
బెంగళూరు: బల పరీక్షలో వంద శాతం గెలుస్తానని కర్ణాటక సీఎం యడ్యూరప్ప అన్నారు. ‘ఈ రాజకీయ క్రీడలో మేం మా ఆధిక్యాన్ని నిరూపించుకుంటాం. బలపరీక్షలో నెగ్గుతాం’ అని అన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైనంత సాధారణ ఆధిక్యం లేకుండానే సీఎంగా ప్రమాణం చేసిన యడ్యూరప్ప.. పీఠమెక్కిన దాదాపు 55 గంటల్లోనే విశ్వాసపరీక్షను ఎదుర్కోనున్నారు.
మా ఎమ్మెల్యేను ఢిల్లీలో ఉంచారు: ఆజాద్
కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్‌ని బీజేపీ అధిష్టానం బేరసారాల కోసం ఢిల్లీకి పిలిపించుకుందనీ, అక్కడ నుంచి ఆయన తిరిగిరాకుండా కట్టడి చేస్తోందని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ శుక్రవారం ఆరోపించారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన స్థానం లో ఉన్న గవర్నర్.. ఆయన చేతులతోనే రాజ్యాంగం పీక నొక్కుతున్నారని ఆజాద్ మండిపడ్డారు. గవర్నర్ రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించారనడానికి సుప్రీం ఉత్తర్వులే నిదర్శనమని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment