
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉత్తరాఖండ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్ పేరును మరోసారి సిఫార్సు చేసేందుకు సుప్రీంకోర్టు కొలీజియం బుధవారం సమావేశమయ్యే అవకాశముంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని అత్యంత సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ మదన్ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌లు ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. కాగా కొలీజియం మళ్లీ ప్రతిపాదనలు పంపినా కేంద్రం వాటిని ఆమోదించకపోవచ్చని సుప్రీం వర్గాలు భావిస్తున్నాయి. అదే జరిగితే రాజ్యాంగ సంక్షోభానికి దారితీయవచ్చని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment