు ప్రకటనలు, అభ్యర్థులు, రాజకీయ పార్టీల ద్వారా జరిగే పలురకాల దుర్వినియోగం తదితర అక్రమాలను తక్షణం అరెస్టుకు వీలుకల్పించే నేరాలుగా పరిగణించాలని, కనీసం రెండేళ్ల పాటు జైలు శిక్ష విధించేలా చర్యలు తీసుకోవాలని సీనియర్ న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ పిటిషన్లో పేర్కొన్నారు. 2000 తర్వాత సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ అవినీతి తారస్థాయికి చేరిందని ఆయన తెలిపారు. -
‘ఆళ్వార్ మూకదాడి’పై చర్యలేవి?
న్యూఢిల్లీ: రాజస్తాన్‌లోని ఆళ్వార్‌లో జరిగిన మూకదాడి ఘటనకు సంబంధించి ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో 7రోజుల్లోగా నివేదిక అంద జేయాలని స్పష్టం చేసింది. ఆవుల అక్రమ రవాణాకు పాల్పడుతున్నాడనే ఆరోపణలతో ఆళ్వార్‌లో గత జూలై 20న రక్బార్ ఖాన్ అనే పాడిరైతుపై మూకదాడి జరిగిన విషయం తెలిసిందే. దాడిలో తీవ్రగాయాలపాలైన బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందతూ మరణించాడు. ఈ ఘటనకు సంబం ధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయలేదలంటూ కోర్టు ధిక్కర ణ పిటిషన్‌ను కాంగ్రెస్ నేత తెహ్సీన్ పూనావాలా దాఖలు చేశారు. ప్రభుత్వ సీఎస్, డీజీపీలతోపాటు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం సోమవారం ఈ పిటిషన్‌ను విచారించింది. ఈ ఘటనపై ఏమీ చర్యలు తీసుకున్నారో తెలుపుతూ ఏడు రోజుల్లోగా అఫిడవిట్ సమర్పించాలని రాజస్తాన్ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని ఆదేశించింది. మూకదాడులపై చర్యలు తీసుకునేందుకు కేంద్రం కొత్త చట్టం చేసే అంశానికి సంబంధించి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ అంగీకారాన్ని తెలుపుతూ సెప్టెంబర్ 7వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని తెలిపింది. -
నాశనం చేయడం సులభం; సీజేఐ మిశ్రా
న్యూఢిల్లీ: ‘ఓ వ్యవస్థను విమర్శించడం, దానిపై దాడులు చేయడం, నాశనం చేయడం చాలా సులభం. కానీ ఆ వ్యవస్థ పనిచేసేలా మార్చ డం సవాళ్లతో కూడుకున్న కష్టమైన పని’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ దీపక్ మిశ్రా వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం నిర్వహించిన పంద్రాగస్టు వేడుకల్లో పతాకాన్ని ఎగురవేసిన అనంతరం జస్టిస్ మిశ్రా మాట్లాడారు. వ్యవస్థలోని వ్యక్తులు తమ వ్యక్తిగత కోర్కెలు, లక్ష్యాలను అధిగమించి సానుకూల దృక్పథంతో, హేతుబద్ధతతో, పరిణతి, బాధ్యతలతో నిర్మాణాత్మక చర్యలు చేపట్టినప్పుడే వ్యవస్థ మరింత ఉన్నత స్థానానికి చేరుతుందని అన్నారు. ‘న్యాయవ్యవస్థను బలహీన పరిచేందుకు కొన్ని శక్తులు పనిచేస్తుండొచ్చు. మనమంతా కలసి వాటిని ధైర్యంగా ఎదుర్కొని నిలబడాలి’ అని పేర్కొన్నారు. న్యాయ దేవత చేతిలోని త్రాసు సమన్యాయాన్ని సూచిస్తుందనీ, ఆ సమానత్వానికి భంగం కలిగించే ఎవరైనా ఆ దేవతను బాధ పెట్టినట్లేనని జస్టిస్ మిశ్రా అన్నారు. న్యాయ దేవత కన్నీరు కార్చేందుకు తాము ఒప్పుకోమన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రజాహిత వ్యాజ్యాల (పిల్) విస్తృతి దెబ్బతినకుండా ఉండాలంటే కొంత పరిశీలన తప్పనిసరన్నారు. తక్కువ విస్తృతి కలిగిన అంశాలపై పిల్ వేసేందుకు చెల్లించాల్సిన రుసుమును సుప్రీంకోర్టు ఇటీవల భారీగా పెంచడాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మహాత్మా గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ పటేల్ తదితర గొప్పవాళ్ల గుర్తుగా ఉన్న ప్రదేశాలను సందర్శించినప్పుడు వారిని పొగడాలని రవి శంకర్ కోరగా, జస్టిస్ మిశ్రా మాట్లాడుతూ ‘వారంతా దేశం కోసం పోరాడారు. మన పొగడ్తల కోసం కాదు’ అని అన్నారు. -
మానవీయ విలువలతోనే హక్కుల పరిరక్షణ
ఎస్కేయూ (అనంతపురం) : ‘మానవత్వంలోనే దైవ త్వం ఉంది. మానవీయ విలువలను కలిగి ఉంటూ మానవ హక్కులను కాపాడుకోవాలి’అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా అన్నారు. ‘మానవీయ విలువలు– చట్టబద్ధమైన ప్రపంచం’అనే అంశంపై అనంతపురం జిల్లా పుట్టపర్తిలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న జాతీయ న్యాయ సేవా సదస్సు శనివారం ప్రారంభమైంది. సదస్సుకు జస్టిస్ దీపక్ మిశ్రా ముఖ్య అతిథిగా, అంతర్జాతీయ న్యాయస్థానం న్యాయమూర్తి జస్టిస్ దల్వీర్ భండారీ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, 750 మంది న్యాయ నిపుణులు, 300 మంది న్యాయ విద్యార్థులు సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ దీపక్ మిశ్రా మాట్లాడుతూ... ఇతరుల హక్కులకు భంగం కలిగించకుండా హక్కులను అనుభవించాలన్నారు. అహాన్ని తొలగించుకుంటేనే శాంతి లభిస్తుందని చెప్పారు. ఆధ్యాత్మికత హేతుబద్ధంగాను, హేతుబద్ధమైన ఆధ్యాత్మికంగానూ ఉండాలన్నారు. మన రాజ్యాంగంలో చట్టపరమైన నిబంధనలే కాకుండా మానవత్వ విలువలు, ఆధ్యాత్మిక నిబంధనలు ఉన్నాయని చెప్పారు. ధర్మమే సమాజాన్ని రక్షిస్తుందని.. సన్మార్గంలో నడిపిస్తుందన్నారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.రాధాకృష్ణ, శ్రీసత్యసాయి సేవా సంస్థ జాతీయ ఉపాధ్యక్షుడు జతీందర్ చీమా, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ట్రస్టీ ఎస్ఎస్ నాగానంద్, ఆలిండియా సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్ అధ్యక్షుడు నిమీశ్ పాండే, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మెంబర్ రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. -
గోరక్షక్ దాడులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు
-
ఆ దాడులపై సుప్రీంకోర్టు ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో గోరక్షణ పేరుతో అమాయక ప్రజలపై దాడులు జరుగుతున్నాయని, వాటిని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని రూపొందించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. కొంత మంది వ్యక్తులు సమూహంగా ఏర్పడి ప్రజలపై దాడిచేసి భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకోడానికి వీల్లేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని దాడులను అరికట్టేందుకు చట్టాన్ని రూపొందించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. దాడుల నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు ఎలాంటి చట్టం చేస్తున్నారో నాలుగు వారాల్లో తమకు నివేదించాలని సుప్రీంకోర్టు కోరింది. ప్రజల హక్కులకు భంగం కలిగించే చర్యలను నివారించడానికి ప్రతి జిల్లాలో నోడల్ అధికారిని నియమించాలని గతంలోనే రాష్ట్రాలను ఆదేశించినట్లు న్యాయస్థానం గుర్తుచేసింది. రాజస్తాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు గోరక్షణ పేరుతో జరగుతున్న దాడులను నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తమకు తెలపాలని ధర్మాసనం ఆదేశించింది. సమాజంలో హింసకు తావులేదన్న ప్రధాన న్యాయమూర్తి తదుపరి విచారణను ఆగస్ట్ 28కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. -
గిరిజనుల వివాదంపై విచారణ వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: బంజారా, లంబాడీ, సుగాలీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలన్న పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ వివాద పరిష్కారం న్యాయస్థానం పరిధిలో లేదని, పార్లమెంటరీ వ్యవస్థ పరిధిలో ఉందని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ గోండ్వానా వెల్ఫేర్ సొసైటీ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. కాగా, ఎస్టీ జాబితా నుంచి వారిని తొలగించాలని కోయ తెగలకు చెందిన ‘ఆదివాసీ (గిరిజన) ఎంప్లాయిస్ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్’, రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్, ఆధార్ సొసైటీ, ఎ.దేవేందర్ తదితరులు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తోసిపుచ్చింది. కానీ ఎస్ఎల్పీలో ఇంప్లీడ్ కావొచ్చని, రెండు వారాల తర్వాత దీన్ని విచారిస్తామని పేర్కొంది. ఎస్ఎల్పీలో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేస్తామని పిటిషనర్ల తరఫు న్యాయవాది రమేశ్ అల్లంకి తెలిపారు. శుక్రవారం ఈ పిటిషన్లు ధర్మాసనం ముందుకు రాగానే ఆదివాసీల పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఎం.ఎన్.రావు, వికాస్ సింగ్ తమ వాదనలు వినిపించారు. ఎస్సీ, ఎస్టీ ఉత్తర్వుల సవరణ చట్టం–1976 ద్వారా బంజారా, లంబాడీ, సుగాలీలను ఎస్టీలుగా గుర్తించడం రాజ్యాంగ విరుద్ధమని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 342ని ఉల్లంఘించడమేనన్నారు. అసలైన వారికి అన్యాయం.. ఎస్సీ, ఎస్టీ ఉత్తర్వుల (సవరణ) చట్టం, 1976 ద్వారా బంజారాలను ఎస్టీలుగా గుర్తించడం వల్ల తెలంగాణలోని అసలైన గిరిజనులకు విద్యా, ఉద్యోగాలు, పదోన్నతులు, చట్టసభల్లో ప్రాతినిథ్యం తదితర రంగాల్లో తీరని నష్టం వాటిల్లిందని ఆదివాసీలు దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. హైదరాబాద్ రాష్ట్రం భారత్‌లో విలీనమైన సందర్భంలో ఆంధ్రా ప్రాంతం మద్రాసు రాష్ట్రంలో ఉందని, ఆ సమయంలో లంబాడా, సుగాలీలను ఆంధ్రాలో ఎస్టీలుగా గుర్తించారు.. కానీ హైదరాబాద్ స్టేట్‌లో కాదని వివరించారు. 1956 నాటి ఉత్తర్వుల అనంతరం కూడా ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణ జిల్లాల్లో సుగాలీ, లంబాడీలను ఎస్టీలుగా పరిగణించలేదన్నారు. 1976లో అప్పటి కేంద్ర హోం మంత్రి బ్రహ్మానందరెడ్డి ఎస్సీ, ఎస్టీ ఉత్తర్వులు (సవరణ) బిల్లు తెచ్చారని, ఎస్సీ, ఎస్టీ జాబితా నుంచి కులాల చేర్పులు, తొలగింపులకు సంబంధించినదైనప్పటికీ.. ఈ బిల్లు చర్చకు వచ్చిన సందర్భంగా కులాల చేర్పులను కొన్ని ప్రాంతాలకు ఆంక్షలు విధించడం సరికాదన్న నిర్ణయానికి వస్తూ తెలంగాణ జిల్లాల్లోనూ బంజారాలను ఎస్టీలుగా పరిగణించారని వివరించారు. కానీ బంజారాలను ఎస్టీలుగా పరిగణించినప్పుడు సరైన సామాజిక, ఆర్థిక అధ్యయనం జరగలేదని, కేవలం ప్రాంతాల ఆంక్షల తొలగింపు ప్రాతిపదికన చేశారన్నారు. దీనిపై బంజారాల తరఫున సీనియర్ న్యాయవాదులు రాజీవ్ ధావన్, ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి తమ వాదనలు వినిపించగా.. స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా.. ఈ విషయంపై హైకోర్టుకే వెళ్లాలని సూచించారు. అయితే హైకోర్టు కూడా ఇదే అంశంపై గత నెలలో ఉత్తర్వులిచ్చిందని, వాటిని సవాలు చేస్తూ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా ఇదే ధర్మాసనం వద్ద ఉందని న్యాయవాది వికాస్‌సింగ్ వివరించారు. ఆ స్పెషల్ లీవ్ పిటిషన్లో ఇంప్లీడ్ అప్లికేషన్ దాఖలు చేసుకోవచ్చని విచారణను వాయిదా వేసింది. -
వారికి ఉరే సరి
న్యూఢిల్లీ: సంచలన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో తమకు విధించిన ఉరిశిక్షపై పునఃసమీక్ష కోరుతూ ముగ్గురు దోషులు దాఖలు చేసుకున్న పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. గత తీర్పును పునఃసమీక్షించేందుకు తగిన కారణమేదీ లేదంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్‌ల ధర్మాసనం దోషుల పిటిషన్లను తోసిపుచ్చింది. 2012 డిసెంబరు 16న రాత్రి ఢిల్లీలో 23 ఏళ్ల పారామెడికల్ విద్యార్థినిపై ఆరుగురు వ్యక్తులు కదులుతున్న బస్సులో అత్యాచారం జరిపి, ఆమెను మాటల్లో చెప్పలేని తీవ్ర శారీరక హింసకు గురిచేసి రోడ్డుపైకి విసిరేసి వెళ్లిపోయారు. అనతరం ఆమె చికిత్స పొందుతూ డిసెంబరు 29న సింగపూర్‌లో ప్రాణాలు కోల్పోయింది. నిర్భయ అత్యాచార ఘటనగా పేర్కొనే ఈ కేసు దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు రేపింది. మహిళలకు రక్షణ కోరుతూ దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఆంక్షలను ధిక్కరించి రోడ్లపైకి వచ్చి ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. అత్యాచారాలను నిరోధించడానికి ప్రభుత్వం నిర్భయ చట్టాన్ని కూడా తీసుకురావడం తెలిసిందే. మరోవైపు ఈ కేసులో మొత్తం ఆరుగురిని పోలీసులు 2012 డిసెంబరులోనే అరెస్టు చేశారు. వారిలో ఒకరు నేరానికి పాల్పడిన సమయానికి మైనర్ కావడం, అతను 2013 ఆగస్టులో దోషిగా తేలడంతో మొదట మూడేళ్ల శిక్ష విధించి బాలల కారాగారానికి తరలించారు. అయితే 2015 డిసెంబరులోనే విడుదలయ్యాడు. మిగిలిన ఐదుగురిపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టు విచారణ జరుపుతుండగా 2013 మార్చిలో రామ్ సింగ్ అనే నిందితుడు జైలులోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. మిగిలిన నలుగురిని ఫాస్ట్ ట్రాక్ కోర్టు దోషులుగా తేల్చి 2013 సెప్టెంబరులో మరణ శిక్ష విధించింది. అనంతరం వారికి ఉరిశిక్షను 2014లోనే ఢిల్లీ హైకోర్టు కూడా సమర్థించింది. ఆ తర్వాత దోషులు ఉరిశిక్షను సుప్రీంకోర్టులోనూ సవాల్ చేయడంతో 2017 మే నెలలోనే సుప్రీంకోర్టు కూడా వారికి ఉరిశిక్ష సరైందేనని తీర్పు చెప్పింది. గతంలోనే నిశితంగా విన్నాం.. నిర్భయ అత్యాచారం కేసులో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ముకేశ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్‌లకు ఉరిశిక్ష విధించింది. ఈ శిక్షను గతంలోనే సుప్రీంకోర్టు కూడా సమర్థించినప్పటికీ, మరణశిక్షపై మరోసారి సమీక్షించాలంటూ ముకేశ్, పవన్, వినయ్‌లు మరోసారి అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. గతంలో విచారణ సమయంలోనే ఈ ముగ్గురి వాదనలను న్యాయమూర్తులు నిశితంగా పరిశీలించారనీ, ఇప్పుడు మళ్లీ నాటి తీర్పును పునఃసమీక్షించాల్సిన అవసరం లేదనీ ధర్మాసనం స్పష్టం చేసింది. అక్షయ్ సింగ్ మాత్రం శిక్షపై పునఃసమీక్ష కోరలేదు. మరణ వాంగ్మూలాలపై... నిర్భయ ఇచ్చిన మరణ వాంగ్మూలాలు ఒకదానితో ఒకటి సరిపోలడం లేదనే వాదనను దోషుల తరఫు న్యాయవాది లేవనెత్తగా ధర్మాసనం తోసిపుచ్చింది. దోషులు మళ్లీ మళ్లీ ఇదే అంశాన్ని లేవనెత్తడం సరికాదని మంద లించింది. నిర్భయ డిసెంబరు 16, 21, 25 తేదీల్లో మూడుసార్లు వాంగ్మూలాలిచ్చింది. మరణశిక్షను రద్దు చేయలేం.. బ్రిటన్, పలు లాటిన్ అమెరికా దేశాలు, ఆస్ట్రేలియా తదితర చోట్ల మరణశిక్షను రద్దు చేశారు కాబట్టి భారత్‌లోనూ అలాగే చేయాలనడం సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది. శిక్షా స్మృతిలో మరణశిక్ష ఉన్నన్ని రోజులూ, ఆ శిక్ష విధింపదగ్గ కేసుల్లో కోర్టులు మరణ శిక్షనే విధిస్తాయనీ, ఇందుకు కోర్టులను ఎవరూ నిందించజాలరని ధర్మాసనం స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని నిబంధనలు, పౌరుల, నేరస్తుల హక్కులకు సంబంధించిన అంతర్జాతీయ ఒప్పందాలను పరిశీలించిన మీదట, మరణ శిక్ష విధించడం రాజ్యాంగబద్ధమేనంది. నమ్మకం తిరిగొచ్చింది: నిర్భయ తల్లి ‘ఉరిశిక్షను సుప్రీంకోర్టు మరోసారి సమర్థించడం.. అలాంటి హీన నేరాలకు పాల్పడేవారికి ఓ హెచ్చరిక. న్యాయవ్యవస్థపై మా నమ్మకం తిరిగొచ్చింది. మహిళలు, అమ్మాయిలపై దురాగతాలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రిని నేను కోరుతున్నా’ అని నిర్భయ తల్లి ఆశాదేవి పేర్కొన్నారు. దోషులకు శిక్షను అమలు చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోందనీ, ఈలోపు దేశంలో తన కూతురిలాగే మరెంతోమంది అమ్మాయిలు బలైపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తర్వాత ఏం చేయొచ్చు? దోషులకు మరణశిక్షను సుప్రీంకోర్టు మరోసారి సమర్థించడంతో ప్రస్తుతం ఉరి శిక్షను తప్పించుకోడానికి మరో రెండు మార్గాలున్నాయి. వాటిలో ఒకటి.. మరణ శిక్షను నిలిపేయాల్సిందిగా కోరుతూ దోషులు మళ్లీ సుప్రీంకోర్టులోనే క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయడం. రెండోది క్షమాభిక్ష పెట్టాల్సిందిగా రాష్ట్రపతిని వేడుకోవడం. ఈ రెండు అవకాశాల్లో కూడా దోషులకు ఊరట లభించని పక్షంలో వారికి ఉరి శిక్ష తప్పదు. కేసులో దోషులకు శిక్షను తగ్గించేందుకు సాయపడేవైనప్పటికీ గతంలో ఎప్పుడూ కోర్టు దృష్టికి తీసుకురాని అంశాలేవైనా ఉంటే, ఆ అంశాలపై విచారణ కోసం దాఖలు చేసేది క్యూరేటివ్ పిటిషన్. అలాంటి అంశాలేవైనా ఉన్నా యని ముందుగా జడ్జీలు భావిస్తేనే పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తారు. లేదంటే పిటిషన్ వేసిన వారికి జరిమానా వేస్తారు. ఉరితో నేరాలు తగ్గవు: ఆమ్నెస్టీ ఉరి శిక్షలు విధించినంత మాత్రాన మహిళలపై నేరాలు తగ్గవని మానవ హక్కుల పోరాట సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా పేర్కొంది. ‘ఉరిశిక్ష వల్ల మహిళలపై నేరాలు కానీ, మరే ఇతర నేరాలు కానీ తగ్గినట్లు రుజువులేవీ లేవు. చట్టాలు సరిగ్గా అమలయ్యేందుకు, వీలైనన్ని ఎక్కువ కేసుల్లో దోషులకు సరైన శిక్ష పడేలా చేసి బాధితులకు న్యాయం చేకూ ర్చేందుకు ప్రభుత్వం నిధులు సమకూర్చాలి. రేప్‌ల చట్టాల సంస్కరణలపై ఏర్పాటైన జస్టిస్ వర్మ కమిటీ కూడా ఉరిశిక్షను వ్యతిరేకించింది’ అని ఆమ్నెస్టీ ఇండియా ప్రోగ్రాం డైరెక్టర్ అస్మిత అన్నారు. నిర్భయ అత్యాచారం, హత్య కేసులో గత తీర్పును పునఃసమీక్షించేందుకు తగిన కారణమేదీ లేదు. గత విచారణ సమయంలోనే ఈ ముగ్గురి వాదనలను న్యాయమూర్తులు నిశితంగా పరిశీలించారు. ఆ తీర్పులో ఏ తప్పూ లేదు. – సుప్రీంకోర్టు ధర్మాసనం ఉరిశిక్షను సుప్రీంకోర్టు మరోసారి సమర్థించడం.. అలాంటి హీన నేరాలకు పాల్పడే వారికి ఇది ఓ హెచ్చరిక. మహిళలు, అమ్మాయిలపై దురాగతాలు జరగకుండా కఠినచర్యలు తీసుకోవాలని ప్రధానిని కోరుతున్నా. – నిర్భయ తల్లి ఆశాదేవి సుప్రీంకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తున్న నిర్భయ తల్లిదండ్రులు -
సీజేఐపైనే అనుచిత వ్యాఖ్యలా?
న్యూఢిల్లీ: ఓ పిటిషన్ అత్యవసర విచారణకు నిరాకరించినందుకు ప్రధాన న్యాయమూర్తిని కించపరిచేలా పరోక్షంగా వ్యాఖ్యానించిన లాయర్‌కు సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. సామాజిక మాధ్యమాల్లో సదరు లాయర్ చేసిన వ్యాఖ్యలు, పంపిన సందేశాలు ఎంతమాత్రం సమర్థనీయం కాదని మండిపడింది. అలాంటి ఆరోపణలు న్యాయవ్యవస్థ ప్రతిష్టకు భంగం కలిగిస్తాయని సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం పేర్కొంది. తామిచ్చే తీర్పులను ఏ వేదికపై చర్చించినా అభ్యంతరం లేదని, కానీ న్యాయమూర్తులను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికింది. ‘కుప్పలుతెప్పలుగా వచ్చిపడే పిటిషన్లలో వేటిని అత్యవసరంగా విచారించాలో సీజేఐ నిర్ణయిస్తారు. ఏదైనా పిటిషన్ అత్యవసర విచారణకు నిరాకరించినంత మాత్రాన సీజేఐని లక్ష్యంగా చేసుకుని సదరు లాయర్ సామాజిక మాధ్యమాల్లో నిరాధార ఆరోపణలు చేస్తారా?’ అని జస్టిస్ చంద్రచూడ్ ప్రశ్నించారు. ఇటీవలే పదవీ విరమణ పొందిన ఓ జడ్జి వ్యాఖ్యలను లాయర్ ఉటంకించడాన్ని కూడా బెంచ్ తప్పుపట్టింది. కోర్టులో ఊరట లభించకపోతే జడ్జీలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని బెంచ్ పేర్కొంది. -
ప్రజాప్రభుత్వమే సుప్రీం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ సర్కార్ మధ్య ఆధిపత్య పోరుకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. లెఫ్టినెం ట్ గవర్నర్(ఎల్జీ) అధికారాలకు కత్తెర వేసిన న్యాయ స్థానం.. ఆయనకు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారం లేదని, ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం సలహాలు, సూచనల ఆధారంగానే ఎల్జీ నడుచుకోవాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ప్రకటిం చింది. ఢిల్లీ రాష్ట్రం కాదని, ప్రస్తుతమున్న రాజ్యాంగ పరిమితుల్లో ఢిల్లీకి రాష్ట్ర హోదా ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ దీపక్‌మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం బుధవారం కీలక తీర్పును ఇచ్చింది. ఢిల్లీ ప్రభుత్వం, ఎల్జీ అధికారాల పరిధిని స్పష్టంగా వెల్లడించింది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో కేంద్ర ప్రభుత్వంపై కేజ్రీవాల్ సర్కారు పై చేయి సాధించినట్లయ్యింది. నేపథ్యం ఇదీ..: 2014లో ఆమ్ఆద్మీ పార్టీ ఢిల్లీ పీఠం ఎక్కినప్పటి నుంచి కేంద్రానికి, ఢిల్లీ ప్రభుత్వానికీ మధ్య అధికార పరిధిపై వివాదం నడుస్తోంది. ఈ నాలుగేళ్లలో ప్రస్తుత ఎల్జీ అనిల్ బైజల్, మాజీ ఎల్జీ నజీబ్‌జంగ్‌తో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విభేదిస్తూ వచ్చారు. వారు కేజ్రీవాల్ తీసుకున్న అనేక నిర్ణయాలను అడ్డుకోవడం వివాదానికి కారణమైంది. ఎల్జీ కేంద్రం అండ చూసుకుని తన ప్రభుత్వ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారని ఆరోపిస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అలాగే ఎల్జీ కార్యనిర్వాహక అధిపతే అంటూ 2016 ఆగస్టు 4న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై అనేక అప్పీళ్లు వచ్చాయి. వీటిపై విచారణ జరిపిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం.. ఢిల్లీ అధికారాలు, హోదాకు సంబంధించిన ఆర్టికల్ 239ఏఏతో ముడిపడి ఉన్న అనేక విషయాలకు తాజా తీర్పుతో జవాబిచ్చింది. ఎల్జీ పాలనాధికారి మాత్రమే.. సీజేఐ జస్టిస్ మిశ్రా తన తరఫున, న్యాయమూర్తులు జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ ఎఎం ఖన్వీల్కర్ తరఫున 237 పేజీల తీర్పును వెలువరించింది. ‘ప్రస్తుత రాజ్యాంగ పరిమితుల మేరకు ఢిల్లీకి రాష్ట్ర హోదా ఇవ్వడం సాధ్యం కాదు. జాతీయ రాజధాని ప్రాంతమైన ఢిల్లీ ప్రత్యేకమైనది. భిన్నమైనది. లెఫ్టినెంట్ గవర్నర్ హోదా.. రాష్ట్ర గర్నవర్ హోదాతో సమానమైనది కాదు. ఆయన ఒక పాలనాధికారి మాత్రమే. పరిమితార్థంలో ఎల్జీ హోదాలో ఆయన పని చేస్తారంతే’ అని సీజేఐ మిశ్రా తన తీర్పులో పేర్కొన్నారు. మంత్రిమండలితో ఘర్షణ పూరిత వైఖరితో కాకుండా ఎల్జీ సంధానకర్త లాగా వ్యవహరించాలని, ఎల్జీకి, మంత్రిమండలికి మధ్య అభిప్రాయ భేదాలు పరిధి దాటకూడదని, వాటిని చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకో వాలంది. ‘ఎల్జీకి స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే ఎటువంటి అధికారం లేదు. ఆయన మంత్రిమండలి సలహాలు, సూచనల ఆధారంగా పనిచేయాలి. లేదా ఆయన సూచనల మేరకు రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలి’అని పేర్కొన్నారు. మంత్రిమండలి తీసుకునే ప్రతి నిర్ణయం ఎల్జీకి తెలియజేయాలని, అయితే ప్రతి అంశంలోనూ ఎల్జీ ఆమోదం తప్పనిసరి కాదని స్పష్టం చేశారు. పబ్లిక్ ఆర్డర్, పోలీస్, భూములు ఈ మూడు అంశాలు మినహా మిగతా అన్ని అంశాల్లో చట్టాలు చేసేందుకు ఢిల్లీ శాసన సభకు అధికారం ఉందన్నారు. నిర్ణయాలు తీసుకునేది కేబినెట్.. జస్టిస్ డీవై చంద్రచూడ్ వెలువరించిన 175 పేజీల అనుబంధ తీర్పులో నిర్ణయాలు తీసుకునేది ఎల్జీ కాదని, మంత్రిమండలి అవసరమైన నిర్ణయాలు తీసుకుంటుందనే విషయాన్ని ఎల్జీ గుర్తుపెట్టుకోవా లన్నారు. రాష్ట్రపతి నిర్ణయానికి కూడా ఎల్జీ బద్ధుడై ఉండాలని తెలిపారు. జస్టిస్ అశోక్ భూషణ్ తన 123 పేజీల అనుంబంధ తీర్పులో ఎన్నికైన∙ప్రజాప్రతిని ధులకు ఢిల్లీ శాసనసభ ప్రాతినిధ్యం వహిస్తుందని, వారి అభిప్రాయాలు, నిర్ణయాలను అన్ని సమయా ల్లోనూ గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. ఢిల్లీ ప్రజల విజయం: కేజ్రీవాల్ అధికారం కోసం కేంద్ర ప్రభుత్వంతో జరుగుతున్న పోరాటంలో సుప్రీంకోర్టు తీర్పు తమ ప్రభుత్వానికి దక్కిన భారీ విజయమని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అన్నారు. తీర్పు అనంతరం ఆయన ‘ఢిల్లీ ప్రజలకు, ప్రజాస్వామ్యానికి దక్కిన భారీ విజయం’ అని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇదే తీర్పు పుదుచ్చేరికి కూడా: చిదంబరం సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్యానికి ఘన విజయమని కాంగ్రెస్ సీనియర్ నేత, ఢిల్లీ ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో వాదించిన చిదంబరం అన్నారు. ఇదే తీర్పు పుదుచ్చేరికి కూడా వర్తిస్తుందన్నారు. ‘ప్రాతినిధ్య ప్రజాస్వామ్యానికి దక్కిన ఘన విజయం. క్లీన్ చిట్ ఉన్న లెఫ్టినెంట్ అనిల్ బైజాల్.. రాజకీయ గురువుల మాట విని తప్పుడు మార్గంలో ఎందుకు నడిచారు?’ అని ఆయన ట్వీటర్లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చిదంబరం ఇంటికి వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు. నష్టం జరిగినా కేజ్రీవాల్‌కు పండుగే: బీజేపీ తన ప్రభుత్వానికి పూర్తి అధికారాలివ్వాలన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించినా ఆయన పండుగ చేసుకుంటున్నారని బీజేపీ ఎద్దేవా చేసింది. పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా మీడియాతో మాట్లాడుతూ..‘సీఎం, ఎల్జీ మధ్య జరుగుతున్న అధికార పోరాటంలో అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. రాజ్యాంగ గౌరవాన్ని నిలబెట్టింది. కేబినెట్ నిర్ణయాలను గవర్నర్‌కు తెలియజేయాలని న్యాయస్థానం పేర్కొంది. రాజ్యాంగానికి తన కిష్టమైన అర్థాన్ని చెప్పడం కేజ్రీవాల్ నైజం. నష్టపోయినా ఉత్సవాలు జరుపుకునేదెవరంటే కేజ్రీవాల్ అనే సమాధానం వస్తుంది’ అని ఆయన ఎద్దేవా చేశారు. ఇదీ ‘ఢిల్లీ’ చరిత్ర... న్యూఢిల్లీ: బ్రిటిష్ హయాం నుంచి నేటి వరకు ఢిల్లీ పాలనలో చోటుచేసుకున్న కీలక పరిణామాలివీ.. బ్రిటిష్ పాలకులు 1911లో దేశ రాజధానిని కోల్‌కతా నుంచి ఢిల్లీకి మార్చారు. ఆ సమయంలో ఢిల్లీకి అధినేతగా ఓ కమిషనర్‌ను నియమించి, దాన్ని చీఫ్ కమిషనర్ ప్రావిన్స్ అని పిలిచేవారు. 1950, జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చాక ఢిల్లీని పార్ట్–సీ రాష్ట్రంగా మార్చారు. అక్కడ అసెంబ్లీ ఏర్పాటుచేయడానికి ప్రత్యేక చట్టం చేశారు. పార్ట్– ఏ,బీ,సీ,డీ రాష్ట్రాలను రద్దుచేస్తూ 1956, అక్టోబర్ 19న రాష్ట్రాల పునర్విభజన చట్టానికి ఆమోదం లభించింది. ఫలితంగా దేశంలోని ప్రాంతాలను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలుగా వర్గీకరించారు. దీనిలో భాగంగా, రాష్ట్రపతి నియమించే వ్యక్తి పాలించేలా ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతమైంది. ఢిల్లీ శాసనసభ, శాసనమండలి రద్దయ్యాయి. ఆ తరువాత కేంద్రపాలిత ప్రాంతాల్లో అసెంబ్లీలు, మంత్రి మండళ్లను ఏర్పాటుచేసేందుకు 1963లో గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ యాక్ట్ చేశారు. అయితే ఈ చట్టాన్ని ఢిల్లీకి వర్తింపచేయలేదు. కానీ, 1966 నాటి ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ చట్టం ప్రకారం..56 మంది ఎన్నికైన సభ్యులతో కూడిన మెట్రోపాలిటన్ కౌన్సిల్, ఐదుగురు నామినేటెడ్ సభ్యులతో పరిమిత ప్రభుత్వ ప్రాతినిధ్యాన్ని కల్పించారు. గవర్నర్/అడ్మినిస్ట్రేటర్/చీఫ్ కమిషనర్ రాష్ట్రపతి నియంత్రణలో ఉంటూ రాష్ట్రాల గవర్నర్ల మాదిరిగా విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని 1966, ఆగస్టు 20న కేంద్ర హోం శాఖ ఉత్తర్వులిచ్చింది. ఢిల్లీకి ఏ హోదా ఇవ్వాలన్న విషయమై 1987లో బాలక్రిష్ణన్ కమిటీని నియమించారు. ఢిల్లీని కేంద్రపాలిత ప్రాంతంగానే సాగిస్తూ, శాసనసభ, మంత్రిమండలిని ఏర్పాటుచేయాలని ఆ కమిటీ సిఫార్సు చేసింది. శాంతి భద్రతల పరిరక్షణ, స్థిరత్వం కోసం ప్రత్యేక హోదా ఇచ్చేలా రాజ్యాంగపర చర్యలు తీసుకోవాలంది. ఫలితంగా 1991లో 69వ రాజ్యాంగ సవరణ చేపట్టి, నిబంధన 239ఏఏ (ఢిల్లీకి ప్రత్యేక నిబంధనలు), 239ఏబీ(రాజ్యాంగ వ్యవస్థలు విఫలమైన సందర్భాలు)లను చేర్చారు. నాలుగేళ్ల క్రితమే వివాదానికి బీజాలు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ)తో రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదానికి బీజాలు నాలుగేళ్ల క్రితమే పడ్డాయి. 2014లో గ్యాస్ ధరలను ఏకపక్షంగా నిర్ణయించారంటూ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీతోపాటు కేంద్ర మంత్రులు వీరప్ప మొయిలీ, మురళీ దేవ్రా తదితరులపై కేజ్రీవాల్ కేసు పెట్టారు. ► 2014, మే 2: ఈ కేసును కొట్టేయాలంటూ రిలయన్స్ కంపెనీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను విచారించే అధికారం ఢిల్లీ ఏసీబీకి ఇస్తూ 1993లో కేంద్రం జారీ చేసిన ఆదేశాలను సవాల్ చేసింది. ► 2014 మే 8: కేంద్ర మంత్రుల కేసులపై విచారణ అధికారం ఏసీబీకి ఇవ్వడాన్ని కేంద్రం ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. ► 2014 ఆగస్టు 19: గ్యాస్ ధరల నిర్ణయంపై కేంద్ర మంత్రులతోపాటు రిలయన్స్‌పై పెట్టిన కేసుల దర్యాప్తు పరిధి నుంచి కేంద్రం తమను తప్పించిందని ఏసీబీ హైకోర్టుకు తెలిపింది. ► 2015 జూన్ 27: ఏసీబీ చీఫ్‌గా ఎల్జీ నియమించిన ఎంకే మీనాను ఏసీబీ ఆఫీసులోకి ప్రవేశించనీయరాదంటూ రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో వేసింది. ► 2016 ఆగస్ట్ 4: ఎల్జీ కేబినెట్ సలహా మేరకు పనిచేయాల్సిన అవసరం లేదని హైకోర్టు పేర్కొంది. ► 2016 సెప్టెంబర్ 9: ఈ తీర్పుపై ఆ రాష్ట్రం సుప్రీంను ఆశ్రయించింది. ► 2017 డిసెంబర్ 6: ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును వాయిదావేసింది. ఓటుహక్కుది చిరస్థాయి: సుప్రీం న్యూఢిల్లీ: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుహక్కు చిరస్థాయిగా నిలిచిపోతుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ దేశం తమదేననే భావనను అది ప్రజల్లో పెంపొందిస్తుందని పేర్కొంది. ఢిల్లీకి రాష్ట్ర హోదా ఇవ్వడం సాధ్యం కాదని పేర్కొంటూ, లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలకు కోత పెడుతూ వెలువరించిన చారిత్రక తీర్పులో ఈ విధంగా స్పందించింది. ప్రజ ల ఆకాంక్షలు అమలయ్యేలా చూడటం అవసరమంది. ‘ఓటుహక్కు ప్రాథమిక హక్కు మాత్రమే కాదు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వానికి అది గుండెకాయ స్థానంలో ఉంటుంది’ అని పేర్కొంది. -
‘సుప్రీం’ కొత్త రోస్టర్
న్యూఢిల్లీ: న్యాయమూర్తులకు కేసుల కేటాయింపు చేస్తూ సుప్రీంకోర్టు ఆదివారం కొత్త రోస్టర్‌ను విడుదల చేసింది. ఈ రోస్టర్ జూలై 2 నుంచి (వేసవి సెలవుల ముగిసి కోర్టు ప్రారంభం అయ్యాక) అమల్లోకి రానుంది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తిగా జస్టిస్ జాస్తి చలమేశ్వర్ రిటైరైన రెండ్రోజుల్లోనే ఈ జాబితా సిద్ధవమడం గమనార్హం. ఈ రోస్టర్ ప్రకారం.. సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ సామాజిక న్యాయం, ఎన్నికలు, హెబియస్ కార్పస్, కోర్టు ధిక్కరణతోపాటు అన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను విచారించనుంది. రెండో సీనియర్ జడ్జి అయిన జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని బెంచ్.. కార్మిక చట్టాలు, పరోక్ష పన్నులు, పర్సనల్ లా– కంపెనీ లా కేసులను విచారించనుంది. జస్టిస్ లోకుర్ నేతృత్వంలోని ధర్మాసనం పర్యావరణ అసమతుల్యత, అటవీ సంరక్షణ, జంతు సంరక్షణ, భూగర్భ జలాలకు సంబంధించిన కేసులను విచారిస్తుంది. మరో సీనియర్ జడ్జి జోసెఫ్ కురియన్ నేతృత్వంలోని బెంచ్.. కార్మిక చట్టాలతోపాటు అద్దె చట్టం, కుటుంబ వివాదాలు, కోర్టు ధిక్కరణ, పర్సనల్ లా కేసులను విచారిస్తుంది. ఐదుగురు సీనియర్ న్యాయమూర్తుల కొలీజియంలో కొత్తగా చేరిన జస్టిస్ ఏకే సిక్రీ ధర్మాసనం.. పరోక్ష పన్నులతోపాటు ఎన్నికలు, క్రిమినల్ కేసులు, ఆర్డినరీ సివిల్ కేసులు, న్యాయాధికారుల నియామకం తదితర అంశాలను విచారిస్తుంది. ఈ ఐదుగురితోపాటు.. మరో ఆరుగురు న్యాయమూర్తుల నేతృత్వంలోనూ ధర్మాసనాలు ఏర్పాటుచేసినట్లు కొత్త రోస్టర్ పేర్కొంది. ఎస్ఏ బాబ్డే, ఎన్వీ రమణ, అరుణ్ మిశ్రా, ఏకే గోయల్, ఆర్ఎఫ్ నారీమన్, ఏఎమ్ సప్రేల నేతృత్వంలోనూ పలు కేసుల కేటాయింపులతో ధర్మాసనాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. -
నిబంధనల మేరకే సీజేఐ ఎంపిక
న్యూఢిల్లీ: భారత సుప్రీంకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తి ఎంపిక విషయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్దేశాలను ఎవరూ ప్రశ్నించాల్సిన అవసరం లేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం ప్రస్తుత సీజేఐ తన తర్వాత ఉన్న సీనియర్ న్యాయమూర్తుల్లో ఒకరిని తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా ఎంపిక చేస్తారని.. అనంతరం కార్యనిర్వాహక వ్యవస్థ చర్చించి తుది నిర్ణయం తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. సీజేఐ దీపక్ మిశ్రా పదవీ కాలం అక్టోబర్ 2న ముగియనున్న నేపథ్యంలో.. సీనియర్ అయిన రంజన్ గొగోయ్‌కు సీజేఐ పదవి దక్కుతుందా అన్న ప్రశ్నకు రవిశంకర్ ఈ సమాధానమిచ్చారు. ఆలిండియా జ్యుడీషియల్ సర్వీసెస్ (ఏఐజేఎస్) విషయంలో న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థ మధ్య భేదాభిప్రాయాలున్న విషయాన్ని అంగీకరిస్తూనే.. కిందిస్థాయి కోర్టుల్లో న్యాయమూర్తుల ఎంపికలోనూ ఓ ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు. దేశ ఎన్నికల వ్యవస్థను ప్రభావితం చేసే విధంగా.. పలు సంస్థలు భారతీయుల డేటాను దుర్వినియోగం చేయడాన్ని సహించబోమని ఆయన హెచ్చరించారు. వీరిపై కఠిన చర్యలు తప్పవన్నారు. దీనిపై ఇప్పటికే ఫేస్బుక్ క్షమాపణలు చెప్పిందని.. కేంబ్రిడ్జ్ అనలిటికా నుంచి ఇంకా వివరాలు సేకరిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్ గుర్తింపు వ్యవస్థ అయిన ఆధార్‌ను రవిశంకర్ సమర్థించుకున్నారు. 121 కోట్ల మంది భారతీయులకు కేంద్ర పథకాల లబ్ధిని అందించడంలో ఆధార్ కీలకమన్నారు. ఆధార్ వ్యవస్థను మరింత పకడ్బందీగా మారుస్తున్నట్లు ఆయన చెప్పారు. ముస్లిం మహిళల హక్కులను కాపాడేందుకు ట్రిపుల్ తలాక్ బిల్లుకు మద్దతివ్వాలని సీనియర్ మహిళా నేతలైన సోని యా గాంధీ, మాయావతి, మమత బెనర్జీలను మంత్రి కోరారు. ఈ అంశంపై రాజకీయాలకు అతీతంగా స్పందిం చాల్సిన అవసరం ఉందన్నారు. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యా వంటి ఆర్థిక నేరస్తులపై కఠినంగా వ్యవహరించేలా చట్టాల్లో మార్పులు చేస్తున్నట్లు చెప్పారు. -
గవర్నర్ నిర్ణయంపై సుప్రీంకు కాంగ్రెస్
న్యూఢిల్లీ: బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించటంపై కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బుధవారం రాత్రి సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రాను కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ నేతృత్వంలోని కాంగ్రెస్ సభ్యుల బృందం కలిసింది. కర్ణాటక గవర్నర్ నిర్ణయం చాలా తీవ్రమైన అంశమని.. దీనిని బుధవారం అర్ధరాత్రే విచారణకు స్వీకరించాలని సీజేఐ కోరింది. గురువారం ఉదయం యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేయనున్నందున.. తక్కువ సమయం కారణంగా అత్యవసర విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేసింది. అనంతరం సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ కార్యాలయం చేరుకున్న కాంగ్రెస్ బృందం.. ఈ కేసును రిజిస్టర్ చేసింది. ‘కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుచేయటం అనైతికం, రాజ్యాంగ విరుద్ధం. అక్రమంగా బీజేపీ గద్దెనెక్కడం దారుణం’ అని వ్యాఖ్యానించింది. -
‘కావేరి’ ప్రణాళికను ఆపలేం
న్యూఢిల్లీ: కావేరి నదీ జలాల పంపిణీ ముసాయిదా ప్రణాళిక ఆమోదాన్ని వాయిదా వేయాలన్న కర్ణాటక అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ప్రణాళికను తయారుచేయాల్సిందిగా తాము కేంద్ర ప్రభుత్వాన్ని మాత్రమే ఆదేశించామనీ, రాష్ట్రాలకు ఈ విషయంతో సంబంధం లేదని సీజేఐ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. కోర్టు ఆదేశానుసారం కావేరి జలాల పంపిణీ ముసాయిదా ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం ఇటీవల ధర్మాసనానికి సమర్పించింది. దీనిపై కర్ణాటక తరఫు న్యాయవాది దివాన్ తన వాదనలు వినిపిస్తూ ‘ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతోంది. రాబోయే 15 ఏళ్ల వరకు ఈ నీటి పంపకాలు అమల్లో ఉంటాయి. కాబట్టి కొత్త ప్రభుత్వ సూచనలను నివేదించేందుకు జూలై తొలివారం వరకు సమయం అవసరం. అప్పటివరకు ముసాయిదాను ఆమోదించకండి’ అని ధర్మాసనాన్ని కోరారు. తమిళనాడు న్యాయవాది శేఖర్ కర్ణాటక అభ్యర్థనపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ జూలై వరకు ఆగితే జూన్‌లో తమ రాష్ట్రానికి రావాల్సిన నీళ్ల సంగతేమిటని ప్రశ్నించారు. కోర్టు జోక్యం చేసుకుంటూ రాష్ట్రాలకు ఈ అంశంలో పాత్ర లేదనీ, ఫిబ్రవరి 16 నాటి తీర్పు ప్రకారం ప్రణాళికను కేంద్రం రూపొందిస్తే తాము ఆమోదిస్తామంది. కేంద్రానికి ఆ అధికారం వద్దు: భవిష్యత్తులో అవసరమైనప్పుడు రాష్ట్రాల మధ్య కావేరి జలాల వాటాను మార్చే అధికారాన్ని తనవద్దే పెట్టుకుంటూ కేంద్రం ఈ ముసాయిదాను తయారుచేసింది. దీనిపై తమిళనాడు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆ నిబంధనను మార్చాలని కేంద్రాన్ని ధర్మాసనం ఆదేశించింది. -
జస్టిస్ జోసెఫ్ పదోన్నతిపై నిర్ణయం వాయిదా
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్‌కు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి అంశాన్ని పునఃసమీక్షించే విషయంపై సుప్రీం కోర్టు కొలీజియం తన నిర్ణయాన్ని వాయిదా వేసింది. సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ కేఎం జోసెఫ్‌కు పదోన్నతి కల్పిస్తూ కొలీజియం చేసిన సిఫార్సును కేంద్ర ప్రభుత్వం గత వారం వెనక్కి పంపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ జె.చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్.బి.లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌లతో కూడిన సుప్రీంకోర్టు కొలీజియం బుధవారం కోర్టు కార్యకలాపాలు ముగిసిన అనంతరం సమావేశమైంది. అయితే ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. జస్టిస్ జోసెఫ్ అంశం కాకుండా కొలీజియంఎజెండాలో కలకత్తా, రాజస్తాన్, తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ హైకోర్టుల్లోని కొందరు న్యాయమూర్తులకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించే అంశంపైనా చర్చ జరిగింది. అయితే నిర్ణయాన్ని వాయిదా వేశారు. ఈ మేరకు సమావేశం తీర్మానం కాపీని సుప్రీంకోర్టు వెబ్సైట్లో పొందుపరిచారు. బుధవారం కోర్టుకు హాజరుకాని జస్టిస్ చలమేశ్వర్ కొలీజియం సమావేశానికి మాత్రం హాజరయ్యారు. అయితే కొలీజియం తిరిగి ఎప్పుడు సమావేశం అవుతుందనే విషయంపై ఎటుంటి అధికారికా ప్రకటనా వెలువడలేదు. -
రేపు సుప్రీం కొలీజయం భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉత్తరాఖండ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్ పేరును మరోసారి సిఫార్సు చేసేందుకు సుప్రీంకోర్టు కొలీజియం బుధవారం సమావేశమయ్యే అవకాశముంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని అత్యంత సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ మదన్ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌లు ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. కాగా కొలీజియం మళ్లీ ప్రతిపాదనలు పంపినా కేంద్రం వాటిని ఆమోదించకపోవచ్చని సుప్రీం వర్గాలు భావిస్తున్నాయి. అదే జరిగితే రాజ్యాంగ సంక్షోభానికి దారితీయవచ్చని చెబుతున్నారు. -
ఫుల్‌కోర్ట్ సమావేశం ఏర్పాటు చేయండి
న్యూఢిల్లీ: అత్యున్నత న్యాయవ్యవస్థను అప్రతిష్టపాలు చేస్తున్న వ్యవస్థాగత లోపాలపై చర్చించేందుకు ఫుల్‌కోర్ట్ (సుప్రీంకోర్టులోని అందరు న్యాయమూర్తులతో) సమావేశం ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్.బి.లోకూర్ సీజేఐ దీపక్ మిశ్రాకు లేఖ రాశారు. సీజేఐకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఇచ్చిన అభిశంసన తీర్మానం నోటీసును రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు తిరస్కరించడానికి ముందు రోజు అంటే ఈ నెల 22న ఈ లేఖ రాశారు. రెండే రెండు వాక్యాలు మాత్రమే ఉన్న ఈ లేఖపై గొగోయ్, లోకూర్ సంతకాలు చేశారు. మార్చి 21న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, ఏప్రిల్ 9న మరో న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ కూడా న్యాయ వ్యవస్థలోని లోపాలపై ఫుల్ కోర్టు ఏర్పాటు చేయాలని కోరడం గమనార్హం. సోమవారం ఉదయం టీ మీటింగ్‌కు న్యాయమూర్తులంతా హాజరైన సమయంలో ఈ లేఖ అంశం చర్చకు వచ్చినట్టు తెలిసింది. అయితే అప్పటికే అభిశంసన తీర్మానాన్ని రాజ్యసభ చైర్మన్ తిరస్కరించినట్టు ప్రకటించారు. దీంతో ఈ సమావేశానికి సంబంధించిన విషయాలను గురించి సీజేఐ ఎక్కడా మాట్లాడలేదని తెలిసింది. -
అభిశంసన కుదరదు!
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాపై అభిశంసన కోసం కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు ఇచ్చిన నోటీసును రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తిరస్కరించారు. పరిగణనలోకి తీసుకునేందుకు నోటీసుకు ఎలాంటి అర్హత లేదని, అందులోని ఆరోపణలు సమర్థనీయం, అంగీకారయోగ్యం కావన్నారు. శనివారం పలువురు న్యాయ నిపుణులు, రాజ్యాంగ కోవిదులతో విస్తృత చర్చల తర్వాత సోమవారం ఈ ఉత్తర్వులిచ్చారు. నోటీసులో పేర్కొన్న దుష్ప్రవర్తన, అసమర్థత అభియోగాల్ని నిరూపించేందుకు కచ్చితమైన సమాచారం లేనందుకే తిరస్కరిస్తున్నట్లు చెప్పారు ఈ కేసులో పేర్కొన్న ఆరోపణలు న్యాయవ్యవస్థ స్వతంత్రతకు తీవ్ర నష్టం కలిగించేలా ఉన్నాయని వెంకయ్య తప్పుపట్టారు. కాగా రాజ్యసభ చైర్మన్ తమ నోటీసుపై హడావుడిగా నిర్ణయం తీసుకున్నారని, ఇది అసాధారణమే కాక చట్ట విరుద్ధమని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ వెల్లడించారు. లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్స్, మాజీ ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులతో పాటు ప్రముఖ న్యాయ, రాజ్యాంగ నిపుణులతో చర్చించిన అనంతరం వెంకయ్య ఈ నిర్ణయం తీసుకున్నారని రాజ్యసభ వర్గాలు వెల్లడించాయి. భారతదేశ చరిత్రలో తొలిసారిగా సీజేఐపై ప్రతిపక్షాలు అభిశంసన నోటీసులివ్వడం తెల్సిందే. కాంగ్రెస్ నేతృత్వంలో 7 విపక్ష పార్టీలు జస్టిస్ మిశ్రాకు వ్యతిరేకంగా రాజ్యసభ చైర్మన్‌కు నోటీసులిచ్చారు. నోటీసులపై 64 మంది రాజ్యసభ సభ్యులు, ఏడుగురు మాజీ సభ్యులు సంతకాలు చేశారు. దుష్ప్రవర్తనతో పాటు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపణలు చేశారు.ప్రతిపక్షాల నోటీసుపై పలువురు న్యాయ నిపుణులు, రాజ్యాంగ నిష్ణాతుల అభిప్రాయం మేరకు నోటీసుల్ని తిరస్కరిస్తున్నట్లు వెంకయ్య ప్రకటించారు. ‘ప్రతిపక్షాల నోటీసులోని అంశాల్ని పూర్తిగా పరిశీలించాను. న్యాయ నిపుణులు, రాజ్యంగ కోవిదులతో సంప్రదింపుల అనంతరం వ్యక్తమైన అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకున్నాక నోటీసుకు ఎలాంటి అర్హత లేదని అభిప్రాయానికి వచ్చాను. అందువల్ల నోటీసును తిరస్కరిస్తున్నాను’ అని ఉత్తర్వుల్లో వెంకయ్య పేర్కొన్నారు.నోటీసు ద్వారా వ్యక్తమైన అంశాలపై అన్ని కోణాల్లో వ్యక్తిగతంగా సంప్రదింపులు జరిపానని, ఒక్కో ఆరోపణను విడివిడిగానే కాకుండా, సమష్టిగా కూడా పరిగణనలోకి తీసుకున్నానని ఆయన తెలిపారు. ‘ఇది సుప్రీంకోర్టు స్వయంగా పరిష్కరించుకోవాల్సిన అంతర్గత అంశం. నోటీసులో పేర్కొన్న ఐదు ఆరోపణల్ని నిశితంగా పరిశీలించాక.. అవి సమర్ధనీయం కాదు, అలాగే అంగీకారయోగ్యం కావనే అభిప్రాయానికి వచ్చాను. ఈ కేసులోని ఆరోపణలు రాజ్యాంగ మౌలిక సూత్రాల్లో ఒకటైన న్యాయ వ్యవస్థ స్వతంత్రతను బలహీనపరిచేలా ఉంది. ఎంతో జాగ్రత్తగా అధ్యయనం చేశాక.. నోటీసులో నిరూపించదగ్గ ఆరోపణలు లేవని నిర్ధారణకు వచ్చాను. తీర్మానానికి సంబంధించి రాజ్యసభ నియమావళిని పరిశీలించడంతో పాటు విస్తృత సంప్రదింపులు, రాజ్యాంగ నిపుణుల అభిప్రాయాల్ని పరిశీలించాక నోటీసును పరిగణనలోకి తీసుకోవడం వాంఛనీయం కాదన్న అంశంతో సంతృప్తి చెందాను’ అని రాజ్యసభ చైర్మన్ తెలిపారు. న్యాయవ్యవస్థను భయపెట్టే ప్రయత్నం: బీజేపీ న్యాయవ్యవస్థను భయపెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని బీజేపీ ఆరోపించింది. ఓట్లు, ప్రజల మద్దతు కోల్పోయిన కాంగ్రెస్ ఇప్పుడు న్యాయవ్యవస్థపై ఒత్తిడి తెచ్చేందుకు కుయుక్తులు పన్నుతోందని బీజేపీ అధికార ప్రతినిధి మీనాక్షి లేఖీ తప్పుపట్టారు. విపక్షాల పిటిషన్‌ను తిరస్కరించినందుకు ఉప రాష్ట్రపతికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ప్రజల తిరస్కారానికి గురైన కాంగ్రెస్... అసత్యాలు, ఇతరుల ప్రోద్బలంతో కూడిన పిటిషన్ల ద్వారా కోర్టు ఆవరణల నుంచి దేశాన్ని నడిపించలేదని న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ విమర్శించారు. నాలుగేళ్ల క్రితం గుండె నొప్పితో మరణించిన జడ్జి లోయా మృతిని కూడా కాంగ్రెస్ రాజకీయ అస్త్రంగా వాడుకుందని ఆయన తప్పుపట్టారు. 15 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన న్యాయమూర్తులు సోమవారం సుప్రీంకోర్టులో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సీజేఐ దీపక్ మిశ్రాతో పాటు ఇతర సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బెంచ్‌లపైకి 15 నిమిషాలు ఆలస్యంగా రావడంతో పలు ఊహాగానాలు విన్పించాయి. సీజేఐపై విపక్షాల అభిశంసన నోటీసు, తిరస్కరణ అంశంపై వారు చర్చించి ఉండవచ్చని పలువురు న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. ఉదయం 10.30 గంటలకు సుప్రీంలోని అన్ని బెంచ్‌లు పనిని ప్రారంభించాల్సి ఉండగా.. 10.45 వరకూ న్యాయమూర్తులు బెంచ్‌లపైకి రాలేదు. 15 నిమిషాలు ఆలస్యంగా బెంచ్‌కి వచ్చిన సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం వెంటనే కేసుల విచారణను ప్రారంభించింది. రాజ్యసభ చైర్మన్కుఆ అధికారం ఉంది: న్యాయ నిపుణులు సీజేఐపై అభిశంసన కోసం ఇచ్చిన నోటీసులో పరిగణనలోకి తీసుకునే అంశాలు లేవని, ఉప రాష్ట్రపతి సరైన నిర్ణయం తీసుకున్నారని ప్రముఖ న్యాయవాది ఫాలీ ఎస్ నారిమన్ అన్నారు. నోటీసుపై నిర్ణయం తీసుకునేందుకు చట్టబద్ధమైన అధికారం రాజ్యసభ చైర్మన్‌కు మాత్రమే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఉప రాష్ట్రపతి నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు సుప్రీంకోర్టుకు వెళ్లినా విజయం సాధించే అవకాశాలు లేవని మరో ప్రముఖ న్యాయవాది సోలి సొరాబ్జీ చెప్పారు. ‘ఉప రాష్ట్రపతి తన బుద్ధి కుశలతను వినియోగించి న్యాయ నిపుణులతో సంప్రదించాక నిర్ణయానికి వచ్చారు’ అని ప్రశంసించారు. కాగా లోక్‌సభ మాజీ స్పీకర్ సోమనాథ్ చటర్జీ స్పందిస్తూ.. వెంకయ్య నాయుడు హడావుడిగా నిర్ణయం తీసుకున్నారని, ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కాదు అని పేర్కొన్నారు. హడావుడిగా నిర్ణయం తీసుకున్నారు: కాంగ్రెస్ అభిశంసన తీర్మానాన్ని తిరస్కరిస్తూ వెంకయ్య తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ మండిపడింది. ఈ నిర్ణయం దేశ న్యాయ వ్యవస్థను ప్రమాదంలోకి నెట్టిందని, ప్రజల నమ్మకంపై నీళ్లు చల్లిందని విమర్శించింది. నోటీసులోని అంశాల్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేయకుండా హడావుడిగా నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ నేత, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఆరోపించారు. ‘ఇది అసాధారణ, చట్ట విరుద్ధమైన పొరపాటు నిర్ణయం. మేం తప్పకుండా ఈ ఉత్తర్వుల్ని సవాలు చేస్తూ సుప్రీంలో పిటిషన్ వేస్తాం’ అని చెప్పారు. అభిశంసన నోటీసుపై సంతకం చేసినందుకు సీజేఐ దీపక్ మిశ్రా న్యాయమూర్తిగా ఉన్న ధర్మాసనం ముందు తాను వాదించబోనన్నారు. ‘నేను సీజేఐ ముందు వాదించను. వృత్తి విలువలను పాటిస్తాను. అభిశంసన నోటీసుపై సంతకం చేసి ఎలా వాదిస్తాను? నైతికంగా అది అసంబద్ధం. వృత్తి ప్రమాణాలకు విరుద్ధం’అని సిబల్ అన్నారు. ఏఐసీసీ మీడియా ఇన్చార్జ్ రణ్‌దీప్ సూర్జేవాల మాట్లాడుతూ.. ఇది ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకిస్తున్న, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తున్న శక్తుల మధ్య పోరు అని అభివర్ణించారు. ఉద్దేశ్యపూర్వకంగానే అభిశంసన తీర్మానాన్ని తిరస్కరించారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ ట్వీటర్లో పేర్కొన్నారు. ఆధారాలు అవసరం: వెంకయ్య ఆలోచన, మాట, చర్య ద్వారా పరిపాలన మూలస్తంభాల్ని బలహీనపరిచేందుకు అనుమతించకూడదని ఉత్తర్వుల్లో వెంకయ్య సూచించారు. ‘పిటిషన్లో వాడిన వ్యాఖ్యలు అనుమానం, ఊహా లేదా అంచనాల్ని మాత్రమే వెల్లడిస్తున్నాయి. నోటీసులో పేర్కొన్న అంశాలకు సరైన ఆధారాలు చూపలేదు. ఆర్టికల్ 124(4) ప్రకారం దుష్ప్రవర్తనను నిరూపించాలంటే ఆధారాలు అవసరం’ అని అన్నారు. అభిశంసన నోటీసుపై ప్రతిపక్ష పార్టీల ప్రెస్ కాన్ఫరెన్స్‌ను ప్రస్తావిస్తూ.. రాజ్యసభ సభ్యుల నియమావళిలోని పేరా 2.2లో పేర్కొన్న పార్లమెంటరీ ఆచారాలు, సంప్రదాయాల్ని సభ్యులు విస్మరించారన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నానని వెంకయ్య చెప్పారు. కాగా, జడ్జి అభిశంసనకు సంబంధించిన నోటీసును తిరస్కరించే చట్టబద్ధ అధికారం రాజ్యసభ చైర్మన్‌కు ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ‘జడ్జిల విచారణ యాక్ట్’ ప్రకారం సంప్రదింపులు, నిబంధనల అధ్యయనం అనంతరం రాజ్యసభ చైర్మన్ లేదా లోక్‌సభ స్పీకర్ నోటీసును అనుమతించవచ్చు లేదా తిరస్కరించవచ్చని తెలిపాయి. గతంలోనూ ఈ తిరస్కరణలు జడ్జిలపై అవిశ్వాస నోటీసులు ఆదిలోనే తిరస్కరణకు గురవ్వడం ఇదే తొలిసారి కాదు. 1970లో నాటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జేసీ షా అభిశంసన కోసం నాటి లోక్‌సభ స్పీకర్ జీఎస్ ధిల్లాన్‌కు నోటీసులు అందాయి. అయితే అభిశంసనకు అవసరమైనంత తీవ్రమైన విషయాలు నోటీసులో లేవని పేర్కొంటూ తదుపరి చర్యలు చేపట్టేందుకు స్పీకర్ తిరస్కరించారు. అలాగే 2015లోనూ గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేబీ పార్దివాలా రిజర్వేషన్లపై అనుచితంగా మాట్లాడారంటూ 58 మంది రాజ్యసభ సభ్యులు ఆయనపై అభిశంసనకు నాటి రాజ్యసభ అధ్యక్షుడు హమీద్ అన్సారీకి నోటీసులు అందజేశారు. అయితే అభిశంసనపై తదుపరి చర్యలు చేపట్టక ముందే రిజర్వేషన్లపై తన వ్యాఖ్యలను సర్దివాల తొలగించడంతో ఆ విషయం అక్కడితో ముగిసింది. -
వెంకయ్యా.. ఇదేందయ్యా..!
సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తిపై అభిశంసన తీర్మాన నోటీసులపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నిర్ణయంపై ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సీజేఐ దీపక్ మిశ్రాపై అభిశంసన కోరుతూ 64 మంది ఎంపీలు సంతకాలు చేసిన నోటీసులు గత వారం ఉప రాష్ట్రపతి వద్దకు చేరగా.. సోమవారం వాటిని వెంకయ్య నాయుడు తిరస్కరించిన అనంతరం ప్రశాంత్ భూషణ్ స్పందించారు. ఉపరాష్ట్రపతికి నేతలు ఇచ్చిన అభిశంసన తీర్మానం నోటీసులు సరిగ్గా ఉన్నాయో లేదో చెప్పడం మాత్రమే వెంకయ్య పని అని, తిరస్కరించే అధికారం లేదని అభిప్రాయపడ్డారు. 'తన వద్దకు తీర్మానం నోటీసులలో 50 మంది కంటే ఎక్కువ ఎంపీలు సంతకాలు చేశారా లేదా అన్నది చూడాలి. అసలు ఏ విషయం ఆధారంగా తీర్మానాన్ని వెంకయ్య తిరస్కరించారు. ఆ నిర్ణయం తీసుకునే అధికారం ఉపరాష్ట్రపతికి ఉండదు. ముగ్గురు జడ్జీలతో కమిటీ నియమించాలని ఎంపీలు నోటీసులలో కోరారు. కానీ అభిశంసన తీర్మానాన్ని తీరస్కరించడం సరైన నిర్ణయం కాదని' ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ట్వీట్ ద్వారా అభిప్రాయపడ్డారు. ఉపరాష్ట్రపతి నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా, రాజ్యసభలో తీర్మానం కోరుతూ కాంగ్రెస్ సహా ఏడు విపక్ష పార్టీలకు చెందిన 64 మంది ఎంపీలు ఇచ్చిన నోటీసులను వెంకయ్య నాయుడు తిరస్కరించారు. సంతకం చేసిన ఎంపీలకు తమ కేసుపై వారికే కచ్చితత్వం లేదని, ఆరోపణలకు సంబంధించి జరిగి ఉండొచ్చు.. అవకాశముంది.. పాల్పడొచ్చు అనే పదాలను ఉపయోగించారని వెంకయ్య నాయుడు తెలిపారు. రాజ్యాంగ నిపుణులతో చర్చించిన తర్వాత నోటీసులను తిర్కరించినట్లు వివరించారు. What!! VP Naidu rejects impeachment motion against CJI signed by 64 RS MPs! On what grounds? He has no power to say that charges are not made out. That's for the inquiry committee of 3 judges. He only has to see if it's signed by >50 MPs & possibly if charges are of misbehaviour — Prashant Bhushan (@pbhushan1) 23 April 2018 -
సీజేఐపై అభిశంసన; తిరస్కరించిన వెంకయ్య
సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తిపై అభిశంసన విషయమై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభలో తీర్మానం కోరుతూ కాంగ్రెస్ సహా ఏడు విపక్ష పార్టీలు ఇచ్చిన అభిశంసన నోటీసులను ఆయన తిరస్కరించారు. న్యాయనిపుణులతో చర్చల అనంతరం వెంకయ్య ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని సోమవారం ఉపరాష్ట్రపతి కార్యాలయం ఒక ప్రకటన విడుదలచేసింది. సుదీర్ఘ సంప్రదింపులు: సీజేఐ దీపక్ మిశ్రాపై అభిశంసన కోరుతూ 64 మంది ఎంపీలు సంతకాలు చేసిన నోటీసులు గత వారం ఉప రాష్ట్రపతి వద్దకు చేరాయి. సదరు నోటీసులను అంగీకరించాలా, వద్దా అనేదానిపై రాజ్యసభ చైర్మన్ వెంకయ్య సుదీర్ఘ సంప్రదింపులు జరిపారు. రాజ్యాంగ, న్యాయ నిపుణులు, అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, మాజీ ఏజీ పరాశరణ్, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్, న్యాయశాఖ మాజీ కార్యదర్శి పీకే మల్హోత్రా తదితరులతో వెంకయ్య మాట్లాడారు. ఒక దశలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డిని కూడా సంప్రదించినట్లు సమాచారం. మూడు రోజుల తర్జనభర్జన తర్వాత చివరికి ‘నోటీసులు తిరస్కరిస్తున్నట్లు’ చెప్పారు. సుప్రీంకు వెళ్లే యోచనలో కాంగ్రెస్: అత్యున్నత న్యాయస్థానంలోని ప్రధాన న్యాయమూర్తి పదవిని అధికార బీజేపీ స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటోందని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. ఒకవేళ అభిశంసన తీర్మానం నోటీసులను ఉపరాష్ట్రపతి తిరస్కరిస్తే సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఆ పార్టీ భావిస్తున్నది. -
విధులకు దూరంగా ఉండాలి
న్యూఢిల్లీ: ఏడు ప్రతిపక్ష పార్టీలు భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) దీపక్ మిశ్రాపై అభిశంసన నోటీసులు ఇచ్చినందున ఆయన న్యాయవిధులకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ కోరింది. గతంలో అభిశంసనను ఎదుర్కొన్న న్యాయమూర్తులు వారిపై వచ్చిన ఆరోపణలు తొలగిపోయే వరకు విధులకు దూరంగా ఉన్నారనీ, జస్టిస్ దీపక్ మిశ్రా కూడా ఆ సంప్రదాయాన్ని పాటించాలని కాంగ్రెస్ పేర్కొంది. సీజేఐకి బీజేపీ మద్దతు తెలపడంపైనా కాంగ్రెస్ మండిపడింది. అత్యున్నత న్యాయస్థానంలోని ప్రధాన న్యాయమూర్తి పదవిని బీజేపీ స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటోందని ఆరోపించింది. ‘తన పదవిని రాజకీయాల కోసం వాడుకోవద్దని బీజేపీకి సీజేఐ చెప్పాలి’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాల అన్నారు. ‘సీజేఐ తనపై ఏ అనుమానాలూ రాకుండా చూసుకోవాలి. ప్రవర్తనపై అనుమానాలు వచ్చినప్పుడు విధుల నుంచి తప్పుకుని విచారణకు సహకరించి తన సచ్ఛీలతను నిరూపించుకోవాల్సిన నైతిక బాధ్యత లేదా?’ అని ప్రశ్నించారు. మరోవైపు అభిశంసన కోసం ఇచ్చిన నోటీసును రాజ్యసభ అధ్యక్షుడు వెంకయ్య నాయుడు తిరస్కరిస్తే సుప్రీంను ఆశ్రయించాలని కాంగ్రెస్, ఇతర పార్టీలు భావిస్తున్నాయి. రాజ్యాంగం ప్రకారం ఎలాంటి గడువూ లేకపోయిన రాజ్యసభ చైర్మన్ నోటీసును అట్టిపెట్టుకోకూడదని న్యాయ నిపుణుడొకరు వ్యాఖ్యానించారు. సంప్రదింపులు ప్రారంభించిన వెంకయ్య అభిశంసన నోటీసులపై సంప్రదింపుల ప్రక్రియను వెంకయ్య నాయుడు ప్రారంభించారు. రాజ్యాంగ, న్యాయ నిపుణులతో ఆదివారం చర్చలు జరిపారు. హైదరాబాద్ పర్యటనను అర్థాంతరంగా ముగించుకుని ఢిల్లీ చేరుకున్న ఆయన.. అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, మాజీ ఏజీ పరాశరణ్, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్, న్యాయశాఖ మాజీ కార్యదర్శి పీకే మల్హోత్రా తదితరులతో మాట్లాడారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డిని కూడా సంప్రదిస్తారని సమాచారం. -
సీజేఐపై అభిశంసన నోటీసులు
న్యూఢిల్లీ: భారతదేశ చరిత్రలో తొలిసారిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)పై అభిశంసన నోటీసులు. ఇప్పటివరకు పలువురు హైకోర్టు న్యాయమూర్తులపై అభిశంసన తీర్మానాలు జారీ అయినప్పటికీ అసాధారణరీతిలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై నోటీసులు ఇవ్వటం ఇదే తొలిసారి. కాంగ్రెస్ నేతృత్వంలో 6 విపక్ష పార్టీలు సీజేఐ మిశ్రాకు వ్యతిరేకంగా ఈ నోటీసులను ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యకు శుక్రవారం అందజేశారు. ఈ అభిశంసన నోటీసులపై 64 మంది రాజ్యసభ సభ్యులు, ఏడుగురు మాజీ ఎంపీలు సంతకాలు చేశారు. సీజేఐ దుష్ప్రవర్తనతోపాటుగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని నోటీసులో విపక్ష నేతలు పేర్కొన్నారు. సీజేఐ తీరుపై 5 ఆరోపణలు చేశారు. భారమైన హృదయంతో..: సిబల్ జడ్జి బీహెచ్ లోయా మృతికేసుపై స్వతంత్ర విచారణ జరపాలన్న పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించిన మరుసటిరోజే ఈ అభిశంసన నోటీసులు ఇవ్వటం చర్చనీయాంశమైంది. ‘ఇలాంటి రోజు వస్తుందనుకోలేదు. కానీ న్యాయవ్యవస్థ స్వతంత్రత కాపాడేందుకు భారమైన హృదయంతో నోటీసులు ఇవ్వక తప్పడంలేదు’ అని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ అన్నారు. సీజేఐపై వచ్చిన ఆరోపణలను విస్మరించలేమన్న సిబల్ ఒకవేళ అభిశంసన తీర్మానానికి ఆమోదం లభిస్తే సంప్రదాయం ప్రకారం ఆయన తక్షణమే తన విధులనుంచి తప్పుకోవాల్సి ఉంటుందన్నారు. ‘ ఈ విచారణలో నిజానిదే తుది విజయం. న్యాయవ్యవస్థ సుస్థిరంగా ఉన్నప్పుడే ప్రజ్వాస్వామ్యం వర్ధిల్లుతుంది’ అని సిబల్ తెలిపారు. ‘రాజ్యసభ చైర్మన్ సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నాము’ అని రాజ్యసభ విపక్ష నేత ఆజాద్ అన్నారు. వారం రోజుల క్రితమే రాజ్యసభ చైర్మన్‌ను కలిసేందుకు అనుమతి కోరామని.. అయితే, శుక్రవారం అపాయింట్మెంట్ దొరికిందని ఆయన తెలిపారు. ఈనోటీసులపై కాంగ్రెస్, ఎన్సీపీ, సీపీఎం, సీపీఐ, ఎస్పీ, బీఎస్పీ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నేతలు సంతకాలు చేశారు. కాంగ్రెస్‌లో విభేదాలు సీజేఐపై అభిశంసన నోటీసుల విషయంలో కాంగ్రెస్‌లో విభేదాలు నెలకొన్నాయి. ఈ నోటీసులపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సీనియర్ నేతలు, న్యాయవాదులైన పి. చిదంబరం, అభిషేక్ సింఘ్వీ తదితరులు సంతకాలు చేయలేదు. అయితే విభేదాలను కాంగ్రెస్ నేతలు తిరస్కరించారు. విపక్షాలన్నీ ఏకతాటిపైనే ఉన్నాయని.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ఉద్దేశపూర్వకంగానే భాగస్వామ్యం చేయలేదన్నారు. మిగిలిన నేతలు కూడా వివిధ కేసులకు సంబంధించిన విరుద్ధ ప్రయోజనాల కారణంగానే.. సంతకాలు చేయలేదన్నారు. మరో సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ ఈ నోటీసులపై చర్చకు వ్యతిరేకంగా ఉన్నారు. ‘అభిశంసన చాలా తీవ్రమైన విషయం. ఒక కేసు తీర్పుపై విభేదించినంత మాత్రాన ఈ నోటీసులు ఇవ్వటం సరికాదు. అందుకే ఉపరాష్ట్రపతిని కలిసే బృందంలో ఉండటం లేదు’ అని ఆయన బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అటు, తృణమూల్ కాంగ్రెస్ కూడా ఈ నోటీసులకు మద్దతివ్వలేదు. ఆర్నెల్లలో పదవీ విరమణ పొందనున్న జస్టిస్ దీపక్ మిశ్రాపై ఇలాంటి నోటీసులు ఇవ్వటం న్యాయబద్ధంగా సరైంది కాదని ఆ పార్టీ భావిస్తోంది. ప్రతీకార పిటిషన్: జైట్లీ సీజేఐపై అభిశంసన నోటీసులను కాంగ్రెస్ పార్టీ రాజకీయ ఆయుధంగా వినియోగించుకుంటోందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విమర్శించారు. జడ్జి లోయా కేసులో కాంగ్రెస్ పన్నిన కుట్రను సుప్రీంకోర్టు భగ్నం చేయటంతో ప్రతీకారంగానే అభిశంసన తీర్మానానికి నోటీసులు ఇచ్చిందన్నారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాకు సోహ్రాబుద్దీన్ కేసుతో ఎటువంటి సంబంధం లేదని.. రాష్ట్ర పోలీసుల సహకారంతో కేంద్ర బలగాలు ఈ ఎన్కౌంటర్ చేశాయన్నారు. కాంగ్రెస్, వారి మిత్రులంతా కలిసి రాజకీయ కుట్రకు పాల్పడుతున్నారన్నారు. అభిశంసన నోటీసుల గురించి ఆలోచించటమే చాలా ప్రమాదకరమన్న జైట్లీ.. అనవసర అంశాలపైనా ఎంపీల సంతకాలను సేకరించటం కష్టమేమీ కాదన్నారు. ఓ న్యాయమూర్తిని భయపెట్టడం.. తద్వారా మరికొందరు న్యాయమూర్తులను హెచ్చరించేందుకే కాంగ్రెస్ ఈ ప్రయత్నం చేసిందన్నారు. గత 25 ఏళ్లలో.. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులపై అభిశంసన తీర్మానాలివ్వటం గత 25 ఏళ్లలో మూడుసార్లు జరిగింది. కానీ..సిట్టింగ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై అభిశంసన నోటీసులు ఇవ్వటం మాత్రం ఇదే తొలిసారి. 1993లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.రామస్వామిపై అవినీతి ఆరోపణలు రావటంతో అభిశంసన తీర్మానం ప్రవేశ పెట్టారు. ఇది పార్లమెంటులో ఓటింగ్ వరకు చేరుకుంది. అయితే లోక్‌సభలో ఓటింగ్‌లో మూడింట రెండొంతుల మెజారిటీ రాకపోవటంతో తీర్మానం వీగిపోయింది. 2011లో కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి సౌమిత్ర సేన్‌పై ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇది రాజ్యసభలో ఆమోదం పొంది.. లోక్‌సభకు ఓటింగ్ కోసం వచ్చింది. ఫలితాన్ని ముందుగానే ఊహించిన జస్టిస్ సౌమిత్ర సేన్ తన పదవికి రాజీనామా చేశారు. 2011లోనే సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ పీడీ దినకరన్‌పై అవినీతి ఆరోపణలొచ్చాయి. ప్రాథమిక విచారణలోనే అవి వాస్తవమేనని తేలింది. సెలవుపై వెళ్లాలని ఆదేశించినా వినకపోవటంతో కర్ణాటక హైకోర్టుకు ఆయన్ను బదిలీ చేశారు. అయితే అభిశంసన ప్రక్రియకు పావులు కదులుతుండగానే ఆయన రాజీనామా చేశారు. 2016లో.. తన అధికారాలను దుర్వినియోగంచేసి ఓ దళిత జూనియర్ సివిల్ జడ్జిని బెదిరింపులకు గురిచేశారన్న ఆరోపణలపై జస్టిస్ నాగార్జున్‌రెడ్డిపై అభిశంసన తీర్మానాన్ని పెట్టారు. అయితే దీన్ని బలపరిచిన వారిలో 19 మంది తమ సంతకాలను వెనక్కు తీసుకోవటంతో ఈ అభిశంసన వీగిపోయింది. సీజేఐపై ఐదు ఆరోపణలు 1. ప్రసాద్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ కేసు విషయంలో ముడుపులు తీసుకున్నారు. ఇదే కేసులో రిటైర్డు హైకోర్టు న్యాయమూర్తికి వ్యతిరేకంగా చర్యలు తీసుకునేందుకు అనుమతివ్వలేదు. 2. సుప్రీంకోర్టులో ప్రసాద్ ఎడ్యుకేషన్ ట్రస్ట్‌పై విచారణకు సంబంధించిన పిటిషన్‌ను ముందు తేదీకి మార్చటం (ఇది చాలా తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్నామన్న కాంగ్రెస్) 3. రాజ్యాంగ ధర్మాసనానికి తనే నేతృత్వం వహిస్తున్నప్పటికీ ప్రసాద్ ఎడ్యుకేషన్ ట్రస్ట్‌కు సంబంధించిన విచారణను తన బెంచీకే కేటాయించటం సంప్రదాయానికి విరుద్ధం. 4. న్యాయమూర్తిగా ఉన్నప్పుడు జస్టిస్ దీపక్ మిశ్రా తప్పుడు అఫిడవిట్‌తో ఓ స్థలాన్ని కొనుగోలు చేశారు. 2012లో తను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందినపుడు దీన్ని సరెండర్ చేశారు. అయితే 1985లోనే ప్లాట్ కేటాయింపు నిబంధనలు రద్దుచేశారు. అప్పటినుంచి వీటిని సీజేఐ ఉల్లంఘించారు. 5. తనకున్న మాస్టర్ ఆఫ్ రోస్టర్ అధికారాలను దుర్వినియోగం చేస్తూ.. సున్నితమైన అంశాలను కొన్ని ప్రత్యేక ధర్మాసనాలకు కట్టబెట్టారు. ‘అభిశంసన సరికాదు’ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై అభిశంసన నోటీసులను రాజ్యాంగ నిపుణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది రాజకీయంగా పైచేయి సాధించేందుకు చేస్తున్న ప్రయత్నంగా అభివర్ణించారు. అసలు అభిశంసన ఇవ్వాల్సిన తీవ్ర ఆరోపణలేమీ లేవని.. కనుక ఇలాంటి తీర్మానాలు వీగిపోతాయని మాజీ అటార్నీ జనరల్ సోలీ సొరాబ్జీ, మాజీ హైకోర్టు న్యాయమూర్తులు ఎస్ఎన్ ధింగ్రా, అజిత్ కుమార్ సిన్హా, సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ వంటి న్యాయకోవిదులు పేర్కొన్నారు. ‘స్వతంత్ర భారత చరిత్రలో న్యాయవ్యవస్థపై జరిగిన అత్యంత దారుణమైన ఘటన ఇది’ అని సోలీ సొరాబ్జీ పేర్కొన్నారు. ఇది జడ్జి లోయా కేసు తీర్పుకు వ్యతిరేకంగానే కాంగ్రెస్ ఈ కుట్రకు పాల్పడుతోందని వికాస్ సింగ్, జస్టిస్ సిన్హాలు అభిప్రాయపడ్డారు. రాజకీయ స్వలాభం, ఉద్దేశపూర్వకంగానే ఈ నోటీసులు ఇచ్చారని మరికొందరు న్యాయనిపుణులు అభిప్రాయపడ్డారు. తీవ్రంగా కలచివేశాయి సీజేఐను తొలగించాలంటూ ఎంపీలు బహిరంగంగా ప్రకటించడం లాంటి పరిణామాలు తీవ్రంగా కలచివేశాయని సుప్రీంకోర్టు పేర్కొంది. సీజేఐపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడానికి సన్నద్ధమయ్యే క్రమంలో మార్గదర్శకాలు పాటించే విధంగా ప్రజాప్రతినిధులను నియంత్రించాలని దాఖలైన పిటిషన్‌ను విచారించే క్రమంలో సుప్రీం కోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్‌ల ధర్మాసనం మాట్లాడుతూ.. ‘ప్రజాప్రతినిధులు ఇలా వ్యవహరించడం దురదృష్టకరం. అభిశంసన గురించి సమాజంలో చర్చ జరగడం సరికాదు. తద్వారా న్యాయ వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఉంది’అని అభిప్రాయపడ్డారు. విచారణ సందర్భంగా సీనియర్ అడ్వకేట్ మీనాక్షి అరోరా వాదనలు వినిపిస్తూ.. పార్లమెంటులో ఎలాంటి తీర్మానం ప్రవేశపెట్టకుండానే న్యాయమూర్తి తొలగింపుపై రాజకీయ నాయకులు పలు బహిరంగ ప్రకటనలు చేస్తున్నారని అన్నారు. దీని ప్రభావం సదరు న్యాయమూర్తి విధి నిర్వహణపై పడుతుందన్నారు. ఆ ప్రకటనలు ప్రచురించకుండా, ప్రసారం చేయనీయకుండా మీడియాపై నిషేధం విధించాలని కోరగా ధర్మాసనం అందుకు నిరాకరించింది. విచారణను మే 7కి వాయిదా వేసింది. అనంతరం ఈ అంశంపై అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సహకారం తీసుకోనున్నట్టు ధర్మాసనం తెలిపింది. అభిశంసన ప్రక్రియ ఇలా ► రాజ్యాంగంలోని ఆర్టికల్ 124(4) ప్రకారం సుప్రీంకోర్టు జడ్జీలు సహా ప్రధాన న్యాయమూర్తిని తొలగించవచ్చు. ► ఈ ప్రక్రియను పార్లమెంట్‌లోని ఏ సభలోనైనా ప్రారంభించొచ్చు. ► రాజ్యసభలో అయితే..ప్రతిపాదనపై 50 మంది సభ్యులు సంతకాలు చేయాలి ► లోక్‌సభలో అయితే.. 100 మంది సభ్యులు సంతకాలు చేయాలి ► స్పీకర్ లేదా చైర్మన్ ఆ తీర్మానాన్ని ఆమోదించొచ్చు లేదా తిరస్కరించొచ్చు ► ఒకవేళ తిరస్కరిస్తే ఆ ప్రతిపాదన వీగి పోయినట్లే ఆమోదం పొందితే.. ► సుప్రీం జడ్జీ, ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఒక న్యాయ నిపుణుడితో కూడిన కమిటీ ఏర్పాటవుతుంది ► ఆ కమిటీయే అభియోగాలను నమోదు చేస్తుంది ► అభిశంసన ఎదుర్కొంటున్న జడ్జీకి ఆ కాపీ పంపుతారు ► తనను సమర్థించుకుంటూ జడ్జీ రాతపూర్వక వివరణ ఇవ్వాలి ► విచారణ తుది నివేదికను కమిటీ స్పీకర్ లేదా చైర్మన్‌కు సమర్పిస్తుంది ► పార్లమెంట్లో చర్చ జరుగుతుంది ► సాధారణ మెజారిటీతో లేదా అందుబాటులో ఉన్న సభ్యుల్లో మూడింట రెండొంతుల మెజారిటీతో ప్రతిపాదన ఆమోదం పొందాలి ► ఒక సభలో ఆమోదం పొందిన తరువాత మరో సభకు పంపుతారు ► రెండింట్లోనూ ఆమోదం పొందిన తరువాత రాష్ట్రపతికి చేరుతుంది ► సదరు జడ్జీని తొలగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీచేస్తారు -
అభిశంసన అంటే ఏమిటీ?
సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాకు వ్యతిరేకంగా అభిశంసన తీర్మానాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన ఏడుగురు ప్రతిపక్ష పార్టీలు సంయుక్తంగా శుక్రవారం నాడు భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడిని కలుసుకొని ఓ లేఖను అందజేశాయి. ఆ లేఖపై కాంగ్రెస్ పార్టీతోపాటు సీపీఎం, సీపీఐ, ఎన్సీపీ, ఎస్పీ, బీఎస్పీ పార్టీలకు చెందిన 71 మంది పార్లమెంట్ సభ్యులు సంతకాలు చేశారు. ప్రతిపక్షానికి చెందిన డీఎంకే మాత్రం అభిశంసన తీర్మానానికి దూరంగా ఉంది. సీబీఐ ప్రత్యేక జడ్జీ బ్రిజ్మోహన్ హరికిషన్ లోయ అనుమానాస్పద మృతిపై స్వతంత్య్రంగా దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని గురువారం నాడు దీపక్ మిశ్రా నాయకత్వంతోని సుప్రీం కోర్టు బెంచీ కొట్టివేసిన నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు అభిశంసన తీర్మానాన్ని ముందుకు తీసుకొచ్చారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకానికి వీలు కల్పిస్తున్న భారత రాజ్యాంగంలోని 124 సెక్షన్ కిందనే ఆయన్ని తొలగించవచ్చు. తప్పుడు ప్రవర్తన, అసమర్ధుడు అనే కారణంగా ఆయనపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు. సుప్రీం కోర్టుకు చెందిన ఏ జడ్జీనైనా పదవీ విరమణకన్నా ముందే తొలగించాలంటే పార్లమెంట్లో అభిశంసన తీర్మానం నెగ్గితే రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా తొలగిస్తారు. అభిశంసన తీర్మానాన్ని ఇరు సభల్లో మెజారిటీ సభ్యులు ఆమోదించడంతోపాటు ఓటింగ్ రోజున ఇరు సభల్లో సభకు హాజరైన సభ్యుల్లో మూడింట రెండు వంతుల మంది అభిశంసనకు అనుకూలంగా ఓటు వేయాల్సి ఉంటుంది. జడ్జీల (ఇంక్వైరీ) యాక్ట్–1969, జడ్జీల (ఇంక్వైరీ) రూల్స్–1969 చట్టాల కింద జడ్జీలను తొలగించేందుకు రాజ్యాంగంలోని 124వ అధికరణ వీలు కల్పిస్తోంది. ఈ మొత్తం ప్రక్రియను అభిశంసనగా వ్యవహరిస్తారు. -
భారత ప్రధాన న్యాయమూర్తి అభిశంసనకు విపక్షాల డిమాండ్
-
సీజేఐపై అభిశంసన; సంచలన పరిణామాలు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాపై అభిశంసన వ్యవహారంలో సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీనిపై గతంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన విపక్షాలు ఇప్పుడు ఒక్కతాటిపైకి వచ్చాయి. ఏడు పార్టీలకు చెందిన సుమారు 71 మంది ఎంపీలు అభిసంశన నోటీసులపై సంతకాలు చేశారు. సదరు తీర్మానాన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టాలని కోరుతూ కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ నేతృత్వంలోని బృందం శుక్రవారం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిశారు. జస్టిస్ లోయా మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసిన మరుసటి రోజే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నట్లైంది. పిటిషన్లను కొట్టేస్తూ సుప్రీం ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ దుర్దినంగా అభివర్ణించిన సంగతి తెలిసిందే. సీజేఐ దీపక్ మిశ్రాపై నలుగురు సీనియర్ జడ్జిలు తిరుగుబావుటా ఎగరేసిన సందర్భంలోనే అభిశంసన అంశం తెరపైకి వచ్చినా, విపక్షాల్లో ఏకాభిప్రాయం కొరవడటంతో అది ముందుకు వెళ్లలేదు. ఇప్పుడు కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు, ఎస్పీ, బీఎస్పీ తదితర పార్టీలు ఒక్కతాటిపైకి రావడంతో తీర్మానానికి బలంపెరిగినట్లైంది. అభిశంసన వార్తలపై నిషేధం!: చీఫ్ జస్టిస్‌పై అభిశంసన తీర్మానం పెట్టేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్న సమయంలోనే సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అభిశంసన గురించి సమాజంలో చర్చ జరుగడం దురదృష్టకరమని, తద్వారా న్యాయవ్యవస్థపై ప్రజల్లో సదాభిప్రాయం సన్నగిల్లే ప్రమాదం ఉందని, కాబట్టి అభిశంసనకు సంబంధించిన అన్ని వార్తలను నిషేధించడమే ఉత్తమమని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ విషయంలో ప్రభుత్వ న్యాయాధికారుల అభిప్రాయాలను కూడా తీసుకోవాలని భావిస్తున్నది. అది జరిగేపని కాదు: కాగా, చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాపై అభిశంసన జరిగేపని కాదని మాజీ అటార్నీ జనరల్ సొలి సొరబ్జీ అన్నారు. ‘చెప్పిన తీర్పుల ఆధారంగా ఒక న్యాయమూర్తిపై అభిశంసన పెట్టడం కుదరదు. ఆ జడ్జి అనుచితంగా ప్రవర్తించినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అభిశంసన తీర్మానం పార్లమెంట్లో ఆమోదం పొందిన తర్వాత దానిపై రాష్ట్రపతి తుది నిర్ణయం తీసుకుంటారు’ అని సొరబ్జీ పేర్కొన్నారు. -
లోయాది సహజ మరణమే
న్యూఢిల్లీ: సీబీఐ మాజీ న్యాయమూర్తి బీహెచ్ లోయా మృతిపై స్వతంత్ర విచారణ కోరుతూ వచ్చిన వివిధ పిటిషన్లను సుప్రీంకోర్టు గురువారం తోసిపుచ్చింది. ఆయనది సహాజ మరణమేననీ, న్యాయ వ్యవస్థను అపఖ్యాతి పాల్జేసేందుకే దురుద్దేశంతో ఈ పిటిషన్లను వేశారనీ, దీనిని తీవ్ర చర్యగా పరిగణిస్తున్నామని పేర్కొంది. లోయా మృతికి సంబంధించిన అన్ని పిటిషన్లపై విచారణ ఇక ఈ తీర్పుతో ముగిసినట్లేనని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. పిటిషన్ల వెనుక రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాలున్నాయనీ, న్యాయవ్యవస్థపై బురదజల్లాలనే దురుద్దేశంతోనే పిటిషన్లు వేశారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. లోయా మృతికి దారితీసిన పరిస్థితులపై నలుగురు న్యాయమూర్తులు ఇచ్చిన వాంగ్మూలాలను అనుమానించడానికి కారణం లేదనీ, లోయాది సహాజ మరణమేనని రికార్డులను పరిశీలిస్తే స్పష్టమవుతోందని పేర్కొంది. సీనియర్ న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలైన దుష్యంత్ దవే, ఇందిరా జైసింగ్, ప్రశాంత్ భూషణ్ తదితరులు లోయా మృతిపై స్వతంత్ర విచారణ కోరుతూ పిటిషన్లు వేశారు.కోర్టుల విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేసేలా, న్యాయవ్యవస్థకు చెడ్డపేరు తెచ్చేలా వీరు ఈ పిటిషన్ల రూపంలో ప్రయత్నం చేస్తున్నారని విమర్శించింది.‘వాణిజ్య వివాదాలను మార్కెట్లో పరిష్కరించుకోవాలి. రాజకీయ విభేదాలను ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలి. చట్టాన్ని పరిరక్షించడం న్యాయస్థానాల బాధ్యత’ అని జస్టిస్ చంద్రచూడ్ తన తీర్పులో పేర్కొన్నారు. జస్టిస్ ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లు మహారాష్ట్రకు చెందిన వారు కాబట్టి లోయా మృతికేసును బాంబే హైకోర్టులో విచారించిన న్యాయమూర్తులు వారికి తెలిసి ఉంటారనీ, కాబట్టి వారిద్దరూ ఈ కేసును విచారించకూడదని ప్రశాంత్ భూషణ్ తన పిటిషన్లో పేర్కొన్నారు. దీన్ని కూడా కోర్టు తీవ్రంగా పరిగణించింది.న్యాయమూర్తులపై అసంబద్ధ ఆరోపణలు చేయడం తగదంది. పిటిషనర్లపై కోర్టు ధిక్కారం కింద చర్యలు తీసుకుందామని తొలుత అనుకున్నామనీ, కానీ తర్వాత వెనక్కు తగ్గామని ధర్మాసనం తెలిపింది. కాగా, సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌లు ఈ ఏడాది జనవరి 12న మీడియా ముందుకు వచ్చి.. బీహెచ్ లోయా మృతి కేసు సహా పలు సున్నితమైన కేసుల కేటాయింపులో సరైన విధానాన్ని ప్రధాన న్యాయమూర్తి అవలంభించడం లేదంటూ ఆరోపణలు చేయడం తెలిసిందే. దేశ చరిత్రలోనే దుర్దినం: కాంగ్రెస్ జడ్జి లోయా మృతిపై సుప్రీం తీర్పు దేశ చరిత్రలోనే దుర్దినమని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. మృతిపై నిష్పాక్షిక విచారణ జరపాలని డిమాండ్ చేసింది. సుప్రీంలో ఈ పిటిషన్ల దాఖలు వెనుక రాహుల్ హస్తముందన్న బీజేపీ ఆరోపణల్ని కాంగ్రెస్ ప్రతినిధి సూర్జేవాలా ఖండించారు. ‘ఈరోజు దేశ చరిత్రలోనే అత్యంత దుర్దినం. న్యాయవ్యవస్థపై నమ్మకమున్నవారికి లోయా అనుమానాస్పద మృతి ఘటన తీవ్ర ఆందోళన కలిగించే విషయం. తీర్పు పూర్తిస్థాయి కాపీని ఇంకా చూడలేదు. కానీ న్యాయవ్యవస్థపై నమ్మకమున్నవారికి ఇంకా పలు అనుమానాలు ఉన్నాయి. మృతికి సంబంధించిన నిజాలు ఏదో ఒకరోజు వెలుగులోకి వస్తాయి’ అని అన్నారు. లోయా కేసులో ఇప్పటివరకూ ఎలాంటి విచారణ జరగకపోవడాన్ని గుర్తుచేశారు. మరోవైపు రాహుల్ ట్వీటర్లో స్పందిస్తూ.. ‘భారతీయులు తెలివైనవాళ్లు. బీజేపీ నేతలతో సహా చాలామంది భారతీయులు అమిత్ షాకు సంబంధించిన నిజాలను ఇట్టే అర్థం చేసుకోగలరు.’ అని ట్వీట్ చేశారు. పిల్ వెనుక రాహుల్ హస్తం: బీజేపీ జస్టిస్ లోయా మృతిపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) వెనుక కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ అదృశ్య హస్తం ఉందని బీజేపీ ఆరోపించింది. జస్టిస్ లోయాది సహజమరణమేనని తీర్పు నేపథ్యంలో రాహుల్ గాంధీ తమకు క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. న్యాయవ్యవస్థను వాడుకుని కాంగ్రెస్ అమిత్ పై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతోందని బీజేపీ ప్రతినిధి సంబిత్ ఆరోపించారు. స్వతంత్ర విచారణ జరిపించాలని కోరుతూ రాష్ట్రపతిని రాహుల్ కలవడం సిగ్గు చేటని ఇది ప్రజాస్వామ్యాన్ని, న్యాయవ్యవస్థని తప్పుదారి పట్టించడమేనని ఆయన అన్నారు. కేంద్రమంత్రి నఖ్వీ సుప్రీం కోర్టు తీర్పుపై స్పందిస్తూ...తమ పార్టీ అధినాయకత్వాన్ని దెబ్బతీయాలని కాంగ్రెస్ చేసిన కుటిల యత్నాలను సుప్రీం కోర్టు తీర్పు తిప్పి కొట్టిందని..ఇప్పటికైనా ఆపార్టీ ఇటువంటి ప్రయత్నాలు మానుకుని తమకు క్షమాపణలు చెప్పాలన్నారు. రాజకీయ ప్రయోజనాలకోసం న్యాయవ్యవస్థను ఎవరూ తప్పుదోవ పట్టించలేరని సుప్రీం తీర్పు రుజువు చేసిందని హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ ట్వీట్‌చేశారు. చివరి ఆశ కూడా పోయింది: లోయా కుటుంబసభ్యులు ముంబై: స్వతంత్ర విచారణను సుప్రీంకోర్టు తిరస్కరించడంపై లోయా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై లోయా మామ శ్రీనివాస్ మాట్లాడారు. ‘తీర్పు మా అంచనాలకు తగ్గట్లుగా లేదు. అనుమానాలకు సమాధానాలు దొరకలేదు. ఈ కేసులో మేం ఇక ఎవ్వరిపైనా ఎలాంటి ఆశలు పెట్టుకోలేం. ఈ కేసులో ప్రతీ అంశాన్ని వాళ్లు మేనేజ్ చేసినట్లు కన్పిస్తోంది. మీడియా, ప్రతిపక్షాలు ఆందోళనలు చేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం ఉండేట్లు లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘వాస్తవం వెలుగులోకి వస్తుందన్న ఒకే ఒక్క నమ్మకం కూడా సుప్రీం తీర్పుతో పోయింది. నాలుగేళ్లు గడిచిపోయాయి. ఇంకా మాట్లాడటానికేం మిగల్లేదు’ అని లోయా సోదరి అనురాధ వాపోయారు. కాగా, తీర్పు అనంతరం లోయా కుమారుడు అనూజ్ అందుబాటులో లేకుండా పోయారు. నేపథ్యమిదీ.. గుజరాత్లో 2005లో సోహ్రబుద్దీన్ షేక్, అతని భార్య కౌసÆŠ, వారి సన్నిహితుడు తులసీరామ్ ప్రజాపతిని పోలీసులు బూటకపు ఎన్కౌంటర్ చేసి చంపేసిన కేసులో ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు, నాటి గుజరాత్ హోం మంత్రి అమిత్ షా గతంలో నిందితుడిగా ఉన్నారు. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి బ్రిజ్గోపాల్ హరికిషన్ లోయా 2014 డిసెంబర్ 1న మృతి చెందగా, ఆ తర్వాత ఆయన స్థానంలో వచ్చిన జడ్జి గోసావి అమిత్‌ను నిర్దోషిగా ప్రకటించారు. లోయా మృతి, తదనంతరం జరిగిన ఘటనలు 2014, డిసెంబర్ 1: నాగ్‌పూర్‌లో సహచరుడి కూతురి పెళ్లికి వెళ్లిన లోయా అక్కడే గుండెపోటుతో మృతిచెందారు. 2018 జనవరి 11: లోయా మృతిపై స్వతంత్ర విచారణ జరిపేందుకు ఆదేశాలివ్వాలంటూ వచ్చిన 2 పిటిషన్లను స్వీకరించిన సుప్రీంకోర్టు జనవరి 12: లోయా మృతి తీవ్ర అంశమనీ, దీనిపై స్పందన తెలపాల్సిందిగా మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం జనవరి 22: పిటిషన్లలో పేర్కొన్నవి తీవ్ర అంశాలంటూ లోయా మృతిపై బాంబే హైకోర్టులో ఉన్న రెండు కేసులను తన వద్దకే తెప్పించుకున్న సుప్రీంకోర్టు ఫిబ్రవరి 12: లోయా మరణించినప్పుడు ఆయన పక్కన ఉన్న నలుగురు న్యాయమూర్తుల వాంగ్మూలాలను బట్టి ఆయనది సహజమరణమేనని సుప్రీంకోర్టుకు తెలిపిన మహారాష్ట్ర ప్రభుత్వం మార్చి 8: కేసు వేసిన వారినే గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తున్నారనీ, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమీ అడగడం లేదంటూ న్యాయమూర్తులపై సీనియర్ న్యాయవాది ఆరోపణలు. ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు మార్చి 16: లోయా మృతిపై విచారణ కోరుతూ వచ్చిన పిటిషన్లపై తీర్పును రిజర్వ్‌లో పెట్టిన సుప్రీంకోర్టు. ఏప్రిల్ 19: పిటిషన్లను తిరస్కరిస్తూ తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు -
అసిఫా కుటుంబానికి రక్షణ ఇవ్వండి
న్యూఢిల్లీ/కఠువా: కఠువాలో సామూహిక అత్యాచారం, హత్యకు గురైన చిన్నారి అసిఫా కుటుంబానికి, ఈ కేసులో బాధితులకు సాయపడుతున్న న్యాయవాదితో పాటు వారి కుటుంబ స్నేహితుడికి రక్షణ కల్పించాలని జమ్మూ కశ్మీర్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే కేసు విచారణను కఠువా నుంచి చండీగఢ్ మార్చాలన్న బాధితురాలి తండ్రి పిటిషన్‌ను కూడా సుప్రీం సోమవారం పరిగణనలోకి తీసుకుంది. ఈ అంశంపై స్పందన తెలియజేయాలని కశ్మీర్ ప్రభుత్వానికి సూచించింది. ఈ కేసులో జమ్మూ కశ్మీర్ పోలీసుల దర్యాప్తు పట్ల తాను సంతృప్తిగా ఉన్నానని బాధితురాలి తండ్రి సుప్రీంకు వెల్లడించడంతో పాటు, సీబీఐ విచారణను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపాడు. ఈ సందర్భంగా కోర్టు స్పందిస్తూ.. ‘ఈ స్థితిలో కేసును సీబీఐకి బదిలీ చేసే అంశంపై జోక్యం చేసుకునే ఉద్దేశ్యం మాకు లేదు’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం పేర్కొంది. ‘బాధితురాలి కుటుంబానికి, న్యాయవాది దీపక్ సింగ్ రజావత్, కుటుంబ స్నేహితుడు తలిద్ హుస్సేన్‌కు భద్రతను పెంచాలని జమ్మూ కశ్మీర్ పోలీసులను ఆదేశిస్తున్నాం. జమ్మూలో మతపరమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశమున్న నేపథ్యంలో కేసు విచారణను బదిలీ చేసే అంశంపై ఏప్రిల్ 27లోగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసుతో సంబంధమున్న మైనర్‌కు తగిన భద్రత కల్పించాలనీ ఆదేశించింది. కేసుతో సంబంధమున్న వారి పిటిషన్లను మాత్రమే విచారిస్తామంది. సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ ప్రస్తావించిన పిటిషన్లను విచారించేందుకు అంగీకరించింది. విధులకు హాజరైన జమ్మూ న్యాయవాదులు కఠువా కేసును సీబీఐకి అప్పగించాలని కోరడంతో పాటు పలు డిమాండ్లతో 12 రోజులుగా విధులు బహిష్కరించిన జమ్మూ హైకోర్టు బార్ అసోసియేషన్ న్యాయవాదులు సోమవారం విధుల్లో చేరారు. బార్ అసోషియేషన్ సమావేశంలో నిర్ణయం అనంతరం వారు కోర్టుకు హాజరయ్యారు. సీబీఐకి అప్పగించండి: నిందితులు తాము ఎలాంటి తప్పు చేయలే దని, తమకు నార్కో ఎనాలిసిస్ పరీక్షలు నిర్వహించాలని కఠువా కేసులోని 8మంది నిందితులు కఠువా డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు జడ్జికి విజ్ఞప్తి చేశారు. విచారణ నిమిత్తం సోమవారం వారిని పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. నిందితుల తరఫు న్యాయవాదుల విజ్ఞప్తి మేరకు.. చార్జిషీట్ కాపీలు సమర్పిం చాలని పోలీసుల్ని జడ్జి ఆదేశించారు. అనంతరం విచారణను ఏప్రిల్ 28కు వాయిదావేశారు. మరోవైపు విచారణ జరుగుతుండగా.. ప్రధాన నిందితుడు సంజీరామ్ కుమార్తె మధు శర్మ సీబీఐ దర్యాప్తు కోరుతూ కోర్టు బయట ఆందోళన నిర్వహించింది. -
సీజేఐని కలవనున్న న్యాయశాఖ మంత్రి!
న్యూఢిల్లీ: కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థ మధ్య పలు అంశాలపై విభేదాలు పెరిగిపోతున్న నేపథ్యంలో.. సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం నడుంబిగించింది. ఇందులో భాగంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాతో.. కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ త్వరలో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై న్యాయశాఖ ఇప్పటికే ఓ నోట్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. జస్టిస్ కేఎం జోసెఫ్, సీనియర్ న్యాయవాది ఇందు మల్హోత్రాలకు ప్రమోషన్ కల్పించటం, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక జిల్లా కోర్టు జడ్జి భట్‌కు హైకోర్టు జస్టిస్‌గా పదోన్నతి వివాదం తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. -
ఆ పిల్‌ను విచారించలేను
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానంలో జరుగుతున్న పరిణామాలపై సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ జె.చలమేశ్వర్ గురువారం మరోసారి ఆవేదన వెలిబుచ్చారు. అలాగే సుప్రీంలో కేసుల కేటాయింపునకు సంబంధించి మార్గదర్శకాలు రూపొందించాలని దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించలేనని, తన తీర్పును తోసిపుచ్చే పరిస్థితిని మరోసారి తాను కోరుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో తానేమీ చేయలేనని, తన ఇబ్బందిని అర్థం చేసుకోవాలని పిటిషనర్‌కు వెల్లడించారు. సుప్రీంకోర్టులో సీజేఐనే సుప్రీం అని పేర్కొంటూ బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా ధర్మాసనం తీర్పు వెలువరించిన నేపథ్యంలో తన తండ్రి శాంతిభూషణ్ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారణకు స్వీకరించాలని.. జస్టిస్ చలమేశ్వర్ ధర్మాసనాన్ని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఆశ్రయించారు. సీజేఐకున్న మాస్టర్ ఆఫ్ రోస్టర్ అధికారాల్ని సవాలు చేయడంతో పాటు, కేసుల కేటాయింపునకు మార్గదర్శకాల్ని రూపొందించాలని కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి శాంతి భూషణ్ గతవారం పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో గురువారం పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. శాంతిభూషణ్ పిల్‌ను అత్యవసరంగా విచారించేందుకు జస్టిస్ చలమేశ్వర్ నిరాకరించడంతో.. ప్రశాంత్ భూషణ్ వెంటనే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా బెంచ్‌ను ఆశ్రయించారు. పిటిషన్‌ను వెంటనే విచారణకు స్వీకరించాలని కోరగా.. ‘పరిశీలిస్తాం’ అని సీజేఐ ధర్మాసనం తెలిపింది. అంతకుముందు జస్టిస్ చలమేశ్వర్ బెంచ్ వద్ద పిల్ అంశాన్ని ప్రశాంత్ భూషణ్ ప్రస్తావిస్తూ.. ఇది అత్యవసర అంశమని పేర్కొన్నారు. మాస్టర్ ఆఫ్ రోస్టర్ విధానాన్ని పిల్ సవాలు చేస్తున్నందున సీజేఐ విచారణ చేయకూడదని.. అందువల్లే మీ బెంచ్‌కు రిఫర్ చేశానని చెప్పారు. అయితే ఈ అంశంలో జోక్యం చేసుకోవడం తనకు ఇష్టం లేదని, అందుకు గల కారణాలు అందరికీ తెలిసినవేనని చలమేశ్వర్ పేర్కొన్నారు. ఇటీవల జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ కురియన్ జోసఫ్‌లు సుప్రీంకోర్టులో జరుగుతున్న వ్యవహారాలు, న్యాయవ్యవస్థలో కార్యనిర్వాహక వ్యవస్థ జోక్యాన్ని తప్పుపడుతూ లేఖలు రాసిన తరుణంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నాపై దుష్ప్రచారం: జస్టిస్ చలమేశ్వర్ ‘సుప్రీంకోర్టులో, దేశంలో జరుగుతున్న వ్యవహారాల్ని ప్రస్తావిస్తూ నేను కొద్ది రోజుల క్రితం లేఖ రాశా. నేను ఏదో ప్రయోజనం ఆశిస్తున్నానంటూ కొందరు తీవ్రంగా దుష్ప్రచారం చేస్తున్నారు. రెండు నెలల్లో రిటైర్ కాబోతున్నాను. ఈ సమయంలో అలాంటి ప్రచారాన్ని నేను కోరుకోవడం లేదు. అందువల్ల ఈ విషయంలో నేను ఇంతకంటే ఏమీ చేయలేదు. క్షమించండి. దయచేసి నా ఇబ్బందిని అర్థం చేసుకోండి’ అని జస్టిస్ చలమేశ్వర్ పేర్కొన్నారు. ‘వచ్చే 24 గంటల్లో మరోసారి నా తీర్పును తోసిపుచ్చే పరిస్థితిని నేను కోరుకోవడం లేదు. అందువల్లే నేను ఈ పిల్‌ను విచారణకు స్వీకరించలేను’ అని ప్రశాంత్ భూషణ్‌కు స్పష్టం చేశారు. గతేడాది నవంబర్ 10న తన నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన తీర్పును సీజేఐ బెంచ్ తోసిపుచ్చిన విషయాన్ని పరోక్షంగా ఆయన గుర్తుచేశారు. ఏకే సిక్రీ ధర్మాసనానికి పిల్ సుప్రీం బెంచ్‌లకు కేసుల కేటాయింపులో మాస్టర్ ఆఫ్ రోస్టర్‌గా సీజేఐకున్న అధికారాల్ని ప్రశ్నిస్తూ శాంతి భూషణ్ దాఖలు చేసిన పిల్ శుక్రవారం విచారణకు రానుంది. సుప్రీం జడ్జీల్లో సీనియారిటీలో ఆరో స్థానంలో ఉన్న జస్టిస్ ఏకే సిక్రీ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిల్‌ను విచారిస్తుంది. ఆరు నెలలుగా... సుప్రీంకోర్టులో అధికార పరిధిపై దాదాపు ఆరు నెలలుగా వివాదం కొనసాగుతోంది. ► నవంబర్ 9, 2017: మెడికల్ అడ్మిషన్ స్కాంలో ఒక ఎన్జీవో సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టులోని ఐదుగురు అత్యంత సీనియర్ జడ్జిలతో కూడిన ధర్మాసనానికి అప్పగిస్తూ నవంబర్ 10న ఆదేశాలు జారీ చేసిన చలమేశ్వర్ ధర్మాసనం గతంలో ఆ కేసు విచారణలో జస్టిస్ దీపక్ మిశ్రా ప్రమేయం ఉన్నందున... ధర్మాసనంలో ఆయన ఉండకూడదని పిటిషనర్ కోరగా.. చీఫ్ జస్టిస్ లేకుండానే ధర్మాసనం ఏర్పాటుకు ఆదేశాలు. ► నవంబర్ 10: ఆ ఆదేశాలను కొట్టివేసిన జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్.. ధర్మాసనం ఏర్పాటు అధికారం సీజేఐకే ఉంటుందని, ద్విసభ్య, త్రిసభ్య ధర్మాసనాలు కేసును తమ బెంచ్‌కు గాని, రాజ్యాంగ ధర్మాసనాలకు గానీ కేటాయించలేవని స్పష్టీకరణ. ► జనవరి 11, 2018: సీనియర్ న్యాయవాది ఇందు మల్హోత్రా, ఉత్తరాఖండ్ ప్రధాన న్యాయమూర్తి కేఎం జోసఫ్ పేర్లను సుప్రీం జడ్జీలుగా సిఫార్సు చేసిన కొలీజియం. ► జనవరి 12: కేసుల కేటాయింపులో సీజేఐ వైఖరిని ప్రశ్నిస్తూ.. సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్ ఓ ప్రెస్ కాన్ఫరెన్స్. ► మార్చి 21: న్యాయవ్యవస్థలో కార్యనిర్వాహక వ్యవస్థ జోక్యంపై ఫుల్ బెంచ్ ఏర్పాటు చేయాలని సీజేఐకు జస్టిస్ చలమేశ్వర్ లేఖ. ► ఏప్రిల్: జనవరి 11న కొలీజియం చేసిన సిఫార్సులపై కేంద్రం జాప్యాన్ని తప్పుపడుతూ సీజేఐకి జస్టిస్ జోసెఫ్ కురియన్ లేఖ ► ఏప్రిల్ 11: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమానుల్లో ప్రథముడని, కేసుల కేటాయింపు, కేసుల విచారణకు ధర్మాసనాల ఏర్పాటుకు సంబంధించి రాజ్యాంగపరమైన విశిష్టాధికారం ఆయనకే ఉంటుందని తీర్పిచ్చిన జస్టిస్ దీపక్ మిశ్రా ధర్మాసనం. -
3లోపు కావేరి ముసాయిదా
న్యూఢిల్లీ: కావేరి నదీ యాజమాన్య బోర్డుకు సంబంధించిన ముసాయిదాను మే 3వ తేదీలోపు తమకు సమర్పించాలని సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నదీ యాజమాన్య బోర్డు ఏర్పాటయ్యే వరకు హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్త వహించాలని కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలకు సూచించింది. ఆరు వారాల్లో బోర్డును ఏర్పాటు చేయాలని ఫిబ్రవరి 16నే సుప్రీంకోర్టు ఆదేశించినా ఇప్పటివరకు కేంద్రం చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా తప్పుబట్టారు. మరోవైపు కేంద్రం తీరుకు నిరసనగా చెన్నైలో ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) క్రికెట్ మ్యాచ్‌లను నిర్వహించకూడదన్న వాదనకు బలం పెరుగుతోంది. ఈ ఐపీఎల్ సీజన్‌కు సంబంధించి చెన్నైలో తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మంగళవారం జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్‌ను నిర్వహిస్తే చిదంబరం స్టేడియం బయట ఆందోళన చేసి అడ్డంకులు సృష్టిస్తామని తమిళగ వళ్వురిమై కచ్చి (టీవీకే) అనే సంస్థ తాజాగా హెచ్చరించింది. చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించకపోవడమే మంచిదని తమిళనాడు రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి జయకుమార్ కూడా అన్నారు. ఇక్కడి పరిస్థితి గురించి ఐపీఎల్ నిర్వాహకులకు తెలియజేశామనీ, అయితే మ్యాచ్‌లు నిర్వహిస్తే నిబంధనల ప్రకారం భద్రత సహా అన్ని రకాల సదుపాయాలూ కల్పిస్తామని స్పష్టం చేశారు. -
బహుభార్యత్వం కన్నా.. అయోధ్యకే ప్రాధాన్యం
సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్య వివాదం కేసును విస్తృత ధర్మాసనానికి నివేదించాలంటూ సున్నీ వక్ఫ్ బోర్డు, ఇతర ముస్లిం పిటిషనర్లు సుప్రీంకోర్టుకు శుక్రవారం విజ్ఞప్తి చేశారు. ముస్లింల బహుభార్యత్వం వివాదం కంటే ఇది చాలా ముఖ్యమైన కేసని ముస్లింల తరఫు న్యాయవాది రాజీవ్ ధవన్ కోర్టుకు నివేదించారు. ఈ వివాదానికి సంబంధించిన అన్ని పిటిషన్లను పరిశీలించిన తరువాతే దీనిపై నిర్ణయం తీసుకుంటామని ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ తెలిపింది. కేసు తదుపరి విచారణను ఈనెల 27వ తేదీకి వాయిదా వేసింది. సున్నీ వక్ఫ్‌బోర్డు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సహా కక్షిదారుల వాదనలు విన్న అనంతరం కేసును విస్తృత ధర్మాసనానికి అప్పగించాలా ? వద్దా ? అనే దానిపై ఓ నిర్ణయానికి వస్తామని తెలిపింది. అలహాబాదాద్ హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ మొత్తం 14 అప్పీళ్లు దాఖలయ్యాయి. ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన అలహాబాద్ హైకోర్టు బెంచ్ గతంలో 2:1 మెజారిటీతో తీర్పునిస్తూ... సదరు భూమిని సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖారా, రామ్‌లీలా సమానంగా పంచుకోవాలని పేర్కొంది. -
న్యాయమూర్తుల ఖాళీలు భర్తీ చేయండి
సాక్షి, హైదరాబాద్: పూర్తి స్థాయి సీజేను నియమించాలని, న్యాయమూర్తులను ఖాళీలను భర్తీ చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాద సంఘాలు కోరాయి. గురువారం ఢిల్లీలో జస్టిస్ మిశ్రాతో న్యాయవాద సంఘాల ప్రతినిధులు భేటీ అయ్యారు. ఉమ్మడి హైకోర్టుకు పూర్తి స్థాయి ప్రధాన న్యాయమూర్తిని నియమించాలని కోరుతూ ఇటీవల రెండు సంఘాల ఆధ్వర్యంలో న్యాయవాదులు రెండ్రోజుల పాటు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. దీనిపై చర్చించేందుకు ఇరు సంఘాల ప్రతినిధుల ను సీజేఐ ఆహ్వానించడంతో వారు ఢిల్లీకి వెళ్లారు. జస్టిస్ మిశ్రాను శాలువాతో సన్మానించారు. పూర్తి స్థాయి సీజేను నియమించే విషయంలో తాము తీసుకున్న చర్యల గురిం చి సీజేఐ వారికి చెప్పారు. హైకోర్టులో తగినంత మంది న్యాయమూర్తులు లేకపోవడం వల్ల కక్షిదారులు, న్యాయవాదులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వారు సీజేఐ దృష్టికి తీసుకొచ్చారు. పెండింగ్ కేసుల గురించి వివరించా రు. సమస్యల పరిష్కారానికి వీలైనంత త్వరగా తగిన నిర్ణ యం తీసుకుంటామని సీజేఐ హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. సీజేఐని కలసిన వారిలో తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జెల్లి కనకయ్య, ఉపాధ్యక్షుడు ఎస్.సురేందర్‌రెడ్డి, కార్యదర్శి పి.సుజాత, సంయుక్త కార్యదర్శి ఎస్.చంద్రమోహన్‌రెడ్డి, ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు సీహెచ్.ధనంజయ, ఉపాధ్యక్షుడు పి.ఆనంద్ శేషు, కార్యదర్శులు జ్యోతి ప్రసాద్, బాచిన హనుమంతరావు, సంయుక్త కార్యదర్శి రూపేశ్‌కుమార్‌రెడ్డి తదితరులున్నారు. -
ఆ మైత్రి ప్రజాస్వామ్యానికి చావుగంటే!
న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థ అధికార పరిధిలో కార్యనిర్వాహక విభాగం జోక్యం చేసుకుంటోందన్న ఆరోపణలపై విచారణకు ఫుల్ బెంచ్‌ను ఏర్పాటు చేయాలని సీజేఐ జస్టిస్ మిశ్రాకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ ఇటీవల రాసిన లేఖ చర్చనీయాంశమైంది. న్యాయవ్యవస్థ, ప్రభుత్వం మధ్య మైత్రి ప్రజాస్వామ్యానికి చావు గంట అని ఈ నెల 21న రాసిన లేఖలో ఆయన అభిప్రాయపడ్డారు. సీజేఐతో పాటు సుప్రీంలోని 22 మంది జడ్జీలకూ లేఖ కాపీలు పంపారు. డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి కృష్ణ భట్‌పై కేంద్ర న్యాయ శాఖ సూచన మేరకు కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దినేశ్ మహేశ్వరి విచారణకు ఆదేశించడాన్ని చలమేశ్వర్ ప్రశ్నించారు. డిస్ట్రిక్ట్ జడ్జిని హైకోర్టు జడ్జీగా నియమించడమో లేదా నియామకంపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే పునఃపరిశీలన కోసం కొలీజియం సిఫార్సుల్ని తిరిగి పంపడమో చేయకుండా న్యాయ శాఖ కర్ణాటక సీజేకి లేఖ రాయడాన్ని తప్పుపట్టారు. కొలీజియం సిఫార్సుల్ని పక్కనపెట్టడమే.. సుప్రీంకోర్టు క్లీన్చిట్ ఇచ్చినప్పటికీ డిస్ట్రిక్ట్ జడ్జిపై ఆరోపణల విషయంలో పునఃవిచారణకు ఆదేశించడమంటే గత విచారణ నివేదికను పక్కనపెట్టడమే కాకుండా, కొలీజియం సిఫార్సుల్ని స్తంభింపచేయడమేనని చలమేశ్వర్ అన్నారు. ఈ అంశంలో కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆసక్తి ప్రదర్శించారని అన్నారు. కొలీజియం సిఫార్సుల్ని పునఃమూల్యాంకనం చేయమని హైకోర్టును ప్రభుత్వం కోరడాన్ని అనుచిత చర్యగా , మొండివైఖరిగా భావించాల్సి ఉంటుందన్నారు. న్యాయవ్యవస్థ స్వతంత్రతపై లేఖలో ప్రస్తావిస్తూ.. ‘సుప్రీంకోర్టు న్యాయమూర్తులమైన మనం.. మన న్యాయవ్యవస్థ స్వాతంత్య్రం, సమగ్రతలోకి కార్యనిర్వాహక వ్యవస్థ కొద్దికొద్దిగా చొరబడేందుకు చోటిస్తున్నామనే అపవాదును మూటగట్టుకుంటున్నాం’ అని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదు.. ‘తప్పని తేలిన, సుప్రీంకోర్టు తిరస్కరించిన ఆరోపణలపై మళ్లీ విచారణ జరపమన్న దృష్టాంతాలు నాకు తెలిసినంత వరకూ గతంలో లేవు. సుప్రీం సిఫార్సులు పెండింగ్‌లో ఉండగా అత్యున్నత న్యాయస్థానాన్ని కార్యనిర్వాహక వ్యవస్థ పట్టించుకోకుండా పనిచేసిన ఉదంతాలు లేవు’ అని అన్నారు. డిస్ట్రిక్ట్ జడ్జీని ప్రమోట్ చేయడంలో ప్రభుత్వానికి ఏవైనా అభ్యంతరాలు, సందేహాలు ఉంటే పునఃపరిశీలనకు కొలీజియం సిఫార్సుల్ని తిప్పి పంపవచ్చని, అలా చేయకుండా వారిదగ్గర అలాగే అట్టే పెట్టుకున్నారన్నారని తప్పుపట్టారు. కొంతకాలానికి సుప్రీంకోర్టు సిఫార్సుల్ని ప్రభుత్వం అంగీకరించడమనేది మినహాయింపుగా మారిపోతుందని, సిఫార్సుల్ని వారి వద్ద అట్టిపెట్టుకోవడం నిబంధనగా పరిణమించే ప్రమాదముందని ఆయన హెచ్చరించారు. జడ్జీల బదిలీకి సంబంధించి హైకోర్టులతో న్యాయశాఖ నేరుగా సంప్రదించడాన్ని గతంలో సుప్రీంకోర్టు సీరియస్‌గా తీసుకుందని, ఆ అంశమే 1981లో మొదటి జడ్జీల కేసులో తీర్పు వెలువడేందుకు కారణమైందని గుర్తుచేశారు. జడ్జి కృష్ణ భట్‌పై మహిళా న్యాయాధికారి చేసిన ఆరోపణలపై విచారణ జరపాలని 2016లో అప్పటి సుప్రీం సీజేఐ ఠాకూర్ అప్పటి కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ ముఖర్జీని ఆదేశించారు. విచారణలో భట్‌కు క్లీన్చిట్ దక్కడంతో ఆయనను హైకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని కేంద్ర న్యాయ శాఖకు కొలీజియం సిఫార్సు చేసింది. సంప్రదాయానికి కొలీజియం బ్రేక్ హైకోర్టు శాశ్వత జడ్జీలుగా నియామకం కోసం తుది జాబితాలో చోటు దక్కించుకున్న వారితో ఇష్టాగోష్టిగా మాట్లాడటం ద్వారా సుప్రీంకోర్టు కొలీజియం చరిత్ర సృష్టించింది. కోల్‌కతా, మధ్యప్రదేశ్ హైకోర్టుల్లో శాశ్వత జడ్జీలుగా సంబంధిత హైకోర్టు కొలీజియాలు సిఫార్సు చేసిన 12 మంది లాయర్లు, ట్రయల్ కోర్టు జడ్జీల్ని సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ మిశ్రా, అత్యంత సీనియర్ జడ్జీలు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్‌లతో కూడిన కొలీజియం అనధికారికంగా గురువారం ఇంటర్వ్యూలు చేసింది. -
సీజేఐపై కాంగ్రెస్ అభిశంసన!
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాపై అభిశంసన తీర్మానాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. అందుకోసం వివిధ ప్రతిపక్ష పార్టీల ఎంపీల నుంచి కాంగ్రెస్ పార్టీ సంతకాలు సేకరిస్తోందని ఎన్సీపీ నేతలు వెల్లడించారు. ఈ అంశంపై స్పందించేందుకు కాంగ్రెస్ పార్టీ నిరాకరించగా.. ఎన్సీపీ ఎంపీ మజీద్ మెమన్ మాట్లాడుతూ ‘భారతదేశ ప్రధాన న్యాయమూర్తిపై అభిశంసన కోసం ప్రక్రియను కాంగ్రెస్ మొదలుపెట్టింది. నోటీసుపై నేను సంతకం చేశాను. ఎంత మంది సంతకం చేశారన్న విషయాన్ని కాంగ్రెస్‌నే అడగండి’ అని సమాధానమిచ్చారు. మరో ఎన్సీపీ ఎంపీ డీపీ త్రిపాఠీ మాట్లాడుతూ.. ‘నోటీసుపై నాతో పాటు ఇతరులు కూడా సంతకాలు చేశారు. ప్రక్రియ కొనసాగుతోంది’ అని చెప్పారు. సంతకాలు చేసిన వారిలో ఎన్సీపీ, సీపీఎం, సీపీఐ, ఇతర పార్టీల ఎంపీలు ఉన్నారని, కొందరు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా సంతకం చేశారని తెలిపారు. సీజేఐకి వ్యతిరేకంగా పార్లమెంటులో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలంటే నోటీసుపై లోక్‌సభలో 100 మంది ఎంపీలు, రాజ్యసభలో 50 మంది సభ్యుల సంతకాలు అవసరం. రాజ్యసభ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ కార్యాలయంలో వివిధ ప్రతిపక్ష పార్టీల నేతలు భేటీ అయ్యి అభిశంసన అంశంపై చర్చించినట్లు సమాచారం. అయితే దీనిపై స్పందించేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు నిరాకరించారు. -
కారుణ్య మరణానికి ఓకే
న్యూఢిల్లీ: కోలుకునే అవకాశం ఏమాత్రం లేని పరిస్థితుల్లో.. మృత్యువు కోసం ఎదురుచూస్తూ, మంచంపైనే కాలం వెళ్లదీస్తున్నవారికి ఊరటనిచ్చేలా దేశ అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం కీలక తీర్పును వెలువరించింది. మరణం వాయిదా వేయడం మినహా మరే ఆశ లేనప్పుడు, శారీరక బాధను భరించలేని దయనీయ పరిస్థితిలో.. రోగి లేదా అతని తరఫున నమ్మకమైన వ్యక్తి అనుమతితో కారుణ్య మరణం ప్రసాదించవచ్చని పేర్కొంటూ పరోక్ష కారుణ్య మరణానికి(పాసివ్ యుథనేసియా) సమ్మతించింది. గౌరవప్రదమైన మరణం కూడా జీవించే హక్కులో భాగమేనని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే, ఈ కారుణ్య మరణం అమలుకు సంబంధించి కొన్ని కచ్చితమైన మార్గదర్శకాలను కోర్టు పేర్కొంది. చికిత్స సాధ్యం కాదని, మరణం అనివార్యమని తెలిసినప్పుడు లేక చాన్నాళ్లుగా అచేతన స్థితిలో (కోమా) ఉన్నప్పుడు ఆ రోగి లేదా ఆ వ్యక్తి తరఫున.. కేవలం మరణాన్ని వాయిదా వేసే వైద్య చికిత్స తనకవసరం లేదని, ఆ ప్రాణాధార చికిత్సను నిలిపేయాలని కోరుతూ ‘అడ్వాన్స్డ్ మెడికల్ డైరెక్టివ్’ లేదా ‘లివింగ్ విల్’ను ఇవ్వొచ్చని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం వివరించింది. కారుణ్య మరణం కోసం ‘అడ్వాన్స్డ్ మెడికల్ డైరెక్టివ్’ని చట్టబద్ధం చేయకపోవడం.. ఆర్టికల్ 21 ప్రకారం రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ప్రశాంతంగా, గౌరవ ప్రదంగా మరణించే హక్కును పట్టించుకోకపోవడమేనని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ అంశంపై వీలైనంత త్వరగా చట్టం చేయాలని ప్రభుత్వానికి సూచించింది. ‘ఈ అంశంపై పార్లమెంటు చట్టం చేసే వరకూ కోర్టు ఆదేశాలు, మార్గదర్శకాలు అమల్లో ఉంటాయి’ అని సీజేఐ మిశ్రా తెలిపారు. తనతో పాటు జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ తరఫున ఆయన తీర్పు వెలువరించగా.. జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్‌లు వేర్వేరుగా తీర్పు వెలువరించారు. చికిత్సకు సంబంధించిన స్వయంగా నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉన్న రోగికి అన్ని విధాలా దగ్గరివారైన, రోగి మనస్సును అర్థం చేసుకోగలవారైన వ్యక్తికి రోగి కారుణ్య మరణంపై నిర్ణయం తీసుకునే అధికారం అప్పగించడాన్నే మెడికల్ పవర్ ఆఫ్ అటార్నీ లేదా లివింగ్ విల్ లేదా అడ్వాన్స్డ్ మెడికల్ డైరెక్టివ్ అంటారు. త్వరగా చట్టం చేయాలి సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా 192 పేజీల తీర్పునిస్తూ ‘బతికే ఆశ లేని పరిస్థితుల్లో లేక కోలుకునే అవకాశం లేకుండా సుదీర్ఘంగా అచేతనంగా(కోమా) ఉన్నప్పుడు.. ఆ వ్యక్తి పడే బాధను తగ్గించే క్రమంలో మరణ ప్రక్రియను వేగవంతం చేయడమంటే గౌరవంగా జీవించే హక్కును కల్పించడమే.. మానవ జీవిత పవిత్రతను ఎంతో గౌరవించాల్సి ఉన్నప్పటికీ.. వారు కోలుకునే ఆశ లేనప్పుడు.. ముందస్తు అనుమతి, సొంత నిర్ణయ హక్కుకు ప్రాధాన్యమివ్వాలి’ అని చెప్పారు. జస్టిస్ చంద్రచూడ్ 134 పేజీల తీర్పును వెలువరిస్తూ.. ‘చావు, బతుకులు విడదీయరానివి.. మరణించడం తప్పనిసరని తెలిసిన పరిస్థితుల్లో కూడా రాజ్యాంగం ప్రసాదించిన గౌరవప్రదంగా జీవించే హక్కు కొనసాగుతుందని తెలుసుకోవడం కోర్టుకు తప్పనిసరి. గౌరవప్రద మరణం కూడా జీవించే హక్కులో భాగం. గౌరవ ప్రదమైన మరణం లేకుండా చేయడమంటే ఒక వ్యక్తికి ఉండే అర్థవంతమైన ఉనికిని లేకుండా చేయడమే. అందుకే మరణించే వరకూ ఒక వ్యక్తి గౌరవప్రదంగా జీవించేందుకు ఉన్న హక్కును రాజ్యాంగం పరిరక్షిస్తుంది’ అని పేర్కొన్నారు. సీజేఐ తీర్పుతో జస్టిస్ సిక్రీ ఏకీభవిస్తూ.. ఈ అంశంపై చట్టసభలు వీలైనంత త్వరగా సమగ్ర చట్టం తీసుకురావాలని సూచించారు. జియాన్ కౌర్ కేసులో ‘గౌరవప్రదంగా మరణించడం రాజ్యంగ హక్కు’ అని 1996లో సుప్రీం ధర్మాసనం చెప్పిన విషయాన్ని తన తీర్పులో జస్టిస్ భూషణ్ పునరుద్ఘాటించారు. 2011లోనే..: 2011లో అరుణా షాన్‌బాగ్ కేసు సమయంలో పరోక్ష కారుణ్య మరణాన్ని సుప్రీంకోర్టు గుర్తించింది. అనంతరం ఇలాంటి సంఘటనలో పరోక్ష కారుణ్య మరణం కోసం రోగి ఇచ్చే లివింగ్ విల్లును గుర్తించాలని కామన్ కాజ్ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేయగా.. సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. లివింగ్ విల్ అంటే.. రోగి తన ఆరోగ్య సంరక్షణకు సంబంధించి నిర్ణయాలు తీసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ బాధ్యతను నమ్మకస్తుడైన మరో వ్యక్తికి కట్టబెట్టే ‘మెడికల్ పవర్ ఆఫ్ అటార్నీ’నే ‘లివింగ్ విల్’ లేదా ‘అడ్వాన్స్ మెడికల్ డైరెక్టివ్’గా పరిగణిస్తాం. ► రోగి స్పృహలో లేనప్పుడు, ఒక నిర్ణయం తీసుకునే తీసుకునే స్థితిలో లేనప్పుడు అతనికి ఎంతకాలం వైద్యం కొనసాగించాలో నిర్ణయించేది ఆ నమ్మకస్తుడైన వ్యక్తే ► సుప్రీం మార్గదర్శకాల ప్రకారం..మానసికంగా ఆరోగ్యవంతుడైన, సరిగా భావ వ్యక్తీకరణ చేసే వయోజనుడు లివింగ్ విల్ రూపొందించుకోవచ్చు. దాని ఉద్దేశం, అమలుచేశాక తలెత్తే పరిణామాలను అతను అర్థం చేసుకొని ఉండాలి. తీర్పులో వివేకానంద, ప్లేటో, షేక్స్పియర్..! తీర్పు సందర్భంగా కోర్టు తత్వవేత్తలు స్వామి వివేకానంద, చార్వాకుడు, ప్లేటో, హిప్పోక్రటస్, ఎపిక్యురస్లను ఉదాహరించింది. వీరితో పాటు విలియమ్ షేక్స్పియర్, అల్ఫ్రెడ్ టెన్నిసన్, ఎర్నెస్ట్ హెమ్మింగ్వే తదితర రచయితలు, కవులు జీవితం, మరణంపై వ్యక్తీకరించిన అభిప్రాయాల్ని తీర్పులో చేర్చారు. సీజేఐ మిశ్రా తీర్పును వెలువరిస్తూ ‘శ్వాసించే మనుషులెవరూ ఇప్పటివరకూ మృత్యువును కోరుకోలేదు’ అని టెన్నిసన్ వ్యాఖ్యలను ఉటంకించారు. ‘ఈ ప్రపంచం ఓ రంగస్థలం. మనం కేవలం పాత్రధారులమే’ అని షేక్స్పియర్మాటల్ని ఉదహరించారు. జస్టిస్ సిక్రీ తీర్పును వెలువరిస్తూ.. ‘ఈ లోకంలోకి ప్రతీ ఒక్కరూ ఏడుస్తూనే వస్తారు. కానీ నవ్వుతూ చనిపోయే వాడే అందరిలోకెల్లా అత్యంత అదృష్టవంతుడు’ అని ఓ హిందీ సినిమా డైలాగ్‌ను తీర్పులో చేర్చారు. ‘ఓ వ్యక్తి పరిపూర్ణం కాని రాజ్యాంగంతో పాటు అనారోగ్యకరమైన అలవాట్లు కలిగిఉంటే ఆ జీవితం వల్ల ఆ వ్యక్తికి, ఇతరులకు ప్రయోజనం శూన్యం’ అని ప్లేటో వ్యాఖ్యలను జస్టిస్ భూషణ్ ఉటంకించారు. ఆ కేసుతోనే కారుణ్య మరణంపై చర్చ అరుణ రామచంద్ర షాన్‌బాగ్.. 1973లో ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ ఆస్పత్రిలో నర్సుగా చేస్తున్న సమయంలో వార్డు బాయ్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె మెడకు గొలుసు బిగించి గాయపర్చడంతో అరుణ మెదడుకి రక్తప్రసారం నిలిచిపోయి అచేతన స్థితికి వెళ్లిపోయింది. 42 ఏళ్ల పాటు అలా మంచానికే పరిమితమయ్యారు. ట్యూబులతో ద్వారా వైద్యులు ఆహారం అందించారు. 2009లో సామాజిక కార్యకర్త పింకీ విరాని ఆమె స్థితికి చలించి ట్యూబుల్ని తొలగించి కారుణ్య మరణం ప్రసాదించాలని సుప్రీంలో పిటిషన్ వేశారు. కోర్టు ముగ్గురు ప్రముఖు వైద్యులతో కమిటీ వేయగా.. అరుణ బ్రెయిన్ డెడ్ అవలేదని, యుథనేసియా ఈ కేసుకి వర్తించదని ఆ కమిటీ తెలిపింది. దీంతో విరానీ పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఆ తర్వాత అరుణ న్యుమోనియా సోకడంతో 2015, మే 18న మరణించారు. యుథనేసియా రకాలు.. స్వచ్ఛంద(వాలంటరీ): రోగి అంగీకారం, అనుమతి మేరకు అతడికి మరణాన్ని అందించడం. బెల్జియం, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్‌లో ఈ రకం యూథనేసియా చట్టబద్ధం. స్వచ్ఛందం కాని(నాన్‌వాలంటరీ): రోగి అనుమతి, అంగీకారం తీసుకునే పరిస్థితి లేనప్పుడు నిర్వహించే మరణ ప్రక్రియ ఇది. పసిపిల్లల విషయంలో అరుదుగా ఉపయోగిస్తుంటారు. ఏ దేశంలోనూ ఇది చట్ట సమ్మతం కాదుగానీ.. నెదర్లాండ్స్‌లో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం అనుమతిస్తారు. బలవంతపు(ఇన్వాలంటరీ): పేరులో ఉన్నట్లే రోగికి ఇష్టం లేకపోయినా అతడిని చంపేసే ప్రక్రియను ఇన్వాలంటరీ యూథనేసియా అని పిలుస్తారు. పాసివ్, యాక్టివ్: పాసివ్ యుథనేసియాలో రోగికి అందిస్తున్న వైద్యాన్ని ఆపివేయడం ద్వారా మరణించేలా చేస్తారు. యాక్టివ్ యుథనేసియాలో వెంటనే చనిపోయేలా విషపు ఇంజెక్షన్లు ఇస్తారు. సుప్రీం మార్గదర్శకాలు.. కారుణ్య మరణం అమలు కోసం రోగి లేదా అతని తరఫు నమ్మకమైన వ్యక్తి రాసిచ్చే అడ్వాన్స్డ్ మెడికల్ డైరెక్టివ్ లేదా లివింగ్ విల్ విషయంలో కోర్టు పలు మార్గదర్శకాలు నిర్దేశించింది. మెడికల్ డైరెక్టివ్ పూర్తి ఆరోగ్యంతో ఉన్న వయోధికుడు మాత్రమే రాసి ఇవ్వాలి. అనుమతి పత్రం ఉద్దేశం, అమలు అనంతర పరిణామాల పట్ల వారికి అవగాహన ఉండాలి. ఎలాంటి నిర్బంధం లేకుండా స్వచ్ఛందంగా అనుమతి పత్రాన్ని రాసివ్వాలి. ముందుగా ఎలాంటి చికిత్స తీసుకున్నప్పటికీ వ్యాధులు నయంకాని రోగి గురించి చికిత్స చేసే వైద్యుడు ఆస్పత్రి యాజమాన్యానికి తెలియచేయాలి. అనంతరం ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు, బంధువులకు చెపుతారు. దీనిపై సంబంధిత విభాగాధిపతితో పాటు జనరల్ మెడిసిన్, కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, అంకాలజీ విభాగాల్లో నిష్ణాతులైన ముగ్గురు వైద్యులతో ఆస్పత్రి యాజమాన్యం ఓ మెడికల్ బోర్డును ఏర్పాటుచేస్తుంది. బంధువుల సమక్షంలో రోగిని ఈ బృందం పరీక్షించి వైద్య సేవల్ని నిలిపివేయాలా? వద్దా? అని నిర్ణయం తీసుకుంటుంది. ఒకవేళ రోగికి వైద్యాన్ని నిలిపివేయడానికి బోర్డు అంగీకరిస్తే.. ఈ విషయాన్ని సంబంధిత జిల్లా కలెక్టర్‌కు తెలియజేయాల్సి ఉంటుంది. ఈ విషయమై కలెక్టర్ మరో మెడికల్ బోర్డును ఏర్పాటుచేసి ఇంతకుముందు ఆస్పత్రి తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షిస్తారు. ఈ కమిటీ ఆస్పత్రి నిర్ణయంపై సంతృప్తి చెందితే కలెక్టర్ రోగిని సందర్శించి పాసివ్ యూథనేసియాకు అనుమతిస్తారు. ఒకవేళ కలెక్టర్ నియమించిన బోర్డు పాసివ్ యూథనేసియాకు ఆమోదం తెలపకుంటే రోగి కుటుంబ సభ్యులు, చికిత్స అందించిన వైద్యుడు, ఆస్పత్రి యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఓ డివిజన్ బెంచ్‌ను ఏర్పాటుచేసి నిర్ణయం తీసుకుంటారు. ముందస్తు వినతి లేని సమయంలో సదరు ఆస్పత్రి యాజమాన్యం మెడికల్ బోర్డును ఏర్పాటుచేస్తుంది. -
చరిత్రాత్మక తీర్పు
వైద్య కారణాలరీత్యా సుదీర్ఘకాలం అచేతన లేదా అర్థ చేతన స్థితిలో ఉన్నవారు సమాజంలోని ఇతరుల్లా తమకు నచ్చినట్టుగా జీవించలేరు. అటువంటివారు మర ణాన్ని ప్రసాదించమని కోరడం చట్టబద్ధమవుతుందా కాదా అనే ప్రశ్నకు ఎట్టకేలకు సర్వోన్నత న్యాయస్థానం నుంచి జవాబు లభించింది. హుందాగా, గౌరవప్రదంగా జీవించడం ప్రాథమిక హక్కు అయినట్టే హుందాగా మరణించాలనుకోవడం కూడా ప్రాథమిక హక్కే అవుతుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృ త్వంలోని అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం శుక్రవారం చరిత్రాత్మక తీర్పులో తేల్చి చెప్పింది. ఆసుపత్రుల్లో జీవచ్ఛవాల్లా బతుకీడుస్తూ నిస్సహాయ స్థితికి చేరుకున్నవారు ‘పాక్షిక కారుణ్య మరణాన్ని’ కోరుకునే వీలు కల్పిస్తూ... ఈ విషయంలో పార్లమెంటు ఒక చట్టం చేసేవరకూ అమల్లో ఉండేలా కొన్ని మార్గ దర్శకాలను రూపొందించింది. ఎంతటి సంక్లిష్టమైన పరిస్థితుల్లో చిక్కుకున్నవారిౖకైనా అర్ధాంతరంగా తనువు చాలించేందుకు అవకాశమీయడం హత్య చేయడంతో సమానమని ప్రపంచ దేశాల్లో చాలాచోట్ల భావిస్తారు. అమెరికా, బ్రిటన్, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, బెల్జియం, కొలంబియా, లగ్జెంబర్గ్, కెనడా వంటి 27 దేశాల్లో మాత్రమే కారుణ్య మరణానికి అనుమతి ఉంది. అయితే వీటిల్లో ‘క్రియాశీల కారుణ్య మరణానికి’ అనుమతించేవి కొన్నయితే, ‘పాక్షిక కారుణ్య మరణానికి’ అనుమతించేవి మరికొన్ని. పైగా అమె రికా, ఆస్ట్రేలియా వంటిచోట్ల దేశమంతా ఒకే విధానం అమల్లో లేదు. ఆ దేశాల్లో కొన్ని రాష్ట్రాలు కారుణ్యమరణాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించాయి. చట్ట పరిభాషలో రోగికి మోతాదుకు మించి మందులిచ్చి మరణానికి చేరువయ్యేలా చేయడం ‘క్రియాశీల కారుణ్య మరణం’ అవుతుంది. అలాకాక జీవస్పందన ఉండేందుకు దోహదపడే కీలకమైన మందుల్ని రోగికి ఇవ్వడం ఆపేస్తే లేదా చేయాల్సిన చికి త్సను నిలుపుచేస్తే సంభవించే మరణం ‘పాక్షిక కారుణ్య మరణం’ అవుతుంది. ఈ రెండూ వైద్యుల పర్యవేక్షణలో జరగాల్సినవే. రోగి లేదా అతని సన్నిహితులు సొంతంగా నిర్ణయించుకుని అమలు చేసేవి కాదు. నైతికంగా అయినా, విలువల పరంగానైనా ఈ రెండు విధానాలూ హత్య చేయడంతో సమానమని వాదించేవారు కొందరైతే... ‘క్రియాశీల కారుణ్యమరణం’ మాత్రం స్పష్టంగా హత్యేనని చెప్పేవారు మరికొందరు. ఇది ఒక నిండు జీవితాన్ని ముగించడానికి సంబంధించిన అంశం గనుక సహజంగానే దీన్లో సామాజిక, మతపరమైన అంశాలు కూడా ఇమిడి ఉంటాయి. నిజానికి ఈ కారుణ్య మరణం అంశం మన దేశంలో చర్చకు రావడానికి ప్రధాన కారణం నలభై రెండేళ్లపాటు అచేతన స్థితిలో మంచానికే పరిమితమై ఉండిపోయిన అరుణా రామచంద్ర శాన్‌బాగ్ అనే యువతి. ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్(కేఈఎం) ఆసుపత్రిలో నర్స్‌గా పనిచేస్తూ ఆమె అత్యాచారా నికి గురైంది. ఆ దుర్మార్గుడు అరుణ మెడకు ఇనుపగొలుసు బిగించి ఈడ్చుకుపో వడం పర్యవసానంగా మెదడుకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయింది. దాంతో ఆమె శాశ్వత అచేతనస్థితికి వెళ్లిపోయింది. ఆ ఆసుపత్రిలో ఆమెతో పనిచేసిన సహ సిబ్బంది, కాలక్రమంలో అక్కడ ఉద్యోగ విధుల్లో చేరినవారు ఈ నాలుగు దశా బ్దాలూ అరుణను కంటికి రెప్పలా చూసుకున్నారు. అయితే అరుణ చలనరహిత స్థితిలో ఉండటాన్ని తట్టుకోలేని ఆమె స్నేహితురాలు పింకీ విరానీ 2009లో ఆమెకు కారుణ్యమరణం ప్రసాదించాలని 2009లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతకు మూడేళ్ల ముందు అంటే... 2006లో జస్టిస్ ఎం. జగన్నాథరావు నేతృత్వంలోని లా కమిషన్ ఈ అంశంపై విపులంగా చర్చించింది. లా కమిషన్ నివే దికను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిశీలించినా ఎలాంటి నిర్ణయమూ తీసు కోలేదు. ఇదే అంశంపై తిరిగి జస్టిస్ పీవీ రెడ్డి ఆధ్వర్యంలోని లా కమిషన్ కూడా 2012లో సిఫార్సుచేసింది. ఇందుకోసం ముసాయిదా బిల్లును సైతం రూపొందిం చింది. దాంతోపాటే అది దుర్వినియోగమయ్యే అవకాశం లేకపోలేదని కూడా హెచ్చరించింది. అరుణ కేసులో 2011లో సుప్రీంకోర్టు తీర్పు వెలువరిస్తూ అసా ధారణ పరిస్థితుల్లో కారుణ్యమరణానికి అనుమతినీయవచ్చునంటూ పాక్షిక చట్టబ ద్ధత కల్పించింది. కానీ ఇది అరుణా శాన్‌బాగ్ విషయంలో వర్తించబోదని తెలి పింది. చివరకు ఆమె 2015 మేలో కన్నుమూసింది. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు వెలువరించిన మార్గదర్శకాల ప్రకారం... రోగి మానసిక స్వస్థతతో ఉండి, తనకెదురుకాగల పరిస్థితేమిటో అవగాహన చేసుకోగల సామర్ధ్యం ఉన్న సమయంలో మున్ముందు తాను అచేతన స్థితికి వెళ్లినపక్షంలో వైద్య చికిత్స నిలిపేయవచ్చునని సూచిస్తూ వైద్యులకు ‘సజీవ వీలునామా’ అంద జేయాలి. చికిత్స వల్ల మరణాన్ని వాయిదా వేయడం మినహా మరే ప్రయోజనమూ ఉండదని రోగి గ్రహించినప్పుడు వైద్య చికిత్సను తిరస్కరించే హక్కు అతడికి/ ఆమెకు ఉంటుందని ధర్మాసనం వ్యక్తం చేసిన అభిప్రాయం ఎన్నదగ్గది. అయితే ఇలాంటి ముందస్తు వీలునామా విధానం కొన్ని ప్రమాదాలకు దారితీసే అవకాశం కూడా లేకపోలేదు. ముఖ్యంగా తీవ్ర అనారోగ్యం బారినపడేవారికి, వృద్ధాప్యంలోకి అడుగిడినవారికి ఇది ప్రాణాంతకంగా మారుతుంది. వారిని ‘త్వరగా’ వదుల్చుకోవాలని, ఆస్తిపాస్తుల్ని రాబట్టుకోవాలని చూసే బంధువులు ఆ రోగికి మాయ మాటలు చెప్పి లేదా నయానో, భయానో ఒప్పించి ‘సజీవ వీలునామా’కు ఒత్తిడి చేయరన్న గ్యారెంటీ ఏమీ లేదు. దురాశ, స్వార్ధం, విలువల లేమి వంటివి వ్యక్తులను దేనికైనా దిగజారుస్తాయి. అలాగే తొలుత అనుమతినిచ్చిన రోగులే తదుపరి మనసు మార్చుకునే అవకాశం లేకపోలేదు. కానీ ఆ సమయానికి దాన్ని వైద్యులకు వ్యక్తపరిచే స్థితిలో వారు ఉండకపోవచ్చు. రోగిని మాత్రమే కాక... సమాజాన్నంతటినీ పరిగణనలోకి తీసుకున్నపక్షంలో తాజా విధానం అమలు ఎంత సంక్లిష్టమైనదో అర్ధమవుతుంది. కనుక ఆచితూచి దీన్ని అమలు చేయడం ఉత్తమం. -
‘నీట్’కు ఆధార్ తప్పనిసరి కాదు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: నీట్–2018, ఇతర ఆలిండియా పరీక్షలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు ఆధార్ నంబర్ తప్పనిసరి చేయొద్దని సీబీఎస్ఈకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సీబీఎస్ఈ వెబ్సైట్లో సమాచారాన్ని అప్లోడ్ చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాతో కూడిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం బుధవారం ఉత్తర్వులిచ్చింది. నీట్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఆధార్ నంబర్ తప్పనిసరిగా సమర్పించాలన్న సీబీఎస్ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను గతంలో గుజరాత్ హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన అప్పీల్ పిటిషన్‌పై బుధవారం వాదనలు జరిగాయి. వాదనల సందర్భంగా నీట్–2018కి దరఖాస్తు చేసుకునే విద్యార్థుల నుంచి ఆధార్ వివరాలు సేకరించే అధికారం సీబీఎస్ఈకి లేదని యూఐడీఏఐ కోర్టుకి తెలిపింది. దీంతో నీట్ దరఖాస్తుదారులకు ఆధార్ తప్పనిసరి చేయొద్దని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. -
సీజేఐ వద్దకు భూ పంచాయితీ
న్యూఢిల్లీ: భూసేకరణకు సంబంధించిన కేసుల విచారణకు తగిన ధర్మాసనం ఏర్పాటు చేయాలని కోరుతూ కేసును ప్రధాన న్యాయమూర్తికి సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం సిఫార్సు చేసింది. ఈ కేసులో ఫిబ్రవరి 8న వెలువరించిన తీర్పుపై బుధవారం ముగ్గురు సభ్యుల ధర్మాసనం స్టే విధించడంతో వివాదం నేపథ్యంలో ఈ అంశాన్ని సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రాకు రిఫర్ చేస్తూ న్యాయమూర్తులు జస్టిస్ అరుణ్‌మిశ్రా, జస్టిస్ అమితవ రాయ్‌తో కూడిన ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. ఈ అంశాన్ని సీజేఐకి సిఫార్సు చేయడమే సరైన నిర్ణయమని, బుధవారం నాటి ఉత్తర్వుల నేపథ్యంలో ఈ అంశంపై విచారణను కొనసాగించాలా? లేదా? అనే విషయాన్ని ఆయనే తేలుస్తారని ధర్మాసనం స్పష్టం చేసింది. నిర్దేశిత ఐదేళ్ల కాలంలో పరిహారం చెల్లించనట్లయితే దాని పేరు చెప్పి భూ సేకరణను రద్దు చేయడం చెల్లదని ఫిబ్రవరి 8న జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువరించింది. పుణే మున్సిపల్ కార్పొరేషన్ కేసులో 2014లో మరో త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. అయితే దీనిపై జస్టిస్ మదన్ బి లోకూర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం బుధవారం స్పందిస్తూ.. న్యాయ వ్యవస్థ అన్ని అంశాలపై ఒకేలా వ్యవహరించాలని పేర్కొంది. ఈనెల 8న వెలువరించిన తీర్పును పరిశీలించినట్లైతే.. న్యాయ వ్యవస్థ క్రమశిక్షణలో వ్యత్యాసం కనిపిస్తోందని, అభిప్రాయభేదాలు ఉన్నందున ఈ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి అప్పగించాలని, అలాగే హైకోర్టులు ఈ అంశంపై దాఖలైన కేసులను విచారించొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులపై జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం గురువారం స్పందిస్తూ.. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే తీర్పు వెలువరించామని, తీర్పు పూర్తిగా చదవకుండానే దాడికి దిగుతారని, ముందు తీర్పు కాపీని చదివి ఆ తర్వాత మాట్లాడాలని స్పష్టం చేసింది. ఈ అంశాన్ని ఎవరు విచారించాలనేది సీజేఐ నిర్ణయిస్తారని పేర్కొంది. -
ఏజీ సాయం కోరిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: చట్టసభ సభ్యులు న్యాయవాద వృత్తిలో కొనసాగకుండా నిషేధం కోరుతూ దాఖలైన పిటిషన్ విచారణలో సుప్రీంకోర్టు అటార్నీ జనరల్(ఏజీ) సాయం కోరింది. ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి అశ్వినికుమార్ ఉపాధ్యాయ ఈ పిటిషన్ వేశారు. పార్లమెంట్ సభ్యులు, శాసనసభ, మండలి సభ్యులు లాయర్లుగా కొనసాగడం ‘విరుద్ధ ప్రయోజనాల’కిందికి వస్తుందని, అడ్వకేట్ల చట్టం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలను ఉల్లంఘిస్తోందని అందులో పేర్కొన్నారు. దీంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ విచారణలో సహకరించాల్సిందిగా అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌ను కోరింది. లాయర్లుగా కొనసాగుతున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు క్లయింట్ల నుంచి ఫీజు, ప్రజా ఖజానా నుంచి జీతాలు అందుకుంటున్నారని, ఇది వృత్తి పరంగా ఆమోదయోగ్యం కాని విధానమని అశ్వినికుమార్ అన్నారు. ప్రజా ప్రతినిధులుగా టీవీలు, రేడియోల్లో చర్చా కార్యక్రమాల్లో పాల్గొని లాయర్లుగా తమ బ్రాండ్ విలువను పెంచుకుంటున్నారని ఆరోపించారు. -
కర్ణాటకకు మరో 14.75 టీఎంసీలు
న్యూఢిల్లీ/చెన్నై/బెంగళూరు: తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా నడుస్తున్న కావేరీ నదీ జలాల వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు శుక్రవారం కీలక తీర్పునిచ్చింది. 2007లో కావేరీ జల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్ (సీడబ్ల్యూడీటీ) కేటాయించిన నీటి వాటాల్లో మార్పులు చేస్తూ కర్ణాటకకు మరో 14.75 టీఎంసీల నీటిని వాడుకునే అవకాశమిచ్చింది. అంతే పరిమాణంలో తమిళనాడుకు కోత విధించింది. కేటాయింపుల్లో తాగు నీటికే తొలి ప్రాధాన్యత అని సీజేఐ జస్టిస్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్ తేల్చింది. బెంగళూరుకు ఉన్న ‘ప్రపంచ స్థాయి నగరం’ హోదాను దృష్టిలో పెట్టుకుని తాజా కేటాయింపులు చేస్తున్నామంది. 14.75 టీఎంసీల్లో బెంగళూరు నగర అవసరాలకోసం 4.75 టీఎంసీల నీటిని కేటాయించింది. ఈ తీర్పుతో ఇరు రాష్ట్రాల సరిహద్దులోని బిలిగుండ్లు నుంచి తమిళనాడుకు కర్ణాటక 177.25 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉంది. ‘బెంగళూరు విస్తీర్ణంలో మూడింట ఒక వంతు మాత్రమే కావేరీ నదీ పరీవాహక ప్రాంతంలో ఉండటంతోపాటు అక్కడ 50 శాతం తాగునీటి అవసరాలు భూగర్భజలాల ద్వారానే తీరుతాయనే ఊహాజనిత కారణాలతో ట్రిబ్యునల్ కర్ణాటకకు కేటాయింపులను తగ్గించింది’ అని ధర్మాసనం తీర్పు చెప్పింది. జాతీయ ఆస్తి.. రాష్ట్రాల సొత్తు కాదు అంతర్జాతీయ నదీ జలాల సమాన పంపకాలకు సంబంధించిన హెల్సింకి, కాంపియన్, బెర్లిన్ నిబంధనలను తాజా తీర్పులో ఉటంకించిన కోర్టు.. నదులు జాతీయ ఆస్తులనీ, ఏ రాష్ట్రం కూడా ఒక నది పూర్తిగా తనకే చెందుతుందని చెప్పుకోజాలదని స్పష్టం చేసింది. ప్రకృతి వరప్రసాదాలైన నదీ జలాలను బాధ్యతాయుతంగా వాడుకునే హక్కు ఆ నది పారుతున్న ప్రతి రాష్ట్రానికీ ఉంటుందని పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 363 ప్రకారం ఈ కేసును సుప్రీంకోర్టు విచారించకూడదన్న కేంద్రం వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. కావేరీ జలాల వివాదం విషయమై 2016లో కర్ణాటక, తమిళనాడుల్లో ఘర్షణలు జరిగాయి. తమిళనాడుకు 404.25, కర్ణాటకకు 284.75 సీడబ్ల్యూడీటీ 2007లో తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరిలకు వరుసగా 419, 270, 30, 7 టీఎంసీల నీటిని కేటాయించింది. తాజా తీర్పుతో తమిళనాడుకు 404.25, కర్ణాటకకు 284.75 టీఎంసీల నీళ్లు దక్కనున్నాయి. కేరళ, పుదుచ్చేరిల కేటాయింపుల్లో మాత్రం సుప్రీంకోర్టు ఎలాంటి మార్పులూ చేయలేదు. అలాగే నదీ పరీవాహక ప్రాంతం నుంచి 10 టీఎంసీల భూగర్భ జలాలను తోడుకునేందుకు తమిళనాడుకు అనుమతినిచ్చింది. తీర్పును అమలు చేసేందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించేందుకు కేంద్రానికి ధర్మాసనం ఆరు వారాల గడువిచ్చింది. 15 ఏళ్ల వరకు ఈ కేటాయింపులు అమలవుతాయని ధర్మాసనం తెలిపింది. తమిళనాడులో ఆందోళనలు తీర్పు కర్ణాటకకు అనుకూలంగా ఉండటంతో తమిళనాడులో నిరసనలు, ఆందోళనలు మొదలయ్యాయి. అవాంఛిత ఘటనలను నివారించేందుకు ప్రభుత్వం ముందుజాగ్రత్తగా పలుచోట్ల పోలీసులు, భద్రతా దళాలను మోహరించింది. ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం మాట్లాడుతూ సుప్రీంకోర్టు కేటాయించిన 177.25 టీఎంసీల నీటిని తీసుకొచ్చేందుకు అంకితభావంతో కృషిచేస్తామన్నారు. తమిళనాడు ప్రభుత్వం అసమర్థతతో కోర్టులో సరైన ఆధారాలు సమర్పించకపోవడం వల్లే తీర్పు కర్ణాటకకు అనుకూలంగా వచ్చిందని ప్రతిపక్ష డీఎంకే పార్టీ ఆరోపించింది. తీర్పు తనకు చాలా అసంతృప్తిని కలిగించిందని నటుడు రజనీకాంత్ అన్నారు. ఇరు రాష్ట్రాల ప్రజలూ గొడవలకు దిగకుండా సామరస్యంగా మెలగాలని నటుడు కమల్ హాసన్ సూచించారు. తమ వాదనలకు అనుగుణంగా తీర్పు లేకపోయినప్పటికీ రాష్ట్రానికి కొంత ఊరట లభించిందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. 1881 నుంచి వివాదం ► 1881వ సంవత్సరంలో కావేరీ నదిపై డ్యామ్ నిర్మించాలన్న అప్పటి మైసూర్ సంస్థానం ప్రయత్నాన్ని మద్రాస్ ప్రెసిడెన్సీ అడ్డుకోవటంతో రెండు రాష్ట్రాల మధ్య వివాదం మొదలైంది. ఆ తర్వాత నదీ జలాల పంపిణీపై రెండు ప్రభుత్వాలు 1892, 1924వ సంవత్సరాల్లో వేర్వేరు ఒప్పందాలు కుదుర్చుకోవటంతో వివాదం పరిష్కారమయింది. ఈ ఒప్పందాల కాల పరిమితి 1974లో ముగిసింది. ► 1990 – తమిళనాడు కోరిక మేరకు కేంద్రం కావేరీ జల వివాద ట్రిబ్యునల్(సీడబ్ల్యూడీటీ)ను ఏర్పాటు చేసింది. ► 1991 – అత్యవసర సాయంగా కొంతనీరు విడుదల చేయాలన్న తమిళనాడు వినతిని సీడబ్ల్యూడీటీ తిరస్కరించింది. దీంతో తమిళనాడు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీం సూచనల మేరకు.. తమిళనాడుకు 205 టీఎంసీల నీటిని విడుదల చేయాలని సీడబ్ల్యూడీటీ కోరగా కర్ణాటక పట్టించుకోలేదు. దీనిపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నా కర్ణాటక దిగిరాలేదు. ఈ పరిణామంతో కేంద్రం సీడబ్ల్యూడీటీ మధ్యంతర ఉత్తర్వులను గెజిట్‌లో ప్రచురించింది. ► 1998 – సీడబ్ల్యూడీటీ మధ్యంతర ఉత్తర్వులను అమలు పరిచేందుకు ప్రత్యేకంగా కేంద్రం కావేరి నదీ ప్రాధికార సంస్థ(సీఆర్ఏ)ను ఏర్పాటు చేసింది. ► 2007 – ఏర్పాటైన 17 ఏళ్ల తర్వాత కావేరి జలాల పంపిణీ తుది అవార్డును సీడబ్ల్యూడీటీ ప్రకటించింది. నదీ జలాల పంపిణీపై 1892, 1924 సంవత్సరాల్లో కుదిరిన ఒప్పందాల అమలే సరైన పరిష్కారమని అందులో పేర్కొంది. ► 2013 – కావేరి యాజమాన్య బోర్డు(సీఎంబీ) ఏర్పాటు చేయాలని తమిళనాడు కోరడంతో ఆ మేరకు కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ► 2013 మే 28 – సీడబ్ల్యూడీటీ ఆదేశాలను అమలు చేయనందుకు తనకు కలిగిన రూ.2,480 కోట్ల నష్టాన్ని కర్ణాటక చెల్లించాలంటూ తమిళనాడు సుప్రీంకు వెళ్లింది. ► 2013 – నీటి విడుదలపై సీడబ్ల్యూడీటీ ఆదేశాలను అమలు చేయాలన్న తమిళనాడు డిమాండ్ సహేతుకం కాదని కావేరీ పర్యవేక్షక కమిటీ పేర్కొంది. ► 2016 సెప్టెంబర్ 11 – కావేరి నీటి విడుదలపై ఉత్తర్వులను సవరించాలని కర్ణాటక వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సుప్రీం తీర్పును వ్యతిరేకిస్తూ చెన్నైలో ఆందోళన చేస్తున్న నిరసనకారులు. చెన్నైలో కర్ణాటక బస్సుకు రక్షణగా వెళ్తున్న పోలీసులు -
ఆధార్‌ను ‘అలా’ పక్కనపెట్టలేం: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకపోవడం వల్ల ఆధార్ చట్ట విరుద్ధమని ప్రకటించలేమని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. ఆధార్ లేకపోవడం వల్ల ప్రజలు ప్రయోజనాలకు దూరం కాకూడదని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వుల జారీకి నిరాకరిస్తూ పై విధంగా స్పందించింది. ‘ఒక చట్టం చెల్లదని ప్రకటించడానికి అలాంటి సమస్యలు ప్రాతిపదికలు కావు’ అని సీజేఐ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బెంచ్ పేర్కొంది. విచారణకు హాజరైన ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ వాదిస్తూ..ఆధార్ సమర్పించనందుకు కొందరు సీనియర్ సిటిజన్లకు పింఛన్లు నిరాకరించారని ఓ పత్రికలో వచ్చిన వార్తను ఉటంకించారు. కేంద్రం తరఫున హాజరైన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, అడిషనల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సిబల్ వాదనలతో విభేదించారు. బయోమెట్రిక్ , ఐరిష్ లాంటివి పనిచేయకుంటే గుర్తింపు కార్డులుగా ఇతర ప్రత్యామ్నాయాలున్నాయని వేణుగోపాల్ అన్నారు. -
లవ్ జిహాదీ కేసు:‘సుప్రీం’ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : కేరళ లవ్ జిహాద్ కేసులో సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. హదియా ఎవరితో జీవించాలనే నిర్ణయం తీసుకునే హక్కు ఆమెకు మాత్రమే ఉందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మంగళవారం ఈ కేసు విచారణను కొనసాగించిన ధర్మాసనం పలు ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేసింది. ‘‘మీరు(ఎన్ఐఏను ఉద్దేశించి) ఏమైనా దర్యాప్తు చేసుకోవచ్చు. కానీ, హదియా వైవాహిక జీవితంలో జోక్యం చేసుకునే న్యాయ బద్ధత మాత్రం లేదు. మేజర్ అయిన ఓ అమ్మాయిని తల్లిదండ్రులతో ఉండాలని చెప్పటానికి ఎవరికీ హక్కులు లేవు. ఎవరితో జీవించాలన్న నిర్ణయం కూడా పూర్తిగా ఆమెకు మాత్రమే ఉంటుంది. పైగా వైవాహిక బంధాన్ని విచ్ఛిన్నం చేసే హక్కు న్యాయస్థానాలకు కూడా ఉండదు’’ అని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణను ఫిబ్రవరి 22కు కోర్టు వాయిదా వేసింది. కాగా, కేరళకు చెందిన అఖిల ఆశోకన్(25) అనే యువతి గతేడాది డిసెంబర్లో మతమార్పిడికి పాల్పడి హదియాగా పేరు మార్చుకుని షఫీన్ జహాన్‌ను వివాహం చేసుకుంది. అఖిల తండ్రి మాత్రం అది బలవంతంగా మతం మార్పిడి వివాహం అని ఫిర్యాదు చెయ్యటంతో వ్యవహారం ‘లవ్ జిహాద్ కేసు’ గా మారి దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. అటుపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఇక హదియ వివాహాన్ని కేరళ హైకోర్టు రద్దు చేయటంతో ఆమె భర్త షఫీన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. కేసు విచారణ కొనసాగుతోంది. -
డాక్యుమెంట్లను క్షుణ్నంగా పరిశీలిస్తాం
-
తీవ్రమైన అంశాలున్నాయి!
న్యూఢిల్లీ: సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి బీహెచ్ లోయా మృతికి సంబంధించి పిటిషన్లలో లేవనెత్తిన అంశాలు చాలా తీవ్రమైనవని, అన్ని పత్రాల్ని చాలా క్షుణ్నంగా పరిశీలిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. లోయా మృతిపై సమగ్ర దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం విచారణ ప్రారంభించింది. ఈ కేసులో బాంబే హైకోర్టుకు చెందిన నాగ్‌పూర్, ముంబై ధర్మాసనాలు విచారిస్తోన్న మరో రెండు పిటిషన్లను సుప్రీంకోర్టుకు ధర్మాసనం బదిలీ చేసింది. లోయా మృతిపై ఇకపై ఎలాంటి పిటిషన్లు దాఖలైనా వాటిని విచారణకు స్వీకరించవద్దని అన్ని హైకోర్టుల్ని ఆదేశించింది. ఇంతవరకూ కోర్టుకు సమర్పించని పత్రాలను ఫిబ్రవరి 2లోగా తమ ముందుంచాలని కోర్టు ఆదేశించింది. అదే సమయంలో ఈ కేసులో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పేరును తెరపైకి తేవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే తీరును కోర్టు తప్పుపట్టింది. షాపై ఆరోపణల పట్ల సాల్వే అభ్యంతరం లోయా మృతిపై కాంగ్రెస్ నేత తెహ్సీన్ పూనావాల్లా, జర్నలిస్టు బీఎస్ లోనే దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. కిక్కిరిసిన కోర్టు గదిలో దాదాపు గంటపాటు న్యాయవాదుల మధ్య వాడీవేడిగా వాదనలు సాగాయి. బాంబే న్యాయవాదుల విభాగం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదిస్తూ.. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పేరును ప్రస్తావించారు. షాను రక్షించే క్రమంలోనే ఇదంతా జరిగిందని ఆరోపించారు. మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సుప్రీం జోక్యం చేసుకుని.. ‘ఇప్పటివరకైతే ఇది సహజ మరణమే. ఇప్పుడు ఆ విధమైన ఆరోపణలు చేయొద్దు’ అని దవేకు సూచించింది. వెంటనే దవే లేచి.. ఈ కేసులో అమిత్ షా తరఫున గతంలో సాల్వే హాజరయ్యారని, ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయన వాదించడం సరికాదని అన్నారు. ‘ఎవరి తరఫున ఎవరు హాజరవ్వాలనేది న్యాయవాదుల విచక్షణకే వదిలేస్తున్నాం. మేం బార్ కౌన్సిల్ కాదు. మిమ్మల్ని మేం ఆపలేము. కేసుకు సంబంధించిన అన్ని రికార్డుల్ని సంబంధిత పార్టీలు కోర్టుకు సమర్పించాలి’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసులో స్వతంత్ర విచారణ జరిపించాలని లోయా తండ్రి, సోదరిలు కోరారని దవే వెల్లడించారు. ఈ కేసులో తాను ఎలాంటి విచారణ కోరడం లేదని లోయా కుమారుడి ప్రకటనకు ముందు.. అప్పటి బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అతన్ని తన చాంబర్‌కు పిలిపించుకోవడాన్ని దవే ప్రశ్నించారు. మహారాష్ట్ర ప్రభుత్వ పత్రాల్ని పిటిషనర్ల న్యాయవాదులకు మాత్రమే అందుబాటులో ఉంచాలని సాల్వే కోర్టుకు విజ్ఞప్తి చేశారు. జైసింగ్ వ్యాఖ్యలపై సుప్రీం ఆగ్రహం ఈ కేసులో మీడియా కవరేజీని కోర్టు అడ్డుకోవచ్చేమోనని సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ సందేహం వ్యక్తం చేయగా.. ఆ వ్యాఖ్యలపై సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాంటి వ్యాఖ్యలు సరికాదని.. వెంటనే వాటిని వెనక్కి తీసుకుని, క్షమాపణలు చెప్పాలని సీజేఐ మిశ్రా ఆదేశించారు. దాంతో ఇందిరా జైసింగ్ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటూ క్షమాపణలు చెప్పారు. ‘ఇది చాలా అనుచితం. మీడియాను అడ్డుకునే విషయంపై కనీసం నేను ఒక్క మాటైనా మాట్లాడానా? మీడియా కవరేజీని నిరోధిస్తూ ఏదైనా ఆదేశాన్ని జారీ చేశానా?’ అని జస్టిస్ మిశ్రా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కేసు చాలా తీవ్రమైందని, అందువల్ల విచారణ సమయంలో మీడియా నివేదికల ఆధారంగా కోర్టు వ్యవహరించదని బెంచ్ పేర్కొంది. నిష్పాక్షిక దృష్టితో పరిశీలిస్తాం వాదనలు ముగిశాక ధర్మాసనం స్పందిస్తూ.. లోయా మృతికి సంబంధించిన అన్ని పత్రాల్ని నిష్పాక్షిక దృష్టితో మరింత లోతుగా పరిశీలిస్తామని తెలిపింది. అనంతరం తదుపరి విచారణను ఫిబ్రవరి 2కు వాయిదా వేసింది. సున్నితమైన సోహ్రబుద్దీన్ నకిలీ ఎన్కౌంటర్ కేసును విచారిస్తోన్న లోయా.. డిసెంబర్ 1, 2014న స్నేహితుడి కుమార్తె పెళ్లి కోసం నాగ్‌పూర్ వెళ్లిన సమయంలో గుండెపోటుతో మరణించారు. సోహ్రబుద్దీన్ కేసులో అమిత్‌షాతోపాటు రాజస్తాన్ హోం మంత్రి గులాబ్ చంద్ కటారియా, గుజరాత్ పోలీసు మాజీ చీఫ్ పీసీ పాండే తదితరులు కేసు ప్రారంభ దశలో నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. -
సుప్రీంలో త్వరలో పారదర్శక రోస్టర్
న్యూఢిల్లీ: సుప్రీంలో దాఖలయ్యే సున్నితమైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలను(పిల్) ధర్మాసనాలకు కేటాయించే విషయంలో మరింత పారదర్శతక కోసం అందిన సలహాలను సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా పరిశీలించినట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. కేసులకు సంబంధించిన వివరాలను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించాయి. మరోవైపు సుప్రీం సంక్షోభం నివారణకు సీజేఐతో నలుగురు సీనియర్ జడ్జీలు సోమవారం భేటీ అయ్యే అవకాశముందని పేర్కొన్నాయి. -
సద్దుమణగని ‘సుప్రీం’ సంక్షోభం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై అసమ్మతి గళం వినిపించిన నలుగురు సీనియరు న్యాయమూర్తులు గురువారం సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కీలక కేసుల కేటాయింపులతో పాటు ఇతర అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. గత నాలుగు రోజుల్లో సీజేఐ, నలుగురు సీనియర్ న్యాయమూర్తులు సమావేశం కావడం ఇది రెండోసారి. జనవరి 12 నాటి మీడియా సమావేశంలో సీజేఐ తీరుపై నలుగురు న్యాయమూర్తులు ఫిర్యాదు చేశాక.. తొలిసారి మంగళవారం వారు భేటీ అయిన సంగతి తెలిసిందే. సీజేఐ జస్టిస్ మిశ్రాతో నలుగురు న్యాయమూర్తులు జస్టిస్ జే చలమేశ్వర్, జస్టిస్ గొగొయ్, జస్టిస్ మదన్ లోకూర్, జస్టిస్ జోసఫ్‌లు దాదాపు 15 నిమిషాలు చర్చించినట్లు తెలుస్తోంది. నలుగురు జడ్జీలు లేవనెత్తిన డిమాండ్లు తనకు తెలుసని ఈ భేటీలో సీజేఐ చెప్పారని సుప్రీం వర్గాల సమాచారం. వారు లేవనెత్తిన అంశాలు, సలహాల్ని పరిగణనలోకి తీసుకుంటానని సీజేఐ హామీ ఇచ్చిన నేపథ్యంలో వివాద పరిష్కారంలో కొంత పురోగతి కనిపించిందని సుప్రీం వర్గాలు తెలిపాయి. తదుపరి చర్చల్లో జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లు కూడా పాల్గొని సంక్షోభ పరిష్కారానికి ప్రయత్నించనున్నట్లు సమాచారం. మరోవైపు ముందుగా నిర్ణయించిన కార్యక్రమం ప్రకారం జస్టిస్ జే చలమేశ్వర్ చెన్నై బయల్దేరి వెళ్లారు. మీడియాను అడ్డుకోవాలన్న పిటిషన్ తిరస్కరణ జనవరి 12 నాటి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో నలుగురు సీనియర్ న్యాయమూర్తుల లేవనెత్తి అంశాల్ని మీడియాలో ప్రచురించకుండా, చర్చించకుండా అడ్డుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకునేందుకు సుప్రీం కోర్టు తిరస్కరించింది. సుప్రీం రిజిస్ట్రార్ పిటిషన్‌ను పరిశీలించి.. విచారణ సమయం కేటాయించిన అనంతరం ఆ అంశాన్ని పరిశీలిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా ధర్మాసనం పేర్కొంది. -
ఆధార్ ఓ ఎలక్ట్రానిక్ పగ్గం
న్యూఢిల్లీ: ఆధార్ అనేది ఒక ఎలక్ట్రానిక్ పగ్గం లాంటిదనీ, జంతువులను తాళ్లతో కట్టేసినట్లు ప్రభుత్వం ఆధార్‌తో ప్రజలను బంధిస్తోందని న్యాయవాది శ్యాం దివన్ సుప్రీంకోర్టుకు తెలిపారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఆధార్ రాజ్యాంగ బద్ధతను సవాల్ చేస్తూ వచ్చిన పిటిషన్లపై బుధవారం విచారణ ప్రారంభించింది. పిటిషనర్ల తరఫున శ్యాం వాదనలు వినిపించారు. ‘ఆధార్ ఒక ఎలక్ట్రానిక్ పగ్గం లాంటిది. ఇది సెంట్రల్ డేటాబేస్కు కనెక్ట్ అయ్యి ఉంటుంది. పౌరుల రోజువారీ కార్యకలాపాలను, అలవాట్లను గమనించే అవకాశం ఇవ్వడం ద్వారా మెల్లగా ప్రజల్లో అసమ్మతిని అణచివేసి, ప్రభుత్వానికి అనుకూలంగా వారి ప్రవర్తనలో మార్పు తీసుకురాగలదు. ప్రతి దానికీ ఆధార్‌ను లింక్ చేయడం వల్ల ఏ పని చేయాలన్నా అది అవసరమవుతుంది. ఆధార్ నంబర్ లేకుండా బతకలేమనే స్థితి వస్తుంది. అప్పుడు ప్రభుత్వంలోని వారికి ఎవరిపైనైనా ఆగ్రహం వస్తే వారి ఆధార్ నంబర్‌ను స్విచాఫ్ చేస్తే చాలు. సామాజికంగా ఆ వ్యక్తి మరణించినంత పనవుతుంది. ఇలా ఇది ప్రజల్లో అసమ్మతి అనేదే లేకుండా చేస్తుంది’ అంటూ శ్యాం వాదించారు. తదుపరి వాదనలు గురువారం కొనసాగనున్నాయి. -
సుప్రీం జడ్జీలకు జస్టిస్ రమణ విందు
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. సుప్రీం కోర్టు జడ్జీల కోసం ప్రత్యేక విందు ఏర్పాటుచేశారు. కోర్టు ప్రాంగణంలోని ఆయన చాంబర్లో భోజన విరామ సమయంలో జరిగిన విందులో నోరూరించే ఆంధ్రా వంటకాలను వడ్డించారు. తాజాగా నెలకొన్న సుప్రీం సంక్షోభంతో కోర్టు వాతావరణం గంభీరంగా ఉన్న సమయంలో ఏర్పాటుచేసిన ఈ విందు ఉపశమనం లాంటిదని ఓ సీనియర్ జడ్జి పేర్కొన్నారు. అనారోగ్యం కారణంగా జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ గోయల్ మినహా సీజేఐ దీపక్ మిశ్రా, మిగిలిన 23 మంది న్యాయమూర్తులు ఈ విందులో పాల్గొన్నారు. ప్రతి బుధవారం ఒక్కో జడ్జి తమ ప్రాంత వంటకాలతో జడ్జీల కోసం విందు ఇస్తున్నారు. కాగా, బుధవారం కోర్టు కార్యకలాపాల ప్రారంభానికి ముందే జస్టిస్ చలమేశ్వర్ మినహా మిగిలిన ముగ్గురు తిరుగుబాటు జడ్జీలతో సీజేఐ సమావేశమయ్యారు. గురువారం చలమేశ్వర్ కోర్టుకు హాజరయ్యే అవకాశముంది. దీంతో ఈ నలుగురితో సీజేఐ సమావేశం అవుతారని సమాచారం. -
కుదరని రాజీ.. తొలగని సంక్షోభం!
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో నెలకొన్న సంక్షోభం కొనసాగుతోంది. ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ దీపక్ మిశ్రా, నలుగురు సీనియర్ న్యాయమూర్తుల మధ్య నెలకొన్న వివాదం ఇంకా సమసిపోలేదు. జస్టిస్ మిశ్రాతో.. ఆయనపై ప్రెస్మీట్లో తీవ్ర విమర్శలు చేసిన జడ్జీలు జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ కురియన్ జోసఫ్ మంగళవారం భేటీ అయ్యారు. 15 నిమిషాల పాటు వీరి భేటీ జరిగిందని, ఇందులో వీరితో పాటు మరికొందరు న్యాయమూర్తులు కూడా పాల్గొన్నారని సుప్రీం వర్గాలు వెల్లడించాయి. తర్వాత జడ్జీలంతా విధుల్లోకి వెళ్లారు. అయితే, ఈ భేటీ అనంతరం వివాద పరిష్కారానికి సంబంధించి కానీ, రాజీ మార్గానికి సంబంధించి కానీ ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అలాగే, వారి మధ్య ఏయే అంశాలు చర్చకొచ్చాయన్న విషయమూ తెలియరాలేదు. కాగా, ఈ సంక్షోభాన్ని కుటుంబ వివాదంగా, టీ కప్పులో తుపానుగా అభివర్ణించి, సమస్య పరిష్కారమైందంటూ సోమవారం ప్రకటించిన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్.. మంగళవారం మాత్రం సమస్య ఇంకా పరిష్కారమైనట్లు కనిపించడం లేదని, మరో రెండు, మూడు రోజుల్లో అంతా సర్దుకుంటుందని చెప్పడం గమనార్హం. టీ కప్పులో తుపాను ఇది చిన్న కుటుంబ వివాదమని, ఇది కూడా ముగిసినట్లేనని అటార్నీ జనరల్(ఏజీ) కేకే వేణుగోపాల్‌తో పాటు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) చైర్మన్ మన్ కుమార్ మిశ్రాలు సోమవారం చెప్పారు. దీంతో ఇకపై అంతా సజావుగా సాగుతుందని న్యాయ వర్గాలు భావించాయి. నలుగురు సీనియర్ న్యాయమూర్తులు తమ విధులకు హాజర య్యారని, పరిస్థితి అదుపులోనే ఉందని, అంతా చక్కబడిందని ఏజీ చెప్పారు. ఇంతవరకూ తాను సీజేఐ సహా ఏ న్యాయమూర్తిని కలవలేదన్నారు. మన్ మిశ్రా కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. ‘ప్రెస్ కాన్ఫరెన్స్‌లో నలుగురు న్యాయమూర్తులు లేవనెత్తిన అంశాలు కుటుంబంలోని అంతర్గత విషయాలు.. అవి అంతర్గతంగానే పరిష్కారమయ్యాయి’ అని చెప్పారు. అంతకుముందు రోజు మిశ్రా నేతృత్వంలోని ఏడుగురి బృందం వివాద పరిష్కారం కోసం సీజేఐతో పాటు సుప్రీంకోర్టులోని 15 మంది న్యాయమూర్తులతో విస్తృతంగా చర్చించింది. సంక్షోభం సర్ధుకుందని అందరూ అనుకుంటోన్న తరుణంలో అటార్నీ జనరల్ వేణుగోపాల్ మంగళవారం మాట్లాడుతూ.. ‘సంక్షోభం సమసిపోలేదని అనుకుంటున్నాను. రెండు మూడ్రోజుల్లో అంతా పరిష్కారమవుతుందని ఆశిద్దాం’ అని చెప్పడంతో ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రెస్ కాన్ఫరెన్స్‌పై పిటిషన్ తిరస్కరించిన సీజేఐ సీజేఐ, నలుగురు సీనియర్ న్యాయమూర్తుల మధ్య విభేదాల నేపథ్యంలో సుప్రీంకోర్టు కార్యకలాపాలపై సోమవారం ఆసక్తి కొనసాగింది. శుక్రవారం ప్రెస్ కాన్ఫరెన్స్ అనంతరం తొలిసారి వారు విధులకు హాజరయ్యారు. తన కోర్టు గదిలో సీజేఐ జస్టిస్ మిశ్రా రోజువారీ కేసుల విచారణను ప్రారంభించగానే.. నలుగురు న్యాయమూర్తుల ప్రెస్ కాన్ఫరెన్స్ విషయాన్ని న్యాయవాది ఆర్పీ లూథ్రా ప్రస్తావిస్తూ.. చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అయితే ఆ పిటిషన్‌ను సీజేఐని తిరస్కరించారు. అనంతరం సీజేఐ నేతృత్వంలోని జస్టిస్ ఎం.ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం పలు కేసుల్ని విచారించింది. ఇక రెండో నెంబరు కోర్టు గదిలో జస్టిస్ చలమేశ్వర్ పలు కేసుల్ని విచారించారు. జస్టిస్ గొగొయ్, జస్టిస్ లోకూర్, జస్టిస్ జోసఫ్‌లు వరుసగా మూడు, నాలుగు, ఐదు కోర్టు గదుల్లో కేసుల విచారణను కొనసాగించారు. మరోవైపు, మంగళవారం సాయంత్రం జస్టిస్ జే చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ మదన్ బీ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌లు భేటీ అయ్యారు. అయితే వారి మధ్య చర్చల సారాంశం తెలియరాలేదు. బుధవారం కూడా నలుగురు న్యాయమూర్తులు సీజేఐతో సమావేశమవుతారని సుప్రీం వర్గాలు పేర్కొన్నాయి. -
జడ్జీల వివాదం పరిష్కారమయ్యేనా?
సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు పరిపాలనా వ్యవస్థ సక్రమంగా లేదని, కీలకమైన కేసుల విచారణకు బెంచీలను ఏర్పాటు చేయడంలో సీనియర్ జడ్జీలను కాదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా తన ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారంటూ నలుగురు సీనియర్ జడ్జీలు పత్రికాముఖంగా దేశ ప్రజలకు స్పష్టం చేసి అప్పుడే నాలుగు రోజులు గడిచిపోయాయి. వారి ఆరోపణల్లోని నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు సుప్రీం కోర్టు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలకు ఉపక్రమించలేదు. పైగా బుధవారం ఎనిమిది కీలక కేసులను విచారించేందుకు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా ఆధ్వర్యాన ఐదుగురు సభ్యుల బెంచీని ఇవాళ (మంగళవారం) సుప్రీం కోర్టు ఏర్పాటు చేసింది. ఈ ఎనిమిది కీలక కేసుల్లో ఆధార్ ఒకటికాగా, స్వలింగ సంపర్కలకు శిక్ష విధించే భారతీయ శిక్షాస్మతిలోని 377వ సెక్షన్ చెల్లుతుందా ? అన్నది రెండవ కేసు. ఐపీసీలోని అక్రమ సంబంధం సెక్షన్ ఇప్పటికీ చెల్లుతుందా? అన్నది మూడో కేసుకాగా, శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతించాలా, వద్దా ? అన్నది నాలుగో కేసు. ఇవి కాకుండా మరో నాలుగు కేసులు ముఖ్యమైనవి ఉన్నాయి. వీటి విచారణకు దీపక్ మిశ్రా నాయకత్వాన ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల బెంచీలో సీనియర్ న్యామూర్తులైన జస్టిస్ చలమేశ్వర్, రంజన్ గొగోయ్, కురియన్ జోసఫ్, మదన్ లోకుర్‌లో ఒక్కరు కూడా లేరు. ఈ నలుగురు న్యాయమూర్తులే చరిత్రలో మొట్టమొదటి సారిగా శుక్రవారం పత్రికా విలేకరుల ముందుకు వచ్చి సీజేఐ దీపక్ మిశ్రా తీరును ఆక్షేపించిన విషయం తెల్సిందే. కీలకమైన కేసులను సీనియర్ జడ్జీలకు ఇవ్వకుండా తన ఇష్టానుసారం ఇస్తున్నారని, ఇతర బెంచీల ముందున్న కేసులను అనుచితంగా లాక్కుంటున్నారని ఆరోపించారు. అంతేకాకుండా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ప్రధాన నిందితుడుగా ఉన్న సొహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసును విచారించిన మహారాష్ట్ర సీబీఐ జడ్జీ బ్రిజ్ మోహన్ లోయా అనుమానాస్పద మతిపై తమకు అనుమానాలు ఉన్నాయని కూడా వారు ఆరోపించారు. ఆ మృతి కేసుపై దర్యాప్తు జరపాలంటూ ముంబై హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా, ఆదరబాదరగా అదేరోజు సుప్రీం కోర్టులో అదే అంశంపై దాఖలైన రిట్ పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తూ కేసు విచారణ అధికారాన్ని సుప్రీం కోర్టు తన పరిధిలోకి లాక్కోవడం కూడా సమంజసంగా లేదని వారు విమర్శించారు. వాళ్ల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా సుప్రీం కోర్టు లోయా అనుమానాస్పద మృతి కేసు విచారణను చేపట్టింది. తాము బహిరంగంగా లేవనెత్తిన అంశాలను పరిష్కరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, పూర్తి భిన్నంగా వ్యవహరించడం పట్ల నలుగురు సీనియర్ జడ్జీలు తీవ్ర అసంతప్తి వ్యక్తం చేసినట్లు వారి సన్నిహితులు తెలియజేశారు. ఈ వివాదాన్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకోవడం మంచిదని భారత బార్ కౌన్సిల్ చైర్మన్ మానన్ కుమార్ మిశ్రా, అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. అయితే ఇది అంత తొందరగా సమసిపోయే సమస్యగా కనిపించడం లేదని నలుగురు జడ్జీల కార్యాలయ వర్గాలు అంటున్నాయి. వీరికి అండగా మరింతమంది సుప్రీంకోర్టు జడ్జీలు ముందుకు వస్తే వివాదం పరిష్కారం కావచ్చని ఆ వర్గాలు అభిప్రాయపడ్డాయి. అయితే చాలామంది జడ్జీలు అచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. సోమవారం సుప్రీం కోర్టు కార్యకాలాపాలు ప్రారంభం కాకముందు జడ్జీలందరూ తేనీరు సేవిస్తుండగా వారి మధ్య వాడివేడిగా ఇదే అంశంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ప్రధాన న్యాయమూర్తే ఈ విషయంలో చొరవ తీసుకోవాలని వారంతా అభిప్రాయపడినట్లు తెల్సింది. -
త్వరలోనే సర్దుకుంటుంది!
న్యూఢిల్లీ: భారత న్యాయవ్యవస్థలో ఏర్పడిన సంక్షోభం త్వరలోనే సమసిపోతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ దీపక్ మిశ్రా స్పష్టం చేశారు. వివాదం నేపథ్యంలో తనను కలిసిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) ఏడుగురు సభ్యుల కమిటీకి సీజేఐ ఈవిధమైన భరోసా ఇచ్చారు. సానుకూల వాతావరణంలో జరిగిన ఈ చర్చల అనంతరం వివాదం 2–3 రోజుల్లో సమసిపోతుందనే భరోసా కలిగిందని బీసీఐ కమిటీ చైర్మన్ మన్ కుమార్ మిశ్రా మీడియాకు వెల్లడించారు. అంతకుముందు ఈ కమిటీ... తిరుగుబాటు చేసిన న్యాయమూర్తులు జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్లతోనూ సమావేశమైంది. వారు కూడా వివాదం తొందరగానే పరిష్కారమవుతుందని అభిప్రాయపడ్డారన్నారు. మరోవైపు, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్సీబీఏ) అధ్యక్షుడు వికాస్ సింగ్ కూడా సీజేఐని కలిశారు. అటు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ ఎస్ఏ బాబ్డేలు కూడా సీజేఐ, జస్టిస్ చలమేశ్వర్లతో సంప్రదింపులు జరిపారు. సుప్రీంకోర్టులో కేసుల పంపకం రోస్టర్ విధానంలో జరగటం లేదంటూ సీజేఐ తీరుకు నిరసనగా నలుగురు సీనియర్ న్యాయమూర్తులు తిరుగుబాటు ప్రకటించిన సంగతి తెలిసిందే. రెండు మూడు రోజుల్లో: బీసీఐ చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాతోపాటు జస్టిస్ చలమేశ్వర్, ఇతర న్యాయమూర్తులతో బీసీఐ కమిటీ ఆదివారం వేర్వేరుగా భేటీ అయింది. ఈ సమావేశాల అనంతరం బీసీఐ చైర్మన్ మన్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ.. ‘సుప్రీంకోర్టులో ఎలాంటి సంక్షోభం లేదు. ఇది కేవలం అంతర్గత విషయమే. ఈ సమావేశాల అనంతరం వివాదం త్వరలోనే పరిష్కారం అవుతుందనే నమ్మకం కుదిరింది. సీజేఐతో 50 నిమిషాల సేపు సానుకూల వాతావరణంలో భేటీ జరిగింది. ఇది తీవ్రమైన సమస్యేమీ కాదు. అంతా సర్దుకుంటుంది. ఈ వివాద పరిష్కారంలో బీసీఐ పాత్ర పరిమితమే. న్యాయమూర్తులు కూడా సమస్యేమీ లేదని పేర్కొన్నారు. 2–3 రోజుల్లో అంతా సర్దుకుంటుంది’ అని పేర్కొన్నారు. కొందరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఢిల్లీకి దూరంగా ఉన్నందున రెండ్రోజుల్లో వీరందరితోనూ భేటీ అవుతామన్నారు. అనంతరం జస్టిస్ అరుణ్ మిశ్రాతో సమావేశమైన బీసీఐ కమిటీ.. ప్రత్యేక సీబీఐ న్యాయమూర్తి బీహెచ్ లోయా మృతిపై దాఖలైన పిల్‌పై విచారణ జరపాలని కోరింది. జస్టిస్ అరుణ్ మిశ్రాకు లోయా కేసును బదిలీ చేయటాన్నీ తిరుగుబాటు జడ్జీలు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. వారి ప్రెస్‌మీట్ దురదృష్టకరం న్యాయమూర్తులు, సీజేఐ మధ్య నెలకొన్న వివాదం త్వరలోనే పరిష్కారమవుతుందని ఢిల్లీ బార్ అసోసియేషన్స్ (ఢిల్లీలోని ఆరు జిల్లా కోర్టుల న్యాయవాదుల సంఘాలు) సమన్వయ కమిటీ ఆశాభావం వ్యక్తం చేసింది. న్యాయమూర్తులు ప్రెస్‌మీట్ పెట్టడం సరైంది కాదని భావిస్తున్నట్లు తెలిపిన కమిటీ.. ఈ వివాదం ద్వారా న్యాయవ్యవస్థపై ప్రజల్లో నమ్మకం కాస్త తగ్గిందని అభిప్రాయపడింది. అందుకే ఎట్టిపరిస్థితుల్లోనూ న్యాయపరమైన క్రమశిక్షణను కొనసాగించాలని పేర్కొంది. 10 రోజుల్లో అందరూ కలిసి సమస్యను పరిష్కరించుకోలేని పక్షంలో మిగిలిన నగరాల్లో ఉన్న బార్ అసోసియేషన్లతో చర్చించి.. దేశవ్యాప్తంగా వీధుల్లో నిరసన ప్రదర్శనలను నిర్వహిస్తామని హెచ్చరించింది. ‘అంతర్గత వివాదాలను పరిష్కరించుకునేందుకు ఓ వ్యవస్థను ఏర్పాటుచేసుకోవాలి. ఇలాంటి వివాదాలను నిరోధించేందుకు జ్యుడీషియల్ అకౌంటబిలిటీ బిల్లును తీసుకురావాలి. సీజేఐ సభను ఆర్డర్లో పెట్టుకోవాలి. సీనియర్ న్యాయమూర్తులు లేవనెత్తిన అంశాలను తక్షణమే పరిష్కరించాలి’ అని కమిటీ ఓ ప్రకటనలో పేర్కొంది. సీజేఐతో ఎస్సీబీఏ అధ్యక్షుడి భేటీ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్సీబీఏ) అధ్యక్షుడు వికాస్ సింగ్ ఆదివారం సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రాతో సమావేశమయ్యారు. సంక్షోభ పరిష్కారం కోసం ఎస్సీబీఏ రూపొందించిన తీర్మానాన్ని సీజేఐకి అందజేశారు. సుప్రీంకోర్టులోని అందరు న్యాయమూర్తులు ఈ తీర్మానానికి సమ్మతించారని.. వికాస్ సింగ్ పేర్కొన్నారు. ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పీఐఎల్), పెండింగ్ పిల్లను సీజేఐ నేరుగా విచారించాలని, లేదంటే కొలీజియం వ్యవస్థలోని నలుగురు సీనియర్ న్యాయమూర్తుల ధర్మాసనానికి అప్పగించాలని ఎస్సీబీఏ శనివారం తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సీజేఐ సానుకూలంగా స్పందించారని వికాస్ వెల్లడించారు. సమంజసమే: మాజీ జడ్జీల లేఖ ఓ సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి సహా ఐదుగురు రిటైర్డ్ న్యాయమూర్తులు సీజేఐకి బహిరంగ లేఖ రాశారు. నలుగురు తిరుగుబాటు న్యాయమూర్తులు లేవనెత్తిన అంశాలు సమంజసమేనని.. వీటిని త్వరలోనే పరిష్కరించుకోవాలని ఆ లేఖలో కోరారు. మాజీ సుప్రీం న్యాయమూర్తి పీబీ సావంత్, ఢిల్లీ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఏపీ షా, మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి కె. చంద్రు, బాంబే హైకోర్టు మాజీ జడ్జి హెచ్ సురేశ్ ఈ లేఖను రాశారు. ఈ వివాదం పరిష్కారమయ్యేంత వరకు ముఖ్యమైన కేసులను ఐదుగురు సీనియర్ న్యాయమూర్తుల ధర్మాసనానికి బదిలీ చేయాలని కోరారు. ‘రోస్టర్, కేసుల పంపకంలో సీజేఐ నిర్ణయమే అంతిమం. కానీ.. సున్నితమైన, ముఖ్యమైన కేసులను జూనియర్ న్యాయమూర్తులున్న ధర్మాసనాలకు ఇవ్వటం సరికాదు. వివాదాన్ని వెంటనే పరిష్కరించుకుని.. కేసుల పంపకానికి సంబంధించి స్పష్టమైన విధివిధానాలను రూపొందించుకోవాల్సిన తక్షణ అవసరం ఉంది’ అని ఆ లేఖలో వారు పేర్కొన్నారు. గెలవలేమని తెలిసే... ‘ఈ నలుగురు న్యాయమూర్తులు తాము లేవనెత్తిన అంశాలను నెగ్గించుకోవాలంటే.. ఫుల్‌కోర్టు (అందరు న్యాయమూర్తులతో సమావేశం)లో విషయాలను లేవనెత్తి ఓటింగ్ నిర్వహించవచ్చు. కానీ సీజేఐకే మెజారిటీ న్యాయమూర్తుల మద్దతుందని ముందే గుర్తించినందుకే ఫుల్‌కోర్టుకు పోకుండా.. తమ ఆవేదనను పంచుకునేందుకే మీడియాతో సమావేశమయ్యారు’ అని సుప్రీంకోర్టు వర్గాలు వెల్లడించాయి. భవిష్యత్తులో సీజేఐ కావాలనుకుంటున్న ఓ న్యాయమూర్తి ఈ నలుగురితో కలిసి మీడియా సమావేశంలో పాల్గొనేందుకు విముఖత వ్యక్తం చేసినట్లు తెలిపాయి. -
'సంక్షోభం' సమసేందుకు!
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు సంక్షోభానికి వీలైనంత త్వరగా ముగింపు పలికేందుకు చర్యలు వేగవంతమయ్యాయి. కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రవిశంకర్ ప్రసాద్, అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌ల పర్యవేక్షణలో ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ), మిగిలిన నలుగురు న్యాయమూర్తుల మధ్య సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు ఈ సంప్రదింపుల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా కూడా ఆ నలుగురితో ఆదివారం సమావేశమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడకపోయినా.. జస్టిస్ జోసెఫ్ కురియన్, జస్టిస్ రంజన్ గొగోయ్‌లు వేర్వేరు వేదికలపై చేసిన వ్యాఖ్యలు సమస్య త్వరితగతిన పరిష్కారమవుతుందనే సంకేతాలనిచ్చాయి. జస్టిస్ జాస్తి చలమేశ్వర్ మినహా మిగిలిన ముగ్గురు న్యాయమూర్తులు ఢిల్లీలో అందుబాటులో లేకపోవటంతో.. వీరంతా ఆదివారం రాజధానికి చేరుకున్న తర్వాత సీజేఐ వీరితో మాట్లాడనున్నట్లు సమాచారం. కాగా, ఇది న్యాయవ్యవస్థ అంతర్గత వివాదమని.. ఇందులో బయటివారి జోక్యం అవసరం లేదని జస్టిస్ కురియన్ పేర్కొన్నారు. అటు, అందరు సుప్రీం న్యాయమూర్తులతో సమావేశమై సమస్యను పరిష్కరించేందుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏడుగురు సభ్యు ల బృందాన్ని ఏర్పాటు చేసింది. కేసుల కేటాయింపులో సీజేఐ తీరును నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నిరసించిన సంగతి తెలిసిందే. రంగంలోకి బార్ కౌన్సిల్ మరోవైపు సమస్య పరిష్కారంలో చొరవతీసుకోవాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) నిర్ణయించింది. న్యాయమూర్తులతో చర్చించేందుకు ఏడుగురు సభ్యుల కమిటీని ఏర్పాటుచేసింది. ఈ బృందం ఆదివారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరినీ కలిసి వీలైనంత త్వరగా వివాదం సమసిపోయేందుకు వారితో చర్చిస్తుందని బీసీఐ అధ్యక్షుడు మనన్ మిశ్రా వెల్లడించారు. ‘మేం మధ్యవర్తిత్వానికి సిద్ధంగా ఉన్నాం’ అని ఆయన పేర్కొన్నారు. ఈ వివాదాన్ని రాజకీయం చేయాల్సిన పనిలేదని, రాజకీయ పార్టీలేమీ ఈ వివాదంలో జోక్యం చేసుకోవాల్సిన పనిలేదని (పరోక్షంగా రాహుల్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ) ఆయన హెచ్చరించారు. ‘ఈ వివాదంలో జోక్యం చేసుకోబోమని న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. ఆయన నిర్ణయాన్ని మేం స్వాగతిస్తున్నాం. అంతర్గత సమావేశాల ద్వారానే ఈ వివాదం పరిష్కారమవుతుంది’ అని మనన్ మిశ్రా తెలిపారు. అటు, ఈ వివాద పరిష్కారంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులంతా చొరవతీసుకోవాలని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్సీబీఏ) తీర్మానం చేసింది. జనవరి 15న విచారణకు రానున్న ప్రజాప్రయోజన వ్యాజ్యాలను సీజేఐ నేతృత్వంలోని బెంచ్ లేదా కొలీజియం సభ్యులున్న ఇతర ధర్మాసనాలకు బదిలీ చేయాలని కోరింది. సీజేఐ ఇంటికి మోదీ దూత! అటు, ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాన కార్యదర్శి నృపేంద్ర మిశ్రా శనివారం ఉదయం సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రాను కలిసేందుకు ఆయన ఇంటికి వెళ్లారు. అయితే సీజేఐ ఇంటిగేటు తెరవకపోవటంతో తన కారులోనే కాసేపు వేచి ఉండి.. అనంతరం తిరిగి వెళ్లినట్లు టీవీ కెమెరాల్లో రికార్డయింది. దీనిపై కాంగ్రెస్ విమర్శలు చేసింది. ప్రధాని తన వ్యక్తిగత కార్యదర్శిని ప్రత్యేక దూతగా సీజేఐ వద్దకు పంపేందుకు ప్రయత్నించారని విమర్శించింది. దీనికి ప్రధాని సమాధానం చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. వివాదానికి కారణమైన వ్యక్తులే చొరవతీసుకుని సమస్యను పరిష్కరించుకోలేని నేపథ్యంలో రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ కోరారు. అయితే.. నలుగురు న్యాయమూర్తులు ధైర్యమైన నిర్ణయాన్ని తీసుకున్నారని శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. న్యాయవ్యవస్థను చెవిటి, మూగ వ్యవస్థగా మార్చేందుకు ప్రయత్నాలు జరిగాయన్నారు. కాగా, కేబినెట్ మంత్రులు కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లా బయటకొచ్చి మాట్లాడాలని.. వారిలో నెలకొన్న భయాన్ని పక్కనపెట్టాలని కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా సూచించారు. పార్లమెంటు రాజీపడి, సుప్రీంకోర్టు సరైన విధంగా నడవని పక్షంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని ఆయన పేర్కొన్నారు. ‘దురుద్దేశంతోనే పిటిషన్’ సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి బీహెచ్ లోయా మృతిపై సమగ్ర విచారణ జరపాలంటూ దురుద్దేశంతోనే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైందని బాంబే లాయర్ల అసోసియేషన్(బీఎల్ఏ) ఆరోపించింది. ఈ విషయంపై తాము బాంబే హైకోర్టులో వేసిన పిటిషన్ విచారణను అడ్డుకోవడానికే జర్నలిస్టు బీఆర్ లోనె సుప్రీంకోర్టులో ఆ పిటిషన్ దాఖలుచేసినట్లు పేర్కొంది. కేసుల కేటాయింపులో సీజేఐ మిశ్రా అనుచితంగా వ్యవహరిస్తున్నారంటూ నలుగురు జడ్జీలు గళమెత్తిన నేపథ్యంలో బీఎల్ఏ అధ్యక్షుడు అహ్మద్ అబ్ది శనివారం ప్రెస్‌మీట్ నిర్వహించారు. జనవరి 4న తాము బాంబే హైకోర్టులో పిటిషన్ వేసిన తరువాతే లోనె సుప్రీంకోర్టును ఆశ్రయించారని వెల్లడించారు. అత్యున్నత న్యాయస్థానం పరిధికి చేరిన విషయాన్ని బాంబే హైకోర్టు విచారణకు చేపట్టకుండా చూసేందుకు దురుద్దేశంతోనే ఇలా చేశారని ఆరోపించారు. సమస్య పరిష్కారమైనట్లే: జస్టిస్ కురియన్ సుప్రీంకోర్టులో రాజ్యాంగ సంక్షోభమేమీ లేదని.. తాము లేవనెత్తిన సమస్యలకు సామరస్యపూర్వక పరిష్కారం లభిస్తుందని జస్టిస్ కురియన్ కొచ్చిలో వెల్లడించారు. ‘రాజ్యాంగ సంక్షోభమేమీ లేదు. విధానంలోని లోపాలను సరిదిద్దాలనేదే మా అభిమతం. సీజేఐకి ఇచ్చిన లేఖలో ప్రతి అంశాన్నీ పేర్కొన్నాం. ఈ లేఖను రెండు నెలల క్రితమే ఆయనకు ఇచ్చాం’ అని తెలిపారు. రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమించేందుకు మాత్రమే అధికారమున్నందున ఆయనకు ఈ విషయాన్ని వెల్లడించలేదన్నారు. ‘మేం ఓ కారణం కోసం దీన్ని లెవనెత్తాం. ఈ సమస్య త్వరగానే పరిష్కారమవుతుందని భావిస్తున్నాం. ఇది ఎవరికీ వ్యతిరేకంగా చేస్తున్నది కాదు. మాకు వ్యక్తిగత విభేదాలేమీ లేవు. పారదర్శకత ఉండాలనేదే మా అభిప్రాయం’ అని జస్టిస్ కురియన్ పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం బయటివారు చొరవతీసుకోవాల్సిన పనేం లేదని జస్టిస్ కురియన్ పేర్కొన్నారు. ‘విషయాన్ని లేవనెత్తాం. సంబంధించిన వాళ్లు దీన్ని విన్నారు. ఇలాంటివి భవిష్యత్తులో జరగకూడదు. సమస్య పరిష్కారమైందని నేను భావిస్తున్నాను. న్యాయవ్యవస్థ అంతర్గతంగా నెలకొన్న వివాదమిది. దీనిలో వేరే వ్యక్తుల జోక్యం అవసరం లేదు. వ్యవస్థే ఇందుకు అవసరమైన చర్యలు తీసుకుంటుంది’ అని ఆయన తెలిపారు. ‘సీజేఐ తరపునుంచి ఎలాంటి రాజ్యాంగపరమైన పొరపాటు జరగలేదు. కానీ ఆయన బాధ్యతల నిర్వహణలో సంప్రదాయ విధివిధానాలను అనుసరించాల్సింది. ఇదే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లాం. మార్పు చేసుకోవటం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మేం న్యాయం కోసం నిలబడ్డాం’ అని ఆయన పేర్కొన్నారు. కోల్‌కతాలో జరిగిన ఓ న్యాయసేవ కార్యక్రమంలో పాల్గొన్న మరో న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ కూడా సంక్షోభమేమీ లేదని వెల్లడించారు. కాగా, ఈ వివాదం సోమవారం కల్లా పరిష్కారమవుతుందని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ధీమాగా చెప్పారు. ‘సోమవారానికల్లా న్యాయమూర్తుల మధ్య ఐక్యత నెలకొంటుంది. న్యాయవ్యవస్థ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని సమస్యకు పరిష్కారం లభిస్తుంది. న్యాయమూర్తులు మేధావులు, అనుభవజ్ఞులు, రాజనీతిజ్ఞత గలవారు. వివాదాన్ని మరింత పెద్దది చేయాలని వారనుకోరు’ అని వేణుగోపాల్ పేర్కొన్నారు. 17 నుంచి 8 కీలక కేసులపై విచారణ ఒకవైపు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, నలుగురు సీనియరు న్యాయమూర్తుల మధ్య వివాదం కొనసాగుతుండగా.. మరోవైపు జనవరి 17 నుంచి ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాలు 8 కీలక అంశాలపై విచారణ చేపట్టనున్నాయి. సుప్రీంకోర్టు వెబ్సైట్లో వెల్లడించిన వివరాల ప్రకారం.. రాజ్యాంగ పరంగా ఆధార్ చెల్లుబాటు అవుతుందా? లేదా? అన్న అంశాన్ని తేల్చడంతో పాటు 2013లో స్వలింగ సంపర్కం కేసులో తానిచ్చిన తీర్పును ఈ రాజ్యాంగ ధర్మాసనాలు పునః పరిశీలిస్తాయి. వివాదాస్పద అంశమైన కేరళలోని శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్లలోపు వయసున్న మహిళలకు ప్రవేశంపై నిషేధంతో పాటు, వేరే మతస్తుడిని పార్శీ మహిళ పెళ్లి చేసుకుంటే తన మత గుర్తింపును కోల్పోతుందా? అన్న విషయాన్ని కూడా ఈ రాజ్యాంగ ధర్మసనాలు విచారించనున్నాయి. వ్యభిచారం కేసుల్లో ఐపీసీ సెక్షన్ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన కేసును కూడా సుప్రీంకోర్టు చేపట్టనుంది. వివాహేతర సంబంధం కేసుల్లో కేవలం పురుషుడినే శిక్షించేందుకు అవకాశమిస్తోన్న ఈ ఐపీసీ సెక్షన్ చెల్లుబాటును రాజ్యాంగ ధర్మాసనం విచారించనుంది. అలాగే చట్టసభ్యులు ఎప్పుడు క్రిమినల్ విచారణ ఎదుర్కొంటారు.. వారి అనర్హతకు సంబంధించిన పిటిషన్ కూడా విచారణకు రానుంది. ఈ అంశాల్ని ఇంతకముందే విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనాలు.. కీలక అంశాలు కావడంతో రాజ్యాంగ ధర్మాసనాలకు సిఫార్సు చేశాయి. -
హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వలేం: సుప్రీం
సాక్షి, న్యూఢిల్లీ: కోడి పందేలపై ఆంక్షలు విధిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బీజేపీ నేత కనుమూరు రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం మధ్యాహ్నం విచారించింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వలేమని ధర్మాసనం పేర్కొనగా.. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది అనూప్ చౌదరి స్పందిస్తూ కోళ్లను అదుపులోకి తీసుకోకుండా, రైతులను ఇబ్బంది పెట్టకుండా చూడాలని విన్నవించారు. గతేడాది సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో ఈ అంశం స్పష్టంగా ఉందని వివరించారు. అయితే ఈ అంశంపై హైకోర్టునే సంప్రదించాలని ధర్మాసనం సూచించింది. సంబంధిత ఉత్తర్వులు లిఖితపూర్వకంగా వెలువడాల్సి ఉంది. -
రాజ్యాంగం ముందు తలొంచాల్సిందే
భువనేశ్వర్: రాజ్యాంగ సార్వభౌ మత్వం అత్యున్నతమైనదని, అంతా దాని ముందు తలొంచా ల్సిందేనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా తేల్చి చెప్పారు. రాజ్యాంగ సార్వభౌమత్వ లేమి అరాచకానికి దారి తీస్తుందని, చట్టాలకు అంతా లోబడి ఉండాల్సిందేనన్నారు. ఒడిశా న్యాయవా దుల అసోసియేషన్ నిర్వహించిన కార్యక్ర మంలో ఆయన మాట్లాడుతూ.. శాసన, పరిపాలన, న్యాయ వ్యవస్థలు కూడా రాజ్యాంగానికి అనుగుణంగానే పనిచేస్తు న్నాయన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవా లన్నారు. న్యాయ వాదులు న్యాయ వృత్తి పవిత్రతను కాపాడుతూ ప్రజలకు సేవ చేయాలని జస్టిస్ దీపక్ మిశ్రా సూచించారు. గత పదేళ్లుగా దేశంలో పెం డింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసుల్ని పరిష్కరిం చాలని హైకోర్టులకు స్పష్టం చేశామని, పెండింగ్ కేసుల పరిష్కారానికి శనివారం కూడా పనిచేయాలని న్యాయ మూర్తులు, న్యాయవాదుల్ని కోరామని సీజేఐ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఆ మూడింటిది ఒకే కుటుంబం
న్యూఢిల్లీ: న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు ఒకే కుటుంబానికి చెందినవనీ, అవి మూడు ఒకదానినొకటి బలోపేతం చేసుకునేలా పనిచేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఈ మూడు వ్యవస్థల మధ్య ఉండే సమన్వయమే రాజ్యాంగానికి వెన్నెముకని ఆయన పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం ఈ మూడు వ్యవస్థలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఏ ఆధికారానికైనా ఓ హద్దు ఉంటుందంటూ నాడు రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ చెప్పిన మాటలను మోదీ గుర్తుచేశారు. పాలనలో న్యాయవ్యవస్థ పాత్రపై న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ దీపక్ మిశ్రా మధ్య చిన్నపాటి మాటల యుద్ధం జరగడంతో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మారిన కాలానికి అనుగుణంగా ఎలా ముందుకెళ్లాలనేదానిపై మూడు వ్యవస్థలూ లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ మూడు వ్యవస్థలూ మీది తప్పంటే మీది తప్పంటూ పరస్పరం విమర్శించుకోవాల్సిన అవసరం లేదనీ, ఏదేనీ ఒక వ్యవస్థలోని లోపాలు, బలాబలాలు...మిగతా రెండు వ్యవస్థల్లోని వారికీ తెలుసని అన్నారు. జాతీయ న్యాయదినోత్సవం సందర్భంగా రెండు రోజులపాటు సుప్రీంకోర్టు, నీతి ఆయోగ్ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో మోదీ ముగింపు ప్రసంగం చేశారు. పౌరులు హక్కుల కోసం పోరాడటంతోపాటు బాధ్యతలను కూడా విస్మరించరాదని హితవు పలికారు. మోదీ కన్నా ముందు కేంద్ర న్యాయ మంత్రి రవిశంకర్ న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య అధికారాల విభజనపై న్యాయవ్యవస్థను ఉద్దేశించి మాట్లాడారు. ‘అధికార విభజన సిద్ధాంతానికి కార్యనిర్వాహక వ్యవస్థ ఎలా కట్టుబడి ఉంటుందో, న్యాయవ్యవస్థ కూడా అలానే ఉండాలి. చట్టాల రూపకల్పన అంశాన్ని ఎన్నికైన ప్రభుత్వాలకే వదిలేయాలి. పరిపాలన అనేది ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వమే చేయాలనీ, వారే ప్రజలకు జవాబుదారీగా ఉండాలని జాతి నిర్మాతలు స్పష్టంగా పేర్కొన్నారు. న్యాయవ్యవస్థకు స్వతంత్రత ఎంతో ముఖ్యమైనదే. కానీ న్యాయవ్యవస్థలో జవాబుదారీ తనం, నిజాయితీ కూడా ముఖ్యమైనవే. జాతీయ న్యాయ నియామకాల కమిషన్ ఏర్పాటు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టేయడాన్ని ప్రభుత్వం ఆమోదిస్తుంది. అయితే న్యాయమూర్తుల నియామకాలను పరిశీలించాలన్న సలహా కూడా అభినందించదగ్గదే’ అని రవిశంకర్ అన్నారు. న్యాయ గడియారాల ఏర్పాటు: మోదీ కోర్టులు కేసులను పరిష్కరిస్తున్న వేగాన్ని బట్టి వాటికి ర్యాంకులిచ్చేలా దేశంలోని వివిధ కోర్టుల పరిసరాల్లో ‘న్యాయ గడియారాల’ను ఏర్పాటు చేస్తే బాగుంటుందని మోదీ సూచించారు. దీనివల్ల కేసులను త్వరితగతిన పరిష్కరించడంలో న్యాయమూర్తుల మధ్య పోటీ కూడా ఏర్పడుతుందనీ, తద్వారా కేసుల సంఖ్య తగ్గుతుందని మోదీ పేర్కొన్నారు. మరొకరు తలదూర్చకూడదు... రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టు నిర్వహించిన మరో కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మాట్లాడుతూ న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు వాటి స్వేచ్ఛ పరిధి గురించి అప్రమత్తతతో ఉండాలనీ, ఆయా వ్యవస్థల స్వతంత్రతను కాపాడుకోవడానికి అవి పాటుపడాలని అన్నారు. ఈ మూడు వ్యవస్థల మధ్య అధికారాల విభజనను గుర్తెరిగి నడచుకోవాలనీ, ఒకరి విధుల్లో మరొకరు తలదూర్చకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. రాజ్యాంగం అంటే కాగితాలు కాదనీ, ప్రాణమున్న పత్రమని కోవింద్ పేర్కొన్నారు. విధానాలను తనిఖీ చేసే అధికారం మాకుంది: సీజేఐ రవి శంకర్ ప్రసాద్ వ్యాఖ్యలపై సీజేఐ జస్టిస్ మిశ్రా స్పందిస్తూ ‘మూడు వ్యవస్థల మధ్య పరస్పర గౌరవం ఉండాలి. ఈ మూడింటిలో మాకున్న అధికారాలే గొప్పవంటూ ఏ వ్యవస్థా చెప్పుకోవడానికి లేదు. మేం ఏ విధానాలనూ తీసుకురావడం లేదు. కానీ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలను తనిఖీ చేసే, అవి అమలయ్యేలా చూసే అధికారం మాకు ఉంది. రాజ్యాంగమే పరిపాలనాధిపతి అని సుప్రీంకోర్టులో మేం విశ్వసిస్తాం. పాటిస్తాం. చట్టాలకు లోబడి ప్రభుత్వాలు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అని సరిచూసేందుకు అవసరమైన అధికారాలిస్తూ, రాజ్యాంగానికి తుది రక్షణదారుగా న్యాయవ్యవస్థను రాజ్యాంగమే నిలిపింది’ అని మిశ్రా పేర్కొన్నారు. పాలనాపరమైన విధానాలు తీసుకురావడానికి ప్రజాహిత వ్యాజ్యాలను దుర్వినియోగం చేస్తున్నారన్న వ్యాఖ్యలను జస్టిస్ మిశ్రా తిరస్కరించారు. పౌరుల ప్రాథమిక హక్కులపై రాజీపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. -
నేటి నుంచి ‘జడ్జీల పేరుతో లంచం’ కేసు విచారణ
న్యూఢిల్లీ: కేసుల పరిష్కారానికి జడ్జీల పేరుతో లం చాలు తీసుకున్న కేసును సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం నేటి నుంచి విచారించనుంది. ఈ కేసును విచారించడానికి ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పా టు చేయాలని జస్టిస్ జె.చలమేశ్వర్, జస్టిస్ అబ్దుల్ నజీర్‌ల బెంచ్ నవంబర్ 9న ఇచ్చిన ఆదేశాలను తర్వాతి రోజు సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి న్యాయవాది కామిని జైశ్వాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ఆర్కే అగర్వాల్, జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్‌ల ధర్మాసనం మధ్యాహ్నం 3.30 గంటలకు విచారించనుంది. -
కక్షిదారులకు అర్థమయ్యేలా తీర్పులు
కొచి: హైకోర్టులు ఇచ్చే తీర్పులు కక్షిదారులకు అర్థమయ్యేలా వారికి తెలిసిన భాషలో ఉండాలని రాష్ట్రపతి కోవింద్ సూచించారు. తీర్పులకు సంబంధించిన అనువాద ప్రతులను అధికారికంగా జారీ చేసేందుకు యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలన్నారు. కేసులను త్వరగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని, తీర్పుల ఆలస్యం వల్ల ఎక్కువగా బాధ పడేది పేదలు, అణగారిన వర్గాలేనని పేర్కొన్నారు. కేరళ హైకోర్టు వజ్రోత్సవాల్లో శనివారం ఆయన పాల్గొని ప్రసంగించారు. తీర్పు వెలువరించడం మాత్రమే ముఖ్యం కాదని, ఆ తీర్పును కక్షిదారులకు అర్థమయ్యే భాషలో ఇవ్వాలని సూచించారు. ‘హైకోర్టులు తమ తీర్పులను ఇంగ్లిష్‌లో వెలువరిస్తాయి. అయితే మన దేశం విభిన్న భాషలు గలది. తీర్పు ఇంగ్లిష్‌లో ఇవ్వడం వల్ల అందులో తమకు ఉపయోగపడే ముఖ్యమైన అంశాలు కక్షిదారులకు అర్థం కాకపోవచ్చు. దీంతో తీర్పును అర్థం చేసుకునేందుకు కక్షిదారులు న్యాయవాదులు లేదా ఇతర వ్యక్తులపై ఆధారపడాల్సి వస్తుంది. దీని వల్ల మరింత సమయం, వ్యయం వృథా అవుతుంది’ అని తెలిపారు. ‘తీర్పుల అనువాద ప్రతులను స్థానిక లేదా ప్రాంతీయ భాషల్లో అందించే యంత్రాంగముండాలి. తీర్పువెలువడ్డ 36 గంటల్లోగా అనువాద ప్రతులను కక్షిదారులకు అందేలా చూడాలి. ఉదాహరణకు కేరళ హైకోర్టు తీర్పు కాపీలు మలయాళంలో, పట్నా హైకోర్టు తీర్పు కాపీలు హిందీలో ఉండేలా చూడాలి’ అని అన్నారు. కేసుల పరిష్కారంలో జాప్యం వల్ల ప్రజలకు న్యాయవ్యవస్థపై నమ్మకం పోయే ప్రమాదం ఉందని సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా అన్నారు. -
పార్లమెంట్ చర్చిస్తుంటే మేం కల్పించుకోవద్దా?
న్యూఢిల్లీ: పార్లమెంట్ చర్చిస్తోందన్న కారణంతో తాము ఫలానా అంశం నుంచి దూరంగా ఉండలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. న్యాయ విచారణ ప్రక్రియలో కోర్టులు పార్లమెంట్ కమిటీల నివేదికలపై ఆధారపడొచ్చా లేక వాటిని ప్రస్తావించొచ్చా అన్న విషయంపై దాఖలైన రెండు పిటిషన్ల విచారణ సందర్భంగా అత్యున్నత ధర్మాసనం గురువారం ఈ విధంగా స్పందించింది. వివాదాస్పద హ్యూమన్ పాపిలోమా వైరస్(హెచ్‌పీవీ) టీకా పరీక్షలను నిర్వహించిన ఔషధ కంపెనీలను తప్పు పడుతూ పార్లమెంట్ స్థాయీ సంఘం 2014లో సమర్పించిన నివేదికను పిటిషన్‌దారులు ప్రస్తావించారు. ‘ న్యాయ సమీక్ష అధికారంలో ఎలాంటి మార్పు లేదు. పార్లమెంట్ చర్చిస్తోంది కదా అని మేం ఆ విషయం నుంచి దూరంగా ఉండలేం. పౌరుల హక్కుల పరిరక్షణకు ముందుకు సాగుతాం. పార్లమెంట్లో చర్చ జరుగుతోంది. కాబట్టి మమ్మల్ని కల్పించుకోవద్దంటే కుదరదు’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం పేర్కొంది. రాజ్యాంగంలోని నిబంధన 142 ప్రకారం తమకు కమిషన్లు ఏర్పాటు చేసి విచారణ జరిపించి, నివేదికలు కోరే హక్కు ఉందన్న సంగతిని బెంచ్ గుర్తుచేసింది. అంతకుముందు, ప్రభుత్వం తరఫున హాజరైన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ స్పందిస్తూ...పార్లమెంట్, పార్లమెంట్ కమిటీల ప్రత్యేకాధికారాలు, శాసన–న్యాయ వ్యవస్థల మధ్య అధికారాల విభజనను ప్రస్తావించారు. -
ఫిరాయింపుల పిటిషన్‌పై వచ్చేనెలలో విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు అంశంపై రాజ్యాంగ ధర్మాసనం అక్టోబర్‌లో విచారణ చేపడుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ పేర్కొంది. తెలంగాణలో కాంగ్రెస్ నుంచి అధికార టీఆర్ఎస్లోకి ఎమ్మెల్యేలు ఫిరాయించగా స్పీకర్ వద్ద అనర్హత పిటిషన్లు దాఖలు చేశామని, వాటిని పరిష్కరించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ కాంగ్రెస్ విప్ సంపత్‌కుమార్ గతంలో సుప్రీంలో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ ఆర్.కె.అగ్రవాల్, జస్టిస్ రోహింటన్ ఫాలీ నారీమన్‌లతో కూడిన ధర్మాసనం.. దీన్ని రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేయాలని ప్రధాన న్యాయమూర్తికి సిఫారసు చేసింది. ఈ సందర్భంగా ‘‘అనర్హత పిటిషన్లు ఏళ్లకు ఏళ్లు పెండింగ్‌లో ఉండడాన్ని ఎలా చూడాలి? స్వయంగా స్పీకర్ ఫిరాయింపులకు పాల్పడ్డ ఉదంతాలు చూశాం. క్షేత్రస్థాయిలో వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా కళ్లు మూసుకొని కూర్చోలేం. స్పీకర్ నిర్ణయం తీసుకునేందుకు తగిన కాలపరిమితి ఉంటే పిటిషన్లు పరిష్కారమవుతాయి’’ అంటూ వ్యాఖ్యలు చేసింది. సాధ్యమైనంత త్వరగా రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయాలని భారత ప్రధాన న్యాయ మూర్తికి నివేదిస్తూ గతేడాది నవంబర్ 8న ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఈ కేసు మళ్లీ విచారణకు రాలేదు. ఈ నేపథ్యంలో పిటిషనర్ తరపున న్యాయవాది జంద్యాల రవిశంకర్ శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం వద్ద ఈ అంశాన్ని ప్రస్తావించారు. దీంతో అక్టోబర్‌లో రాజ్యాంగ ధర్మాసనం దీనిపై విచారిస్తుందని బెంచ్ పేర్కొంది. -
ఈసారి ‘చూపు’ సభాపతుల వైపు
స్పీకర్ నిష్పాక్షికంగా ఉండటమే కాకుండా ఉన్నట్టు కనబడాలన్నది జస్టిస్ దీపక్ మిశ్రా వ్యాఖ్య. తెలుగునాట అది పూర్తిగా డొల్ల. ఒక పార్టీ తరఫున గెలిచిన వ్యక్తి మరో పార్టీ మంత్రివర్గంలో ఉన్నారంటే, రాజ్యాంగం పదో షెడ్యూల్ అమల్లో ఉండగా.. సభ్యుడి రాజీనామా తీసుకోకుండా ఈ పరిస్థితిని స్పీకర్ ఎలా అనుమతించారనేది రాజ్యాంగ నిపుణుల ప్రశ్న. స్పీకర్‌తో ఈ విషయం ధ్రువీకరించుకోకుండా సదరు సభ్యుడితో మంత్రిగా గవర్నర్ ఏ విధంగా ప్రమాణస్వీకారం చేయించారన్న విమర్శకుల ప్రశ్నకు సమాధానమే లేదు. బ్రెగ్జిట్‌పై రిఫరెండమ్‌కు వెళతామని పౌరులకిచ్చిన ఎన్నికల హామీని బ్రిటన్ కన్జర్వేటివ్ పార్టీ సాహసించి నెరవేర్చింది. అదంత అనివార్యం కాకపోయినా.. నైతిక బాధ్యత వహించి ఫలితాలొచ్చిన కొన్ని గంటల్లోనే ప్రధాని డేవిడ్ కామె రూన్ పదవికి రాజీనామా చేశారు. యురోపియన్ యూనియన్‌లో ఉందా మని దేశవాసులకు ప్రధాని పిలుపునిస్తే, వద్దు వైదొలగాలని అదే పార్టీకి చెందిన బోరిస్ జాన్సన్ విస్తృత ప్రచారం చేసినా... ఏ క్రమశిక్షణా చర్యల్లే కుండా పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యం అందుకాయన్ని అనుమతించింది. అదే స్ఫూర్తితో ప్రత్యర్థి లేబర్ పార్టీలో ఉండి కూడా జెర్మి కొర్బిన్, ప్రధాని పిలుపునకు అనుకూలంగా ఈయూలోనే కొనసాగుదామని ప్రచారం చేయగ లిగారు. బ్రెగ్జిట్‌కు అనుకూలంగా తనప్రచార లక్ష్యం నెరవేరినందున తాను ఇంకా బ్రిటన్ స్వతంత్ర పార్టీ (యూకేఐపీ) అధినేతగా కొనసాగాల్సిన అవ సరం లేదని నిగెల్ ఫరాజ్ ప్రకటించారు. స్వచ్ఛందంగా పదవి నుంచి వైదొల గారాయన. ఇవీ... రాజకీయాల్లో విలువలకు మచ్చుతునకలు. ఇలాంటి విలు వల్ని ప్రస్తుతం మన దేశ రాజకీయాల్లో కనీసం ఊహించగలమా? ఎన్నికల హామీల్ని తుంగలో తొక్కడం, పదవుల్ని పట్టుకు వేలాడ్డం, అధికారం కోసం ఏ గడ్డయినా కరవడం, ఒక పార్టీ తరఫున ప్రజలెన్నుకుంటే, ఆ ప్రజలే తిరస్కరించిన ప్రత్యర్థి పార్టీల్లోకి నిర్లజ్జగా మారడం, వారిని రాజ్యాంగ పరిరక్ష కులే కాపాడ్డం... ఇదీ ఇప్పుడిక్కడ జరుగుతున్న తంతు. విలువలు అంతటా నశిస్తున్నాయని మనం అంటుంటాం. కానీ, ఈ దేశంలో రాజకీయాల్లో విలు వలు పతనమైనంత వేగంగా మరే రంగంలోనూ అవటం లేదని అరుణాచల్ వ్యవహారంలో సుప్రీం కోర్టు తాజా తీర్పు మరోసారి రుజువు చేసింది. నిస్సి గ్గుగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఓటుకే అనర్హులంటూ మొన్న ఉత్తరా ఖండ్ వ్యవహారంలో ఇచ్చిన సుప్రీం తీర్పు రాజకీయ పార్టీలకు చెంపపెట్టు. కేంద్రం చెప్పుచేతల్లో లక్ష్మణరేఖ దాటిన గవర్నర్ చర్యలన్నింటినీ బుట్టదా ఖలు చేస్తూ నిన్న ఇచ్చిన సుప్రీం తాజా తీర్పు, కీలుబొమ్మగా నడుచుకునే గవ ర్నర్ల వ్యవస్థకు ఇంకో చెంపదెబ్బ. ఈ వరుసలో ఇక.... పాలకపక్షాలకు తాబే దార్లుగా నడుచుకునే స్పీకర్ల వ్యవహార శైలిని ఎండగట్టే సుప్రీం తీర్పే తరు వాయి. రాజ్యాంగ వ్యతిరేకంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేలపై చర్యలకు స్పీకర్ ఉద్దేశ పూర్వకంగా తాత్సారం చేస్తున్నారంటూ పెట్టిన కేసు సోమవారం సుప్రీంకోర్టు ముందు తదుపరి విచారణకు రానుంది. కీలకమైన ఈ అంశంపై సుప్రీం ఎలా స్పందిస్తుందో చూడాలి. రెండు తెలుగు రాష్ట్రా ల్లోనూ ఈ తప్పిదం యథేచ్ఛగా సాగుతోంది. ‘అతి’తో పాటు స్పీకర్ల నిష్క్రియ కూడా తప్పిదమే! అరుణాచల్‌ప్రదేశ్ కేసులో సుప్రీం ధర్మాసనం చాలా అంశాల్ని నొక్కి చెప్పింది. ఈ కేసులో ధర్మాసనం అంతిమ నిర్ణయానికి సానుకూలత వ్యక్తం చేస్తూనే విడిగా తీర్పు రాసిన జస్టిస్ దీపక్ మిశ్రా స్పీకర్ల బాధ్యతపై ఓ వ్యాఖ్య చేశారు. ‘స్పీకర్లు నిష్పాక్షికంగా ఉండటమే కాకుండా ఉన్నట్టు కనిపించాల’నే ప్రజాస్వామ్య స్ఫూర్తిని పునరుద్ఘాటించారు. ఆస్ఫూర్తి రెండు తెలుగు రాష్ట్రాల శాసనసభల్లోనూ లోపిస్తోంది. ఈ ఫిరాయింపులన్నీ విపక్షాల నుంచి పాలక పక్షంలోకి సాగుతున్నవే! పార్టీ ఫిరాయించిన శాసనసభ్యుల్ని అనర్హులుగా ప్రక టించండి అని సదరు పార్టీలు చేసిన విజ్ఞప్తిపై స్పీకర్లు ఏ చర్యా తీసుకోవడం లేదు. రాజ్యాంగ ఉల్లంఘనల్ని, పాలకపక్ష అనుకూల వాతావరణాన్ని అను మతించినట్టవుతోంది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఇటు వంటి ఉల్లంఘనల్ని పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిన అధికారం స్పీకర్లకు మాత్రమే కట్టబెట్టారు. వారు చర్యలు తీసుకోనంత వరకు చట్టం అమలు జరు గనట్టే లెక్క. ఇది రాజ్యాంగం పదో షెడ్యూల్‌కు గుడ్డి ఉల్లంఘన. ఈ నిష్క్రి యాపరత్వం వారు తమ రాజ్యాంగ విహితమైన బాధ్యతల్ని విస్మరించడమే. దీంతో స్పీకర్లు నిష్పాక్షికంగా లేరని రూఢీ అవుతున్నట్టే! అరుణాచల్‌లో 21 మంది అసమ్మతి ఎమ్మెల్యేలలో 14 మందిని అనర్హులుగా ప్రకటిస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని గౌహతి హైకోర్టు తాత్కాలికంగా నిలుపుదల చేసింది. హేతుబద్ధం కాకుండా, రాజ్యాంగ పరిధికి లోబడి లేని స్పీకర్ల ‘అతి’ చర్యలు ఎంత తప్పో, అవసరమైన చోట చర్యలే లేని నిష్క్రియాపరత్వం కూడా అంతే తప్పు. ప్రజాస్వామ్య వివిధ అంగాల మధ్య రాజ్యాంగం కల్పించిన స్వయం ప్రతిపత్తి వల్ల ఈ విషయంలో సుప్రీంకోర్టుకు కొన్ని పరిమితులున్నాయి. ఫిరాయింపు ఫిర్యాదులపై చర్య తీసుకొమ్మని, ఫలానా సమయం లోపల చర్యలుండాలని స్పీకర్‌ను నిర్దేశించే పరిధి తమకు లేదని సుప్రీం చాలా సందర్భాల్లోనే స్పష్టం చేసింది. ‘కిహోటో హొలాహాన్ వర్సెస్ జచి లుహూ’ కేసులో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఫిరాయింపు కేసుల్లో కోర్టుల పరిధిని వివరిం చినపుడు ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఒకసారి స్పీకర్ నిర్ణయించిన తర్వాత సదరు నిర్ణయం రాజ్యాంగబద్ధతను సమీక్షించే అధికారం మాత్రం సుప్రీంకోర్టుకుంది. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొనే... కోర్టులకు చిక్కకుండా స్పీకర్లు ఉద్దేశపూర్వక జాప్యాలకు పాల్పడి పాలకపక్షాలకు అను కూలంగా వ్యవహరిస్తున్నారనేది విశ్లేషకుల భావన. పరిష్కరించకుంటే పరిహాసమే! ఫలితమివ్వనప్పుడు అది రాజ్యాంగపు హక్కయినా నిరుపయోగమే. ఇప్పు డదే జరుగుతోంది. 1984లో రాజ్యాంగ సవరణ (52)ద్వారా ఈ బిల్లు తెచ్చిన పుడు గానీ, 2003లో తదుపరి సవరణ (91) జరిగినపుడు కానీ... చట్టం పక డ్బందీ అమలుకు తగు జాగ్రత్తలు తీసుకోలేదనిపిస్తుంది. ఎంత ఉదార ఆలో చనయినా, ఏకపక్షంగా స్పీకర్లకే నిర్ణయాధికారం కట్టబెట్టేనాటికే పలువురు స్పీకర్లు లక్ష్మణరేఖలు దాటి ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసిన సందర్భాలు న్నాయి. ఎన్నికైన ప్రజా ప్రతినిధులు, ఒక పార్టీ తరపున ఎన్నికైన ప్రతినిధి, ప్రజాతీర్పును వంచించి మరో పార్టీలోకి మారినపుడు అనర్హుడవడం ఇందులో నిర్దేశించారు. కానీ, ఇలా ఒక పార్టీ నుంచి మూడో వంతు సభ్యులు పార్టీ ఫిరాయించడాన్ని చీలికగా గుర్తించడం, మూడింట రెండొంతుల సభ్యులు ఇతర పార్టీలో కలవడాన్ని విలీనంగా గుర్తించడం ద్వారా అనర్హత వర్తించకుండా మినహాయింపులు పెట్టారు. ఇవన్నీ ఒక ఎత్తయితే, ఒకరు ఇద్దరు మారినా చర్యలు లేని దుస్థితి ప్రస్తుతం నెలకొంది. 1990లో గోస్వామి కమిటీ నివేదిక, 1999లో లా కమిషన్ నివేదిక, 2002లో నేషనల్ కమిషన్ టు రివ్యూ ది వర్కింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ నివేదిక ఈ ఫిరాయింపు నిరోధక నిబంధనల్లో ఉన్న లోపాల్ని, అమలు వైఫల్యాల్ని ఎత్తిచూపాయి. అందుకే, 2003లో జరిపిన 91వ సవరణ ద్వారా చీలికను పూర్తిగా ఎత్తివేసినా ‘విలీనం’ ఇంకా కొనసాగుతూనే ఉంది. 20వ లా కమిషన్ ‘ఎన్నికల సంస్కరణలు’ పేరుతో ఇచ్చిన 255వ నివేదికలో ఓ ప్రతిపాదన చేసింది. ఫిరాయింపు పిటి షన్లపై స్పీకర్లు నిర్ణయం తీసుకోవడంలో అనుచిత-ఉద్దేశపూర్వక జాప్యాలు జరుగుతున్నందున సదరు నిర్ణయాధికారాన్ని పార్లమెంటు సభ్యుల విష యంలో అయితే రాష్ట్రపతికి, శాసనసభ్యుల విషయంలో అయితే గవర్నర్‌కు అప్పగించాలని కేంద్రానికి సిఫారసు చేసింది. పక్షపాతంగా వ్యవహరిస్తున్నం దున ఈ అధికారాన్ని స్పీకర్ పరిధి నుంచి తప్పించి ఎన్నికల సంఘానికి అప్పగించాలని ఏపీలో విపక్షనేత వై.ఎస్.జగన్మోహనరెడ్డి డిమాండ్ చేస్తు న్నారు. ఫిర్యాదు అందిన నాటినుంచి 90 రోజులు దాటకుండా పరిష్కరించా లనీ ప్రతిపాదించారు. ఎంపీల ప్రతినిధి బృందంతో స్వయంగా ఢిల్లీ వెళ్లి ఈ మేరకు వినతిపత్రాల్ని కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి ఇదివరకే అందజేశారు. స్పీకర్ 90 రోజుల్లో పరిష్కరించేలా గడువు పెట్టాలని, లేదా అది ఎన్నికల సంఘం పరిధిలోకి వెళ్లేలా ఆదేశాలివ్వాలని కాంగ్రెస్ ముఖ్యులు లీగల్ కౌన్సిల్ ద్వారా సుప్రీంను కోరుతున్నారు. పచ్చి పచ్చిగా పచ్చ పచ్చగా.... రాజ్యాంగ హోదాల్లో చట్టసభలకు నేతృత్వం వహించే వారి చేష్టల్ని ప్రజలు నిశితంగా పరిశీలిస్తారు. స్పీకర్ నిష్పాక్షికంగా ఉండటమే కాకుండా ఉన్నట్టు కనబడాలన్నది జస్టిస్ దీపక్ మిశ్రా వ్యాఖ్య. తెలుగునాట అది పూర్తిగా డొల్ల. ఒక పార్టీ తరఫున గెలిచిన వ్యక్తి మరో పార్టీ మంత్రివర్గంలో ఉన్నారంటే, రాజ్యాంగం పదో షెడ్యూల్ అమల్లో ఉండగా... సభ్యుడి రాజీనామా తీసుకో కుండా ఈ పరిస్థితిని స్పీకర్ ఎలా అనుమతించారనేది రాజ్యాంగ నిపుణుల ప్రశ్న. స్పీకర్‌తో ఈ విషయం ధ్రువీకరించుకోకుండా సదరు సభ్యుడితో మంత్రిగా రాష్ట్ర గవర్నర్ ఏ విధంగా ప్రమాణస్వీకారం చేయించారన్న విమ ర్శకుల ప్రశ్నకు సమాధానమే లేదు. ఇక ఏపీలో పరిస్థితి మరీ దారుణం. అక్కడ స్పీకర్ నేరుగా టీడీపీ సభలు, సమావేశాల్లో పాల్గొనడం, రాజకీయ వ్యాఖ్యలు చేయడం వంటివి విమర్శలకు తావిచ్చాయి. ఈసారి ఎన్నికల్లో పదకొండున్నర కోట్లు ఖర్చయిందన్న ఆయన వ్యాఖ్య పెద్ద దుమారమే రేపింది, స్పందించిన ఎన్నికల సంఘం ఆధారాల సేకరణ వరకూ వెళ్లింది. జగ్జీత్సింగ్ వర్సెస్ స్టేటాఫ్ హర్యానా కేసులో, స్పీకర్ పదవి హుందాతనాన్ని చెబుతూనే ఇటీవలి కాలంలో వారి నిష్పాక్షికత విషయంలో తలెత్తుతున్న సందేహాలు, ప్రశ్నల్ని సుప్రీం ఎత్తిచూపింది. ఈ పరిస్థితుల్లో తన ముందున్న కేసులో సుప్రీం ఏం తీర్పు ఇస్తుందోనని ప్రజానీకం నిరీక్షిస్తోంది. రాజ్యాం గాన్ని కాపాడే బాధ్యత సుప్రీంకోర్టుదే అయినా... పదే పదే ఉల్లంఘనలకు పాల్పడి సుప్రీంతో మొట్టికాయలు వేయించుకోవడం ఇతర ప్రజాస్వామ్య సంస్థలకు అంత మంచిది కాదన్నది జనాభిప్రాయం. - దిలీప్ రెడ్డి ఈమెయిల్: dileepreddy@sakshi.com -
భావ ప్రకటనకూ పరిమితులున్నాయి: సుప్రీం
న్యూఢిల్లీ: భావ ప్రకటన స్వేచ్ఛ నిరపేక్షమేం కాదని, దానికీ పరిమితులుంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ‘భావ ప్రకటన స్వేచ్ఛను విశాల కోణంలో అర్థం చేసుకోవాలి. అదే సమయంలో దానికి అంతర్గతంగా స్వతఃసిద్ధ పరిమితులు కూడా ఉండాలి. అవి రాజ్యాంగ ప్రమాణాలకు లోబడి ఉండాలి. రాజ్యాంగంలోని 19(1) అధికరణ అందించిన భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు నిరపేక్షమేం కాదని, దానికీ అదే అధికరణంలోని రెండవ భాగం 19(2) కింద పరిమితులుంటాయని మేం ఇదివరకే స్పష్టమైన వివరణ ఇచ్చాం’ అని జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ పీసీ పంత్‌ల ధర్మాసనం గురువారం తేల్చి చెప్పింది. మహాత్మాగాంధీపై అనుచిత రీతిలో, అభ్యంతరకర పదజాలం ఉపయోగిస్తూ వసంత్ దత్తాత్రేయ గుర్జార్ అనే మరాఠీ కవి రాసిన కవితను 1994లో ఆల్ ఇండియా బ్యాంక్ అసోసియేషన్ యూనియన్ వారి ఇన్‌హౌజ్ జర్నల్‌లో ప్రచురించిన ప్రచురణ కర్త దేవీదాస్ రామచంద్ర తుల్జాపుర్కర్పై దాఖలైన క్రిమినల్ కేసును కొట్టివేస్తూ తీర్పునిచ్చిన సందర్భంగా ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. -
‘రవాణా’ ఒప్పందం రద్దు
చెన్నై, సాక్షి ప్రతినిధి:చెన్నై నగరంలోని 25లక్షల జనాభాతోపాటూ ఇతర రాష్ట్రాల నుంచి రాకపోకలు సాగించే ప్రజలతో కార్పొరేషన్ రోడ్లన్నీ కిటకిటలాడుతూనే ఉంటాయి. నగరం నలుమూలలకే కాదు సిటీ శివార్లకు సైతం బస్సు సౌకర్యం ఉండటం, టికెట్టు చార్జీలు సైతం అందుబాటులో ఉండడం వల్ల ఎక్కువ మంది బస్సులపైనే ఆధారపడతారు. ఈ కారణంగా బస్టాపులను సైతం ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంతో ప్రకటనదారుల కన్నుపడింది. రవాణా సంస్థకు సైతం అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉండడంతో ప్రకటనలపై ప్రయివేటు సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. అయితే ఈ ఒప్పందంలో అవినీతి, అవకతవకలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు రావడంతో మద్రాసు హైకోర్టు దీన్ని రద్దు చేసింది. దీంతో సదరు రవాణాశాఖ సుప్రీం కోర్టులో అప్పీలు చేసుకుంది. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు దీపక్ మిశ్రా, లలిత్ విచారించారు. ప్రకటనల ఒప్పందంలో అవినీతి జరిగినట్లు తెలిసింది. ఈ కారణంగా రవాణాశాఖకు భారీగా నష్టం వాటిల్లిందన్నారు. ప్రజాస్వామ్య పరిపాలనలో ఇటువంటి అవినీతి కార్యకలాపాలకు తావులేదని వారు వ్యాఖ్యానించారు. అత్యంత చాతుర్యంతో సాగిన అవినీతి ఒప్పందాన్ని కొనసాగించే అవకాశమే లేదని స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాలను సర్వసాధారణంగా తీసుకుంటున్నారని రవాణాశాఖ అధికారులపై అక్షింతలు వేశారు. ఈ ఒప్పందంలో పారదర్శకత పాటించకుండా అక్రమమార్గంలో సాగినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. తప్పుడు విధానాలతో రవాణాశాఖ తన గౌరవాన్ని తానే కోల్పోతోందని, తన గొయ్యిని తానే తీసుకుంటోందని వారు వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందాలు ఏ కోణంలో చూసినా చట్టపరంగా లేవన్నారు. ఈ కారణంగా గతంలో జరిగిన ప్రకటనల ఒప్పందాలను ఎంతమాత్రం కొనసాగించడానికి వీల్లేదని అన్నారు. కొత్తగా టెండర్లు పిలిచి, నిర్ణయాలపై పారదర్శకత, నిజాయితీని పాటించండని హితవు పలికారు. కోర్టులో కేసులు పెట్టిన ప్రకటన సంస్థలు ఒక్కో బస్టాండ్‌కు రూ.5లక్షల చొప్పున రవాణా సంస్థకు చెల్లించాలని ఆదేశించారు. ఈ చెల్లింపు 8 వారాల్లోగా పూర్తి చేయాలని అన్నారు. రవాణాశాఖ సైతం టెండర్ల విధానాన్ని అమలుచేయకుండా ఒక ప్రయివేటు సంస్థకు అప్పగించడం భవిష్యత్లులో సంస్థకు చేటుచేస్తుందని చెప్పారు. -
‘అర్ధరాత్రి’పై ఆంక్షలు
సాక్షి, న్యూఢిల్లీ: పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్పడంతోపాటు కొత్త ఏడాదిని ఘనంగా ఆహ్వానించేందుకు నగరవాసులు ఎన్నో ప్రణాళికలు రూపొందిం చుకుంటున్నారు. వేడుకల కోసం ఇప్పటికే నగరంలోని పలు హోటళ్లలో, రెస్టారెంట్లలో ముమ్మరంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అయితే వేడుకల పేరిట అర్ధరాత్రి దాటిన తర్వాత ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఢిల్లీ పోలీసులు ముందస్తుగానే దృష్టి సారించారు. దీనిలో భాగంగా డిసెంబర్ 31 రాత్రి ప్రత్యేక నిబంధనలు అమలులోకి తేనున్నారు. ఢిల్లీలోని రద్దీ ప్రదేశాల్లో ఒకటైన కన్నాట్‌ప్లేస్‌లో 31 వేడుకల కారణంగా ఎలాంటి ఘర్షణలు, మహిళలపై వేధింపుల వంటి సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. కన్నాట్‌ప్లేస్(సీపీ)లో దాదాపు 50 వరకు రెస్టారెంట్లు, హోటళ్లు ఉన్నాయి. ప్రతి హోటల్, రెస్టారెంట్ వద్ద ఒక పోలీస్‌ను అందుబాటులో ఉంచేలా పోలీసులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సీపీలో ఆ రాత్రి వాహనాల రాకపోకలపైనా ఆంక్షలు విధించనున్నారు. రాత్రి 12.30 గంటల తర్వాత మ్యూజిక్ పూర్తిగా బంద్ చేయాలి. రాత్రి 12.55 గంటల తర్వాత హోటల్లో భోజన విక్రయాలు పూర్తిగా నిలిపివేయాల్సి ఉంటుంది. కన్నాట్‌ప్లేస్ ఔటర్ సర్కిల్లో వాహనాల పార్కింగ్‌కు అనుమతిస్తారు. ఢిల్లీలోని అన్ని పోలీస్స్టేషన్లలో ఎస్హెచ్ఓ నుంచి డీసీపీ స్థాయి వరకు అధికారులు రాత్రి 8 గంటల నుంచి రాత్రి ఒంటిగంట వరకు ఏరియా పెట్రోలింగ్ నిర్వహించాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్.బస్సీ,స్పెషల్ కమిషనర్(శాంతిభద్రతలు) దీపక్‌మిశ్రా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అన్ని ప్రాంతాల్లో పీసీఆర్ సిబ్బంది సైతం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వీలైనంత ఎక్కువ మంది పోలీసులను రోడ్లపై వాహనాల తనిఖీలకు వినియోగించనున్నారు. మద్యం సేవించి మహిళలను వేధించే వారిపై దృష్టి సారించనున్నట్టు పోలీస్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. రానున్న వారం రోజుల పాటు నగరంలో రాత్రి పూట గస్త్తీని కూడా పెంచుతామన్నారు. ఇందుకోసం ప్రస్తుతమున్న గస్తీ సిబ్బందితో పాటు 15 వేల రిజర్వ్ సిబ్బందిని కూడా రాత్రివేళ గస్తీ విధుల కోసం వీధులలో మోహరిస్తామని తెలిపారు. జనవరి మొదటివారం వరకు నగరంలో రాత్రి పూట గస్తీపై మరింత శ్రద్ధ వహించనున్నామని వెల్లడించారు.