
న్యూఢిల్లీ: ఎన్నికల అక్రమాలను తక్షణ అరెస్టుకు వీలైన నేరంగా పరిగణించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. ‘వాదనలు విన్నాం. ఈ పిటిషన్‌ను కొట్టేస్తున్నాం’ అని సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం స్పష్టం చేసింది. ఎన్నికల అక్రమాలుగా పరిగణించే డబ్బులు పంచడం, తప్పుడు ప్రకటనలు, అభ్యర్థులు, రాజకీయ పార్టీల ద్వారా జరిగే పలురకాల దుర్వినియోగం తదితర అక్రమాలను తక్షణం అరెస్టుకు వీలుకల్పించే నేరాలుగా పరిగణించాలని, కనీసం రెండేళ్ల పాటు జైలు శిక్ష విధించేలా చర్యలు తీసుకోవాలని సీనియర్ న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ పిటిషన్‌లో పేర్కొన్నారు. 2000 తర్వాత సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ అవినీతి తారస్థాయికి చేరిందని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment