భువనేశ్వర్: రాజ్యాంగ సార్వభౌ మత్వం అత్యున్నతమైనదని, అంతా దాని ముందు తలొంచా ల్సిందేనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా తేల్చి చెప్పారు. రాజ్యాంగ సార్వభౌమత్వ లేమి అరాచకానికి దారి తీస్తుందని, చట్టాలకు అంతా లోబడి ఉండాల్సిందేనన్నారు. ఒడిశా న్యాయవా దుల అసోసియేషన్ నిర్వహించిన కార్యక్ర మంలో ఆయన మాట్లాడుతూ.. శాసన, పరిపాలన, న్యాయ వ్యవస్థలు కూడా రాజ్యాంగానికి అనుగుణంగానే పనిచేస్తు న్నాయన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవా లన్నారు.
న్యాయ వాదులు న్యాయ వృత్తి పవిత్రతను కాపాడుతూ ప్రజలకు సేవ చేయాలని జస్టిస్ దీపక్ మిశ్రా సూచించారు. గత పదేళ్లుగా దేశంలో పెం డింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసుల్ని పరిష్కరిం చాలని హైకోర్టులకు స్పష్టం చేశామని, పెండింగ్ కేసుల పరిష్కారానికి శనివారం కూడా పనిచేయాలని న్యాయ మూర్తులు, న్యాయవాదుల్ని కోరామని సీజేఐ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment