![Ashok Chavan Slams Devendra Fadnavis Statement - Sakshi](/styles/webp/s3/article_images/2019/11/27/013.jpg.webp?itok=6-ZHQCM0)
ముంబై: మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు కూటమిగా ఏర్పడి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ స్పందిస్తూ.. 'ఆటోరిక్షా కూడా మూడు చక్రాలపై నడుస్తుంది. అయితే.. మూడు చక్రాలు కూడా ఒకే దిశలో కాకుండా తలో దిశలో వెళ్తే ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. ప్రస్తుతం శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ప్రభుత్వంలోనూ అదే పరిస్థితి నెలకొంటుందని' వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ చవాన్ ఆయనకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. 'రెండు చక్రాల కన్నా మూడు చక్రాలే ఉత్తమం' అని వ్యాఖ్యానించారు. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ఉమ్మడి కార్యాచరణ విషయంపై చవాన్‌ను విలేకరులు ప్రశ్నించగా బీజేపీని అధికారానికి దూరంగా ఉంచడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఇప్పటి వరకు అత్యల్పకాలం ముఖ్యమంత్రిగా కొనసాగిన వ్యక్తి నేతగా దేవేంద్ర ఫడ్నవిస్ రికార్డుల కెక్కారు. గతంలో 1963లో ముఖ్యమంత్రి మారోతరావ్ కన్నంవార్ మరణానంతరం 1963 నవంబరు 25వ తేదీ సావంత్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. కాగా సావంత్ కూడా కేవలం తొమ్మిది రోజుల్లోనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. మరోవైపు మరోసారి నవంబర్ నెలలోనే 23వ తేదీన ముఖ్యమంత్రి పదవి చేపట్టిన దేవేంద్ర ఫడ్నవిస్ అత్యల్పంగా కేవలం మూడున్నర రోజులలోనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment